ఈ మధ్యనే ఒక ట్రావెలోగ్ చదివాను.అజిత్ హరి సింఘానీ రాసిన One life to ride అని చెప్పి ..ఆయన చేసిన మోటార్ బైక్ ప్రయాణం అది.పూనే నుంచి హిమాలయాల లోని లేఖ్,కార్గిల్ ఇంకా అనేక కనుమల గుండా చేసిన ప్రయాణం అది.చాలా ఎత్తైనా హిమ సానువులు,మనిషి మనుగడ కి సవాలు విసిరే ప్రాంతాలు.నాలుగు వేల మీటర్లు పై బడిన ఎత్తు గల పర్వత రహదారులు,ఉన్నట్టుండి కరిగి దారిని బ్లాక్ చేసే మంచు గడ్డలు...ఇంకా అక్కడక్కడ కనిపించే కొన్ని జీవితాలు ,వారి జీవిత విధానాలు.తన లాగే సాహస యాత్ర చేయడానికి వచ్చే కొద్ది మంది వ్యక్తులు.ఇలా చక్కని అనుభూతులతో ముందుకు తీసుకు పోతుందీ పుస్తకం.
ఒక దారి గుండా ఎంతమందైనా వెళ్ళనీ..కానీ ప్రతి ఒక్క కంటి కి ఆనే దృశ్యాలు వేరు గా ఉంటాయి..చూసే కోణమూ వేరు గా ఉంటుంది.అందుకే ఏ ట్రావెలోగ్ అయినా సరే చదివి తీరవలసిందే.దాని లోని విభిన్న కోణం తెలుసుకోవడానికి.అసలు ఈ దేశ దిమ్మరి తనం అనేది కూడా జన్మ జన్మల అనుబంధంగా రావాలేమో...చాలామంది దృస్టిలో ఇది ఒక ప్రమాదకరమైన పిచ్చి.అంతే.కాని దాని లోని రుచి తెలిసిన వాడు దాని కోసం దేనినైనా త్యాగం చేస్తాడు.ఆంగ్ల సామెత లో చెప్పాలంటే They are the salt of the earth. ప్రతి వారు చదువుకునేదాన్ని అతను అనుభవిస్తాడు...అంతేనా ప్రయాణం లో రాని గుణం ఏమిటి ...ఓర్పు..ఇతరులతో మెలిగే తెలివి..ప్రమాదాన్ని ఎలా తప్పుకోవాలో తెలుసుకునే అనుభవ జ్ఞానం...ఇతరుల లోని మంచి చెడుగులు..ఇలా ఎన్నో ఫస్ట్ హేండ్ గా తెలుసుకోవచ్చు.అలనాటి హుయాన్ త్షాంగ్ నుంచి రాహుల్ సాంకృత్యాయన్ దాకా ఎంతమంది దారి చూపిన వెలుగులు..? ఇక యూరోపియన్ల విషయం చెప్పేదేముంది..మేజిలాన్ వద్ద నుంచి వాస్కోడా గామా ఇంకా ఎంతమందని...ఇప్పటికి వారి స్పిరిట్ పని చేస్తూనే ఉంది.....!
సరే...మనం అజిత్ హరిసింఘాని వద్దకి వద్దాము.ఈ ప్రయాణ అనుభవాల ద్వార ఎన్నో చక్కని అనుభూతులు పంచారు.కొన్ని చోట్ల వర్ణనలు అద్భుతం...హిమాలయాలలో ..మనుషులు అలికిడి లేని ఆ రాత్రులు..అక్కడి వాతావరణం గురుంచి చెబుతూ అంటాడు.." నేను ఈ గ్రహం మీద ఉన్నట్లుగా లేదు..వేరే ఏదో గ్రహం మీద ఉన్నట్లు గా ఉన్నది..అది అనుభవించవలసిందే తప్ప చెప్పేది కాదు అంటాడు..!!
లేఖ్ దగ్గర ఉన్న టిబెటన్ ల వద్దకి ..అక్కడి బుద్ధుని ఆలయానికి వెళ్ళినప్పుడు ..చెబుతాడు..అక్కడ గుమిగూడిన వారి లో కొన్ని వందలు మంది ఉంటే ..దానిలో సగానికి పైగా యూరో పియన్లు ఇంకా మిగతా దేశీయులే ఉన్నారని.దానిలో వింత లేదు.ఎంతమంది కి మనలో అనిపిస్తుంది ..ఒక వేళ లోపల ఉన్నా..పోవాలని.మన బంధనాలు అలాంటివి..విచిత్రంగా బంధనాల బోలుతనాన్ని చెప్పేది మన తత్వ శాస్త్రాలే..కాని ..ఎందుకు అనుకోవడం..మన స్థితి అది.సరే....అలాంటి దుర్గమమైన ప్రదేశాల్లో రోడ్లు వేసే మన అధికారులని అభినందించకుండా ఉండలేము.పొద్దున్న రోడ్డు వేస్తే కొన్ని మార్లు మధ్యానం కల్లా కొట్టుకు పోతుంది మంచు ఉరవడి లో..అంత ఎత్తుల లో ...ఉంటూ సరిహద్దుల్ని కాపల కాసే సైనికులు... మన అజిత్ గారి వాహనాన్ని చూసి ఆపడం ఫోటోలు దిగడం..తమ వారికి సందేశం చెప్పమని అడగడం ..హృదయం ద్రవిస్తుంది.
ఎక్కడో తప్ప ...ప్రతి చోట కొత్త మనిషికి సహాయం చేయడం..అనేది దేశం లో ఎక్కడికి పోలేదు..అది స్థిరపడుతుంది దీని లో..!!ఇది చదువుతున్నప్పుడు మన తెలుగు ప్రయాణీకులు కొంత మంది గుర్తుకు వచ్చారు.ప్రవస్తు పరమేశ్వర్ గారు..ఇంకా ఆదినారాయణ గారు..ఇలా..! వాళ్ళు పుస్తకాలు అన్నీ తెలుగు లో రాసుకున్నారు కావున పెద్ద గా బయట ప్రపంచానికి పెద్ద గా తెలియదు.నిజానికి మన ఈ ఇద్దరు తెలుగులు ఈ అజిత్ హరిసింఘానీ కంటే ఉన్నతులు..కానీ ఆంగ్లం లో వారి పుస్తకాలు రాకపోవడం పెద్ద లోటు అని చెప్పాలి.ఒక వేళ ఒకటి అరా వచ్చినా ..దాన్ని ప్రమోట్ చేసే విధానం మనకి తెలియది...అది ఒప్పుకు తీరాలి..పరవస్తు పరమేశ్వర్ గారి చత్తీస్ ఘడ్ స్కూటర్ యాత్ర దీని కన్నా నూరు రెట్లు ఘనమైనది కాని తెలుగు కే పరిమితమవడం విచారకరం...! అది నాకు బాధ కలిగింది.కాలి నడక తో ఆదినారాయణ గారు చెసిన యాత్రలు అతి అద్భుతం గాని..అరిచి చెప్పే మాధ్యమమేది..???
వీరందరి లో ..ముఖ్యంగా భారతీయ యాత్రికులు అందరి లో ..రాహుల్ సాంకృత్యాయాన్ ఇచ్చిన స్ఫురణ మామూలు దా.. ? నువ్వు ఏ లోకాననున్న ..మహానుభావ....నీకు వందనం.

No comments:
Post a Comment