Friday, August 12, 2016

ఎట్టకేలకు కొన్ని పేజీలు అంటే ఓ రెండు వందల పేజీల దాకా The Fountainhead చదివాను

ఎట్టకేలకు కొన్ని పేజీలు అంటే ఓ రెండు వందల పేజీల దాకా The Fountainhead చదివాను,గతం లో కూడా అన్నాను..నాకు లోపల ..బాగా అనిపించిందీ అంటే అది అలా సాగిపోతుంది,ఎన్ని పనులున్నా ఆ రచన చదివి అవతల పెట్టేస్తాను,ఎన్ని పేజీలున్నా..!కాని ఈ నవల లోని శైలి ఎందుకనో బోరు గా అనిపిస్తూన్నది..మళ్ళీ బాగా పేరు వచ్చిన నవలాయె  ..చాలామంది దీని లోని ఒకటి రెండు పాత్రలగురుంచి బాగా చెబుతుంటారు.అక్కడక్కడ వర్ణనలు ఇతర చిత్రణలు చాలా ఎక్కువ గా ఉన్నాయనిపించింది.1943 లో రాయబడిన ఈ నవల ఇప్పటి ఈ కాలానికి తగినదేనా అని అడిగితే ,అంత కాలం క్రితమే ఆ దేశం లో ఇలాంటి యోచనలు చేయడమే గొప్ప సంగతి,దానిని ఒప్పుకుతీరాలి.సరే..నే చదివినంతమేరలో చెబుతాను క్లుప్తంగా ...!

మన దేశం విషయానికి వస్తే ఈ నవల లోని హీరో పాత్రని జాగ్రత్త గా అర్ధం చేసుకోవాలి,గుణ గణాల్ని కూడా.పైపైన అర్ధం చేసుకుంటే ఒక దారి తెన్ను లేని "వ్యక్తి" తత్వాన్ని చూసినట్లు అవుపడుతుంది.అసలు ఫౌంటైన్ హెడ్ అంటే ఏమిటి..స్థూలంగా చెప్పాలంటే ..ఒక ఒరిజినల్ సోర్స్ అని..ఏ విషయమైనా గాని అది..!  దీనిలోని హీరో Howard Roark , అలాంటి మనిషి..ఇరవై రెండేళ్ళు అతనికి.Stanton institute of Technology లో ఆర్కిటెక్చర్ చదువుతుంటాడు,వెనుక ముందు ఎవరూ ఉండరు.Mrs.Keating ఇంట్లో అద్దెకి ఉంటూ ఉంటాడు, నవల్లో తెరవగానే వస్తుంది గదా అతను ఆ వాగు లో స్నానం చేసే సీను..అది అయిపోయి నాక ఇంటికి అనగా అతని రూము కి చేరుకుంటాడు.దాని లో పెద్ద గా సామాన్లు ఉండవు,అతను వేసిన డ్రాయింగ్ లు ,కొన్ని వస్త్రాలు ,మంచం అలాంటివి అంతే..!

రాగానే ఆ ఇంటిగలావిడ చెబుతుంది ..అబ్బాయ్ నీ గురుంచి ఆ కాలేజీ వాళ్ళు కబురు పెట్టారు..నువ్వు వెళ్ళి కలువు..నిన్ను కాలేజీ లోనుంచి డిస్మిస్ చేసే యవ్వారం ఏదో ఉందట..ఎందుకొచ్చిన గొడవ..వెళ్ళి సారీ ఏదో చెప్పరాదూ..ఇలా చెపుతుంది అతనికి,ఏ విషయానికి అలాగే మౌనంగా   ఉండే అతను సరే నని వెళతాడు..అక్కడ విషయం తెలిసినదే...మొత్తానికి డీన్ గది లోకి వెళతాడు..అసలు ఆ డీన్ ఉండే నిర్మాణమే తనకి నచ్చదు.ఒక చాపెల్ లా గా ఉంటుంది.అక్కడి ..ఆ కాలేజీ నిర్మాణాలన్నీ పురాతన గ్రీకు నిర్మాణాల్ని అనుకరిస్తూ కట్టినవే..!

లోపలకి వెళ్ళగానే ఆ డీన్ అంటాడు..ఎందుకని ప్రతి దాన్ని ఖండిస్తుంటావు,నీ ప్రొఫెసర్ల కంటే నీకు ఎక్కువ తెలుసా..ఎవరో ఒకాయన తప్ప అందరూ నిన్ను కాలేజీలోనుంచి తొలగించమని కోరుతున్నారు..ఏమిటి..నీ ధోరణి..అని..!

మనం ఈ కాలం లో చేసే నిర్మాణాల్ని మన అవసరాలకి తగినట్టు గా రూపొందించుకోవాలి గాని గొప్ప దని చెప్పి ఎప్పుడో నిర్మించిన గ్రీకు ఇంకా ఇతర నాగరికతల కట్టడాల్ని మనం ఎందుకు అనుకరించాలి.వాళ్ళ అవసరాలు వేరు,ఈ రోజు అవసరాలు వేరు.ప్రతి మనిషి పుట్టు కతో ఇంకో మనిషి లా ఎలా ఉండడో అలానే మన భవనాలు ఉండాలి మన వైన అవసరాలకి తగినట్లుగా ..!పార్థినాన్ ని ఆ నాటి గ్రీకులు వారి అవసరాలకి అనిర్మించారు..ఆ Facade లో కనిపించే Columns అలా ఉండటం లో కూడా ఒక అర్ధముంది..కొన్ని చెక్కతో చేసిన అతుకులు కనిపించకుండా అలా నిర్మించారు...ఇట్లా ఆ డీన్ కి హిత బోధ చేయబోతాడు.

బాబూ..నువ్వు మాత్రమే తెలివైన వాడివి అనుకోక.. పాతదనం లోని గొప్పదనాన్ని కూడా గుర్తించాలి..అంటూ కొన్ని సుద్దులు చెప్పి ..నీ వైఖరి మార్చుకొని సారీ చెప్పకపోతే కాలేజీ నుంచి తీసివేయక తప్పదు అంటాడు..మీ ఇష్టం అని వచ్చేస్తాడు..అలా కాలేజీ లోనుంచి మధ్య లోనే తొలగింపబడతాడు మన హీరో..!

ఆ పిమ్మట న్యూయార్క్ కి చేరుకుంటాడు హీరో ..ఏదో కంపెనీ లో పనిచేయాలని..స్కెచ్ లు వేయడం లో ఇటు కష్టమర్ల తో గాని అటు కంపెనీ పెద్దల తో గాని ఏ మాత్రం రాజీ పడని హీరో ఎక్కడ స్థిరంగా పనిచేయలేకపోతాడు.అనవసరంగా పొగడడం,పొగిడించుకోవడం కూడా తనకి ఇష్టం ఉండదు.కేవలం అతని కి పని..దాని లో దక్షత అంతే ..!

తను ఎంతో ఇష్టపడే Henry Cameron దగ్గర కి పనిచేయాలని వెళతాడు.అతను నిరాకరిస్తాడు..ఇతను కూడా మన హీరో లాంటి గుణగణాలు ఉన్నవాడే,ఒకప్పుడు బాగా వెలిగి ఇప్పుడు ఆరిపోయ దీపం లా ఉన్నాడు..నిరాశతో మద్యానికి బానిస అయిపోయినాడు.హీరో పని విధానం ని చూసి అతను అంటాడు...నీ లాంటి ఒరిజినల్ థాట్స్ ని ఉన్న మనిషిని భరించే స్థితి లో సమాజం లేదు.నువ్వు నీ దారి మార్చుకొని నలుగురితో కలిసి పో ..లేకపోతే నీవు ధనం ని,పేరు ని సంపాదించలేవు..లేదా నాలా అయిపోతావు అంటాడు.

ఒకరోజు Henry Cameron సోదరి వచ్చి జబ్బు పడిన అతనిని వాళ్ళ ఊరికి తీసుకు వెళ్ళిపోతుంది ..అప్పుడు మన హీరో ఒక భవన నిర్మాణం జరిగే చోట సూపర్ వైజర్ గా చేరతాడు..అక్కడ Mike అనే మేస్త్రి ఉంటాడు..ఇనుప చువ్వలు విరిచే విధానం ని మొరటు గా చేస్తుంటాడు.హీరో అతనికి ..ఈ పని సులభంగా ఇంకో విధానం లో ఇల్లా చేవచ్చును అని చేసి చూపిస్తాడు....ముందు హీరోని..అతని ..డ్రెస్ ని ,బక్కగా,పొడుగ్గా  రివట లా అనాకర్షణ గా ఉన్న అతని రూపాన్ని చూసి Mike ద్వేషిస్తాడు.పని చేయడం లో అతను చూపించే ఏకాగ్రత ,అదే జీవితం లా చేసే ఆ గుణం ..ఇవన్నీ Mike ని కట్టిపడేస్తాయి. అతను అంటాడు...నేను మనిషి యొక్క నేపధ్యాన్ని ఇంకా  రూపాన్ని బట్టి గాక అతను పని లో చూపే నైపుణ్యాన్ని బట్టి గౌరవిస్తాను..నీ లాంటి వ్యక్తి నే ..మౌనంగా ఉంటూనే  పనిని గొప్ప ప్రే మ తో చేసే ఒక ఆర్కిటెక్ట్ తో కలిసి పని చేశాను,అతని పేరు Henry Cameron అని..!

నేను అతని దగ్గర పనిచేశాను అంటాడు Roark.

మై గాడ్ ..నిజంగానా..అంటాడు Mike.

(సరే..మిగతాది ఎప్పుడైనా..) ...Murthy Kvvs  

No comments:

Post a Comment