నూతన సంవత్సర వేడుకల లో భాగంగా బెంగుళూరు లో ఇటీవల జరిగిన కొన్ని అంశాలు చదివి ఎలా స్పందించాలో అర్ధం కాలేదు.ఎందుకంటే అందరూ అక్కడ చేరిన మతి చెడి పవర్తించిన మంద ను గర్హించారు.అది అవసరమే కాని ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి దీనిని.ఈ గ్లోబలైజేషన్ పరిణామా ల్లో ఇది ఒక అంశము మాత్రమే,ప్రపంచ వాణిజ్య సంస్కృతి లో ఇవి అన్నీ చోటు చేసుకునే అంశాలే.అసలు ఈ గ్లోబలైజేషన్ లో అసలు కీలకం ఏమిటి..! నీ దగ్గర ఏమి ఉన్నదో ప్రపంచానికి అమ్ము..నా దగ్గర ఉన్నది నేను అమ్ముతా..! ఇదీ వరస..! మిగతా నైతికత తొక్కా తోలు తరవాత అంశాలు.అయితే దీని లో ఎక్కువ గా సొమ్ము చేసుకోగలిగే అవకాశం ధనిక దేశాలకే ఉంటుంది.దాని వెనుక సవా లక్ష పైకి రాని వి ఉంటాయి.దాని ప్రశ్నించి ఎదురు తిరిగే అవకాశం మిగతా దేశాలకి తక్కువ,ఒక వేళ ఎవరైన అలా చేయగలిగినా సద్దాం హుస్సేన్ ,గడాఫీ లకి పట్టినా గతి ఏ పడుతుంది.ప్రస్తుతం ఇది సాగుతున్న సామ్రాజ్యవాద స్వరూపం.దీనికి పోరాటాల పేరు తో చేసే వన్నీ వాళ్ళు నిర్దేశించిన మేరకే సాగుతుంటాయి.అవి రాజకీయ పార్టీలు గాని,స్వచ్చంద సంస్థలు గాని ..గనక ఇది ఒక మాయా దుప్పటి లో సాగే వ్యవహారం.వీటిని అన్నిటిని పర్యవేక్షించడానికి సవా లక్ష యాంత్రిక మైన కళ్ళు...మన ఆలోచనలకి కనీసం నాలుగు వందల ఏళ్ళు ముందు ఉన్న అగ్ర రాజ్యాల ప్రపంచ పాలన.అవును ఇపుడు సాగుతున్నది ప్రపంచ పాలన ఏ..!సరే..ఇది ఇక్కడ తో ఆపి....
అసలు విషయానికి వస్తే ఆ బెంగుళూరు లో జరిగినదేమిటి...! నూతన వత్సరం సందర్భంగా అక్కడ ఉన్న అమ్మాయిలు పూటు గా పబ్ ల లో తాగారు.వీరి లో ఎక్కువ గా ఉత్తరాది కి చెందిన సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నట్లు భోగట్టా.నేను స్త్రీలు తాగడం పాపం అని ఇక్కడ చెప్పట్లా..!ఆనందించడం తప్పని అనట్లా.ప్రపంచీకరణీ లో భాగంగా ఇవన్నీ ఒక భాగము అయినాయి.సగం దాకా ప్రవహించిన ఈ నదిని ఎవరు ఆపగలరు..?కాని అవి ఎక్కడనుంచి ఏ దేశాల్నుంచి ప్రవహించాయో అక్కడి ఒక సంస్కృతి ని ఇక్కడి ప్రజలు ముఖ్యంగా మగ వారు అర్ధం చేసుకోలేకపొయినారు.ఒక వేళ చేసుకున్నా ఇక్కడ చెల్లుతుందన్న ధీమా ఏమో..!
చాలా పాశ్చ్యాత్య దేశాల్లో మద్య పానం విషయం లో స్త్రీలకి పురుషులకి వేరు వేరు నీతులు లేవు.ఒక వేళ తాగిన వైనాన్ని ఆసరాగా తీసుకొని స్త్రీని లొంగ దీసుకోవాలని చూసినా కంప్లైంట్ చేస్తే అక్కడ శిక్షలు బలం గా ఉంటాయి.కొన్ని వందల ఏళ్ళ నుంచి వచ్చిన ఎటికెట్ అనేది ఈ అంశాల్లో ఉన్నది.ఆయా సమాజాలు ఆ విధంగా పరిణామం చెందినవి.ఇంకొక అంశము ఏమంటే స్త్రీ తానంతట తాను సెక్స్ కి సిద్ధపడితేనే ఆమోదించి ముందడుగు వేస్తాడు పురుషుడు..స్త్రీ పురుషుని పై ఉండి సెక్స్ చేయడమనేది స్త్రీకి ఇచ్చే గౌరవంగా భావిస్తారు.. ఆయా సమాజాల్లో అది ఒక మర్యాద పురుషుని లక్షణం.ఇలా ఉండటాన్ని అక్కడి స్త్రీలు జెంటిల్ మెన్ లక్షణాల్లో ఒకటిగా పరిగణిస్తారు.
సరిగ్గా ఆ విధంగా చొరవ తీసుకునే స్త్రీని మన వద్ద జారిణి గా ,నీతి బాహ్యత కి చిహ్నంగా పరిగణిస్తారు.మనం పశ్చిమం యొక్క బయటి అలవాట్లు స్వీకరిస్తాము తప్ప దాని వెనుక ఆయా సమాజాల్లో evolve అయిన అంశాలని అధ్యయనం చేయము.ఇక్కడ ఫేషన్ ప్రపంచం లో ఉన్న సో కాల్డ్ జనాల అందరి స్థితి అంతే.ఇది ఒక చదువుకున్న అజ్ఞానము అని చెప్పవచ్చు.ఒక నాగరికత లోనుంచి మరి యొక నాగరికత లోకి ప్రవేశించే ముందర జరిగే పరిణామాలు ఇవి అన్ని.మన భారతీయ సమాజం లో పైకి చెబుతాము గాని ఆచరణ లోకి వస్తే స్త్రీ కి ఎక్కువ గౌరవం మరియు ప్రతిపత్తి ఇచ్చేది పశ్చిమ సమాజమే.అయితే మనం అనుకునే విలువల లా అవి ఉండక పోవడం వల్ల వారిని తుచ్చం గా పరిగణిస్తాము.అది వచ్చే చిక్కు.అంత దాకా ఎందుకు.స్త్రీ యొక్క ఆధిపత్యాన్ని ఇప్పటికి ఉద్యోగాల్లో పురుషులు భరించరు.మన దేశం లో.అది అక్కడ సహజము.అనేక రంగాల్లో.
ఇంకా చెప్పాలంటే....ఒక్క మాట చూడండి...మీరు వారి నవలల్లో గాని ,సినిమా ల్లో గాని చూడండి...
జీవితాల్లోగాని అవకాశముంటే...మన వద్ద I fucked her అనే మాట వినపడుతుంది..కాని అక్కడ నుంచి I fucked him అనే మాట కూడ వినబడుతుంది.అక్కడనే చాలానే అర్ధం చేసుకోవచ్చు.ఎంత గ్యాప్ ఉన్నదో మన సమాజాల మధ్య..!
ఈ మాట అడగకుండా ఉండలేకపోతున్నాను. 2016 New Year వేడుకల్లో జర్మనీలో ముస్లిము కుర్రాళ్ళు ఇలాంటిపనే చేస్తే, దాన్నిపట్టుకొని మొత్తం ముల్సిములనీ, వాళ్ల మతాన్నీ విమర్శించామే! మరిప్పుడు మనవాళ్ళు చేసిన దౌష్ట్యాలను చూశాక మనం ఆత్మవిమర్శచేసుకుంటామా? లేక తప్పు పాశ్చాత్య వస్త్రధారణమీదకు నెట్టేస్తామా?
ReplyDeleteఇంకొకటి. ఎవరైనా దేశంలో పెక్కుమంది కలిగున్న అభిప్రాయానికి విభిన్నంగా తమ వాణిని వినిపిస్తేనే వారిమీద సెడిషన్ కేసులు పెడుతున్నామే, మరి ఆ అకృత్యం చేసినవారికి వత్తాసుపలికినట్లుమాట్లాడిన ఆ మంత్రిగారిమీద రేప్‌కేసెందుకు పెట్టలేదు?
ఇక మీరు రాసినదాని గురించి. మీరు గతంలో చాలాసార్లు వ్రాసినట్లుగానే, పాశ్చాత్య విలువలు, ప్రాచ్య విలువల కంటే ఉదారమైన స్థాయికి పరిణామం చెందుతూ వచ్చాయి. పాశ్చాత్య విలువలు మనకు పరిచయమైన తరువాయనే ఉదారవాదం ఒక మంచి లక్షణమని గుర్తెరిగి, మేమూ ఒకప్పుడు పాశాత్యులకన్నా ఉదారంగా ఉండేవాళ్ళమంటూ గొప్పలైతే పోతున్నాం కానీ ఆచరణలో తాలిబన్లలాగా "మన సంస్కృతి" అంటూ తిరోగమన పధంలో ఆలోచిస్తున్నాం.