Monday, January 16, 2017

Story of Tublu అనే ఒక నవల పై కొన్ని మాటలు...



ఈ నవల 2015 లో ప్రచురింపబడింది.జహీద్ అఖ్తర్ అని చెప్పి అస్సాం కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్..బెంగూళుర్ లో పనిచేస్తుంటాడు.నా ఇంగ్లీష్ బ్లాగ్ మూలంగా తను నాకు పరిచయం.అప్పుడప్పుడు నా బ్లాగు కి వచ్చి కామెంట్లు చేస్తూ ఉంటాడు.అలానే అతని బ్లాగ్ లో కి వెళ్ళి నేను కూడా ఏదో రాస్తూ..అలా మా ఇద్దరికి పరిచయం.ఒక అయిదు ఆరు ఏళ్ళు గా ఇలా సాగుతుండగా ఒక సారి అన్నాడు...ఈ అనుభవాలు ఇచ్చిన భరోసా తో ఒక నవల రాశాను చదివి అభిప్రాయం చెప్పండి అని..!ఇన్నాళ్ళు పాటు కుదర్లా ఏదో ప్రయాణాల్లో...పనుల్లో బడి...! కాని ఇటీవల నే చదవడం పడింది..దాని తో ఈ రెండు ముక్కలు రాయాలనిపించింది.

కధ అస్సాం లోని ఒక గ్రామం లో మొదలవుతుంది.ఓ తండ్రి,కొడుకు బ్రహ్మపుత్ర వరదల్లో సర్వం కోల్పోయి మరో ఊరు చేరడం అక్కడ ఉదార స్వభావం గల శర్మ కుటుంబం వలన కొత్త జీవితం ప్రారంభించడం..ఆయన స్కూల్ లోనే బిపిన్ బోరా కి పని కల్పించడం,అతని కుమారుడు తుబ్లు అలియాస్ తన్మయ్ బోర ని పాఠశాల లో చేర్పించడం ఇలా సాగుతుంది.వారి ఇంటి లోనే ఉంటూ స్కూలు,కాలేజీ జీవితాన్ని గడపడం ,పప్లూ దా ఇంకా మైనా వీరు ఇరువురు అన్నా చెల్లుళ్ళు.శర్మ యొక్క పిల్లలు.వారి జీవిత గమనం లో ని సరిగమలు,తుబ్లు జీవితం లో ఎదురైన పదనిసలు ఇవన్నీ చేర్చి ఈ నవల 204 పేజీల్లో రూపు దాల్చింది.సగటు భారతీయ జీవితాన్ని అదే సమయం లో వివిధ భారతీయ నగరాల్లోని ప్రభభావాల్ని దీని లో చూపించారు.ఒక సగటు బాలీవుడ్ సిని మాని చూసినట్లు ఉన్నది.

ముఖ్యంగా విసుగు పుట్టించకుండా కధని నడిపించడం చెప్పుకోవాలి. కాలేజీ జీవితాల్ని ఇంకా సంసారిక వ్యవహారికాల్ని బోరు పుట్టించకుండా రాశాడు.నాకు ఒకటే ఇది ఏమిటంటే ఇలా నలభై దాటని ఇంజనీరింగ్ ఇంకా ఇతర గ్రాడ్యుఏట్లు హాయిగా చక్కని వ్యక్తీకరణ తో ఇంగ్లీష్ లో ఇలా రాసి వేస్తుంటారు.. మనం ఎంతో వెనుకబడినవి అనుకొనే రాష్ట్రాల నుంచి కూడా..కాని అదేమిటో తెలుగు రాష్ట్రాల లోని పిల్లలకి మాత్రం ఆ పాటి ఆత్మవిశ్వాసం ఉండదు అదేమిటో..? నాకు తెలిసీ ఒకటే ...ఇంగ్లీష్ లో సరైన ఫిక్షన్ చదివే అలవాటు మొదటి నుంచి ఓ అలవాటు గా లేకపోవడం..! వీలైతే చదవండి అమెజాన్ లో దొరుకుతుంది.

No comments:

Post a Comment