ఈ రోజు మరాఠా యోధుడు శివాజీ యొక్క జయంతి.ఆ సందర్భంగా కొన్ని మాటలు రాయాలనిపించింది.కొంత మంది బొమ్మల్ని కొన్ని పార్టీ లు ఉపయోగించడం వల్ల వాళ్ళని మిగతా వాళ్ళు బ్లంట్ గా వ్యతిరేకిస్తుంటారు.వారి జీవితాన్ని ,కృషి ని అధ్యయనం చేయకుండానే.అదో టేబూ మిగతా అనుయాయులు అందరకీ.పెద్ద గా హిస్టరీ చదవము..ఒక వేళ చదివినా ఆయా దేశ కాలాలకి అన్వయించుకుని కొన్ని స్వంత గా అంచనా వేసుకోలేము.వేసుకున్నా ప్రస్తుత కాలానికి అవి ఏ కోణం లోను లాభించవని అలా వదిలేస్తాము.
చరిత్ర చదువుతుంటే గతం మన ముందు నిలుస్తుంది.నిజంగా భారత చరిత్ర చదువుతుంటే ...అది నన్ను ఒక్క ముక్క లో చెప్పమంటే...మన స్వదేశీ రాజుల ఘోర పరాభవం ..అడుగడుగునా ..ఎంత ప్రసిద్ది వహిస్తే ఏం లాభం..విజయనగర సామ్రాజ్యం,కాకతీయ సామ్రాజ్యం,అటు ఉత్తరాది లో లెక్కకు మిక్కిలి గల రాజపుత్రుల సంస్థానాలు.. అన్నీ అరబ్బుల,టర్కుల ,మధ్య ఆసియా ల నుంచి వచ్చిన ముస్లిం రాజుల శక్తి ముందు సోది లోకి లేకుండా కొట్టివేయబడినవేగదా.ఏ హిందూ రాజు స్వతత్రించి నిలబడి విజేత గా నిలబడినాడు.గ్రహించగలిగితే ఎన్నో ఆలయాలు,రాజ్యాలు వారాల నెలలకొద్దీ కొల్లగొట్టబడినాయి. ఈ విగ్రహాల్ని ఏ నేల లో నో పాతిపెట్టుకొని కాపాడుకొన్నట్లు గా భావించుకున్నారు.వారి దగ్గర నే అణగి ఉంటూ ఇంకో సాటి స్వ దేశీ రాజుని అంతమొందించడం లో సాయపడుతూ జీవించాము.ఇది చరిత్ర చెప్పే సత్యము.
సకల శాస్త్రాలు పుట్టినాయని చెప్పుకునే ఈ భూమి ఎందుకని బానిస బ్రతుకు నే జీవించింది.ఏదైతే శాస్త్రాల్లో ఉన్నాయో అవి నిత్య జీవితం లో ఆచరణ లోకి రాకపోవడము.కనపడే లేదా జరుగుతున్న వాస్తవాన్ని గుర్తించి దానికి అనుగుణంగా జీవిత విధానాల్ని మార్చుకోలేకపోవడము.శత్రువు మాయ,వంచన ల తో యుద్ధం చేసినా మనం మాత్రం ధర్మ బద్ధంగా నే వెళ్ళాలనే తల మాసిన మిట్ట వేదాంతము.అక్కడనే హిందూ రాజూ లందరూ చావు దెబ్బ తిని దేశాన్ని అన్య జాతులకు అప్పగించింది.ఇక సరే..కుల భేదాలా..వాటి కేమి తక్కువ. మారు తున్న యుద్ధ తంత్రాల్ని ఎప్పటికి అప్పుడు విదేశాలు తిరిగి గమనించడం అనేది లేదు.సముద్ర ప్రయాణం నిషేధించినపుడే దేశ పతనం ప్రారంభం అయింది.నిలవ నీరు ..దాని గతి అంతే.
అయితే ఎవరో ఒక్కరు ఒక కార్యం కోసం పుడతారు.వారు తమదైన సొంత శైలి లో జరుగుతున్న సంగతుల్ని విశ్లేస్తారు.దానికి తగిన మందు ఏమిటి..అని ఆచరణాత్మక రీతి లో యోచించి ఎవరేమనుకున్నా ఆ దారి లో పోతారు.అదిగో అటువంటి శక్తి యే శివాజీ ,కుయుక్తి ని కుయుక్తి తోనే జయించాలి.యుద్ధం యొక్క అంతిమ లక్ష్యము విజయమే.ఏ దారి అవలంబించినా.! సహ్యాద్రి కొండ ప్రాంతాల్ని పరిశీలించి..దానిని తన స్థావరం గా మలచుకొని...బలమైన సైన్యాల పై మెరుపు వేగం తో దాడులు చేసి నష్ట పరిచి వెనుకకి రావడం....శత్రువు ని దారి మళ్ళించడానికి రకరకాల ఎత్తులు వేయడం...ఏది ఏమైనా విజేత గా నిలవడం ఇదే చత్రపతి శివాజీ లో కనిపించేది. మొగల్ సేనాని అఫ్జల్ ఖాన్ చర్చలకి రమ్మని మోసం చేసి కత్తి వేటు కి గురి చేయాలని చూడగా అప్పటికే తొడుక్కున్న Tiger claw తో అతని పొట్టని చీరి వేస్తాడు.అట్లా శత్రువు కంటే ప్రణాళికలో ,ఆచరణ లో ముందుండేవాడు.కనకనే శివాజీ హిందువుల చరిత్ర లో కనబడే ఏకైక హీరో గా కనిపిస్తాడు.అయితే హిందువులకి అలా చెప్పుకునే గర్వము ఎంత మాత్రము ఉండదు..ఎందుకంటే తాము ప్రస్తుత కాలం లో సెక్యులరిస్ట్ గా పిలువబడమేమో అని...లోన ఎక్కడో ఓ అనుమానము.అయితే శివాజీ చరిత్ర ని పరికించినట్లయితే అనేక మంది ముఖ్య సైనిక అధికారులను ముస్లిం ల్నే నియమించాడు...ఏ ఇతర మతాన్ని విద్వేష భావం తో చూసినట్లు గా కనబడదు.ఈ శివాజీ యొక్క ఆరా అనండి..ఇంకొకటి అనండి...మహారాష్ట్ర లో ఇంకా బలంగా ఉన్నది..!

No comments:
Post a Comment