అమెరికా లోని కన్సాస్ కి చెందిన సెనేటర్ జెర్రీ మోర్న్ తన సంతాపాన్ని ప్రకటించాడు ..మంచిది..శ్రీనివాస్ కూచిభొట్ల అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణానికి..హ్మ్మ్..హత్యకి.. దాని వల్ల ఒరిగేది ఏమిటి...ప్రాణం తిరిగి వస్తుందా..రాదు..అది అంతే..కొన్ని రాజకీయ పరి భాషలు అలా ఉంటాయి..దాని వల్ల ఒరిగేది ఏమిటి శూన్యం.అదే ఇక్కడ దీనికి పర్యవసానంగా రెండు అమెరికన్ ప్రాణాలు తీయగలరా..తీయలేరు.ఒక మాట లో చేత కాదు.ఎందుకని మనం అక్కడ వారి పై ఆధారపడి బతుకుతున్నాము..మన బిలియనీర్ల, రాజకీయుల ఆస్తులు ఇంకా బిజినెస్ లు వారి తో అధార పడి యున్నాయి.అసలు ఇదనే కాదు...ఎన్ని భారతీయుల ప్రాణాలు అమెరికాలో విద్యకి ఇంకా ఉద్యొగానికి వెళ్ళి పోయినాయో ప్రతి ఏటా ఆ లెక్కన మన ప్రభుత్వం ప్రకటించగలదా..అసలు అలాంటి లెక్కలు ఉన్నాయా..ఎక్కడా అవి ప్రకటించరు..ఎందుకు..ఒక సంఘటన జరిగినపుడు ఏదో అలా అరవడం..మళ్ళీ అలా సద్దు మణగడం..అదేగా జరిగేది.మన వద్ద బిజినెస్ హౌస్ లు... మీడియా హౌస్ లు ..ఉన్న వారు ఎంత మాత్రం వారి ప్రయోజనాలకి ఇంకోలా వ్యవహరించలేరు.జరిగితే దాని పర్యవసనాలు వారికి బాగా తెలుసు.
ఈ కూచిభోట్ల యువకుని పుణ్యమా అని ఇయాన్ గ్రిలియట్ అనే అమెరికన్ యువకుడు మానవత వాది గా గణుతి కి ఎక్కాడు.మనకి ఉండాలి కొంత.పొలోమని 1991 తర్వాత నుంచి మనాళ్ళు అమెరికా కి ఎగబడటమే ఎగబడటం...అది సరళీకరణ మొదలైన తొలినాళ్ళు.ఇంకో రకంగా ప్రపంచ పాలన మొదలయిన రోజులు. ఇప్పుడు హాలిడే ముగిసింది. అందుకే ట్రంప్ వచ్చింది.మన దేశం లోని పరిస్తుతల మల్లే అన్నీ ఉండవు.అవి విజేతల వ్యూహాలు.అవి ఊహించడానికి అర్ధం జేసుకోడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో చెప్పలేము.అయితే మన పాలకులకి అవి అన్నీ తెలుసు అందుకు నే సంతాప సందేశాలు పంపి ఊరుకుంటారు.
కేవలము కొంత మంది అమెరికన్ పౌరులు చనిపోతేనే ప్రపంచం యుద్ధం ప్రకటించినంత పని చేస్తారు అమెరికన్లు ..కాని ఇండియా అంత హంగామా ఎందుకు చేయలేదు....ఇరాన్ ఇంకా ఇరాక్ మీద ఆంక్షలు వెనుక కారణం ఏమిటి..? వాళ్ళు ఎంతో కొంత మన కంటే మెరుగ్గా స్పందించబట్టే విలన్లు గా మీడియా లో చూపబడతారు.మన స్థానిక వ్యాపార దిగ్గజాలు...వారు సపోర్ట్ చేశే పాలకులు ఒక స్థాయిని మించి అమెరికా ని ప్రశ్నించలేరు.వీరి బట్టల్ని విప్పి నగ్నంగా నిలబెట్టగల నిలబెట్టగల తెలివి వారి స్వంతం.
ఇంకోటి ఇలాంటి వి జరిగినప్పుడు ఇప్పటికే అమెరికా లో స్థిరపడిన వేల తెలుగు కుటుంబాలు ఎందుకని స్పందించవు..?
ఇంతా జేసి ఇయాన్ గ్రిలియట్ అనే అమెరికన్ యువకుడు హీరో అయినాడు..బహుశా అతనికి ఏదో ప్రపంచ స్థాయి అవార్డ్ వచ్చినా ఆశ్చర్యం లేదు.ట్రంప్ అనే ప్రసిడెంట్ వ్యూహం లో ఒక భాగం అంతే..ఎప్పుడు ఏ రకంగా అమెరికా పాలన నడవా లో నిర్దేశించేది తెర చాటున ఉండే అక్కడి కార్పోరేట్ బాస్ లే.స్కెచ్ లు వేయడం లో ఇండియన్ లు పది అడుగులు దూకితే వారు వంద అడుగులు దూకుతారు.అసలు వారు వేసిన స్కెచ్ ని అర్ధం చేసుకోడానికి మనకి వందలు ఏళ్ళు పడుతుంది.అందుకనే బుద్ది కలిగిన మన రాజకీయులు వారు కమ్మీలు గాని కాషాయం వారు గాని ఒక స్థాయిని మించి పోరు.
No comments:
Post a Comment