"అయితే నువ్వు ఓ పెద్ద చేప ని గాని పట్టిన పక్షం లో..నీకు సాయం గా మేము వస్తాము లే" అన్నాడు కుర్రవాడు.
" నువ్వు ఇప్పుడు వెళ్ళే పడవ ఉన్నదే అతను ..సముద్రం లో ఎక్కువ దూరం వెళ్ళడా.. ఏం..?" ముసలాయన ప్రశ్నించాడు.
" లేదు.అతనికి కంటి చూపు అంతంత మాత్రమే..ఆ డాల్ఫిన్ లు అవీ పైకి లేచినపుడు పక్షులు అవీ వచ్చి చూస్తున్న మందం కూడా చూడలేడు.."
" అతనికి కంటి చూపు అంత తక్కువా..?"
"ఇంచుమించు అంతే"
" వింతగానే ఉన్నదే...అతను తాబేళ్ళ వేట కూడ చేసిన వాడు కాదు.అలాంటివి చేయడం లో కంటి చూపు మందగించే అవకాశం ఉంటుంది.."
" అలా అంటున్నావా..మరి మస్కిటో కోస్ట్ లో ఎన్నో ఏళ్ళు నువు తాబేళ్ళ వేట చేశావు.నీ కంటి చూపు బాగానే ఉందిగా.." ఆశ్చర్యంగా అన్నాడు కుర్రవాడు.
" నేను ఒక వింత ముసలివాణ్ణి లే"
"నిజంగా ఓ పెద్ద బలమైన చేప ఇపుడు నీకు పడిందే అనుకో...దాన్ని నువ్వు సంభాళించగలవా..?"
"దానికి నా మెళుకువలు నాకున్నాయి..ఎలాంటి దానినైనా ఒడ్డుకు తీసుకురాగలను.."
" సరే..పద..ఈ మర బోటు కి సంబందించిన సరంజామానంతా ఇంటికి తీసుకు పోదాం.ఆ తర్వాత నా పని లోకి నే పోతాను" చెప్పాడు కుర్రాడు.బోటు కి పెట్టే గేర్ ని,తెర చాపలు కట్టడానికి గాను ముందు భాగం లో అమర్చే పొడవాటి దుంగని వాటిని ముసలాయన తన భుజానికి ఎత్తుకున్నాడు.ఎరలు పెట్టే చెక్క పెట్టె,గాలాలు వేసే తాళ్ళు ,హార్పున్ లాంటివి కుర్రవాడు పట్టుకున్నాడు.ఇవన్నీ ఇక్కడ ఉంచినా ఎవరూ తీసుకెళ్ళరు లే గాని ఎందుకు అనవసరం గా ఉంచడం అని..ముఖ్యంగా హార్పున్ లాంటివి..!
అలా ఇద్దరూ నడుచుకుంటూ వచ్చి ముసలాయన ఇంటికి వచ్చారు.ఒక గుడిశె మాదిరి దే అని చెప్పవచ్చు. ముసలాయన ఆ పొడవాటి దుంగని గోడకి ఆనించి నిలబెట్టాడు.తెరచాపల్ని వాటిని ఒక వార గా పెట్టాడు.ఆ కుర్రాడు కూడా మిగతా అన్నిటిని పక్కనే సదిరాడు.ఆ పొడవాటి దుంగని mast అంటారు వారి పరి భాష లో.రాయల్ పాం కలప తో తయారు చేసినట్టిది.
ఆ చిన్ని ఇంటిలో ఉన్నది బహు కొద్ది సామాన్లు..ఒక మంచం,ఒక కుర్చి,ఒక టేబుల్..అంతే.పొయ్యి బొగ్గు తో రాజేస్తారండానికి గుర్తు గా నేమో..నేల మీద మరకలు అవీ ఉన్నాయి..ఈ మధ్య ఊడ్చినట్లు గా లేదు.అక్కడక్కడ గాలికి కొట్టుకు వచ్చి న చెట్ల ఆకులు..పరుచుకుని ఉన్నాయి.ఒక వేపు న క్రీస్తు పరిశుద్ధాత్మ బొమ్మ,మరో వేపు మేరీ మాత బొమ్మ ఉన్నాయి.అవన్నీ ఎప్పుడో భార్య బతికి ఉన్నరోజుల్లో పెట్టినవి..అలానే ఉన్నాయి.ఆ గోడకి ఉండే భార్య ఫోటోని మాత్రం ఒక అరలో మంచి చొక్క మడత లో పెట్టాడు. ఆ గోడ మీద అది కనబడుతున్నప్పుడల్లా తనకి ఏకాంతం లో ఉన్న భావం కలిగి అదోలా అనిపిస్తుంది.
" తినడానికి ఏమి ఉంది" అడిగాడు కుర్రవాడు Manolin .
" ఒక కుండలో కొంత పసుపు అన్నం,చేపల కూర ఉంది..నీకు ఏమన్నా కావాలా " ముసలాయన అడిగాడు.
" నేను ఇంటి వద్ద తింటాలే..వాటిని వేడి చేయనా "
"వద్దు..నేను తర్వాత వేడి చేసుకుంటా..లేదా అలాగే తినేస్తా "
" ఆ వల ఏది..ఓ సారి చూస్తా.."
" అలాగే..కానీ" చెప్పాడు ముసలాయన.
అక్కడ పసుపు అన్నం ఉండదు,కూర ఉండదు..ఆ వల ఉండదు..దాన్ని అమ్మివేసిన సంగతి ఆ కుర్రాడికి తెలుసు.కాని ఒక్కోసారి అలా ఏదో మాటలు సాగిపోతుంటాయి వారి మధ్య.
" అన్నట్లు ఎనభై అయిదు నా లక్కీ నంబర్ గదా..ఒక వెయ్యి పౌండ్ల చేప పడిందనుకో ఈ రోజు..ఎలా ఉంటుంది.." అడిగాడు ముసలాయన.
" నేను వెళ్ళి వల ని ఇంకా ఆ సార్డైన్ లని తెస్తా గాని..ఈ తలుపు దగ్గర సూర్య కాంతి లో కూర్చుంటావు గా"
" ఓ..అలాగే..నిన్నటి పేపర్ కూడా ఉండాలి.దాంట్లో బేస్ బాల్ ఆట గురుంచి చదవాలి" చెప్పాడు ముసలాయన.
ఆ పేపర్ సంగతి మాత్రం ఆ కుర్రాడికి తెలియదు,ముసలాయన ఉన్నట్లుండి మంచం లోనుంచి ఓ పేపర్ తీసుకొని చదవ సాగాడు." నిన్న Perico ఈ పేపర్ ని ఇచ్చాడు చదువుకోమని" అన్నాడు దాని వివరం చెపుతూ.
" సరే..మరి నే వెళ్ళోస్తా..ఎర గా వేసే చేపల్ని నీవి,నావి కలిపే పెడదాం..రేపొద్దున్న ఎవరివి వాళ్ళు తీసుకుందాం.వచ్చిన తర్వాత బేస్ బాల్ సంగతులు చెపుదువులే.."
" ఏది ఏమైనా ఈ సారి Yankees ఓడిపోవడం జరగదు" చెప్పాడు ముసలాయన.
" Indians of Cleveland జట్టు తక్కువా.
" Yankees లో నమ్మకముంచవయ్యా..గొప్ప ఆటగాడు DeMaggio ఆ జట్టు లో ఆడుతున్నాడు ..మరిచిపోయావా "
" అట్లాని కాదు.
" ప్రతి చిన్నదానికి భయపడితే ఎలా...అలా అయితే అణా కాణీ కాని వాళ్ళ కి భయపడుతూ పోవాలి"
" సరేలే..నువు చదువుతూ ఉండు...మళ్ళీ వస్తా "
" రేపు ఎనభై అయిదవ రోజుగదా..అదిరిపొయే లా ఏదైనా జరగవచ్చునేమో.."
" ఓ సారి 87 రోజులకి ..ఒక్కటీ పడలేదని చెప్పావు గుర్తుందా.."
" లేదు లే ఆ రికార్డు ఎట్టి స్థితి లోను పునరావృతం కాదు.." చెప్పాడు ముసలాయన.
--- Murthy KVVS
No comments:
Post a Comment