ఈ సారి వేసవి కాలం లో కేరళ లో ఒక మంచి ప్రదేశాన్ని సందర్శించడంజరిగింది.అయితే అది ముందు ప్రణాళిక వేసుకున్నది కాదు.ఒక్కోసారి అలాజరుగుతుంటాయి.జరగినివ్వడమే..అన్నీ ఒకందుకు మంచిదేనని..!మైసూరు లో మూడు వారాలు అలవోక గా గడిచిపోతుండగా చివరి లో కేరళ కి చెందిన ముసద్దీక్ పరంబిల్ మాటల లో అన్నాడు ఇక్కడికి మావూరు మూడు గంటల ప్రయాణం...మంచి అందమైన ప్రదేశాలు ఉన్నాయి అని.మరింకేమి..వీలైతె రేపు పొద్దునే బయలుదేరుదాము అన్నాను.గతం లో కొట్టాయం అటువేపు ప్రాంతాలు తిరిగాను గాని ఈ వైనాడ్ జిల్లాలో దిగింది లేదు. చూద్దాము..ఇక్కడ ఏమి ఉన్నాయో మనకోసం అనుకున్నాను.ప్రత్యేకంగా పనీ పాటా లేకుండా తిరగడము ...ఏ ఇబ్బందులనైన మనవి కాదు అని భావించడం ముందునుంచి మనకి అలవాటైన విద్యయే కదా.
కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ కి చెందిన బస్ ఎక్కాం.పశ్చిమ కనుమల లోని దట్టమైన అరణ్యాల గుండా సాగిపోయాము.మధ్య లో గుండ్లు పేట అనీ ఒకటి తగిలింది.ఒక మాదిరి పటణం ..కాని ఇళ్ళన్నీ ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాయి.రోడ్లు కి అడ్డదిడ్డం గా ఏవో నిర్మాణాలు లేకుండా చూడటానికి బావున్నది.ఇది కర్ణాటక లోదే.కోజికోడ్ మీదుగా వెళ్ళి సుమారు రెండుం బావు గంటల తర్వాత సుల్తాన్ బత్తెరి లో దిగాము.ఇది వైనాడ్ జిల్లా లోనిది.మున్సిపాలిటి. కాని కేరళ లో ప్రవేశించి నప్పటినుంచి.. దృశ్యాలు.... పచ్చదనం ..ఆ పర్వతాలు...నీట్ గా ఉన్న బంగాళా పెంకుల ఇళ్ళు... రకరకాల భవనాలు... తెరపి లేకుండ ...అరణ్యాలు... అసలు వీళ్ళు అరణ్యాల లో ఇళ్ళు కట్టుకున్నారా అనిపించింది.హాయిగా ,చల్లగా ఉంది..!ఇక్కడ మనకి మాడిపోయేంత వేడి ఈ మే మాసం లో.. ఒక్క దేశం లో ఎన్ని వాతావరణ వ్యత్యాసాలో...!
సుల్తాన్ బతెరి లో ఒకప్పుడు టిప్పు సుల్తాన్ యొక్క ఆయుధాగారం ఉండేదట. ఆ పేరు మీదనే ఈ పేరు వచ్చిందని తెలిసింది.సరే..దిగగానే..ఒక హోటల్ లో టిఫిన్ చేశాము.టిఫిన్ లో గుడ్లు సర్వ సాధారణం. గనక లాగించి ఒక లోటాడు కాఫీ తాగుట జరిగింది.ఆ తర్వాత జీప్ లో కురవ ద్వీపానికి బయలు దేరాము. సుల్తాన్ బతెరి దాటి ఇంచుమించు ఓగంట పైన ప్రయాణించి అక్కడికి చేరుకున్నాము. సెలవుకావడం మూలాన పిల్లలు పెద్దలు బాగానే వచ్చినట్లుంది.ఈ కురవ ద్వీపం ఇప్పుడిప్పుడే వెలుగు లోకి వస్తోంది..టూరిజం శాఖ వాళ్ళు ఏరాట్లు బాగానే చేశారు..ముఖ్యంగా పర్యావరణం కలుషితం కాకుండా వెదురు బొంగుల తో తెప్పలు కట్టి..దాన్ని పైన వేలాడతీసిన తాళ్ళ సాయం తో నడుపుతున్నారు.ఆ నీళ్ళ లోనుంచి ప్రయాణం చేసి దీవి లోకి వెళ్ళడం అద్భుతం గా ఉంటుంది.అంతా అడవే కాని ..ఒ జలపాతం వరకు దారి వేశారు..ఓ రెండు మైళ్ళు దాక పోయి అక్కడ స్నానం చేయవచ్చు.
ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో ..జైన మతానికి చెందిన ప్రాచీన ఆలయం ఒకటి ఉంది.టిప్పు సుల్తాన్ కి చెందిన కోట ఒకటి ఉంది.ఇంచుమించు శిధిల దశ కి చేరుకున్నాయి.ఎడక్కల్ గుహలు కూడా ఇక్కడ చూడదగినవి.దానిలో ఆదిమానవుని కాలం కి చెందిన చిత్రాలు అవీ ఉన్నాయి.ఆ ఊరు లో కొన్ని బజారులు తిరిగాను. ఇక్కడ రోజు వారి సంగతులు అవీ చూద్దామని.ఎవరి జీవితం వారిదే న్నట్లుంది ..రోడ్ల మీద గాని ఇళ్ళ పక్కల వారి తో గాని ఎవరూ బాతాఖానీల లాంటివి నెరపడం కనపడలేదు.చాల ఇళ్ళ లో మనుషులున్నారా అన్నంత సైలెన్స్ అదేమిటో.
బస్ స్టాండ్ పక్కనే ఒక Toddy shop కనిపించింది.అక్కడ కూడా నో సౌండ్.దాని వేళ కాలేదు.టైమింగ్స్ ఉన్నాయక్కడ.కొన్ని ఫోటోలు తీశా. ఇలా రాసినప్పుడు వేయవచ్చునని. ఒకటి చెప్పాలి...ఇక్కడ.ఈ సుల్తాన్ బతెరి శివారు లో ఓ చిన్న హోటల్ లో భోజనం చేస్తుండగ ...ఓ బసు లో ముప్ఫై మంది జనాలు దిగారు. వీళ్ళందరకీ సర్వ్ చేయడానికి ఎంత సమయం పడుతుందో అని ..అనుకొంటూండగా ..ఆ గుంపు లోని ముగ్గురు హోటల్ ఓనర్ దగ్గరకి పోయి ఎదో మాట్లాడారు. అంతె..ఆ ముగ్గురు కలసి.. హోటల్ కి వచ్చిన అందరకీ ..వాళ్ళ జనాలతో కలుపుకుని ..సర్వ్ చేసేశారు.డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఈ పరస్పర సహకార బాగానే ఉందే అనిపించింది.
No comments:
Post a Comment