"ఇపుడు నువు ధైర్యంగా ...ఆత్మవిశ్వాసం తో ఉండటం మంచిది..ముసలివాడా" అనుకున్నాడు తనలో తను." దాన్ని నువు వేటాడుతున్నావు..తాడుని కూడా అనుకున్నంత పొందలేవు...కొద్దిసేపటి లో ఆ చేప గుండ్రంగా తిరగడం మొదలెడూంది..చూసుకో.."
ఎడమ చేతి తో అలానే పట్టుకొని ..వెనక్కి తిరిగి కుడి చేతి తో నీళ్ళు తీసుకున్నాడు సముద్రం లోనుంచి...ముఖం మీద ఇందాక అంటిన డాల్ఫిన్ మాంసాన్ని కడుక్కోవడానికి.లేకపోతే దేవినట్లయి వాంతి అయినా కావచ్చు...దానివల్ల ఇంకా శక్తి కోల్పోయే అవకాశం ఉన్నది.ముఖం కడుక్కొని..ఆపైన కుడి చేతిని కూడా కడుక్కున్నాడు.సముద్రం నీళ్ళ లో కాసేపు అలాగే చేతిని ఉంచాడు.
సూర్యుడు అయితే కనపడటం లేదు గాని ...వెలుతురు పొడసూపింది ఆకాశం లో.తాను తూర్పు గా సాగుతున్నట్లు అనిపిస్తోంది.సముద్రపు అలలు తీసుకువెళుతున్నవేపే వెళుతున్నాడు.తాను అలసినట్లే ఉన్నాడు.ఆ చేప గుండ్రంగా తిరగడం ప్రారంభించినపుడు...తన అసలు పని మొదలవుతుంది.కుడి చేతిని నీళ్ళ లోనుంచి తీసేసుకున్నాడు." కొద్దిగా నొప్పి ఉన్నది లే గాని..ఇపుడు ఫరవాలేదులే" అనుకున్నాడు.మళ్ళీ గేలపు తాడు ని జాగ్రత్త గా సంభాళించడం మొదలెట్టాడు.తన శరీరానికి అనువు గా.
" నువు కష్టపడినా ...దానికీ ఓ పరమార్ధం ఉందిలే.." ఎడమచేతికి సర్దిచెప్పాడు.
రెండు చేతులకి ఒకే రకపు సామర్ధ్యం ఉండి ఉంటే బాగుండేది.అలా పుట్టి ఉంటే బాగుండేది.మరో చెయ్యికి సరైన తర్ఫీదు ఇవ్వలేదని దాని అర్ధం.అవకాశాలు ఎన్నో వచ్చినాయి.ఆ దేవుడికే తెలుసది.ఈ చేయి మొరాయించినపుడు కూడా ...ఆ రాత్రి బాగానే పని చేయగలిగాను.ఒకసారి ఇది తెగింది..మళ్ళా అలా జరగడం కంటే ..అసలిది పోవడమే మంచిది.
" ఇంకొద్దిగా డాల్ఫిన్ మాంసం తింటేనో...బుర్రలో కూడా చికాకుగా ఉంది...లేదు..ఇపుడది కష్టం." అనుకున్నాడు మళ్ళీ.వాంతి వచ్చి చికాకు అయి..శక్తి కోల్పోయే కంటే ఇలా ఉంటమే హాయి...అందులోను ఇందాక ముఖం మాంసం లో కూరుకుపొయి ..చాలా ఇదిగా అనిపించింది.అత్యవసరం అయితే తర్వాత చూసుకోవచ్చులే..ఆ ఎగిరే చేప మాంసం తింటే పోలా..శక్తి కి"
ఇంకో చేప..అదే ఎగిరే చేప మాంసం తయారు గానే ఉంది.శుభ్రంగానూ ఉంది.దాని లోని ముల్లుల్ని తీసి పారేసి దాని తోక దాక ఉన్న మాంసాన్ని తిన్నాడు.అన్నిటికంటే ఇది బలవర్ధకం.సరే..కావలసింది చేశా.ఇక ఆ నీళ్ళ లోని చేప దే ఆలశ్యం.తిరుగులు తిరగడానికి.
ఇది మూడవ రోజు సూర్యుడు ఉదయించి..తాను ఈ సముద్రం మీదకి వచ్చిన తర్వాత. నీళ్ళ లో చేప కదలిక ప్రారంభం చేసింది.గేలపు తాడు కూడా కొద్దిగా వొంగినట్లు అయింది గాని ముందు అది గమనించలేదు.తాడు మీద వత్తిడి బాగానే ఉంది.మెల్లిగా కుడి చేతి తో కదిలించడం చేస్తున్నాడు.భుజాలు,తల కిందు గా వంచి నీళ్ళ లోకి చూశాడు.రెండు చేతులతో గేలపు తాటిని ఊపి చూశాడు.
" గుండ్రంగా తిరుగుతోంది...పైగా దూరంగా జరుగుతోంది...ఎంత వీలైతే అంత గట్టిగా పట్టుకోవాలి దాన్ని...అది తిరిగిన ప్రతిసారి అలుపు తగ్గినట్లు అవుతోంది.కాసేపట్లో ..అంటే ఓ గంట లో బయటకి రావచ్చును అది.ఏదోలా అలాగే రప్పించి ..ఆ తర్వాత మట్టుబెట్టాలి.అయితే నెప్పది గా తిరుగుతోంది.చెమట తో ముసలాయన తడిసిపోయాడు.ఆ చేప నీళ్ళలో గుండ్రంగా తిరుగుతూనే పైకి వస్తున్నట్లుగా అనిపించింది.గేలపు తాడు వంగే విధానాన్నిబట్టి చేప కదలికని అంచనా వేయవచ్చు.
గంట అయినతర్వాత..ఆ సముద్రపు నీళ్ళ లో నల్లని మచ్చలు..ఆ చేపవేనేమో కనిపించసాగాయి.కంటి కింద అయిన గాయం మీదకి చెమట ధార గా కారుతోంది ముసలాయనకి.నొసల మీద కూడా.నీరసం గా తోచింది. " నేనెప్పుడు విఫలం కాలేదు..ఇలాంటి చేప చేతి లోనా నేను చచ్చేది..లేదు.చక్కగా వస్తోది అది..దేవుడా నాకు సాయం చెయ్యి..ఇపుడయితే చేయలేను గాని తర్వాత నీకు వందల కొద్దీ ప్రార్ధనలు చేస్తాను. "
ఉన్నట్లుండి మళ్ళీ గట్టి ఊపు ..ఊపినట్లయింది.గేలపు తాటిని రెండు చేతులతో పట్టుకున్నాడు.ఇది బరువు గా ..వేగంగా ఉంది.దీని ఈ సారి ఊపు..
చేపని బందించి ఉన్న ఆ హుక్ లు వైర్ లీడర్ కి అనుసందింపబడి ఉంటాయి గదా..దాని సమీపం లో బల్లెం తో పొడవాలని అనుకున్నాడు.అదెలగూ చేయవలసిందే.ఇపుడు గుండ్రంగా తిరుగుతోంది..కానీ..ఒక్కోసారి గాలి లో ఎగిరితే కూడా మంచిదే..దానికి తగులుకున్న హుక్ చేప గాయం ని పెద్దది చేస్తుంది..మరీ మితి మీరినా కష్టమే..హుక్ కూడా పడిపోవచ్చు.
"ఎగరకు చేప ఎగరకు.." ముసలాయన కొద్ది గా తాడు వదులుతున్న కొద్దీ అది వచ్చి వైర్ లీడర్ కేసి కొట్టుకొంటోంది.దాని బాధ అది పడనీ..పడాలి..నాకేమిటి..నన్నూ నేను కంట్రోల్ చేసుకోగలను..దాని బాధ దానికి పిచ్చెత్తించినట్లు చేస్తుంది.కాసేపు ఉన్నాక ఆగి..మళ్ళీ గుండ్రంగా తిరగడం షురూ చేసింది.తాడుని లోపలకి తీసుకొంటున్నాడు మెల్లిగా...లోపల నీరసం గా ఉన్నది.సముద్రం నీటిని ఎడమ చేతి తో తీసుకొని తల మీద,మెడ వెనుక భాగం వద్ద పోసుకొని రుద్దుకున్నాడు. (సశేషం)
బాగా చెప్పారు సార్ ...!!!
ReplyDeleteచాలా బాగున్నాయ్ పోస్టులు ... !!!!
తెలుగు వారి కోసం నూతనం గా యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది
చూసి ఆశీర్వదించండి
https://www.youtube.com/garamchai