ఇపుడు చెయ్యి బిగుసుకుపోవడాలు అలాంటివి ఏమీ లేవు...కాసేపట్లో గేలానికి తగిలిన ఆ చేప పైకి వస్తుంది.అపుడు చూపించాలి నా తడాఖా....మాటలెందుకులే.. !" మోకళ్ళమీద అలగే కాసేపు ఉండి ...సాలోచనగా ఇంకొంచం తాడు ని వదిలాడు. కొద్దిగా విశ్రాంతి పొందుతా...గుండ్రంగా తిరుగుతూ వస్తుందిగా...అప్పుడు నా పని మొదలెడతా...అని అనుకున్నడు ముసలాయన.
విశ్రాంతి తీసుకుంటున్నా ఒకలాంటి ఆతురతే... ఆ చేప పడవ కి చేరువగా రావడం తో తాడు ని లాఘవంగా కదపడం మొదలెటాడు. ఎప్ప్పటికంటె కూడా ఈసారి బాగా అలిసిపోయాను.వ్యాపార పవనాలు వీయడం మొదలైంది.ఇవి ఇపుడు తనకి బాగ అవసరం.నెత్తిమీద ఉన్న టోపి ఓ వేపుకి పడి ఉంది.వాతావ్రణం సైతం బాగుంది.మళ్ళీ ఇంటిముఖం పట్టడానికి ఇవి అవసరం.
నైరుతి దిక్కు వేపు వెళ్ళాలి నేను....సముద్రం లొ దారితప్పడం ఏమీ ఉండదు... ఇదొక పెద్ద ద్వీపం లాంటిది.మూడోసారికి,ఆ చేప ఎగిరినపుడు ...అగుపించింది.ముందు ఓ పెద్ద నీడలా తోచింది.పడవ కింద భాగంలో...ఆ చేప పొడవు నమ్మలేనంత గా ఉంది. లెదు పెద్ద ఆ ఉండదు అనుకున్నాడు తనలో.నిజానికి అది పెద్ద చేప నే..!సముద్రం పైన ఈదుతూ 30 యార్డుల దూరం లో ఉందది..!
పెద్ద కొడవలి కంటే కూడా పెద్ద గా ఉంది దాని తోక.ఆ నీలపు నీళ్ళ లో వెలిసిపొయిన లావెండర్ రంగు లొ ఉంది.దాని మీద ఉన్న గీతలు కూడా కనిపిస్తున్నాయి. అన్నివిధాలా అసామాన్యంగా నే ఉన్నది. ఒక రెండు చిన్న చేపలు ..ఈ పెద్ద చేప కి చేరువ లో నే ఈదుతున్నాయి.కొన్నిసార్లు ఆగుతూ...చక్కగా ఈదుతూ పోతున్నాయి.ముసలాయన చెమటలు కక్కుతున్నాడు...సూర్యుడొకడే కాదు దానికి కారణం.ఇక తన ఆయుధం హార్పూన్ ని ఉపయోగించి ...దాన్ని పరి మార్చే సమయం చేరువ అవుతోంది.అయితే ఇంకా కొద్దిగా ..ఇంకొద్ది గా దగ్గరకి రావాలి...ఆ చేప. దాన్ని తల మీద కాదు ..గుండే భాగం లో హార్పూన్ తొ దెబ్బ తీయాలి. తల భాగంలో కాదు...గండె భాగం లో ..దాన్ని హార్పూన్ తో దెబ్బతీయాలి.నిశ్శబంగా... బలం కొద్దీ దెబ్బ తీయాలి. చేప కూడ తిరుగుడు ఆపడం లేదు. దాని వెనుక తోక ఊపుతూ పోతుంది.
మొత్తనికి దాన్ని నేను కదల్చగలిగాను.సరే..ఈసారి ఇంకా దాన్ని బలహీనపర్చగలగాలి..అన్ని భాగాలను..!ఇదే చివరి అవకాశం..ఇంకా దాన్ని లాగిపారేయాలి.మళ్ళీ గట్టిగా లాగాడు గేలపుతాడుని..పడవకి చేరువ గానే ఉన్నది అది..!మళ్ళీ ఆ చేప సర్దుకుని ఈదసాగింది.
ఓ చేపా...నువు ఎలాగు మృత్యువు ని వరించబోతున్నావు... నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా...ఏమిటి..?అలగయితే ఎలా..? ముసలాయన నోరు పిడచగట్టుకుపోయింది..నీళ్ళు నోటిలో కొన్నైనా పడాలి...మాట గట్టిగా రావాలంటే..!చేప సంభాళించుకుంటూనే ఈదసాగింది.
నన్ను చంపుతున్నావు గదే .నీకు ఆ హక్కు ఉందిలే.. నీలాంటి అందమైన ...గొప్పదైన తోబుట్టువు ని నేనింతదాకా చూడలేదు.పోని నన్ను చంపు... ఎవరు ఎవర్ని చంపినా నాకు ఫరవలేదు...! నీ తల ఏమైనా పాడయిందా ...సరి చేసుకో.. మనిషి లాగనో,చేప లాగనో బాధపడటం నేర్చుకో...!
చేప తిరగలబడినపుడు ...గాయపరచాలని అనుకున్నాడు.కాని ఉన్నట్లుండి అది సర్దుకొని ముందుకే పోతోంది.ముసలాయన ఈ సారి శరీరం లో మిగిలిపోయిన బలాన్ని అంతా ఉపయోగించి తాడుని లాగాడు.ఇపుడు చేప బాగా దగ్గరయింది.
మరింత తాడుని లోపలికి లాక్కున్నాడు.ఆ తాడు ని కాళ్ళ తో తొక్కి పట్టి హార్పూన్ ఆయుధాన్ని తీశాడు.బలం కొద్దీ చేప కి ఓ పక్క గా పొడిచాడు.సరిగ్గా దాని గుండె ఉండే చోట.బాధ తో అది అంతెత్తున ఎగిరింది.. హార్పూన్ కి అమర్చిన ఆ బల్లెం దాని లోపలకి దిగడం తో ఇక ఆలశ్యం చేయకుండా పోటు మీద పోటు మళ్ళీ మళ్ళీ పొడిచి వదిలాడు.తన బలం అంతా హార్పూన్ లో నిక్షిప్తం చేశాడు.
చివరిసారిగా దాని గొప్ప రూపాన్ని చూపెట్టాడానికా అన్నట్లు ఆ చేప మళ్ళీ ఒక్కసారిగా గాలిలోకి ఎగిసింది.దభెల్లున సముద్రం లో పడింది.దాని నుంచి వచ్చిన వాసన ముసలాయన్ని,పడవని వేగంగా తాకింది.
వెంటనే అతడిని నీరసం ఆవహించింది. హార్పూన్ కి ఉన్న తాడు ని సర్దుకుని చూస్తే వెండి రంగు లో మెరిసే ఆ చేప పొట్ట సముద్రపు నీటి మీద తేలుతున్నట్లుగా అగుపించిది. తన చూపు మందగించినట్లుగానూ అనిపించింది.అ దృశ్యాన్ని కాసేపు అలాగే చూశాడు.. రెండు చేతుల్ని తల వెనక్కి పెట్టి అదుముకున్నాడు.నీ ఈ తల మంచిగా పనిచెయనీ...నేను అలసిన ముదుసలినే అయినా నా తోబుట్టువు వంటి ఈ చేపని చంపాను.పోరాటం ముగిసింది. ఇపుడు ఇక బానిస చాకిరి మిగిలింది. దీన్ని తాళ్ళ తో గట్టి గా కట్టుకొని ఒడ్డుకి తీసుకుపోయే పని ఉన్నదిక..! (సశేషం)
No comments:
Post a Comment