Monday, June 26, 2017

Ernest Hemingway నవల The Old man and the sea సంక్షిప్తంగా...(17 వ భాగం)ఇపుడు ఈ  చనిపొయిన పెద్ద చేపని  ఒడ్డుకి తీసుకుపొయే పని మిగిలిఉంది.దాన్ని పడవలో పెట్టడానికి కుదరదు.అంత పెద్దది అది.పడవ కి ఒక వార గా కట్టి తీసుకుపోవాలి.చేపని దగ్గర గా  లాగి .దాని మూతికి,మొప్పలకి గట్టిగా తాళ్ళతో కట్టాలి.ఈ చేప ఇపుడు నా సొంతం.  దాని పోరాట శైలి కి మెచ్చుకోవలసిందే.ఆ ..అన్నట్లు చేప కి  చివరి మధ్య భాగాల్లో కూడా తాళ్ళ తో కట్టాలి.మళ్ళి అవన్నీ పడవకి అనుసందానం చేసి కట్టాలి.


అలా ఆలోచిస్తూ కొద్ది గ నీళ్ళు తాగాడు. ఒక్కమాటు ఆకాశం కేసి చూసి ఆ తర్వాత  చేప వేపు దృష్టి సారించాడు.  మధ్యానం కూడా ఐ ఉండదు.వ్యాపార పవనాలు బాగానె  వీస్తున్నయి. పడవనీ చేపనీ అవే లాక్కెళ్ళి పోతాయి.గట్టిగ మాటాడితే తాళ్ళు కూడా  అవసరం లేదు.ఇంటికి పోగానే నేను ఆ కుర్రాడు కలిసి  దీన్ని కోసి పోగులు వేస్తాము. ఈ చేప తల  చాలా పెద్దగా ఉంది.హార్పూన్ కి ఉన్న తాడు ని...మిగతా తాళ్ళని  తీసి చేప మొప్పలు   దవడలు అన్నిటిని చక్కగా గట్టిగ కట్టాడు. బందోబస్తు గా  రెండు వరసలు వేశాడు. చేప వంటి మీద గీతలు అర చేతి మందాన ఉన్నాయి. చేప రంగు సైతం మారింది. దాని కన్ను ఒకటి బయటకి   వచ్చి ఉంది.

తప్పదు. దాన్ని చంపడానికి ఇదే మార్గం మరి. ఈ చేప బరువు పదిహేను వందల పౌండ్లకి ఉండొచ్చు.. లేదా కొద్ది గా ఎక్కువ నే ఉండొచ్చు. తరుగు పోగా...ఒక్కో పౌండ్ మాంసం ని ముప్ఫై సెంట్ల చొప్పున అమ్మవచ్చు.ఆ లెక్కన మొత్తం ఎంత వస్తుంది...ఎమోలే..ఆ లెక్కలన్నీ వెయ్యాలంటే ఇపుడు పెన్సిల్ కావల్సిందే.తలంతా చికాకు గా ఉంది..! ఆ నా అభిమాన  బేస్ బాల్ ఆటగాడు DeMaggio నన్ను  ఇపుడు గాని చూస్తే మెచ్చుకోకుండా ఉంటాడా..!  ఎముక దెబ్బ తినడం లాంటిది అయితే నాకు జరగలేదు.అసలు అలా జరిగితే ఎలా ఉంటుందో....అలాంటివి అన్నీ మనకి తెలియకుండానే  జరిగిపోతాయి.అయితే ఒకటి .. చేతులు,వీపు భాగాలు సలుపులు గా ఉన్నాయి.

ఎందుకైనా మంచిదని మిగిలిన తాళ్ళు ఇంకొన్ని తీసి చేపకి అన్ని భాగాలకి కట్టుదిట్టం గా కట్టి...పడవ  తో పాటు  దాని కళేబరం  కూడా నీళ్ళ లో కదిలేలా చేశాడు.  ఇప్పుడు పడవ,చేప చేదోడు వాదోడు గా వస్తున్నాయి.ఒడ్డు వేపు.నైరుతి దిక్కు ఎటువైపు అని చెప్పాలంటే తనకి కంపాస్  లాంటిది ఏమీ అవసరం లేదు. గాలి వీచే విధానాన్ని బట్టి  అది పడవని తీసుకెళ్ళే తీరుని బట్టి దిక్కుల్ని తాను గుర్తించగలడు.
ఆ చిన్న చేపలు Sardines రకం ఉండలి గదా..వాటి మాంసం తిని కాసిన్ని నీళ్ళు తాగుదామా  అనుకున్నాడు ముసలాయన...సమయానికి చెంచా కనబళ్ళేదు..మాంసం కూడా అంత బాగున్నట్లు లేదు.  సముద్రం మీద తేలియాడుతున్న తెట్టు మీదుగా పడవ సాగిపోతోంది.బుల్లి చేపలు shrimps రకం వి నీళ్ళ పైన టింగు టింగుమని ఎగురుతూన్నాయి. ఓ డజన్ బుల్లి చేపల్ని చేతి తో పట్టాడు ముసలాయన. వాటి తలలు తుంచి మిగతా భాగాల్ని నోటిలో  వేసుకుని నమలడం ప్రారంభించాడు. బాగున్నాయి..ఇవి వంటికి కూడా మంచివి అనుకున్నాడు.

ఆ తర్వాత  బాటిల్ లో  మిగిలిన నీళ్ళు కొన్ని తాగాడు.  పడవ దానితో పాటు కట్టిన చేప ముందుకు సాగిపోతున్నాయి. అది చక్కగా ఆనేట్లు కట్టుకున్నాడు పడవకి.ఇంకా ఇదంత కల గానే ఉంది.నిర్జీవమై తనతో బాటు వస్తోన్న ఈ చేప ..వింత గానే ఉంది.అక్కడ ఆ చేప..ఇక్కడ గాయాలతో  నా చేతులు. ఇది కల కాదు..నిజమే. గాయాలదేమి ఉందిలే..కొన్ని రోజులు సముద్రపు  ఉప్పు నీళ్ళు  తగిలితే అవే మానిపోతాయి.ఆ చేప..నేను  ..ఇంటికి వెళ్ళిపోతున్నాం మొత్తానికి. ఆది నా పడవని  లాగుతోందా ..లేదా నా పడవే  దాన్ని లాగుతోందా.. సరే..ఏదైతే ఏమిటిలే...ఇరువురం పక్క పక్క నే పోతున్నాం..అనుకుంటే పోలా...! ఏమైన తెలివి అనేది మాత్రం   మనిషికే ఎక్కువ.ఏ జీవి తో పోల్చినా.

ముసలాయన చేతుల్ని కాసేపు అలాగే సముద్రపు నీళ్ళ లో ఉంచి..తీసిన తర్వాత తలకేసి రుద్దుకున్నాడు.ఆకాశం లో మేఘాలు  తెల్లగా గుతులుగుత్తులు గా  ఉన్నాయి..ఇంకా పైన చారల మాదిరి గాను ఉన్నయి.  ఈ రాత్రికి చక్కటి గాలి  వీస్తుంది ..పర్లేదులే అనుకున్నాడు.అప్పుడప్పుడు తను  వేటాడి తెస్తున్న ఆ చేప వేపు ఓ కన్ను వేస్తున్నాడు.

ఎలా పసిగట్టిందో  మొత్తానికి గాని ..ఒక షార్క్....ఈ చేప కళేబరం వెంట పడటం కంటబడింది.బహుశా సముద్రపు నీటి లో ఏ మైలు   దూరం కిందనో ఈదుతుండగా చేప రక్తపు వాసన దీనికి తగిలిఉంటుంది.ఇక ఊరుకుంటుందా ..నీలిసంద్రపు పై భాగాన్ని  బద్దలు చేసున్నట్లు గా పైకి వచ్చింది.ఇక ఈ చేప, పడవ   వెళుతున్న దారిని వెంబడిస్తూ వస్తున్నది. (సశేషం)  

No comments:

Post a Comment