Tuesday, July 4, 2017

శ్రీరంగ పట్న అని అంటే తెలుగు వారికి సరిగా అనిపించదు.


శ్రీరంగ పట్న అని అంటే తెలుగు వారికి సరిగా అనిపించదు.శ్రీరంగ పట్నం అంటేనే నిండుగా ఉంటుంది.కాని కన్నడ భాష కి తెలుగు భాష కి కొన్ని వత్యాసాలు ఆ మాత్రం లేకపోతే ఎలా ..? కర్నాటక రాష్ట్రం లో మాండ్యా జిల్లా లో ఉన్న ఈ ఊరు ఇప్పుడు చిన్న పట్టణం గా ఉన్నా ..గొప్ప చరిత్ర కలిగిన నగరం ఒకప్పుడు.క్రీ.శ.9 వ శతాబ్దం లో గంగ వంశీయులు నిర్మించిన ఇక్కడి కావేరీ తీరం లోని శ్రీరంగ నాధుని ఆలయం ...కాలక్రమం లో విజయనగర,హోయసల రాజుల ఆదరణ తో విస్తరించింది.మైసూరు కి కేవలము 15 కి.మీ. దూరం లో ఉన్నది. ఈ పట్టణం పేరు చెప్పగానే మనకి గుర్తుకి వచ్చే మరో పేరు టిప్పు సుల్తాన్ ఆయన నిర్మించిన కోట యొక్క ప్రాకారాలు ఇప్పుడు చాలా దాకా శిధిలమయ్యాయి.4 వ ఆంగ్లో మైసూర్ వార్ ఇక్కడనే జరిగింది..దానితో అంగ్లేయుల ఆధిపత్యం సుస్థిరమైంది.అంతకు ముందు జరిగిన యుద్ధాల్లో టిప్పు సైన్యాలు పై చెయ్యి సాధించి అనేకమంది బ్రిటీష్ సైనికుల్ని బందించి నేలమాళిగల్లో వేయగా చాలా మంది మరణించినట్లు చరిత్ర.అంతటితో తగ్గితే బ్రిటీష్ వాడు ఎలా అవుతాడు.... కోట నిర్మాణ రహస్యాలు తెలిసిన సైనిక అధికారిని తమ వైపు కి తిప్పుకొని ,అలాగే మన నిజాం ఇంకా మరాఠా సైన్యాల సాయం తో టిప్పు ని తుదముట్టించారు. ఆయన కళేబరం పడిన చోట ఒక జ్ఞాపిక ని నిర్మించారు.జనరల్ జార్జ్ హారిస్ నేతృత్వం లో జరిగిన ఈ విజయ యాత్ర చివరి లో టిప్పు సుల్తాన్ కి సంబందించిన అన్ని విలువైన వస్తువుల్ని అనగా విలువైన నగలు,లోహాలు,ఆయుధాలు,చెప్పులు,దుస్తులు,ఇలా సమస్తం ని బ్రిటీష్ వారు లండన్ కి తరలించారు.అచటి విక్టోరియా అల్బర్ట్ మ్యూజియం లో భద్రపరిచారు.సరే..విజయ మాల్య ఆ మధ్య ఒక కత్తి ని వేలం లో పాడి తెచ్చాడు అన్నారు. అది మళ్ళీ లండన్ కి తీసుకుపోయాడో ఇక్కడే ఉంచాడో తెలియదు. ఆ చరిత్ర అలా ఉంచితే...ఇప్పుడు ఈ శ్రీరంగ పట్న ని చూస్తే ఒక చిన్న పట్నం మాదిరి గా తోచ్చింది.ఈ గుడి ఉన్న పరిసరాలు ప్రాచీనతను అలానే శుభ్రతలేమి ని మన కళ్ళ ముందు కడుతుంటాయి.చిన్న తరహా పరిశ్రమలు ఆ చుట్టు పక్కల ఉన్నాయి.ఇక్కడ టీ హొటళ్ళు తమిళులవి ఉన్నాయి.మైసూర్ లో గాని ఇక్కడ గాని నచ్చినది ఏమంటే కళ్ళు చెదిరే చక్కని పచ్చని చెట్లు. రోడ్లు అంతా పరచుకొని ఉన్నట్లు ఉన్నాయి.ఏ బోర్డ్ ల్కి గాని అడ్డు వస్తే ఆ కొమ్మ దాకా కొడుతున్నారు తప్పా చెట్టంతా నరికి పారేయడం అనేది లేదు.అందుకనే నెమో మే నెల లో కూడా చల్లగానే తోచింది.

No comments:

Post a Comment