ఎన్ని రోజులు గానో ...అంటే ...ఈ పుస్తకం రివ్యూ ఒక చోట చదివిన దగ్గరనుంచి దీనిని చదవాలని అనుకుంటూన్నాను.ఈ పాద యాత్ర లోని విశేషాలు తెలుసుకోవాలని.అనుకోకుండా ఫేస్ బుక్ పుణ్యమా అని ఈ రచయిత చిరునామా తెలుసుకోవడం ... మాట్లాడుట...ఆయన నాకు ఈ పుస్తకం పంపడం ...వేగంగా జరిగిపోయాయి.అప్పటికే నేను చదువుతున్న అమీష్ త్రిపాఠి యొక్క సీతా ద వారియార్ ని పక్కన బెట్టి ఇది చదవడం మొదలెట్టాను.
మూడు పాదయాత్రల సమాహారమిది.పైసా ప్రతిఫలం లేనిదే ఏమీ చేయని లోకం ఇది.అందునా తెలుగు వారి గురించి ఏమి చెప్పినా తక్కువే.ఏది ఇలాంటిది చేసిన ఎంత వస్తుంది ఏమిటి అని అడిగే జనాలు ఉన్న రకం.ఇలాంటి ఒక పాద యాత్రికుడు మన తెలుగు వాడు కావడం మన అదృష్టం.ఒక నవల కంటే వేగంగా చదువుకుపోయాను.అసలు నవలలో ఏముంది.ఇక్కడ తను జీవించిన రోజులని అదీ ..మన దేశం లోని అనేక ప్రాంతాలను రక్త మాంసాల తో ఇక్కడ నిలబెట్టారు మాచవరపు ఆదినారాయణ గారు.
ముందుగా పాదయాత్రాంజలి ...రాహుల్ సాంకృత్యాన్ కి నివాళిగా చేసిన యాత్ర ఇది.1500 కి.మి. పర్యంతం అనగా ...విశాఖ నుంచి డార్జిలింగ్ దాకా చేసి అక్కడి రాహుల్జి సమాధి ని దర్శించారు.ఈ మధ్య లో తగిలే ఎంతో జీవితాన్ని భద్రంగా మనకి అందించారు.ఆయా రాష్ట్ర ప్రజలు...వారి తో ఏర్పడిన అనుభవాలు అన్నీ.ఉత్తరాంధ్ర లోని సోంపేట ప్రాంతం లో ఆ పల్లీయులు ధరించే ఆ టోపీలు వర్షాన్ని ఎండని కప్పే తీరు...అవీ..! హృద్యంగా ఉన్నాయి.అసలు ..మనం ..ఎందుకు అని టోపి గాని...తల పాగా గాని ధరించము.. నిజానికి మన వంటి ప్రాంతాల్లో అవి తలల్ని చల్లగా ఉంచి చాలా మేలు చేస్తాయి.లేని పోని ఫేషన్లకి దిగి మన ఉష్ణోగ్రతల్ని మరచి అనారోగ్యం పాలవుతున్నాము.
ఒరిస్సా ప్రాంతం లోని గంజాం ఏరియా లో బాటసారిని ఆదరించిన తీరు అపూర్వం.ప్రతి చోట దొంగలుంటారు.. ప్రతి చోట ఒక మంచి పనిని ఆదరించేవారుంటారు.అది రుజువు అవుతూంటుంది.ఖంద గిరి లో కోతుల్ తాకిడి గురించి రాశారు.అది నేనూ ఆ చోటికి వెళ్ళినప్పుడు అనుభవించాను.కాని ఒకటి మనిషిని మించిన అనాగరికత్వం జంతువుల లో ఉండదు.అది ఈ పర్యాటన ఆసాంతం కనిపిస్తుంది.
బెంగాల్ లో ప్రవేశించి ఆయన కొన్ని అనుభవాలు చెప్పారు.కుడెఘర్ అనే పేరు తో వారు నిర్మించే ఇళ్ళు.కింద పశువులు.పైన మనుషులు.ఇంటికి షాపు కి బేధం లేకుండా ప్రతి దాని లోను మిథున్,సత్యజిత్ రే,ఠాగూర్ ఇంకా వివిధ రంగాల్లోని బెంగాలీ ప్రముఖుల ఫొటోలు నింపి వేయడం ఆవి. ప్రతి నాగరిక జాతి తమ పూర్వికుల గొప్పదనం చాటుకోవడం సహజం. ప్రపంచవ్యాప్తం గా వివిధ రూపాల్లో జరిగేదే అది.
ఖరగ్ పూర్ లో తెలుగు పిల్లలు.మన బాట సారి కి శుభం పలుకుతూ సాగిపోయే వారు.అనుమానించేవారు.విలువ తెలిసి అభిమానించి ఆదరించేవారు. ఎన్ని రకాలో జనాల్లో.మొత్త్తం మీద చెప్పాలంటే బాటసారిని నిలువెల్లా దోచుకొని పోవాలనే ఇది ఎక్కడ కనిపించదు.దానికి కారణం ఈ యాత్రల తరహా తరతరాల నుంచి కొత్త గాదు భారతీయునికి.పుణ్య యాత్రలకి నడుస్తూ వెళ్ళే ఎంతో మంది సాధు సజ్జనుల చరిత్ర దీని వెనుక ఉన్నది.
గూర్ఖాలాండ్ లో బెంగాలీ వ్యతిరేక రాతలు.ఆయా ప్రాంతాలోని తోటలు ...అడవులు..తోడు వస్తూ అలరించే పిట్టలు... ప్ర్కృతి అందాలు...మధ్యలో దాభాలు...నల్లుల తో నిండిన మంచాలు...వారి ఆదరణలు....చల్లి గాలులు...ఎట్టకేలకు నార్త్ బెంగాల్ యూనివెర్శిటి లో రాహుల్జీ తనయుని కలుసుకోవడం... ఆ పిమ్మట కమలా రాహుల్జీ కలుసుకోవడం ..ఇలా ....మొత్తానికి చివరకి ఆయన సమాధిని దర్శిస్తారు.అది పిచ్చి గడ్డి పెరిగిన పరిసరాల్లో దర్శనమిస్తుంది.
ఈ దేశం లో అదేమిటో గాని ...సినిమా ఇంకా రాజకీయం తప్ప మిగతా ఏ రంగం లో ఎంత ప్రాణాలొడ్డి కృషి చేసినా వారికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వము.ఇది మన దేశ జనుల అజ్ఞానం తప్ప మరి ఒకటి కాదు.విదేశాల్లొ తిరుగుతాము.. కాని వారినుంచి నేర్చుకోవాల్సింది మాత్రం నేర్చుకోము. ( మిగతాది తరువాత)
బాగా వ్రాశారు. ఆఖరి పేరాతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఇటువంటి స్ఫూర్తిదాయకమైన విషయాలు మన పత్రికలలో ఎప్పుడు చదువుతామో.
ReplyDelete