Sunday, July 16, 2017

'భ్రమణ కాంక్ష" పుస్తకం గురించి కొన్ని మాటలు (చివరి భాగం)



ఇక ఇదే పుస్తకం లో తన మరొక పాదయాత్ర చవట పాలెం నుంచి ఢిల్లీ దాకా చేసినది కూడా ఉన్నది.దీని దూరం 2300 కి.మి. గా ఉన్నది.ఇది మరణించిన తన సోదరి యొక్క స్మృతి లో అక్కడ ఉన్న ఆమె సమాధి దాకా చేసినది.తెలంగాణా ,మహరాష్ట్ర,మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా చేసినది.ఆయా రాష్ట్రాల లోని గ్రామాలు, పట్టణాలు మన ముందు మెదులుతుంటాయి.ప్రతి చోట... గ్రామం లో ఆదినారాయణ గారు ..అచటి టీచర్ ని కలవాలని ప్రయత్నించడం మంచి తెలివైన నిర్ణయం. ఎందుకంటే ఇలాంటి బాటసారుల హృదయాన్ని వారు తొందర గా అర్ధం చేసుకొని సహకరిస్తారు. విచిత్రంగా మహరాష్ట్ర లోని కొన్ని ఊర్ల లొ పోలీసులు చక్క గా చూసుకోవడం ఎన్నిక గా చెప్పవలసిన విషయం. ఒక కానిస్టేబుల్ తన ఇంటికి తీసుకుపోయి గాడ్గే బాబ  ఫోటోని చూపించడం...వసతి ఏర్పాటు చేయటం ఇలాటివి.

మధ్య ప్రదేశ్ లోని భీం భేట్కా గుహలు..! ఉత్తరాది లొ సంకట్ మోచన్ ఆలయాలు..సాత్పుర పర్వతాలు...పొట్టి గా ఉండే  బండ్లు...!  ఎన్నోఅనుభవాలు. అనుమానించి వెదికేవారు.మహత్మా అని పిలిచి గౌరవించెవారు.ఇక దేశం అంతట పెనవేసుకున్న భూతం... కులం.సాక్షాత్కరిస్తుంది. ఇంచుమించు ప్రతి రాష్ట్రం లోనూ మీ ది ఏ కులం అని అడగటం కనిపిస్తుంది.గమ్మత్తు గా తనది యాత్రికులం అని ...చమత్కరిస్తారు మన బాటసారి.

ఏ మాటకి ఆ మాటే...పొడవాటి గడ్డం ఉన్నా...ఇక కాషాయం ధరిస్తే చెప్పఖర్లా .. ఉన్నవారిని ఉత్తరాది లోని చాలా మంది ప్రజలు గౌరవంగా చూస్తారు.రాజస్థాన్ లోని జిప్సీలు..వారి చరిత్ర ..మళ్ళీ  గుర్తు చేశారు.మధ్య ఆసియా,యూరపు నుంచి మన దేశం దాకా రకరకాల పేర్ల తో సంచరించే వారి గాధ  ఆలోచనీయమైనది.  

మొత్తం మీద భారత దేశం లోని భిన్నత్వం..అదే సమయం లో ఒక ఏకత్వం రెండూ దర్శనమిస్తాయి.వారి సోదరి సమాధి ని దర్శించి ఆ వాన లో అంజలి ఘటించడం ..ఒక మెలోడ్రామా సినిమా కి ఏ మాత్రం తీసిపోదు ఆ సన్నివేశం.దీనితో బాటు గుండ్లకమ్మ తీరం వెంబడి చేసిన పాదయాత్ర కూడా దీని లో చోటు చేసుకున్నది.

ఇంత మంచి ఆసక్తిదాయకమైన పుస్తకం ఇంగ్లీష్ లో కూడా విడుదలై తెలుగు తెలియని ... దేశం లోని వారికే గాక..ఇతరులకి కూడా తెలిస్తే ఎంత బాగుంటుంది  అనిపించింది.మన తెలుగు రచయితల  చాలా రచనలు...ఇంగ్లీష్ లో వస్తుంటాయి గాని....అదేమిటో చాలా అకడమిక్ గా  ...కృతకంగా ఉండి చదవ బుద్ధి గావు. ఇప్పుడు వస్తోన్న ఆంగ్లో ఇండియన్ నవల ట్రెండ్ ని పరిశీలించండి. అమీష్ త్రిపాఠి గాని,చేతన్ భగత్ గాని...ఆ విధంగా అన్ని వర్గాల వారికి వెళ్ళే విధంగా శైలి ఉండి ..మంచిగా మార్కెట్ చేయ గలిగితే ఈ రచన ప్రపంచవ్యాప్తంగ  ఎన్నో తెలుగేతర హృదయాలని అలరిస్తుంది. -- MURTHY KVVS

2 comments:

  1. చాలా బాగుందండి వ్యాసం
    ఆకెళ్ళ రవిప్రకాష్

    ReplyDelete
  2. చాలా బాగుందండి వ్యాసం
    ఆకెళ్ళ రవిప్రకాష్

    ReplyDelete