"నేను ఒక ముదుసలిని... అయితే ఆయుధం లేని వాడిని కాను..."
గాలి చల్లగా వీస్తోంది.హాయిగా సాగిపోతున్నాడు.తనతో పాటు తీసుకు రాబడుతున్న చేపని చూశాడు.ఆశ మళ్ళీ చిగురించింది.అదీ గాక ఇలా ఓ ప్రాణి ని చంపేది కూడా పాపమే గా అనిపించింది.అయినా ఇప్పుడు దాని గురుంచి ఎందుకు..చాలా ఉన్నాయి ఆలోచించడానికి...అసలు వాటి గురుంచి కూడా తనకి తెలీదు.నా ఒక్కడి కోసమేనా నేను దీన్ని చంపింది.. ఎంతోమంది తినడానికేగా..తినే జనాలు వాళ్ళే ఆలోచించనీ ఈ పాప పుణ్యాల గూర్చి..!నువ్వు ఓ జాలరి గా పుట్టాలని,అది చేప గా పుట్టాలని రాసి ఉంది.దానికి చేసేముంది.ఇలా ఆలోచిస్తూఉన్నాడు ముసలాయన.
రేడియొ ఉన్నా లేదా పేపర్ ఉన్నా బాగుండు ఊసు పోవడానికి..లేకపోతే ఇగో ఇదే ఆలోచనలు. దీన్ని అమ్మడానికో...దీని వల్ల జీవించడానికో ..దాని కోసమే ఈ పెను చేపను చంపలేదు.ఒక జాలరిగా ఇది నాకు గర్వకారణ మైన విషయం.చేప బతికి ఉన్నప్పుడైనా ,చచ్చిన తర్వాతనైన ఒక లాగే దాన్ని నేను ప్రేమిస్తాను. అలాంటపుడ్ చంపె ఇది నాకు లేదా..అది పాపమా?
"ఏయ్ ముసలివాడా నువు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్ సుమా " తనలోనే అనుకున్నాడు.
మరి ఆ పెద్ద పళ్ళ జీవం అదే ఆ షార్క్ ని చంపే పనిలో నువ్వు బాగానే ఆనందించావు గదూ..నువ్వు ఎట్లా చేపల మీద బతుకుతావో..అదీ అంతేగా.. అది నానా చెత్త ని తినేది గాదు.అందంగానూ,భయ రహితం గానూ ఉండే జీవం అది.
అవును నన్ను నేను కాపాడుకుండానికే దాన్ని చంపింది.గట్టి గానే అన్నాడు.ప్రతి జీవి ఇంకో జీవి ని ఏదో రకంగ చంపుతూనే ఉంది.ఈ చేపలు పట్టే పని నన్ను ఎలా బతికిస్తున్నదో ,అదే రకంగా నా ప్రాణాలు కూడా తీస్తుంది.నన్ను నేను మోసం చేసుకోరాదు.అది నిజం.
కొద్దిగా కిందికి ఒంగి ఆ షార్క్ చేపని ఎక్కడైతే కొరికిందో అక్కడ కొద్దిగ మాంసం తుంపి తీసుకుని నోట్లో వేసుకుని నమిలాడు. బాగానే ఉంది.ఫర్లేదు.మార్కెట్ లో రేటు బాగానే వస్తుంది.అయితే ఒకటి..ఇక్కడ ఈ సముద్రపు నీళ్ళ లో ..దీని వాసన ..మిగతా జీవాలకి కొట్టకుండా తీసుకురావడం కుదరని పని..మళ్ళీ ఏ షార్క్ లాటి దో వెంటబడితే..అదీ తన భయం.
చల్ల గాలి అలాగే వీస్తోంది. ఈశాన్యం వేపు కి తిరిగింది..ఇదిలానే ఉంటుంది ..ఆగదు ఇప్పట్లో.ముసలాయన ముందుకి చూశాడు ..దరిదాపుల్లో ..ఏ నౌక యొక్క పొగ గాని... ఇంకా పడవలు గాని కనబడటం లేదు.ఒక్క పిట్ట కూడా లేదు.ఏదో చిన్న చేపలు అక్కడక్కడ.. నీళ్ళ మీద తేలుతున్న గడ్డి గాదం లాటిది..!రెండు గంటలు గా తిరుగు ప్రయాణం సాగుతూనే ఉంది.పడవ మీదనే కాస్త అలా ఒరిగి చేప మాంసాన్ని నములుతున్నాడు.
అంతలోనే ...రెండు షార్క్ లు ..ఒకటి ముందు కనిపించింది..తగులుకుంటూ వస్తూనే ఉన్నాయి..తన చేప వైపు..!ఏయ్ ..అంటూ గట్టిగా అరిచాడు.గోధుమ రంగు లో ఉన్నయవి...చేప వాసనని పసిగట్టి వెంటబడ్డయి.తెడ్డు కి ఓ వేపు పదునైన కత్తి ఉన్నది..వీటి దుంప తెగ.. ఇవి వాసన కొట్టి చస్తున్నాయి..వీటికి ఉచ్చం నీచం లేదు..ఏది దొరికితే అది తినిపారెసే ఒక రకమైన షార్క్ జాతి ఇది. ఆకలైతే తెడ్డు ని కూడా కొరుకుతాయి.తాబేలు అనీ కాదు మనిషి అని కాదు..ఏది దొరికితే దాన్ని తినేసే రకం ఇవి.
" ఆ..ద ..ద.." అన్నాడు ముసలాయన.అవి పడవ కిందికి చేరి ఊపడం చేస్తున్నాయి. ఒకటి మాత్రం కొద్దిగ ఇవతలికి వచ్చి ముసలాయన్ని చూడసాగింది. ఇదే సమయం అని ముసలాయన తెడ్డు కి ఉన్న కత్తి తో సరిగ్గా దాని మెదడు ప్రాంతం లో ఒక వేటు వేశాడు.ఏ మాత్రం తెములుకోడానికి అవకాశం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ అలా వేస్తూనే ఉన్నాడు.కాసేపటికి అ షార్క్ జీవ రహితం గా నీళ్ళ మీద తేలడం ని నిర్ధారణ చేసుకున్నాడు.
ఇంకో షార్క్ ఉంది గా...అది పడవ పక్కగా వచ్చి దబ్బున బాదింది తన శరీరం తో. బలం కొద్దీ తెడ్డు తో గట్టిగా మోదాడు. అది తప్పించుకొంది.ముసలాయన భుజం లో నొప్పి గా అనిపించింది.అది మళ్ళీ తల బయట పెట్టింది..ఈసారి మళ్ళీ తెడ్డు కి గల కత్తి దాని తలకి తగిలేలా మోదాడు.దాని కంట్లోనూ,వెన్ను దగ్గర,మెదడు దగ్గర బాదాడు.ఆ షార్క్ పండ్ల లో తెడ్డు కి ఉన్న కత్తి ని పెట్టి గుండ్రంగా తిప్పాడు. పో..సముద్రం లో మైలు కిందికి దిగి పో... అక్కడ నా చేత చంపబడిన నీ మిత్రుడు ఒకడుంటాడు..వాడిని కలుసుకో పో...అంటూ అరిచాడు ముసలాయన. (సశేషం)
No comments:
Post a Comment