Monday, July 31, 2017

Ernest Hemingway నవల The old man and the sea సంక్షిప్తంగా... (20 వ భాగం)



మొత్తానికి ఆ షార్క్ ని కూడ తుదముట్టించి...పడవ మీద అలా సాగిపోతున్నాడు.నేను వేట చేసిన చేప ని పావు వంతు దాకా ఇవే తినేసాయి.ఇది ఓ కలే అయితేనో..అసలు దాని వేపే చూడాలని అనిపించడం లా...క్షమించు చేపా...అంతా తిరగబడింది...ఆ చేప వేపు కన్నెత్తి కూడా చూడాలని లేదు దాని ఉన్న స్థితికి..!రక్తం చారలు ఉన్నాయి దాని మీద..ఇంకా దానికి ఉన్న వొంటి చారికలు తో పాటు.

సముద్రం మీద అంత లోనికి ..పోకుండా ఉండాల్సింది.నీకు గాని నాకు గాని దీనివల్ల ఒరిగింది ఏమిటి.ఇంకా రాబోయేవి ఏమిటో..!

నువ్వు ఏవేవో తెచ్చావు గాని ఒక రాయి కూడా తెచ్చి ఉంటే బాగుండేది.ఈ తెడ్డు కి కట్టడానికి బాగుండేది.ఇప్పుడు లేని దాని గురుంచి ఎందుకు విచారించడం..తనే అనుకున్నాడు మళ్ళీ. ఆ చివరి షార్క్ ఎంత మాంసాన్ని లాగేసిందో దేవుడికె తెలియాలి.ఇంకా చేప కింద భాగం లో ఎంత మాంసం పోయిందో. ఈ సముద్రం అనే హై వే లో ఎంత విడిచిపెట్టాయో ..వాటి వాసన పట్టుకొని మరి కొన్ని తగలడతాయి.

ఈ చేప మంచి గా ఉన్నట్లయితె ఓ మనిషి   ఒక కాలం అంతా  తినొచ్చు.. హ్మ్ అనుకోవడం కూడా అనవసరం ఇప్పుడు. నీ  చేతుల్ని చక్కగా ఉంచుకో..రాబోయే ఉపద్రవాన్ని తట్టుకోవడానికి ..!  ఇదంత ఒక కల అయితే బాగుండు.ఎవరకి తెలుసు..ముందు అంతా బాగా నే ఉంటుందేమో.


అదిగో ..మళ్ళీ  ఒక షార్క్ దాపురించింది. ఒక్కటే నాసికా ద్వారం ఉంది దానికి.ఒక పంది మాదిరి గా వచ్చింది.అంత నోరు చాపుకుంటూ.మనిషి తల పెట్టినా సరిపోతుంది దానిలో.చేప ని ముట్టేంత వరకు ఆగి..ఆ తర్వాత సరిగ్గా దాని మెదడు మీద తెడ్డు కి ఉన్న కత్తి తో బాదాడు.అది చాలా చురుకు గా తప్పించుకుంది వేటు పడకుండ.
సర్దుకు కూచున్నాడు ముసలాయన.ఆ షార్క్ మెల్లగా నీళ్ళ లోకి వెళ్ళింది. సరే.. ఈ రెండు తెడ్లు ..ఇంకా  ఏవో ఉన్నాయి దాని భరతం పట్టడవాటిని వాడటానికి తన శక్తి లేదు..ఆ చెక్క గద లాంటిది ఉంది గాని దానితో మోదటం కాని పని. నీళ్ళ లోకి చేతులు పెట్టి తడుపుకున్నాడు.వేళ మధ్యానం దాటింది.సముద్రం ఇక్కడ,ఆకాశం అక్కడ ..మరేమీ కనబడటం లేదు. గాలి కొద్దిగా పెరిగింది.కాసేపట్లో నేల  కనిపించవచ్చును.

ముసలాయనకి, మొప్పలు ఊపుకుంటూ వచ్చే జీవాలు రెండు కనబడ్డాయి.గోధుమ వన్నె లో ఉన్నాయి.తిన్నగా తన పడవ వేపే వస్తున్నాయి.దగ్గర గా రానిచ్చాడు.చేతి లోకి అనువైన ఆయుధం ని తీసుకున్నాడు..విరిగిన తెడ్డు కి ఉన్న కత్తి అది. రెండు అడుగుల మీద కొద్దిగా ఉంటుంది.ముందు ఒక దాన్ని ముక్కు కి సమీపం లో గాని,దాని తల మీద గాని కొట్టాలి అనుకున్నాడు.

ఆ రెండు జీవాలు (Galanoes  అనే రకంవి ) దగ్గర గా వచ్చాయి...ఒకటి మాత్రం త్న చేప ని తిండనికి నిళ్ళ్ కిందికి వెళ్ళింది.ముసలాయన గద లాంటి ఆయుధం తో రెండో దాని తల మీద బలం ఆ కొట్టాడు.రబ్బర్ మీద కొట్టినట్లు అనిపించింది.ఏదో ఎముక కి తాకినట్లు కూడా తోచింది.మళ్ళీ దాని ముక్కు మీద బలం కొద్దీ కొట్టాడు.ఇంకోటి మాత్రం నీళ్ళ లో దోబూచులాడుతున్నట్లు  మునుగుతూ తేలుతూ చివరకి నోరు తెరుచుకుంటూ ముందుకు వచ్చింది.దాని నోట్లో మాంసం అవశేషాలు కనిపించాయి. తన చేప ని బాగానే గుంజేసింది అన్నమాట. బలం కొద్దీ దాని తల మీద మోదాడు.

ఆ దెబ్బకి  ఆ షార్క్ ..తన నోటి లోని మాంసం ని విడిచి ముసలాయన కేసి చూసింది.మళ్ళీ దెబ్బ మీద దెబ్బ వేశాడు  ముసలాయన.అది కోపంగా దూసుకు వచ్చి అంతెత్తున ఎగిరింది..ఇదే అదును గా ముసలాయన దాని ముట్టె మీద బలంగా కొట్టాడు.దాని మెదడు ఉండే భాగం లో మళ్ళీ మళ్ళీ కొట్టాడు.అది కింద పడిపొయింది..లేస్తుందేమోనని చూశాడు గాని అది లేవ లేదు. ( సశేషం)   

No comments:

Post a Comment