Tuesday, August 8, 2017

Ernest Hemingway నవల The old man and the sea సంక్షిప్తంగా.. (21 వ భాగం)



వాటిని చంపాలని తను అనుకోలేదు.అయితే ఆ షార్క్ ల్ని బాగానే గాయపరిచిన  ఆమాట మాత్రం నిజం.నేనే గనక రెండు చేతులతో ఆ గద ని పట్టుకుని కొట్టి ఉంటే ఆ మొదటిది చచ్చి ఊరుకునేది.తాను తీసుకొస్తున్న చేప వేపు చూడాలనిపించలేదు.సగాని కి పైగా దాని మాంసం నాశనమయింది.సూర్యుడు అస్తమించాడు..ఆ రెండు చేపలతో పోరాటం లో ఉండగానే.

కాసేపటి లో చీకటి అలుముకుంటుంది. ఇంకొద్ది సమయం లో హవానా నగరపు వెలుగులు దూరం నుంచి కనబడాలి.అలా కాకపోయినా ఏదో ఒక బీచ్ లో ఉండే లైట్లన్నా కనబడాలి.నేను ఇప్పుడు ఎంతో దూరం లో లేను.అయినా నా గురుంచి వ్యాకులపడేది ఎవరని...ఆ కుర్రవాడు నా గురుంచి బాధపడచ్చు..ఇంకా పాతకాలపు జాలరులు కొందరు ..అలా ఉండొచ్చునేమో.ఏమైనా ఒక మంచి ఊరు లోనే నేను జీవిస్తున్నాను.

ఇప్పుడు చేప తో కబుర్లు చెప్పాలని అనిపించడం లేదు.ఏముందని అక్కడ.ఉన్నట్లుండి తోచింది.అక్కడుంది సగం చేప నే గా.చేపా..నేను సముద్రం లో చాలా దూరం పోయాను.ఇద్దరమూ దెబ్బ తిన్నాము.అయితే ఒకటి ..మధ్య లో చాలా షార్క్ లిని చంపాము గదా.నువ్వు ఇప్పడి దాకా ఎన్నిటిని చంపి ఉంటావు..నీ తల మీద బల్లెం లాటి మొప్ప ఉంటుంది గాని ఎందుకు..అది పనికిరానిది.
ఆ చేప యే గనక మామూలు గా ఈదుతున్నప్పుడు షార్క్ లాటిది వస్తే ఏం చేస్తుందో.ఈ రాత్రి లో గాని అది వస్తే ఏమి చేస్తుందో..! సరే నువ్వు ఏమి చేస్తావు...నేనా ..చివరి దాకా పోరాడుతా..!ఇలా తనలో తను అనుకుంటూన్నాడు.ఇప్పుడు వెలుతురు లేదు సముద్రం మీద.గాలికి అలా ముందుకు సాగుతోంది పడవ.రెండు అర చేతుల్ని రుద్దుకుని గుప్పిళ్ళు మూసి తెరిచి ..నేను ఇంకా బతికే ఉన్నాను..అనుమానం లేదు అనుకున్నాడు.

కాసేపు వెనక్కి జారగిలబడి నాకేం కాలేదు..నా భుజాలే నాకు చెబుతున్నాయి అని సర్దుకున్నాడు.నాకు చేప చిక్కితే చాలు..ఎన్నో ప్రార్ధనలు చేస్తానని అప్పుడు అనుకున్నా గాని..ఇప్పుడు బాగా అలిసిపోయాను.ఆకాశం నుంచి కొంతైనా వెలుతురు వస్తుందా అన్నట్లు పైకి ఓమారు చూశాడు. ఇటు చూస్తే ఈ చేప మాంసం సగమే మిగిలింది.అదృష్టం...ఈ మాత్రమైనా దక్కింది.అసలు అంత లోపలికి పోవడమే నువ్వు చేసిన పొరపాటు.

" చక్కగా పడవ నడుపుకుంటూ పో..ఇంకా నీకు అదృష్టం ఉందిలే"

" దీన్ని అమ్మి ఏమి కొనేదని"

" పోయిన ఆ హార్పూన్ నా..విరిగి పొయిన కత్తి నా..పాడయిన ఈ చేతుల్నా "

" సరే..ఏదో ఒకటిలే..కాని ఎనభై నాలుగు రోజులకి గదా ఇది దొరుకుతుంటా ..అది మామూలా"

చ..అర్ధం లేని విషయాలు అవన్నీ ఆలోచించకూడదు ఇంకేమీ అనుకున్నాడు తనలో..!అదృష్టం అనేక రూపాల్లో వస్తుంది.ఎవరు గుర్తించగలరు దాన్ని..?దానిలో కొద్దిగా నాకు దక్కాలి..దానికి ప్రతి గా ఎంతో కొంత ఇస్తా.నాకు ఇప్పుడు కావలసింది ఒకటే..తీరం నుంచి కనబడే లైట్ల యొక్క కాంతి.చక్కగా సర్దుకు కూచున్నాడు.

అప్పుడు రాత్రి లో పది కావచ్చునేమో.ఎట్టకేలకు దూరం నుంచి లైట్లు ఇచ్చే కాంతి లీల గా కనిపిస్తోంది.గాలి పెరిగింది.సముద్రం చికాకు గా ఉంది.కాసేపటి లో తీరం కి చేరుకుంటాను.అయిపోయింది అనుకోడానికి లేదు..మళ్ళీ ఏవో దాడి చేయవచ్చు.రాత్రి పైగా ఆయుధం లేదు.చేసేదేముంది.

వళ్ళంతా నొప్పులు గా ఉంది.దెబ్బతిన్న భాగాలు ..వీటికి తోడు చలి రాత్రి.ఇంకా ఏమి ఉండదులే అనుకున్నాడు.అర్ధరాత్రి సమయానికి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.కాని ఫలితం లేనిదే అది.ఈ సారి దాడి చేసిన షార్క్ లు అన్నీ గుంపులు గా వచ్చాయి.వాటి మొప్పలు అవీ రాత్రి లో మెరుస్తున్నాయి.కొన్ని పడవ కింద చేరి కదుపుతున్నాయి.ఉన్న గద లాటి దాని తో అందిన కాడల్లా కొట్టసాగాడు.కాసేపటికి అది కాస్తా నీళ్ళ లో జారిపొయింది..మొత్తానికి అవే లాగిపారేశాయి.

పడవ వెనక అమర్చే పొడవైన కర్రలాటి దాన్ని తీసి అందిన వాటినల్లా బాదటం చేస్తున్నాడు.అవి ముందుకు వచ్చాయి.ఒకదానికొకటి మంచి అనుసంధానం గా కదులుతున్నాయి.మిగిలి ఉన్న ఆ కొద్ది చేప మాంసాన్ని ముక్కలు గా కొరికి వేస్తున్నాయి.అటూ ఇటూ తిరుగుతున్నపుడు అగుపిస్తున్నాయి.

మొత్తానికి ..తన మానాన  తాను బాదుతూనే ఉన్నాడు.ఎన్ని తిప్పలు పడినా ...అవి చేపని తినడం విజయవంతం గా ముగించాయి.ఇక ఏమీ లేదనుకొని ..అవి నిష్క్రమించాయి.ముసలాయనకి శ్వాస తీసుకోవడం భారం గా తోచింది.నోరంతా అదోలా అయింది.కాసేపటికి సర్దుకున్నాడు.సముద్రం లోకి ఊసి " తినండి..మొత్తం తినండి...ఒక మనిషిని చంపినట్లు గా ఆనందించండి" అన్నాడు ఆ షార్క్ ల్ని ఉద్దేశించి..! ( సశేషం)   

No comments:

Post a Comment