పడవ అలాగే ముందుకు పోతున్నది.మనసు లో ఎలాటి భావాలు లేవు...దేని గురించి కూడా.జరిగినదంతా గతం లోకి జారుకున్నది.సాధ్యమైనంత చక్కగా తెలివి గా ఒడ్డుకి చేరుకోవడమే ఇప్పుడు తన ముందు ఉన్నది.బల్ల మీద ఉన్న పదార్ధాన్ని తన్నుకుపోయినట్లు ఇక మిగిలిన ఆ చేప అస్థి పంజరాన్ని కూడా ఏదో షార్క్ తన్నుకు పోతుందా ..పోనీ.దాని గురించి లక్ష్యపెట్టదలచలేదు.పడవ ని చక్కగా నడపడమే ఇప్పుడు తన ముందున్నది.ఎలాంటి బరువు లేకుండా తేలిగ్గా పోతున్నది పడవ.
పడవ కి వెనుక ఉన్న టిల్లర్ అనబడే బలమైన కర్ర ని కొద్దిగా కొరకడం తప్ప పెద్ద గా ఏం చేయలేదు ఆ షార్క్...మొత్తానికి దాన్ని అది ఉండే స్లాట్ లో పెట్టేశాడు.ఆ బీచ్ లో వెలుగుతున్న లైట్లు మిణుకు మిణుకు మంటూ అగుపిస్తున్నాయి.ఇంచు మించు ఇక ఇంటి కి చేరుకున్నట్లే లెక్క.ఈ పవనాలు ఎంత మంచివో...అలా తీసుకుపోతుంటాయి...అయితే సముద్రం మటుకు శత్రువులు,మిత్రులు ఇద్దర్నీ కలిగి ఉన్నట్టిది.మంచం మరి...అదీ మంచిదే...దెబ్బతిన్నప్పుడు శరీరానికి హాయిని ఇస్తుంది. నువ్వు ఇప్పుడు ఆ స్థితి లోనే ఉన్నావు.నీకిప్పుడు మంచం అవసరం.
" అదేం లేదు..నేను చాలా లోపలకి వెళ్ళాను.." గట్టిగా నే పైకి అరిచాడు.
మొత్తానికి హార్బర్ లోకి వచ్చేశాడు.టెర్రస్ అంతా లైట్లు వెలుగుతున్నాయి.అంతా మంచాలు ఎక్కి గాఢ నిద్ర లో ఉన్నారు.గాలి మంద్రంగా వీస్తూ ..వేగాన్ని అందుకున్నది క్రమంగా..!తాను దిగేప్పుడు సాయం రావడానికి ఎవరూ లేరు.దిగి..ఆ పడవ ని మెల్లగా తోసి అక్కడ ఉన్న రాయికి కట్టేశాడు.పడవకి ఉన్న తెర చాపలు అవీ విప్పుకున్నాడు.ఒడ్డు కి పై భాగం లోకి వెళ్ళడానికి తయారయ్యాడు.అప్పుడు గాని అర్ధం కాలేదు తాను ఎంత అలిసిపోయింది..!ఒక్క క్షణం ఆగి ఆ చేప ..తాను వేటాడిన చేపని చూశాడు.ఏముందని అక్కడ..అస్థిపంజరం..కాకపోతే తల భాగం లో కొద్దిగా నల్లటి కండ...ఆ మొప్పలు..!
భుజం మీద సరంజామా ఉంచుకొని ముందుకి కదిలాడు.పడిపోయి తమాయించుకున్నాడు. లెగబోయాడు...ఎందుకైనా మంచిదని అలాగే కాసేపు కూర్చొని ..రోడ్డు వేపు చూశాడు.ఒక పిల్లి కనబడింది..దాని పనిలో అది తిరుగుతున్నది.సరంజామా ని కింద బెట్టి తను లేచి నిలబడ్డాడు.ఇంటికి వెళ్ళే లోపు లో కనీసం అయిదు సార్లు అలా కూర్చుంటూ వెళ్ళాడు.
మొత్తానికి లోపలకి వెళ్ళి ఆ తెరచాపల్ని వాటిని గోడ కి ఆనించాడు.నీళ్ళ సీసా లో ఉన్న కొన్ని నీళ్ళ ని నోట్లో పోసుకున్నాడు.వెంటనే మంచం మీద కి ఒరిగాడు.దుప్పటి కప్పుకున్నాడు.అర చేతుల్ని అలాగే తెరుచుకొని వాటి మీద భారం పడకుండా పడుకున్నాడు.పొద్దున్నే ఆ కుర్రవాడు వచ్చాడు..అలా ప్రతి రోజు వచ్చి చూసిపోతున్నాడు..ఈ రోజు ముసలాయన తిరిగి వచ్చాడు.అతని చేతులకి అయిన గాయాల్ని చూసి కుర్రవాడు రోదించసాగాడు.కాఫీ తీసుకు వద్దామని బయటకి వచ్చాడు..దారి పొడుగూతా ఏడుస్తూనే ఉన్నాడు.
అప్పటికే కొంతమంది జాలరులు ముసలాయన పడవ దగ్గరకి వచ్చి ఆ చేప స్వరూపాన్ని చూస్తున్నారు.కొంత మంది అడిగారు." ఎక్కడ అతను" అని." నిద్రపోతున్నాడు..ఇప్పుడే ఎందుకు లేపడం " అన్నాడు కుర్రాడు.
" ఈ చేప పెద్దదే..పద్దెనిమిది అడుగులు ఉంది.." అన్నాడు ఒకతను.
కుర్రవాడు టెర్రస్ వద్ద ఉన్న హోటల్ లో కాఫీ ఇమ్మని అడిగాడు." కొద్దిగా పాలు,పంచదార ఎక్కువ వేసి.. స్ట్రాంగ్ గా ఇవ్వండి" అన్నాడు.
" ఇంకా ఏమన్నా కావాలా " హోటల్ అతను అడిగాడు.
" ఇప్పుడు అయితే ఇంతే..ఏమి తింటాడు అనేది తర్వాత చూస్తాను"
" నిన్న నీకు రెండు చేపలు ..భలే మంచివి పడ్డాయి"
" నా వాటికేం వచ్చింది లే" అంటూ కుర్రవాడు ఏడవసాగాడు.
" చెప్పు ఇంకా ఏమన్నా కావాలా "
" వద్దు.నేను మళ్ళీ వస్తా.శాంటియాగో (ముసలాయన) ని ఇబ్బంది పెట్టవద్దని వారికి చెప్పండి.."
" ఓహ్..అతనితో చెప్పు.. నాకూ బాధ గా ఉందని"
" థాంక్స్ " అన్నాడు కుర్రవాడు.
ముసలాయన లేచేవరకు ఓపిగ్గా ఆ గది లోనే కూర్చున్నాడు కుర్రాడు.కాసేపు లేచినట్లు లేచి నిద్ర లోకి జారుకున్నాడు.చల్లారిన కాఫీ ని వేడి చేయడానికి పుల్లలు ఏరుదామని బయటకి వచ్చాడు కుర్రాడు.ముసలాయన లేచాడు.
" ఇందా..ఈ కాఫీ తాగు" అంటూ ముసలాయనకి ఓ గ్లాస్ లో పోసి ఇచ్చాడు.
ముసలాయన తీసుకొని తాగాడు. " అవి బాగా దెబ్బ తీశాయి నన్ను..అదే మనోలిన్ చేప...నిజంగా ఏమి దెబ్బ తీశాయి.."
" ఆ చేప కాదేమో దెబ్బ తీసింది..నేను అనుకోవడం.."
" లేదు..ఆ చేప ని పట్టిన తర్వాత నే అయిన చికాకంతా.."
" అక్కడ నీ పడవ ని...దాని లోని గేర్ ని ..పెడ్రికొ ..ఆ హోటల్ ఆయన చూస్తుంటాడులే..దాని గురుంచి చింతించకు..ఆ చేప తల ఒక్కటే ఇక మిగిలింది కదా ..ఏమి చేద్దామని దాన్ని.."
" దాన్ని పెడ్రికో ని తీసుకోమని చెప్పు..ఎరలు గా దాని ముక్కల్ని ఉపయోగించుకుంటాడు."
చెప్పాడు ముసలాయన.
" మరి ఆ బల్లెం"
" నీకు కావలసి వస్తె తీసుకో.."
" తీసుకుంటాలే..ఇంకా మిగతా వాటి గురుంచి మనం ఆలోచన చేద్దాం"
" నాకోసం వెతికారా"
"అవును. తీరం లోని దళాలు..ఇంకా విమానాల ద్వారా.."
" సముద్రం చాలా పెద్దది.దాంట్లో నా పడవ ఎంతని. " ఫర్లేదు నా గురుంచి కూడా శ్రద్ధ తీసుకునేవారు ఉన్నారు అని పించి ఆనందం గా తోచింది." నిన్ను చూడలేకపొయా ఇంత కాలం..ఇంతకీ నీ ప్రగతి ఎలా ఉంది.." అడిగాడు ముసలాయన.
" మొదటి రోజున ఒకటి పడింది.రెండో రోజున ఒకటి..మూడో రోజున రెండు చేపలు పడ్డాయి..."
"బాగుంది"
" ఇక మనం ఇద్దరం వేట కి పోదాం"
" లేదు ..లేదు..నాతో ఉంటే అదృష్టం రాదు"
" దాన్నటు పోనీ.. ఆ అదృష్టం ని నేనే లాక్కొస్తా"
"మీ వాళ్ళు వద్దంటారేమో"
" నాకదేం లెక్క లేదు.నిన్న నాకు రెండు చేపలు పడ్డాయి.ఇకనుంచి మనం కలిసే పడదాం.నీ నుంచి నేర్చుకునేది ఎంతో ఉంది.."
" సరే..మంచి పదునైన బ్లేడ్ చేయించు పడవ లో ఉపయోగపడానికి..నాదగ్గరున్నది పొయింది గదా..చాలా పదును గా ఉండాలి."
" సరే..కావలసినవి అన్నీ చేయిస్తా.."
" ఎన్ని రోజుల్లొ అయితే బావుంటుంది.."
" మూడు రోజుల్లో లేదా ఆ పైన అనుకో"
" సరే..సిద్ధం గా ఉంచుతాలే గాని ... నీ చేతుల గాయాలు తగ్గనీ ముందు"
" దాన్ని ఎలా తగ్గించుకోవాలో నాకు ఎరుకే గాని...చాతి లో కొద్ది గా కలుక్కుమన్నట్టన్నది రాత్రి.."
"అది కూడా తగ్గనీ.. నువ్వు పడుకో ముందు ...తినెందుకు ఏమైనా తెస్తా ఉండు.."
" అలాగే పేపర్లు ఉంటే తీసుకు రా...అదే నేను మిస్ అయిన రోజులవి.."
" అన్నీ తెస్తాలే..నీకు అయిన గాయాలకి మందులు కూడా తెస్తా"
" మర్చిపోకుండా చెప్పు..ఆ చేప తలని పెడ్రికో ని తీసుకోమని చెప్పు.."
" నాకు జ్ఞాపకం ఉందిలే"
అలా ఆ కుర్రవాడు ఇంట్లోనుంచి బయటకి వచ్చి రోడ్డు వేపు కి తిరిగాడు.మళ్ళీ అతను ఏడుస్తూనే ఉన్నాడు.
ఆ మధ్యానం తీరం వద్దన ఉన్న టెర్రస్ దగ్గరకి టూరిస్ట్ లు ఎక్కడినుంచో వచ్చారు.సందడి గా ఉంది ..!పార్టీలు జరిగిన దానికి గుర్తు గా ఆ పక్కనే కొద్ది దూరం లో బీర్ డబ్బాలు అవీ ఉంటాయి.అక్కడ నే ఉన్న పెను చేప యొక్క అస్థి పంజరం ..దానికి తగులుతున్న సముద్రపు అలలు.ఇది చూసి అడిగింది ఓ టూరిస్ట్ " ఏమిటది.. " అని.
" అది టిబురోన్ రకం ..ది ..షార్క్ కావచ్చును" వెయిటర్ జరిగినది అంతా చెప్పాలని ప్రయత్నించాడు.
" షార్క్ లు ఇంత చక్కని తోకలు కలిగి ఉంటాయా...నాకు తెలియదు నిజంగా .." అందామె.
" నాకూ తెలియదు" ఆమె తో పాటూ ఉన్న ఇంకోతను చెప్పాడు.
ఆ రోడ్డు కి అవతల ఏమి జరుతోందంటే ...అక్కడున్న తన నివాసం లో ముసలాయన ..మళ్ళీ నిద్ర లోకి జారుకున్నాడు.ఆ కుర్రవాడు అలాగే చూస్తూ కూర్చున్నాడు ..మొహం మంచం లోకి పెట్టి నిద్రపోతున్న ఆ ముసలాయన్ని చూస్తూ.ఇప్పుడు ముసలాయన కలలో కి సిమ్హాలు వస్తున్నాయి. (సమాప్తం)
No comments:
Post a Comment