నిన్నటి తో ఎర్నెస్ట్ హెమింగ్ వే రాసిన నవల ద ఓల్డ్ మేన్ అండ్ ద సీ తెలుగు అనువాదం పూర్తి అయింది.ప్రతి బియ్యపు గింజ మీద తినే వారి పేరు ఉంటుందని అంటారు.అలా ఇంగ్లీష్ నవలల మీద కూడా ఉంటుందేమో.ఎవరు తెలిగించాలనేది.ఈ నవల అనువాదం చేయడానికి ఒక ప్రధాన కారణం సోదరి పూదోట శౌరీలు గారు.వారి తో ఓ సారి మాటాడినపుడు దీని ప్రాశస్త్యం గురుంచి చెప్పి ఈ మాటు ఇది చేయకూడదా అన్నారు. ఎందుకనో వెంటనే మళ్ళీ రెండోసారి ఆ మూలం లోని నవలని చదివాను.ఈసారి చాలా కొత్త దనం తోచింది...పది హేనేళ్ళ క్రితం చదివిన దానితో పోలిస్తే..!
నరేంద్ర కుమార్ లాంటి ఫేస్ బుక్ మిత్రులు కూడా మీ అనువాదం లోని రుచి యే వేరు చేయండి అని కోరారు.గతం లో దీనికి ఒక తెలుగు అనువాదం వచ్చిందని కొందరు మిత్రులు అన్నారు.సరే...టాల్స్ టాయ్ ఇంకా మన రవీంద్రుని రచనలు ఒక్కోటి ఎన్నిసార్లు తెలుగు రాలేదు.చూద్దాము..బాగుందా చదువుతారు లేదా అలా కాల గర్భం లో కలిసిపోతుంది అనుకొని మొదలెట్టాను.
అసలు ఈ నవల The old man and the sea గూర్చి కొంచెం చెప్పాలి.
ఇది వంద పేజీలు లోపు ఉంటుంది మూలం లో.ఇలాటి వాటిని "నావెల్లా" అంటారు వారు.ఇది ఒకే ఒక్క పాత్ర పై ప్రధానంగా నడుస్తుంది.సరే..ఆ కుర్రవాడు..ఇంకా పెడ్రికో అనే హోటల్ అతను ఉన్నా అవి చాలా చిన్న పాత్రలే.ఒక ముసలి వ్యక్తి సాహసొపేతమైన సముద్ర యానం..దానిలో భాగంగా మూడు రోజులు పాటు చేసిన చేపల వేట...ప్రాణం కూడా లెక్క చేయకుండా తన గత నైపుణ్యాన్ని,బలాన్ని స్ఫురణ కి తెచ్చుకుంటూ చేసిన పోరాటం...మళ్ళీ రిక్త హస్తాల తో తిరిగి రావడం( చేప దొరికినప్పటికి) ... ఇది సాగిన కధాంశం.దీనిలో అనేక అంశాల్ని రచయిత సింబాలిక్ గా చెప్పాడు.అదే దాని లోని గొప్ప దనం.ఎక్కడా బోరు అనిపించదు.మానవుని యొక్క ఆత్మ శక్తి ..దాని యొక్క వైభవం ని కళ్ళకి కట్టినట్లు చూపించాడు.చూపించాడు అని ఎందుకు అన్నానంటే నువ్వు పాఠకులకి ..చూపించాలి తప్ప అంత కంటే చేయవలసింది ఏమీ లేదు..అని రచయితల్ని ఉద్దేశించి అంటాడు హెమింగ్ వే.అది ఎప్పుడు జరుగుతుంది...రచయిత స్వయంగా అనుభవించినపుడు.
నిజానికి హెమింగ్ వే జీవితం దీనిలోని ముసలి వాని పాత్ర వంటిదే అనిపించింది చదివినపుడు.అమెరికా లో పుట్టినప్పటికి గల్ఫ్ స్ట్రీం లో వేటాడం..క్యూబా లో ని జాలరులతో తిరగడం...సముద్రం పై సాహస ప్రయాణాలు చేయడం ఇవన్నీ అతనికి కరతలామలకం.తను చూసిన,పొందిన అనుభవాలనే అంత చక్కగా వ్యక్తీకరించగలిగాడు.
నిజానికి హెమింగ్ వే రాసిన ఫిక్షన్ లో ఇదే చివరిది.కనుకనే అనుకుంటా గొప్ప మానసిక పరిణితి అగుపిస్తుంది.పాశ్చత్యులు దీని లోని సింబాలిజం ని బైబిల్ లోని కొన్ని ఘట్టాలతో ముడిపెట్టి చూస్తారు.ఆ ముసలి జాలరి సముద్రం పై చేసిన మూడు రోజుల పోరాటాన్ని క్రీస్తు యొక్క మూడు రోజుల శ్రమ దినాలు గా వర్ణించారు.ఇది 1952 లో ప్రచురితం అయినపుడు చాలా మంది దీన్ని విలియం ఫాల్క్నర్ రాసిన ద బేర్ తోను,హెర్మన్ మెల్విల్లె రాసిన మోబీ డిక్ తోను సరి తూగ గల రచన గా భావించారు.అయితే వాటి న్నిటిని ఈ నావెల్లా అధిగమించింది.కాలక్రమం లో.విచిత్రం గా నోబెల్ పురస్కారం వచ్చినప్పుడు కూడా ఈ రచన ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.నిజం చెప్పాలంటే ఈ రచన వల్ల మిగతా అతని రచనలు మసకబారినవి అంటే అతిశయోక్తి కాదు.ఇంతా చేసి ఇది వంద పేజీల లోపు దే.
దీనిలోని భాష చాలా తేలికది.ఏ మాత్రం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళయినా చదవవచ్చు.అయితే దానిలోని అంతరార్ధం.. సొగసు ని తెలుసుకోడానికి ఒక రసిక హృదయం ఉండాలి.లేకపోయినట్లయితే ఒక ముసలి జాలరి ..ఒక పెద్ద చేప అంతేగా అనిపిస్తుంది.సృష్టి లో ప్రతి గొప్ప విషయం అంతే.మన కి పక్కనే ఉంటుంది.కాని తెలియదు.తెలుసుకున్నపుడు ఇంతేనా అనిపిస్తుంది.ఎందుకంటే మనిషి మనిషే ఎక్కడైనా.ఎప్పుడైనా.భాష ...ప్రాంతం ..అన్నీ రాజకీయాల్లో భాగం...! మూర్తి కెవివిఎస్
20
మొత్తానికి ఆ షార్క్ ని కూడ తుదముట్టించి...పడవ మీద అలా సాగిపోతున్నాడు.నేను వేట చేసిన చేప ని పావు వంతు దాకా ఇవే తినేసాయి.ఇది ఓ కలే అయితేనో..అసలు దాని వేపే చూడాలని అనిపించడం లా...క్షమించు చేపా...అంతా తిరగబడింది...ఆ చేప వేపు కన్నెత్తి కూడా చూడాలని లేదు దాని ఉన్న స్థితికి..!రక్తం చారలు ఉన్నాయి దాని మీద..ఇంకా దానికి ఉన్న వొంటి చారికలు తో పాటు.
సముద్రం మీద అంత లోనికి ..పోకుండా ఉండాల్సింది.నీకు గాని నాకు గాని దీనివల్ల ఒరిగింది ఏమిటి.ఇంకా రాబోయేవి ఏమిటో..!
నువ్వు ఏవేవో తెచ్చావు గాని ఒక రాయి కూడా తెచ్చి ఉంటే బాగుండేది.ఈ తెడ్డు కి కట్టడానికి బాగుండేది.ఇప్పుడు లేని దాని గురుంచి ఎందుకు విచారించడం..తనే అనుకున్నాడు మళ్ళీ. ఆ చివరి షార్క్ ఎంత మాంసాన్ని లాగేసిందో దేవుడికె తెలియాలి.ఇంకా చేప కింద భాగం లో ఎంత మాంసం పోయిందో. ఈ సముద్రం అనే హై వే లో ఎంత విడిచిపెట్టాయో ..వాటి వాసన పట్టుకొని మరి కొన్ని తగలడతాయి.
ఈ చేప మంచి గా ఉన్నట్లయితె ఓ మనిషి ఒక కాలం అంతా తినొచ్చు.. హ్మ్ అనుకోవడం కూడా అనవసరం ఇప్పుడు. నీ చేతుల్ని చక్కగా ఉంచుకో..రాబోయే ఉపద్రవాన్ని తట్టుకోవడానికి ..! ఇదంత ఒక కల అయితే బాగుండు.ఎవరకి తెలుసు..ముందు అంతా బాగా నే ఉంటుందేమో.
అదిగో ..మళ్ళీ ఒక షార్క్ దాపురించింది. ఒక్కటే నాసికా ద్వారం ఉంది దానికి.ఒక పంది మాదిరి గా వచ్చింది.అంత నోరు చాపుకుంటూ.మనిషి తల పెట్టినా సరిపోతుంది దానిలో.చేప ని ముట్టేంత వరకు ఆగి..ఆ తర్వాత సరిగ్గా దాని మెదడు మీద తెడ్డు కి ఉన్న కత్తి తో బాదాడు.అది చాలా చురుకు గా తప్పించుకుంది వేటు పడకుండ.
సర్దుకు కూచున్నాడు ముసలాయన.ఆ షార్క్ మెల్లగా నీళ్ళ లోకి వెళ్ళింది. సరే.. ఈ రెండు తెడ్లు ..ఇంకా ఏవో ఉన్నాయి దాని భరతం పట్టడవాటిని వాడటానికి తన శక్తి లేదు..ఆ చెక్క గద లాంటిది ఉంది గాని దానితో మోదటం కాని పని. నీళ్ళ లోకి చేతులు పెట్టి తడుపుకున్నాడు.వేళ మధ్యానం దాటింది.సముద్రం ఇక్కడ,ఆకాశం అక్కడ ..మరేమీ కనబడటం లేదు. గాలి కొద్దిగా పెరిగింది.కాసేపట్లో నేల కనిపించవచ్చును.
ముసలాయనకి, మొప్పలు ఊపుకుంటూ వచ్చే జీవాలు రెండు కనబడ్డాయి.గోధుమ వన్నె లో ఉన్నాయి.తిన్నగా తన పడవ వేపే వస్తున్నాయి.దగ్గర గా రానిచ్చాడు.చేతి లోకి అనువైన ఆయుధం ని తీసుకున్నాడు..విరిగిన తెడ్డు కి ఉన్న కత్తి అది. రెండు అడుగుల మీద కొద్దిగా ఉంటుంది.ముందు ఒక దాన్ని ముక్కు కి సమీపం లో గాని,దాని తల మీద గాని కొట్టాలి అనుకున్నాడు.
ఆ రెండు జీవాలు (Galanoes అనే రకంవి ) దగ్గర గా వచ్చాయి...ఒకటి మాత్రం త్న చేప ని తిండనికి నిళ్ళ్ కిందికి వెళ్ళింది.ముసలాయన గద లాంటి ఆయుధం తో రెండో దాని తల మీద బలం ఆ కొట్టాడు.రబ్బర్ మీద కొట్టినట్లు అనిపించింది.ఏదో ఎముక కి తాకినట్లు కూడా తోచింది.మళ్ళీ దాని ముక్కు మీద బలం కొద్దీ కొట్టాడు.ఇంకోటి మాత్రం నీళ్ళ లో దోబూచులాడుతున్నట్లు మునుగుతూ తేలుతూ చివరకి నోరు తెరుచుకుంటూ ముందుకు వచ్చింది.దాని నోట్లో మాంసం అవశేషాలు కనిపించాయి. తన చేప ని బాగానే గుంజేసింది అన్నమాట. బలం కొద్దీ దాని తల మీద మోదాడు.
ఆ దెబ్బకి ఆ షార్క్ ..తన నోటి లోని మాంసం ని విడిచి ముసలాయన కేసి చూసింది.మళ్ళీ దెబ్బ మీద దెబ్బ వేశాడు ముసలాయన.అది కోపంగా దూసుకు వచ్చి అంతెత్తున ఎగిరింది..ఇదే అదును గా ముసలాయన దాని ముట్టె మీద బలంగా కొట్టాడు.దాని మెదడు ఉండే భాగం లో మళ్ళీ మళ్ళీ కొట్టాడు.అది కింద పడిపొయింది..లేస్తుందేమోనని చూశాడు గాని అది లేవ లేదు.

ఆ పుస్తకం పొందాలి అంటే ఎలా అండి ?
ReplyDeletePlease contact Nava chetana publications...Hyderabad.
ReplyDelete