Sunday, December 31, 2017

మరి మనకి ఎందుకని ఆ దారిద్ర్యం అంటే.మనకి హిపోక్రసీ...ఇంగ్లీష్ లో రాస్తే తెలుగు ద్రోహి అనే ఒక మూఢనమ్మకం..



ఎవరైనా ఒక చోటికి వెళ్ళాలి అనుకునేది ఎందుకు...అదీ తన ప్రాంతం కాక ఇంకో చోటికి..!తనది కాని చూడని..వినని...ఏదో కొత్తదనాన్ని చూడటానికి..!దాన్ని ఆస్వాదించడానికి..అదే కాదు దాని నుంచి నేర్చుకోడానికి.అది ఏ చిన్నదైనా సరే.లోకం దృస్టిలో దానికి విలువ లేకపోవచ్చును...కాని మనలో ఏదో ఓ మూల ఓ దీపం వెలిగిన అనుభూతి.అదిగో దానికే తిరుగుతుంటా. ఈ తిరిగే దానికి కూడా ..ఎక్కడో ఓ మూల రక్తం లో దానికి సంభందించిన గత స్మృతుల జ్ఞాపకాలు కూడా తడుముతుండాలేమో.లేకపోతే ప్రతి ఒక్కనికీ ఈ తిరిగే ధ్యాస ఉండదే..అదీ గుంపు గా కాక..!రక్షణ ని కనిపించని ఏదో శక్తి కి వదిలిపెట్టి..!గాలి వలె...!

సరే...నా ఒడిస్సా ప్రయాణం తాలుకు విశేషాలకి వస్తాను. ఈ నెల చివరి వారం లో జరిగినది.గతం లో మూడు మార్లు భుబనేశ్వర్ లో దిగి యున్నాను.ఈ ఊరికి నాకు గతం లో ఏమైనా అనుబంధం ఉన్నదా అనిపిస్తుంది కొన్ని మార్లు.నా అర్థం కొన్ని గత జన్మ ల లో..!అలా లేనిదే ఒక ప్రాంతం గాని,ఒక మనిషి గాని మనకి చేరువ గారు..అవి మనల్ని అలరించవు.ఎంత దగ్గరున్న ఎంత దూరమున్నా..!ఒక ప్రూఫ్ ఇవ్వవయ్యా అంటే భౌతిక శాస్త్ర పరంగా నేను ఇవ్వలేను.అది ధ్యానం లో కొంత పురోగమించిన వారికి తెలియును.సరే...మనం వద్దాము.ఇంకో విషయానికి.

ఒరిస్సా అనగానే మనం ఏమనుకుంటాము.ఒక బాగా వెనకబడిన రాష్ట్రం అని.కొన్ని వాట్లని పేపర్లని చదువుతాము.ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటాము.ప్రతి సారి అదే ఇది గా భావిస్తుంటాము.కొన్ని వాట్లలో గావచ్చును.కాని అక్కడ నుంచి నేర్చుకోవలసినవి ఏమీ లేవా అంటే చాలా ఉన్నాయి.ప్రతి ప్రదేశానికి దేని ప్రత్యేకత దానిది.అలా ఉంటుంది..అది అంతే.నాకు తెలిసి ప్రతి ఒరియా భద్రలోకీయుని లోను ఒక గొప్ప చదువరి ఉన్నాడు.షేక్స్పియర్ నుంచి ఇప్పటి చేతన్ భగత్ దాకా.చాలా మంది తెలుగు కవులకంటే ఒరియా కవులు వారి భాష తో పాటు ఇంగ్లీష్ లో కూడా మంచి డొక్కశుద్ది గలవారు.ఆంగ్ల,ఒరియా భాషల్లో అవలీల గా కవిత్వం రాయగలవారు ఎందరో సీతాకాంత్ మహాపాత్ర నుంచి రమాకాంత్ దాస్ వరకు ..అంటే నేటి తరం దాకా.నేను బాగా శోధించ గా తేలింది ఏమంటే వారు బెంగాలీ భద్రలోకీయుల్ని ఆదర్శం గా తీసుకుంటారని.మాతృ భాషతో పాటు ఇంగ్లీష్ లో ను లోపలకి వెళ్ళుట.

మనోజ్ దాస్ వంటి కధా రచయితలు ఆంగ్ల ,ఒరియా భాషల్లో అవలీల గా ఎన్నో పుస్తకాలు వెలువరించారు.మరి మనకి ఎందుకని ఆ దారిద్ర్యం అంటే.మనకి హిపోక్రసీ...ఇంగ్లీష్ లో రాస్తే తెలుగు ద్రోహి అనే ఒక మూఢనమ్మకం.ఏమయ్యా ఇంగ్లీష్ గొప్ప...అని అనవచ్చు.నువు నీ భాషని మించి దేశానికి,ప్రపంచానికి నీ బాధ వినిపించవచ్చు.ఎంతైనా వాదించు..ఏమైనా అనుకో మిత్రమా..!నీకు ఒక గొప్ప కిటికీ తెరుచుకోదు..భావం లో గాని..భాష లో గాని...అర్ధం చేసుకోవడం లో గాని.ఇంకా అలా చాలా వాటిల్లో.ఆ వెనుకబాటు తనం అలా ఉంటుంది.ఎప్పటికీ.
---Murthy kvvs

No comments:

Post a Comment