రజనీ కాంత్ (కధ)---మూర్తి కె వి వి ఎస్
నిన్న పార్క్ లో రజనీ కాంత్ అనుకోకుండా కలిశాడు.వాళ్ళ ఊరి సంగతులు ఏవో చెప్పుకుంటూ వచ్చాడు.అప్పటి రోజులు మళ్ళీ కళ్ళ ముందు నిలిచినట్లుగా అనిపించాయి.గతం లో అన్నీ సంతోషకరమైన విషయాలే ఉండవు,చాలా చేదు విషయాలూ ఉంటాయి.ఇక్కడ నుంచి ఎప్పుడు బయట పడతాం రా బాబూ అనిపించిన సన్నివేశాలూ లేకపోలేదు.ఎంత భరించలేని రోజులు గా ఉక్కిరి బిక్కిరి అయ్యాడో తను ...ఆ ఊరి లో ఉద్యోగం చేసినన్నాళ్ళు..!కారణాలు చెప్పాలంటే అనేకం.కాని అవి ఇప్పుడు తల్చుకుంటే ఆ మాత్రం దానికే తను ఎందుకు అంతలా ఫీలయ్యాడు ..అని ఇప్పుడు అనిపిస్తోంది.బహుశా కాలం తనని అనేక అనుభవాల ద్వారా గట్టి పరచడం కూడా ఓ కారణమేమో..!
ఈ రజనీ కాంత్ అనేవాడి కి ఆ సినిమా సూపర్ స్టార్ కి ఎలాంటి సంబంధమూ లేదు.ఈ రజనీ పేరు తో ప్రసిద్దుడైన వికాస్ అనబడే ఇతను ప్రస్తుతం ఓ కార్పోరేట్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు.నేను వాళ్ళ గ్రామం లో ఓ నాలుగేళ్ళ క్రితం దాకా హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేసి రిటైర్ అయి ప్రస్తుతం ఖమ్మం లో విశ్రాంత పర్వం లో ఉన్నాను.భద్రాచలం కి ఇరవై కిలో మీటర్ల కి పైగా దూరం ఉండే ఆ గ్రామం లో అడుగు పెడతానని ఎప్పుడూ అనుకోలేదు.కాని వచ్చిన ప్రమోషన్ వదులుకోవడం ఇష్టం లేక అక్కడ స్కూల్ లో జాయిన్ అయ్యాను.
రజనీ కాంత్ అప్పుడు పదవ తరగతి చదువుతున్నాడు.అతని అసలు పేరు వికాస్.కాని ఎందుకో వాడి పేరు రజనీ కాంత్ గా మార్చుకోవాలని తెగ ఇదవుతుండేవాడు.స్కూల్ లో జరిగే హోం ఎగ్జాంస్ లో గాని ,టెక్స్ట్ పుస్తకాల మీద గాని వాడి పేరు ని ఎప్పుడూ రజనీ కాంత్ అని రాసుకునేవాడు.టీచర్లు చెప్పినా ఆ ధోరణి మార్చుకునేవాడు కాదు.ఇక వాళ్ళకి విసుకు పుట్టి ఈ కేస్ ని నా రూం లోకి పంపించారు.
" ఒరేయ్ అబ్బాయ్...నీ పేరు ఏమిటి" ప్రశ్నించాను.
"వికాస్ ..సార్" మర్యాద గా చెప్పాడు తను.
"చాలా మంచి పేరు పెట్టారు మీ వాళ్ళు.మరి పుస్తకాల మీద ,పరీక్షల్లోనూ రజనీ కాంత్ అని రాసుకుంటున్నావట..ఏమిటి కధ..!మీ పెద్ద వాళ్ళు అడ్మిషన్ రిజిస్టర్ లో ఏ పేరైతే ఎక్కించారో అదే ఎప్పటికీ ఉంటుంది..గుర్తు పెట్టుకో...నీ కంతగా మార్చుకోవాలని అనిపిస్తే ..దానికీ ఓ లీగల్ ప్రొసీజర్ ఉంది.పెద్దయిన తర్వాత ఆ దారి లో పోయి ..నీ యిష్టం వచ్చిన పేరు పెట్టుకో ..అర్ధమయిందా..?" కొద్దిగా సీరియస్ గా నే చెప్పాను.
"సరే..సార్" అని వెళ్ళిపోయాడు.
అయితే మళ్ళీ ఆ వికాస్ మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదు.టీచర్ల ని అడిగితే వాడు ఇప్పుడు వికాస్ అనే తన పేరు ని రాసుకుంటున్నట్లు చెప్పారు.పోనీలే దారిన బడ్డాడు అని కుదుటబడ్డాను.అయితే వింతగా కొన్ని పరిణామాలు జరిగాయి.క్లాస్ లో పిల్లలందరకీ ఈ విషయం తెలిసి వీడిని వికాస్ అని కాకుండా రజనీ అనే నిక్ నేం తో పిలవసాగారు.ఆ విధంగా వాడు వద్దనుకున్నా ఆ పేరు వాడిని వదల్లేదు.గ్రామం లో కూడా ఈ పేరు తోనే వాడు ప్రసిద్దుడైనాడు.అది వాడికి ఓ రహస్య ఆనందం కలిగించసాగింది.
భద్రాచలం లో దైవ దర్శనం చేసుకుని అభయాంజనేస్వామి పార్క్ కి ఎదురు గా ఉన్న గెస్ట్ హౌస్ కి వచ్చాను.అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి ఊరి లో.సెలవు ల్లోను,వారాంతాల్లోనూ యాత్రికులు బాగా పెరిగారు.అదృష్టం బాగుండి మామూలు రోజుల్లో వచ్చాను.ఏ శ్రీరామనవమి రోజునో,ముక్కోటి రోజుల్లోనో వస్తే వసతి గృహాలకి కొంత ఇబ్బందే ఎన్ని వందల గదుల సత్రాలున్నా..!గెస్ట్ హౌస్ లో సాయంత్రం దాకా రెస్ట్ తీసుకున్నాను.ఆ తర్వాత గోదావరి కరకట్ట మీద ఆ చల్ల గాలి కి కాసేపు తిరిగాను.బాపురమణల సృష్టి కి గుర్తు గా ఉన్న రామాయణ దృశ్యాల కి సంబందించిన విగ్రహాలు ఆ పొడవునంతా..!
కాసేపున్నతర్వాత పార్క్ లోకి ప్రవేశించాను.అక్కడ ఉన్న కుందేళ్ళ ను చూస్తుండగా మళ్ళీ ఇన్నేళ్ళకి ఈ రజనీ కాంత్ అనే పాత విధ్యార్ధి కనిపించాడు.తనే నన్ను గుర్తు పట్టి పలకరించాడు.ఎదిగే వయసు గనక తనలో వచ్చిన మార్పుల వల్ల మొదట గుర్తించలేకపోయాను.రజనీ కాంత్ అనే పేరు కి సంబందించిన ఉదంతం తను గుర్తు చేయగానే చటుక్కున నేను ఆ రోజుల్లోకి కనెక్ట్ అయిపోయాను.
" ఓ..నువ్వా..ఏం చేస్తున్నావు ఇప్పుడు " అడిగాను.
" హైద్రా బాద్ లో బి.బి.ఏ .చేస్తున్నాను సార్..నేను గుడికి వచ్చాను సార్.ఒక ఫ్రెండ్ వస్తానంటే ఈ పార్క్ లోకి వచ్చాను..ఇంతలో మీరు కనిపించారు.." ఆనందం గా చెప్పాడు ఆ కుర్రాడు.
" సంతోషం ..మంచిగా చదువుకుంటున్నందుకు..!ఏమిటి మీ ఊరు విశేషాలు ..అంతా బాగున్నారా..?స్కూల్ కి అప్పుడు గ్రౌండ్ చుట్టూతా కాంపౌండ్ వాల్ కట్టాలని ఎందరికో విన్నపాలు చేశాము.ఇప్పటికైనా అది పూర్తి అయిందా..?ఆ కొత్త గేట్ ..అదే మనం పెట్టినది ..అలాగే ఉందా ..?"
" మీరు ఉన్నప్పుడు ఆ ఊరు ఉమ్మడి రాష్ట్రం లో ఉండేది.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం చుట్టుపక్క ప్రాంతాలన్ని ముఖ్యంగా దక్షిణం వైపు అరకిలోమీటర్ కూడా భద్రాచలం పరిధి లో లేకుండా పోయింది.రాముడి కి చెందిన వందలాది ఎకరాలు ఆంధ్ర ప్రాంతం లోకి వెళ్ళాయి.ఇక ఉత్తరం కూడా అంతే.పర్ణశాల వెళ్ళాలంటే తూర్పు గోదావరి జిల్లా లోకి వెళ్ళి మళ్ళీ తెలంగాణా లోకి ప్రవేశించాలి.భద్రాచలం లోని కొన్ని వీధులే వేరే రాష్ట్రం లో కలిసిపోయాయి..పరిస్థితి గందర గోళం గా తయారయింది"
" అంటే..పోలవరం ప్రాజెక్ట్..ఏదో ముంపు ప్రాంతాలు అని పేపర్ లో చదివాను.దానికోసమే కలిపి ఉంటారు లే..!కొత్త రాష్ట్రం లో కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది రా అబ్బాయ్"
" పిల్లలు హాస్టల్ లో,స్కూల్ లో చేరే దగ్గర ఇబ్బందులు వస్తున్నాయి సార్.సర్టిఫికేట్లు తీసుకునేదగ్గర కూడా చికాకులు గానే ఉన్నాయి.పిల్లలకి బస్ పాస్ లు కూడా సమస్య గా మారింది.ఇంకా ఇట్లా సమస్యల రాజ్యం లానే ఉంది సార్..."
"కొత్త గదా ..కాస్త సర్దుకునేదాకా అలాగే ఉంటుందిలే..." అనునయించాను.
వాడి పరిధి లో ని విషయాలు వాడు చెప్పాడు.అయితే దానికి మించిన సమస్యలే రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైనాయి.ముఖ్యంగా భద్రాచలం డివిజన్ కి సంబందించి అనేక సామాజిక ,భౌగోళిక ప్రశ్నలు కొత్తగా ఆవిర్భవించాయి.ఎవరి రాజకీయ క్రీడ లో వారు బిజీ ..ప్రజల ఇబ్బందుల్ని పట్టించుకునే నాధుడేడి..?ఇవన్నీ ఆవిష్కరిస్తూ వాడికి బోధ చేసే సమయం నాకు ఇప్పుడు లేదు.టాపిక్ మారుస్తూ అడిగాను.
" ఇప్పుడు నువు వికాస్ అనే రాసుకుంటున్నావా నీ పేరు ..? లేకపోతే మార్చుకున్నావా "
"లేదు సార్.అప్పుడు ఏదో అలా రాసుకున్నా గానీ ..నా అసలు పేరే నాకిష్టం సార్ .." చెప్పాడు వికాస్.
"వెరీ నైస్.ఇంకా మిగతా స్టాఫ్ అప్పటి వాళ్ళు ..ఎవరైనా కలుస్తుంటారా..బాబూ" ప్రశ్నించాను.
"రఘు సార్,వాసు సార్ ..ఎప్పుడైనా కలుస్తుంటారు సార్.రమేష్ సార్ చనిపోయారట.నేను అప్పుడు సిటీ లో ఉన్నాను.."
"అప్పుడు నేను సెర్మనీ కి వచ్చాను వికాస్.అది ఏమిటో ఒక మిస్టరీ గా మిగిలిపోయిందిలే..!సరే మరి...అందరని అడిగినట్టు చెప్పు" అని నేను ముందు కి సాగిపోయాను.పార్క్ లోనే ఆ చివరి లో ఉన్న సిమెంట్ బెంచ్ నా కోసమే ఎదురు చూస్తున్నట్లు ఖాళీగా కనిపించింది.(సమాప్తం)
---Murthy Kvvs

No comments:
Post a Comment