ఈ మధ్య కధలు రాస్తుంటే వాటి లోని విషయాలు కొన్నితెలుస్తున్నాయి.కధలు చదవడం నాకు కొత్త కాదు.ఇంగ్లీషు,తెలుగు భాషల్లోనూ వీలైనన్నీ కధలు పెద్ద సంఖ్య లోనే చదివాను.కొన్ని దశాబ్దాలు అలా చదువుతూ ఈ మధ్య నుంచి రాయడం మొదలుపెట్టాను.గతం లో ఎప్పుడో ఒకటీ అరా రాసినా సీరియస్ గా తీసుకున్నది లేదు.
నవల కూడా పొడిగించబడిన కధయే ..పాయలు పాయలు గా సాగి చివరన శుభం కార్డు వేసుకుంటుంది.అంతే తేడా.ఇంగ్లీష్ కధలకి మన తెలుగు కధలకి కొన్ని చిన్న తేడాలు కనిపిస్తుంటాయి.ముఖ్యం గా పశ్చిమ దేశాల కధల్లో అక్కడక్కడ కొన్ని Gap లు వదిలేస్తుంటారు.అక్కడ చదువరి కొన్ని వాటిని ఊహించుకోవలసిందే.ప్రతిదీ వివరం గా చెప్పాలని అనుకోరు.చెప్పాల్సింది మాత్రం ఒక్కోసారి పేజీల కొద్దీ రాస్తారు అది వేరే విషయం.
మనం వద్దనుకున్నా,లేకున్నా ఆయా సమాజాల్లోని మత గ్రంధాల ప్రభావం అంతర్లీనం గా రచయితల మీద ఉంటుంది.బైబిల్ ని చదివిన తర్వాత నాకు అర్ధం అయింది ఏమిటంటే చాలా చోట్ల ఒక కంటిన్యుటి అనేది ఉండదు.బహుశా రోమన్,లాటిన్ భాష ల్లో నుంచి మిగతా ఇతర భాషల్లోకి అనువదించేప్పుడు కొన్ని అంశాల్ని తొలగించినారా అనిపిస్తుంది. అలాంటి ఒక ధోరణి ఇంగ్లీష్ రచయితలు అనుసరిస్తారు.ఆయా చదువరులకి కూడా కొత్త అనిపించదు.ఉదాహరణకి ఫౌంటైన్ హెడ్ నవల నే తీసుకొంటే హీరో హోవార్డ్ రోర్క్ చిన్నతనం గురించి ఏమీ మనకు కనపడదు.ఆ యిల్లు అద్దెకిచ్చినావిడతోను..ఇంకోచోట ప్రస్తావించినపుడు మాత్రమే చాలా తక్కువ సంభాషణల్లో బాల్యం గురించి దొర్లుతుంది.అదే లాంటి నవల మన దగ్గర రాస్తే..అంత బలమైన నమ్మకాలు ఉన్న పాత్ర ..అసలు ఎలాంటి ప్రభావాలతో బాల్యం లో పెరిగాడో రాయకపోతే ఎలా అంటూ తప్పక ప్రశ్నిస్తారు.
ఎర్నెస్ట్ హెమింగ్వే యొక్క నవలిక "ది ఓల్డ్ మేన్ అండ్ ద సీ" లో కూడా ..ఆ ముసలాయన పాత్ర తన భార్య ని పెద్ద గా తలుచుకున్నది ఉండదు..ఎంత ప్రయాస పడినా ..ఆమె ఫోటో పర్స్ లో పెట్టుకున్న వైనాన్ని చెబుతాడు రచయిత.అది మనకి అదోలా అనిపిస్తుంది.ఇవన్నీటినీ బహుశా culture gaps గా చెప్పవచ్చును.
ఎందుకో గాని మన తెలుగు కధకుల్లో ..అందరూ అని కాదు కాని...కొందరిలో..!విపరీతమైన డ్రమటజేషన్ ని సంభాషణల్లో చొప్పిస్తారు.అందుకే కృత్రిమంగా అనిపించి జీవితాన్ని ధ్వనించినట్లుగా ఉండదు.పెద్ద గా మనసు లో నిలవవు.తాత్కాలికంగా ఊపు నిస్తాయి.అంతే.మరీ కొన్ని అయితే ఎక్కడో చెప్పదలుచుకున్న సోదిని అంతా కధ రూపం లో చెపుతున్నట్లు అనిపిస్తుంది.ఊసుపోకరాసేవి వెంటనే పట్టిచ్చేస్తాయి.
జీవితాన్ని పరిశీలించడానికి చాలా ఓపిక,నేర్పు అవసరం.మళ్ళీ దాన్నీ అక్షరాల్లోకి ఒంపడం అక్కడే ఉంది అసలైన కళ.గాడ్ ఫాదర్ లోని కొన్ని సన్నివేశాల్నే చూడండి.చాలా సహజంగా రాయబడటం వల్లనే అవి అలా నిలిచిపోయాయి.ఈ పరిస్థితి లో నేను ఉన్నా ఇలాగే మాటాడుతాను గదా అనిపిస్తుంది.అంత ఆచి తూచి నట్లు ఉంటాయి మాటలు. ఎక్కడ ఎంత ఉండాలో అంతే ..!టెస్సియో నమ్మక ద్రోహానికి పాల్పడతాడు గాడ్ ఫాదర్ పోయిన తర్వాత. అప్పుడు మైఖేల్ కి టాం హేగన్ కి మధ్య సంభాషణలు చూడండి.
"అయితే టెస్సియో ని బిగించవలసిందేనా..?"
"వేరే దారి లేదు"
అంతే.ఒక చిల్లింగ్ స్పిరిట్ ని అక్కడ సంభాషణల ద్వారానే ప్రవేశపెడతాడు...భీభత్సమైన వర్ణనలు లేకుండా..!టెస్సియోని బందించి తీసుకువెళ్ళినట్లు చెపుతాడు రచయిత.అయితే అతడిని చంపినట్లు గాని ఇంకోటి చేసినట్లు గాని ఎక్కడా ఉండదు.అది ఒక Gap ..!దాని ఇమాజినేషన్ ని మనకే వదిలేస్తాడు రచయిత.కేవలం మనం తెలుగు రచనల తో పోల్చి చూస్తే ఏమిటి పాత్రలకి నిండుదనం లేదు అని అనిపిస్తుంది.మళ్ళీసారి ఇంకొన్ని మాటాడుకుందాం.--Murthy kvvs

No comments:
Post a Comment