ఈరోజు పొద్దున్నే పేపర్ తెరవగానే ఒక దుర్వార్త. చాలా చిన్న పాప "ఆద్య" అభం శుభం ఎరుగని చిన్నారి చనిపోయింది. అలాగే ఆ చంటి బిడ్డ తల్లి కూడా...! లేదు కరుణాకర్ అనే వ్యక్తి చంపినట్లు రాయబడింది. మొత్తం ఆ వార్త ని ఒకటికి రెండుసార్లు చదివాను. హృదయవిదారకం గా అనిపించింది.
అయితే ఆ వార్త చదివిన తరువాత నా ఈ అభిప్రాయాలు పంచుకోవాలనిపించింది. ఆ వార్త లో ఉన్నదాని ప్రకారం విషయం ఏమిటంటే ఆ చంటి బిడ్డ తల్లి కూడా పెద్ద వయసేమీ కాదు.యువ ప్రాయమే. జరిగినది ఏమిటంటే ఈవిడకి కరుణాకర్ అనే యువకుని తో స్నేహం అయి చక్క గా మాట్లాడుకుంటున్నారు.కొంత కాలానికి ఈ కరుణాకర్ తన తో వచ్చే రాజశేఖర్ ని ఈ యువతి కి పరిచయం చేశాడు. ఎందుకో ఈమె కరుణాకర్ ని నిర్లక్ష్యం చేస్తూ రాజశేఖర్ తో ఎక్కువ మాట్లాడుతోందని మొదటి స్నేహితుని కి అనిపించింది.వాద వివాదాలు జరిగి..చివరికి అది పీక్ స్టేజ్ కి పోయి ఈ రాజశేఖర్ సర్జికల్ కత్తి తో ఆవేశం తో దాడి చేయడం తో రెండు ప్రాణాలు పోయాయి.
తొందరపడి వీళ్ళద్దరి తో ఆ సంబంధం ఆమె కి ఉందా అనుకోవడం కూడా సబబు కాదు. మారిన కాలమాన పరిస్థితుల లో ఆడా,మగా మధ్య మామూలు స్నేహాలు కూడా అలా సాగిపోతున్నాయి.ఒకప్పుడంటే ఆడా మగ (భర్త కాక) మాట్లాడుకుంటే సమాజం కూడా హర్షిచేది కాదు.కాని ఇప్పుడు కొంత సడలింపులు అందరి లోనూ వచ్చినవి.సరే...కొద్దిగా నాకు తెలిసినంత మేర లో మానసిక విశ్లేషణ లోకి వెళతాను.ఎందుకంటే ఇలాంటివి పైపైన చూస్తే ఒకలా ఉంటే లోపలకి వెళితే వేరే కోణాలు ఉంటాయి.ఏదైమైనా అది దారుణం..కాదనడం లా..!
మనసు ని మాయల దయ్యం తో పోల్చాడు ఆత్రేయ. అది నిజమే...మనిషి అంతరంగం లో చెప్పడానికి,వ్యక్తీకరించడానికి వీలు కాని కోణాలు ఉంటాయి.సిగ్మండ్ ఫ్రాయిడ్ పరి భాషలో చెప్పాలంటే తాను విన్న,చూసిన,అనుభవించిన ప్రతి విషయం మనిషి అంతరంగం లోకి పోయి రిజిస్టర్ అయి తనకే ఆశ్చర్యం అనిపించే విధంగా వివిధ సన్నివేశాల్లో ప్రతి స్పందనలు గా అవి బయటకి వస్తుంటాయి.అవి అందరి లోనూ ఒకేలా ఉండాలని ఏమీ లేదు.
సరే..."కోవర్ట్ నార్సిస్టిక్ బిహేవియర్" అనేది కొందరి మనుషుల్లో ఉంటుంది.స్త్రీలు పురుషులు ఇరువురు లోనూ ఈ లక్షణాలు ఉంటాయి.ఇవి మనం కొందరి లో గమనిస్తుంటాము గాని సరిగ్గా పరిశీలించము. ముందు స్త్రీలనుంచి వద్దాము,ఉదాహరణ కి చాలా అందమైన ,ఆకర్షణీయమైన స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటాయి అని మానసికవేత్తలు అంటారు. తమ అందానికి ఒక పురుషుడు ఆకర్షితుడయ్యాడని కనిపెట్టినపుడు అలాంటి స్త్రీ అతడిని మొదటి దశ లో
స్వర్గం లో ఉన్నట్లుగా ప్రేపిస్తారు.క్రమేపి కొన్ని రోజుల తర్వాత వారిని నిర్లక్ష్యం చేసి ఎదుటి వ్యక్తిని మానసిక ఆందోళన కి గురి చేసి ఆనదిస్తూంటారు.ఇంతకంటే డేంజరస్ గేం ఇంకొకటి ఏమిటంటే Triangulate చేయడం చేస్తారు. అంటే తనని పిచ్చిగా అభిమానించే పురుషుడు ఉండగానే అతను చూస్తుండగా మరో పురుషుని వైపు అదోలా చూడడం చేసి అసూయ ని కలిగిస్తూంటారు. అప్పుడు ఈ ఇద్దరు పురుషుల మధ్య మనస్పర్ధలు వస్తాయి.వచ్చి చాలా చికాకులు అవుతుంటాయి.
ఆ విషయాన్ని మాట్లాడదామని మొదటి వాడు ప్రయత్నిస్తే కోపపడడము లేదా Stonewall లోకి వెళ్ళిపోతారు.అంటే అరిచి గీ పెట్టినా సరే...చూడకపోవడం,మాట్లాడకపోవడం చేస్తూంటారు ఇలాంటి స్త్రీలు.అక్కడ వీడు పిచ్చెక్కి ఎలా ప్రవర్తిస్తాడో ఆ మనిషికి ఉన్న అవగాహన మీద ఆధారపడిఉంటుంది. మామూలు స్త్రీలు అయితే అంటే ఈ లక్షణాలు లేని వాళ్ళతో ఏ సమస్యా ఉండదు.అలాటి వాళ్ళు కూర్చొని ఎదుటి వ్యక్తి తో సవివరం గా మాట్లాడతారు. విషయం ఇద్దరి మధ్యా ఓ కొలిక్కి వస్తుంది. మన సమాజం లో ఇలాటి వాటి మీద అవగాహన లేదు గాని పాశ్చాత్య సమాజాల్లో దీని మధ్య చాలా అధ్యయనం జరిగింది. చాలా చర్చలు కూడా ఆయా బాధితుల మధ్య జరుగుతుంది.
ఈ లక్షణాలు ఉన్న పురుషులు ఇంకా దారుణం గా ఉంటారు.వీళ్ళు అంతా చూడటానికి చాలా మర్యాదస్తుల్లా నీటు గా బయట వారికి కనిపిస్తుంటారు.కాని మనసు లోపల వారు పొందే ఆనందం ,ముఖ్యం గా వారి టార్గెట్ లు లేదా Empath లు బాధపడుతుంటే వీరికి కలిగే ఆనందం వర్ణనాతీతం. అయితే ఇదంతా అందరూ గమనించరు...మనిషికి మనిషికి మధ్య రహస్యం గా సాగే ఈ రాక్షస క్రీడని. ఎప్పుడైనా ఒక సంఘటన బయటకి కనిపించేలా జరిగినపుడు అప్పుడు అటువేపు చూస్తాము.మళ్ళీ కొన్నాళ్ళకి మర్చిపోతాము. కాని లోనికి తొంగి మనసు లొకి చూస్తే చాలా తెలుస్తాయి.ముఖ్యం గా వీరి ప్రవర్తనా విధానాన్ని ఆది లోనే కనిపెట్టగలిగితే కొన్ని చికాకులు తొలిగిపోతాయి.
మరెలా అంటారా..? ఇతను లేదా ఈమె నాకు Soulmate లా అనిపిస్తోంది అని ఎవరిపట్లనైనా అనిపిస్తే (ప్రవర్తన లో మాటల్లో) కొంతకాలం వారిని గమనించి చూడండి.అందరూ అని గాదు గాని అది మొదటి Red flag. ఈ సబ్జక్ట్ మీద ఇంకా రాయాలి దీనికి కొనసాగింపుగా. రాస్తాను. ముందు ముందు. (సశేషం)
------Murthy Kvvs

No comments:
Post a Comment