ఆంగ్లమూలం:డి.హెచ్.లారెన్‌స్
తెలుగు సేత:మూర్తి కెవివిఎస్
Post No: 1
Vicar గారి భార్య చిల్లిగవ్వలేని ఓ యువకుని తో లేచిపోయిందనే వార్త మామూలు గా పాకలేదు.ఆమె కి ఇద్దరు కుమార్తెలు.ఒకరికి ఏడేళ్ళు,మరొకరికి తొమ్మిదేళ్ళు.Vicar గారి గూర్చి చెప్పాలంటే చాలా మంచి భర్త.నిజం.అతని తలవెంట్రుకలు కాస్త నెరిసివుండవచ్చు గాక,కాని మీసాలు మాత్రం నలుపే..!అందం గానే ఉంటాడు.అందమైన తన భార్య అంటే బయటకి చెప్పలేనంత ఇష్టం..!
మరి ఆమె ఎందుకు లేచిపోయింది..?మతిలేని ఆ పని ఎందుకు చేసినట్లు..?
ఎవరివద్దా జవాబు లేదు.భయభక్తులు గల కొందరు స్త్రీలు ఆమె గుణమే మంచిది కాదు అన్నారు.ఇంకొంతమంది మౌనం వహించారు.అయితే వారికి దానిలోపలి విషయం తెలుసు.
ఆ ఇద్దరు చిన్న పాపలకి మాత్రం ఏమీ తెలియదు.వాళ్ళ అమ్మ వాళ్ళని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయిందనే నిర్ణయానికి మాత్రం వచ్చారు.వారి హృదయం గాయపడినది.
ఈ దిగ్భ్రాంతికరమైన వార్త మిగతా అందరిని పెద్ద గా ఊపివేసింది ఏమీ లేదులే గాని Vicar గారి కుటుంబానికి మాత్రం బాంబు పేలినట్లయింది.ఇంకా చూడండి...ఆ ఊరి లోని పుస్తకప్రియులకి ఆయన మీద కొంత జాలి కలిగింది.ఎందుకంటే ఈయన వ్యాసరచయిత గా ఇంకా అందులోనూ వివాదస్పదుని గా పేరెన్నికగన్న వ్యక్తి. ఆ Papplewick ప్రాంతం లో ఆ విధంగా ఆయనకి పేరుంది.దురదృష్టం అనే గాలిని ఈ North country లో ఉన్న Rectorate మీది కి తోలాడు ఆ దేవుడు.
ఆ ఊరి లోకి ప్రవేశించే ముందర ఒక నది ప్రవహిస్తూంటుంది.దాన్ని River Papple అంటారు.దానిని ఆనుకునే ఈ Vicar గారి Stone house ఉంటుంది.ఒక మాదిరి గా ఉంటుంది.ఇంకొద్దిగా ముందుకుపోతే ఓ చిన్న పిల్లకాలువ తగులుతుంది.ఆ దాపునే ఎప్పుడో నీటి శక్తి తో నడపబడిన కాటన్ మిల్‌స్ కానవస్తాయి.ఆ రోడ్డుని దాటి వంపు తిరిగి పైకి వెళితే ఆ ఊరి లో రాతి తో వేసిన వీధులు కానవస్తాయి.
ఆ ఏరియా లోని భవనం లోకి వచ్చిన తర్వాత Vicar గారి కుటుంబం కొన్ని కావలసిన మార్పులు చేర్పులు దానికి చేసుకున్నారు.Vicar అనే పదవి నుంచి Rector అనే పదవి లోకి వచ్చాడిప్పుడీయన.ఆయన తో బాటు వృద్దురాలైన తల్లి,సోదరి,సిటీ లో ఉండే సోదరుడు వీరంతా కూడా ఈ ఇంటిలోకి వచ్చారు.ఇక మిగిలిన ఆ ఇద్దరు బాలికలు ...మిగతా వారితో పోలిస్తే విభిన్నవర్గమని చెప్పాలి.
Rector గారికి ఇపుడు 47 ఏళ్ళు.ఆయన భార్య అలా వెళ్ళిపోవడం పట్ల గాఢంగానే కలత చెందారు. ఆయన పట్ల దయగల స్త్రీలు కొంపదీసి ఆత్మహత్య చేసుకుంటాడా అని కనిపెట్టుకు కూచున్నారు.ఆయన జుట్టు ఇంచుమించు గా తెల్లగా అయిపోయింది.కళ్ళు వెడల్పు గానూ దీనం గానూ అయినాయి.నిజం గా మీరు ఆయన్ని చూసి తీరవలసిందే ఎంత భయానకంగా ఆయన స్థితి అయిపోయిందో తెలుసుకోవాలనుకుంటే..!
అయినా ఎక్కడో ఒక అపశ్రుతి ఉన్నది.ఆయనంటే జాలి పడిన స్త్రీల లో కూడా కొందరు రహస్యం గా ఆయన్ని అయిష్టపడేవారు.మళ్ళీ ఓ వైపు ఈయన సత్యవర్తనుడు అనే భావమూ ఉండేది.
(సశేషం)
.
No comments:
Post a Comment