---ఆంగ్లమూలం:డి.హెచ్.లారెన్‌స్
---తెలుగు సేత: మూర్తి కె.వి.వి.ఎస్.
ఆ పిల్లలిద్దరికీ వాళ్ళ Rectory పరిధి లోకి అడుగు పెట్టడం తో హృదయాల్లో ఝం అన్నది.చూసేందుకు వారికది నచ్చదు.ఇక్కడంతా ఒక మధ్య తరగతి వాతావరణం ఇంకా కేవలం అలాంటి సౌకర్యాలే ఉంటాయి,అంతే.వాళ్ళ ఇల్లంటే పెద్దగా నచ్చదు.ఆ రాతి కట్టడం వారికి అశుభ్రంగా అనిపిస్తుంది.దానిలోని ఫర్నీచర్ అదీ గానీ వారికి నూతనం గా అనిపించదు.భోజనం దగ్గర కూడా..వాళ్ళకి రుచించదు.విదేశం లో చదువుకొచ్చిన యువతరం గదా మరి అలాగే అనిపిస్తుందేమో..!
రోస్ట్ చేసిన బీఫ్,వెట్ కేబేజ్,కోల్డ్ మటన్,మాష్డ్ పొటాటో,పుల్లటి పచ్చళ్ళు,భోజనానతరం తినే కొన్ని తీపి పదార్థాలు ...ఇవి ఆ ఇంటిలోని వంటకాలు.
నాయనమ్మ కి పోర్‌క్ అంటే ఇష్టమే గాని ఆమెకి కొన్ని ప్రత్యేక వంటకాలు ఉంటాయి.బీఫ్ టీ,రస్కులు,సేవరీ కష్టర్డ్ ఇలాంటివి.ఆమె ఒంటరిగా టేబుల్ ముందు కూర్చుని ప్లేట్ లో బాయిల్డ్ పొటాటో వేసుకుని తింటూఉంటుంది. మాంసాహారం తినదు.మిగతావాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ,స్థిమితం గా ఉండి,మళ్ళీ తనకి కేటాయించబడిన పదార్థాల్ని లొట్టలు వేసుకుంటూ ఆరగిస్తుంది. ఆహార పదార్థాలు పెద్ద రుచిగా ఉండవు ఆ ఇద్దరాడపిల్లలకి..!
ఎందుకలా అంటే,ఆ వంటల్ని చూసుకునే Cissie ఆంటీ కి ఫుడ్ విషయం లో పెద్దగా అభిరుచి లేకపోవడం. తినడం లోనూ అంతే.గత మూడు నెలలుగా పనిమనుషుల్ని కూడా మానిపించింది.
ఆ ఇద్దరాడపిల్లలు ఏదో తిన్నాం అంటే తిన్నాం లాగా జరిపించేస్తుంటారు. Lucille ఏమి మాట్లాడకుండా తినేస్తుంది. Yvette మాత్రం ముక్కు తో వాసన చూసి ఇష్టం లేనట్టు మొహం చిట్లిస్తుంది.ఆ ఒక్క Rector మాత్రం జోక్ లు వేసుకుంటూ తినేస్తుంటాడు.తెల్లని జుట్టు గల ఆ మనిషి తన బూడిద రంగు మీసాల్ని కర్చీఫ్ తో తుడుచుకుంటూ మహదానందం గా లాగిస్తుంటాడు.
రాను రాను తను లావై పోతున్నాడు.తన రూం లో పుస్తకాలతో రోజంతా కాలక్షేపం చేస్తుంటాడు.బద్దకస్తుడిలా అవుతున్నాడు.వ్యాయామం అనేది చేయడు.వాళ్ళ అమ్మ తో కూర్చుని ఏవో వ్యంగ్యాత్మక కబుర్లు, జోకులు చెప్పుకుంటూ కాలం గడుపుతుంటాడు.
ఎత్తైన గుట్టలతో , లోతైన లోయలతో ఆ గ్రామీణ ప్రాంతమంతా ముసురు పట్టి నిద్ర పోతున్నట్లు గా ఉంటుంది.ఆ ప్రదేశానికి దానికంటూ ఉండే ఓ ప్రత్యేకత ఉన్నది.అదే దానికి బలం.ఉత్తరానికి అలాగే 20 మైళ్ళు వెడితే అక్కడ కొన్ని పరిశ్రమలు ఉన్నాయి.ఆ Papplewick గ్రామం ఒంటరి గా ,ఏదో పొగొట్టున్నట్లు గా ఉంటుంది.అక్కడగల రాతికట్టడాల్లోనే జీవమంతా ఉన్నది.ఓ కవితాత్మకమైన ప్రదేశం అది.
గతంలో లానే ఆ ఇద్దరాడపిల్లలు Choir లో పాడటమూ,ఆ Parish లో సాయపడటమూ చేస్తుంటారు.Yvette కి సండే స్కూల్ అంటే ససేమిరా పడదు.ఎప్పుడో పెద్దవాళ్ళు నిర్ణయించిన ఇలాంటి పనులు ఆమెకి నచ్చవు.చర్చ్ కి సంబందించిన విధులు అన్నిటినీ తప్పించుకుంటుంది.ఎప్పుడు అవకాశం దొరికినా Rectory నుంచి దూరం గా ఉంటుంది.
Framleys కుటుంబం Grange ప్రాంతం లో ఉంటుంది.చాలా పెద్ద కుటుంబం,డల్ గానూ,ఆనందం గానూ ఉంటారు.విధుల పట్ల అలసత్వం చూపరు.ఒక్కోసారి ఆమెని ఎవరైనా భోజనానికి గాని,టీ కి గాని ఆహ్వానిస్తే ,అది మామూలు శ్రామికుల కుటుంబం అయినా సరే,ఆమె దానిని స్వీకరిస్తుంది.అలా చేయడం లో ఆమె కి ఓ థ్రిల్లింగ్ ఉన్నది.అలాంటి వారి తో అంటే శ్రామికుల వంటి వారి తో మాటాడటం ఆమె కి ఇష్టం.వాళ్ళ లో కొంతమంది చికాకు గాళ్ళు ఉంటారు గాని చాలా మటుకు మంచి వాళ్ళూ సైతం ఉంటారు.ఏదైమైనా వారిదంతా మరో ప్రపంచం.
నెలలు గడిచిపోయాయి.Gerry Somercotes ఇంకా Yvette కి ఆరాధకుడి గానే ఉన్నాడు.రైతు కుటుంబం నుంచి,మిల్ ఓనర్ల కుటుంబం నుంచి వచ్చిన యువకులు ఇంకొందరు కూడా ఆమె కి ఆరాధకులు గా మారారు.ఆమె ఇప్పుడు ఇక్కడ సమయాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.కాని ఆమె పార్టీలు,డాన్‌స్ లు అంటూ బయట ఊర్లకి వెళుతుంది.ఆమె కోసం స్నేహితులు మోటారు కార్ల లో వస్తుంటారు. అలా ఆమె సిటీ కి వెళ్ళి ప్రధానమైన హోటళ్ళ లో మధ్యానపు డాన్స్ ల లో ఫాల్గొంటుంది.నూతనం గా నిర్మించిన ఘనమైన Palais de Danse కి వెళుతుంది.దాన్ని Pally అని పిలుస్తారు.
అయినప్పటికీ ఆమె ఇంద్రజాలానికి గురైన జీవి లా ఉంటుంది.పూర్తి ఆనందం గా ఉండదు.లోలోపల ఎక్కడో ఓ చికాకు.అలా ఉండటం ఆమె కి ఇష్టం కాదు గాని అది ఎప్పుడు మొదలయిందో ఆమె కీ తెలియదు.Cissie ఆంటీ తో కూడా ఒకోమారు రూడ్ గా ఉంటుంది.ఇంటి దగ్గర ఉండటం అంటే మహా చికాకు.Yvette కి ఉండే ఈ స్వభావం ఆ కుటుంబానికి ఉన్న ఓ లక్షణం గా తయారైంది.
ఇక Lucille విషయానికొస్తే,చాలా ప్రాక్టికల్ మనిషి.తనకి ఫ్రెంచ్ భాష,షార్ట్ హేండ్ వచ్చును.ఆ అవసరం ఉన్న ఓ వ్యక్తి దగ్గర ఆమె పర్సనల్ సెక్రెటరీ గా జాయినయింది.రైలు లో రోజూ సిటీ కి వెళ్ళి వస్తుంది.అదే రైలు లో Uncle Fred కూడా ప్రయాణిస్తాడు.కాని ఈమె మాత్రం తనతో కలవదు.వాతావరణం ఎలా ఉన్నా ఆమె స్టేషన్ దాకా సైకిల్ మీదనే వెళుతుంది.ఆయన మాత్రం నడుచుకుంటూ వెళతాడు.
సుఖవంతమైన సాంఘిక జీవితాన్నే ఆ ఇద్దరమ్మాయిలు కోరుకున్నది.Rectory అంటే ఇద్దరికీ పడదు.ఇక వాళ్ళ స్నేహితుల గురిచి చెప్పేదేముంది..!
వారి ఇంటిలో కింది భాగం లో నాలుగు గదులు ఉంటాయి.ఒక కిచెన్,దాన్లో ఇద్దరు పనివాళ్ళుంటారు.అసంతృప్తిగా..!ఆ తర్వాత ,అంతగా వెలుతురు రాని డైనింగ్ రూం ఒకటి ఉంటుంది.ఇక పోతే Rector చదువుకోవడానికి ప్రత్యేకంగా ఒక స్టడీ రూం..! ఆ తర్వాతది లివింగ్ రూం లేదా డ్రాయింగ్ రూం ,ఇది పెద్ద గా ఉంటుంది.డైనింగ్ రూం లో గ్యాస్ తో వెలిగే పొయ్యి ఉంటుంది.లివింగ్ రూం లో మాత్రం చలికాచుకోవడానికి మంచి వసతి ఉన్నది.ఆ ప్రదేశం లో నాయనమ్మ దే హవా..!
ఈ రూం లో కుటుంబం అంతా సమావేశమవుతుంది.సాయంత్రం పూట డిన్నర్ గట్రా అయిపోయినతర్వాత Uncle Fred,Rector ఇద్దరూ వాళ్ళమ్మ తో కలిసి క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేయడం అనే కార్యక్రమం ఒకటి పెట్టుకుంటారు.
(సశేషం)
No comments:
Post a Comment