Wednesday, September 16, 2020

ద వర్జిన్ అండ్ ద జిప్సీ (తెలుగు అనువాదం)-POST :6

     --ఆంగ్లమూలం:డి.హెచ్.లారెన్‌స్

    --తెలుగుసేత:మూర్తి కె.వి.వి.ఎస్.


"ఆ..అమ్మా...ఇపుడు చెప్పు...నువు రెడీయేగదా,N బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్ W : a siamese functionary"


"ఏ...ఏమిటి...?M బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్ W నా? " అడిగింది ముసలావిడ.ఆమె కి వినికిడి శక్తి తక్కువ అని తెలిసిదే గదా..!


"కాదమ్మా..M కాదు,N ఆ తర్వాత నాలుగు బ్లాంక్ లు చివరన W వస్తుంది.దాని అర్ధం a siamese functionary అట."


"N ఆ తర్వాత 4 బ్లాంక్ లు,ఆ తర్వాత W నా ! a chinese functionary నా..అంతేగదా..?"


"కాదు,సియామిస్" 


"ఆ అలాగా " 


"siamese,siam" 


"ఓ.. సియామిస్ ఫంక్షనరీ నా..?అయితే ఆ ఖాళీల్లో ఏ అక్షరాలు వస్తాయబ్బా " రెండు చేతులు పొట్టకి ఆనించి ఆలోచించసాగింది.ఇద్దరు కొడుకులు ఏవో ఊహిస్తున్నారు.దానికామె ఊ కొడుతున్నది.


Rector ఈ క్రాస్ వర్డ్ పజిల్‌స్ పూరించడం లో మంచి తెలివైనవాడు.అయితే Fred కొన్ని సాంకేతిక పదాల్ని బాగా ఊహిస్తాడు.


"ఇది చాలా కష్టమైన పదం లా ఉంది" ఆ ముసలావిడ అన్నది.అందరూ ఆలోచిస్తున్నారు.


Lucille చెవులకి తన చేతుల్ని అడ్డం పెట్టుకుని ఏదో చదువుతున్నట్లుగా అభినయిస్తోంది.Yvette కోపంగా ఏదో బొమ్మలు గీకుతూ గట్టిగా రాగం తీస్తున్నది.


Cissie ఆంటీ అదుపు లేకుండా చాకొలెట్ తింటున్నది.ఆమె దవడలు ఎప్పుడూ అలా కదులుతూనే ఉంటాయి.ఆమె కాస్తా దూరం గా ఉంది.ఇంకో చాకొలెట్ నోటిలో వేసుకుని Parish మేగజైన్ ని తిప్పుతోంది.ఆమె ఓ సారి తల తిప్పి,ముసలావిడకి హార్లిక్స్ టైం అయిందన్నట్లు లేచింది.


ఆమె అలా లేవగానే Yvette విసురు గా వెళ్ళి ఒక కిటికీ ని తెరిచింది.ఆమె ఉద్దేశ్యం లో ఆ రూం లోకి ఫ్రెష్ గాలి రావాలని.అంత చెవుడు ఉన్న ముసలావిడ కి ఆ శబ్దం బాగానే వినబడింది.


"ఏయ్ ...Yvette , ఆ కిటికీ ని తెరిచావా..?ఇక్కడ నీకంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు.ఆ సంగతి గుర్తుంచుకోవాలి.అర్ధమైందా..?భరించలేని చలిగాలి వీస్తోంది. అందరికీ జలుబు చేస్తుంది" అంది ముసలావిడ. 


మళ్ళీ తనే అంది " ఈ రూం పెద్ద గానే ఉంది.అందరూ కావలసినంత వెచ్చదనం పొందవచ్చు ఇక్కడ ఉన్న ఫైర్ తో.." 


"అది నాకు తెలుసు,కొద్దిగా ఫ్రెష్ గాలి రావాలని తెరిచాను" అంది Yvette. ఆ ముసలావిడ కోపం తో కంపించింది.


"ఏమిటి...నిజమా?" అరిచింది ఆమె.


ఈ లోపులో Rector మెల్లగా లేచి ఆ కిటికి దగ్గరకి పోయి దాన్ని మూసేశాడు.కూతుర్ని అదిలించడం ఇష్టం లేక ఆమె వైపు చూడకుండా వచ్చేశాడు.అయితే ఎప్పుడెలా ఉండాలో ఆ అమ్మాయి తెలుసుకునే తీరాలి.


ఈ క్రాస్ వర్డ్ పజిల్స్ ని ఆ సాతాను కనిపెట్టాడనుకుంటా,ఇపుడు ఇది ఈ ముసలామె దాకా వచ్చింది.ఆమె హార్లిక్స్ తాగింది.మంచం ఎక్కి నిద్రపోవడానికి గాను నిర్ణయించుకుని అందరికీ గుడ్ నైట్ చెప్పింది. అందరూ లేచారు.


అప్పటికి రాత్రి తొమ్మిదయింది.ఆ ముసలావిడ ఏదో పడుకుంటుంది గాని ఆమె కి నిద్ర అంత తొందరగా పట్టదు.ఆ Cissie ఆంటీ వచ్చి నిద్రోయేదాకా..! 


"నే కాపురం చేసిన 54 ఏళ్ళు మీ నాన్నగారు లేకుండా ఏ రోజు నిద్రపోయింది లేదు.ఆయన పోయిన తర్వాత ..నిద్రపోయే వేళకి ప్రాణం బయటకి వచ్చినంత పని అవుతోంది.అసలు నన్నే ముందు తీసుకెళ్ళమని ఆ దేవుడిని ప్రార్ధించా...అయితే ఒకటిలే...నేను ముందెళ్ళినా తను భరించలేడు" సణిగింది ముసలావిడ.


ఆ ముసలావిడ తోనే ఈ Cissie ఆంటీ కూడా పడుకుంటుంది.ఆమెకది చికాకు గానే ఉంటుంది.తను అంత తొందరగా నిద్రపోదు.రోజురోజు కి ఆమె పరిస్థితి అలా తయారవుతోంది.ఆ తినే తిండి సహించడం లేదు.ఏదో ఒకటి చేయాలి.


మధ్యాన భోజన సమయం కల్లా ముసలావిడ లేస్తుంది. ఆ చూపు తగ్గుతున్న నీలికళ్ళు,సాగుతున్న కనుబొమలు,ఎర్రటి మొహం,ఒకలాంటి భరించలేని గంభీరత్వం ఇలాంటి లక్షణాల తో కూడిన ఆమె తన చేతుల కూర్చీ లో కూర్చొని ఆరగిస్తుంది.తెల్లని వెంట్రుకలు పల్చబడుతున్నాయి.దానిమీద Rector అనడమూ,ఈమె దాన్ని ఒప్పుకోకపోవడమూ అదొక సన్నివేశం.తిండి విషయం లో సంతృప్తి గా ఉంటుంది.ఆ ఘట్టం అయిన తర్వాత తన శరీరాన్ని నొక్కుకుంటూ ఆ కుర్చీ లో కూలబడుతుంది.


ఆ ఇద్దరాడపిల్లలకి ఒక ఇబ్బంది ఏమిటంటే ...వాళ్ళ స్నేహితులు ఎవరు వచ్చినా ఈమె వాళ్ళని అన్నీ వాకబు చేస్తుంది.రాగానే ముందు ఆ గది లోనే ఉంటుంది.ఆమె ని చూసుకుంటూ Cissie ఆంటీ కూడా..!వచ్చిన ప్రతివాళ్ళు ముసలావిడ దగ్గర హాజరు వేయించుకోవాలి.వాళ్ళెవరు,ఎక్కడినుంచి వచ్చారు,వాళ్ళ జీవిత విశేషాలు ఏమిటి ఇవన్నీ తెలుసుకుంటుంది.ఆమె సంతృప్తి చెందితే సంభాషణ కొనసాగిస్తుంది. (సశేషం)  



No comments:

Post a Comment