మొదటిసారి జపాన్ వెళుతున్నారా? ఇవి గుర్తుంచుకుంటే మంచిది.
---------------------------------------------------------------------------------------
మొదటిసారి జపాన్ దేశం వెళుతున్న వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. జపాన్ అనగానే మనకి టోకియో నగరం జ్ఞాపకం వస్తుంది. నిజానికి ఆ దేశం లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.ఒసాకా,క్యోటో,నగానో, యోకోహామా ఇలా ఎన్నో నగరాలు ఉన్నాయి. మనం ఏ దేశం వెళ్ళినా అక్కడి స్థానిక అలవాట్లను,సంస్కృతి ని గౌరవించాలి. జపాన్ లో ఏ ఇంట్లోకి వెళ్ళాలన్నా ఇంకా కొన్ని వ్యాపార ప్రదేశాలకి వెళ్ళాలన్నా చెప్పులు బయట వదిలి వెళ్ళాలి. అంతేకాదు మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ పని చేసే సర్వర్ లకి గానీ,ఉద్యోగులకు గానీ పొరబాటున టిప్ అనేది ఇవ్వకూడదు. దాన్ని వారు సీరియస్ గా పరిగణిస్తారు.
పబ్లిక్ లో టాట్టూ లు ప్రదర్శించరాదు. ఎదుటి వారిపట్ల గౌరవం చూపాలి అనుకుంటే బౌ చేయాలి. అంటే శిరసు వంచి అలా చేస్తే గౌరవించినట్లు లెక్క.ఎస్కలేటర్స్ మీద ఎడమ వైపు నిల్చోవాలి. జపాన్ లో చౌకగా తిరగాలంటే రైల్ పాస్ అనేది కొనుక్కుంటే చాలు. బస్ ల్లోనూ,రైళ్ళ లోనూ ఇంకా ఇతరత్రా ప్రయాణ వాహనాల్లో అతి తక్కువ ఖర్చు తో చుట్టిరావచ్చు.లేదంటే ఖర్చు బాగా అవుతుంది. నగరాల్లో చాలామందికి ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి భాష సమస్య పెద్దగా ఉండదు. జపనీస్ డిక్షనరీ ని గూగుల్ ట్రాన్ స్లేట్ లో డౌన్లోడ్ చేసుకుంటే కూడా ఉపయుక్తం గా ఉంటుంది. జపాన్ లో కార్డ్ ల కంటే నగదు నే చాలా చోట్ల ఉపయోగిస్తారు. ముఖ్యం గా షాపింగ్ చేసేటప్పుడు,కనక సరిపోయినంత క్యాష్ ని చేతి లో ఉంచుకోవడం మంచిది.
ఏటిఎం ల దగ్గర మాత్రమే గాక పోస్ట్ ఆఫీసుల్లో ఇంకా 7 ఎలెవెన్ అనే స్టోర్ ల వద్ద కార్డులు ఉపయోగించి క్యాష్ ని పొందవచ్చు. డేటా రోమింగ్ కంటే పాకెట్ వై ఫై ని కొనుక్కుంటే చవగ్గా అన్ లిమిటెడ్ ఇంటెర్ నెట్ ని ఉపయోగించుకోవచ్చు. జపాన్ లో వారి స్థానిక వంట రుచుల్ని,ఆతిథ్యాన్ని చవి చూడాలంటే ర్యోకన్ అనే సంప్రదాయ నివాసాల్లో ఉండాలి.అంటే అవి ఒక తరహా లాడ్జ్ లు వంటివి. టాకుహాబిన్ అనే లగేజ్ సర్విస్ ఉంటుంది.మీ లగేజ్ బాగా బరువు ఉంటే వారికి ఒప్పజెప్పి అడ్రెస్ ఇస్తే చాలు, అక్కడికి తెచ్చి పెడతారు.నామమాత్రపు ఖర్చు తో ఈ పని చేస్తారు. శుభ్రత కి జపనీయులు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. ఏదైనా చెత్త ఉంటే హోటల్ కి వచ్చేదాకా మీ జేబు లో పెట్టుకోవాలి లేదా దగ్గర లో స్టోర్ ఏదైన ఉంటే అక్కడి డస్ట్ బిన్ లో వేయాలి.
పరిసరాల్ని,ఇంటిని శుభ్రం గా ఉంచుకోవడం,పదిమందిలో ఎలా మెలగాలి,ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలి కేవలం ఇలాంటి వాటిని నేర్చుకోవడానికే అక్కడి ప్రాథమిక విద్య లో ప్రాధాన్యతనిస్తారు. అయిదు ఏళ్ళు నిండిన ప్రతి చిన్నారి ,ఆడా మగ తేడా లేకుండా ఈ విషయాల్ని అభ్యసించాలి. ఎవరి స్కూల్ ని , ఆఫీస్ ని ఎవరికి వారే శుభ్రం చేసుకుంటారు.చిన్నప్పటి నుంచి ఇలాంటి మేనరిజం ని నేర్పించే పాఠశాలల్ని యో చిన్ అని జపనీస్ భాషలో పిలుస్తారు. మార్చ్ నుంచి మే నెలల మధ్య ఇంకా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలం లో జపాన్ దేశాన్ని సందర్శిస్తే బాగుంటుంది.
--- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)
No comments:
Post a Comment