Monday, September 10, 2012

ఈ పోస్టింగ్ ని SNKR అనే నా మిత్రునికి అంకితమిస్తున్నాను.వాడికి బ్రైన్ కేన్సర్ సోకి ICU లో ఉన్నాడు ప్రస్తుతం.




ట్రావెంకూర్ సంస్థానాధీశులకి భారత దేశ చరిత్ర లో ఒక విశిష్ట చరిత్ర ఉంది.వారు తమ రాజ్యాన్ని పద్మనాభ స్వామి తరపున పాలిస్తున్నట్టుగా భావించేవారు.కుటుంబంలోని పురుషులు పేరుకి ముందు "పద్మనాభ స్వామి దాసా " అని స్త్రీలు "పద్మనాభ స్వామి సేవిని" అని పెట్టుకునేవారు.ఇటీవల కాలంలో పద్మనాభ స్వామి వారి ఆలయంలో దొరికిన అమూల్యమైన బంగారు నగలు,సంపదా అంతా ఆ స్వామి సొత్తు గానే ఆ నేలమాళిగల్లోనే భద్రపరిచారు తప్ప తమ స్వంతానికి వాడుకోకపోవడం వారి భక్తి ప్రపత్తుల్ని తెలియజేస్తుంది.ట్రావెంకూర్ చివరి పాలకుడు బలరామ వర్మ ,చివరి మహారాణి తిరుణాల్ లక్ష్మి బాయి ..! ఇప్పటికి ఆ రాజకుటుంబాన్ని ప్రజలు యెంతో గౌరవిస్తారు.అన్నట్టు ప్రఖ్యాత చిత్రకారుడు రవి వర్మ వీరి బంధు వర్గం లోని వారే..! 

Pics: 1. Last maharani     2. Royal palace of Travancore

2 comments:

  1. blogs lo coment pedutuntaaru SNKR ani aayanenaa?

    ReplyDelete
  2. cha..cha..maa vaadu "profile" display chesukoagala magaadandi baabu..

    ReplyDelete