"The Old Man and the Sea" Telugu translation by Murthy Kvvs

                                                 1

ఆ ముసలాయన గల్ఫ్ స్ట్రీం గా పిలువబడే సముద్ర జలాల్లో చేపల్ని వేటాడుతుంటాడు..!ఆ రోజుకి ఎనభై నాలుగు రోజులు గడిచాయి.ఒక్క చేపా పడ లేదు.మొదటి నలభై రోజులు ఓ కుర్రవాడు సాయంగా వచ్చేవాడు.అంటే ఏం లేదు..ఆ కుర్రవాని తల్లి దండ్రులు కాస్త మెళుకువలు నేర్చుకుంటాడని ఇతని దగ్గర చేర్పించారు. ఇన్ని రోజులూ ఒక్క చేపా పడలేదు.చికాకు లేచి ఆ తల్లి దండ్రులు వేరే జాలరి వద్ద చేర్పించారు.మొదటి వారం లోనే మూడు మాంచి చేపలు పడ్డాయి.ఇకనేం..ఆ తల్లి దండ్రులు ఆ కుర్రవాణ్ణి Salao లాంటి ముసలివాణ్ణి వదిలి ఈ కొత్త పడవ మీదనే వేటకి వెళ్ళు అని చెప్పారు.

అయితే ఈ కుర్రవానికి ఆ ముదుసలి వ్యక్తి తో గల అనుబంధం అంత త్వరగా తెగిపోయేది కాదు. తల్లిదండ్రుల కన్నుగప్పి కూడా వచ్చి ఈ ముసలాయన బాగోగులు చూస్తూ ఉంటాడు.ఒక తాతా మనవల  బంధమేమో.ప్రతి రోజు ఆ కుర్రవాడు ఈ ముసలాయన పాకలోకి వస్తుంటాడు.చేపలు పట్టడానికి ఉపయోగించే సరంజామా అంతా..ఆ మొకులు..తాళ్ళు..గేలాలు...ఆ తెర చాపలు ఇలాంటివి అన్నీ ఏ రోజుకి ఆ రోజు సిద్ధం చేస్తూ ఆ ముసలాయనకి సాయం చేస్తుంటాడు.

ముసలాయన శరీరం లోని శక్తి క్రమేపి హరించుకు పోతుందా అన్నట్లు మోము నుంచి మెడ వెనుక దాకా ముడతలు పడుతున్న వళ్ళు.శరీరం మీద అక్కడక్కడ గోధుమ రంగు మచ్చలు..అంతాటా పాకుతున్నట్లు చెంపల మీది నుంచి ..కింది దాకా చేతుల మీద దాకా..ఒక లాంటి చారలు..ఆ సూర్య తాపం అదీ మామూలా.బలమైన చేపల్ని వేటాడం లో గాని,ఆ మోకుల రాపిడి తో గాని ..అవి చేసే దెబ్బలు అవి అన్నీ మామూలా.అతని శరీరం లో అవి అన్నీ ప్రతిఫలిస్తున్నాయి.ఇప్పటివి కావు అవి.

ఆ ముసలాయానికి సంబందించి చెప్పాలంటే అన్నీ పాతవే.ఒక్క అతని కళ్ళు తప్ప..సముద్రం మాదిరి గానే అవి నీలి వర్ణం లో ..ఆనందకరంగా ...ఓటమి ఎరుగని వారి లా గోచరిస్తుంటాయి.

"శాంటియాగో"  పిలిచాడు ఆ కుర్రవాడు.పడవని ఆపుచేసి ఉన్న ఒడ్డు కి సమీపంగా వెళుతుండగా.మళ్ళీ అతనే అన్నాడు ..!

" మళ్ళీ నీతో వేటకి వస్తాను...కొంత సంపాదించుకున్నాముగా ఇప్పటి కే" అని.

అసలు చేప వేట సముద్రం మీద ఎలా ఉంటుందో ..నేర్పించిందే ఈ ముసలాయన ..ఆ కుర్ర వానికి..!

" వద్దులే..నువ్వు ఇపుడు మంచి చేపలు పడే పడవల వాళ్ళ తో గదా ఉన్నది,అక్కడే ఉండు.." అన్నాడు శాంటియాగో..అదే ఆ ముసలాయన.

" మరి ఒకటి గుర్తుంచుకో..ఎన్ని రోజులు పాటు బడినా ఒక్క చేప కూడా మనం కలిసి పట్టలేకపోయాము.మరి ఇప్పుడేమో..ప్రతి రోజు ఓ పెద్ద చేప పడుతోంది..గత కొన్ని వారాలుగా.."

" నాకు తెలుసు..నీ అంతట నువ్వు నన్ను వదిలి వెళ్ళవు..కాని ఎక్కడో నీకు ఓ సందేహం..ఔనా.."

" ఏం చేయను..మా నాన్న చెప్పింది నేను కాదనగలనా..నేను చిన్న పిల్లవాణ్ణి గదా.."

" నాకు తెలుసు..అది సహజం లే.."

" ఆయనకి నమ్మకం లేదు నేను ఏమి చేసేది.."

"లేదు..మనలో మనకి ఉండాలి నమ్మకం ముందు..కాదా.."

" నిజమే..ఆ..అన్నట్టు నేను నీకు ఓ బీర్ ఇప్పిస్తాను..పద..ఆ టెర్రస్ వేపు..ఈ సామాగ్రి అంతా ఇంటికి తర్వాత తీసుకు పోవచ్చు.."

" సరే..కానీ ..ఇద్దరు జాలారుల మధ్య సహజమేగా.."

ఇద్దరు కూర్చుని బీర్ సేవిస్తుండగా ఇంకా కొంత మంది జాలరులు వచ్చారు.ముసలి వాని వేపు చూసి ఏదో ఎగతాళి గా అన్నారు.అయితే శాంటియాగో అది పట్టించుకోలేదు.ఆ రోజు సముద్రం తీరు గురించి,వాతావరణం గురుంచి..బోటు లో నుంచి వదిలే తాళ్ళ గురుంచి ఇలా పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.ఆ రోజు బాగా షికారు చేసిన వాళ్ళు తమ చేపల్ని అమ్మడం కోయడం ..ఇలాంటి వాటిల్లో బిజీ గా ఉన్నారు.కొన్ని ఏమో రాజాధాని హవానా కి తరలిస్తున్నారు.శీతల పేటికల్లో. షార్క్ లు పడిన వాళ్ళు ముందు గా వాటి ప్రాణాలు తీసి మాంసాన్ని చక్క గా పేర్చుతున్నారు.మొప్పల్ని వాటిని వేరు చేసి.

గాలి తూర్పు వైపు గా ఉన్నట్లుంది,వాసన గుప్పున కొట్టింది.కాసేపు ఆగి గాలి దిశ మారింది..ఆ వాసన తగ్గింది..హాయిగా ఉంది..సూర్య కాంతి లో ఆ టెర్రెస్ మీద ..!
" శాంటియాగో"  ఆ కుర్రవాడు పిలిచాడు.

" ఆ..చెప్పు.." ముసలాయన ఏదో ఆలోచిస్తూ అన్నాడు.

" నేను బయటకి పోయి నీ కోసం కొన్ని Sardines( ఒక రకం చేపలు) తీసుకు వచ్చేదా"

" నీకెందుకులే..పోయి నువు బేస్ బాల్ ఏదో ఆడుకో..నాకు రోజ్లియో సాయం చేస్తాడు లే " అన్నాడు ముసలాయన.

" నీతో చేపలు పట్టడానికి రాలేకపోయినా కొద్ది గా అయినా నన్ను సాయం చేయనీ "

" నాకు బీర్ ఇప్పించావు గదా..నువు ఇపుడు పెద్దాడి కిందే లెక్కా"

" నువు మొట్ట మొదటి గా నన్ను షికారు కి తీసుకెళ్ళినప్పుడు నా వయసు ఎంత  ఉండి ఉండవచ్చు.."

" అయిదు ఏళ్ళు ఉండవచ్చు.. అప్పుడు గుర్తుందా..ఆ పచ్చ చేప సముద్రం లో మన పడవ ని ముక్కలు చేసినంత పని చేసింది.జ్ఞాపకం ఉందా" అడిగాడు ముసలాయాన.

" ఔను..ఆ తోక తో బాదడం..అప్పుడు నన్ను పడవ చివరి అంచు కి నువ్వు  తోసి వేయడం..ఆ పిమ్మట నువ్వు కత్తి తో వేసిన వేటుకి అది మొదలు తెగిన చెట్టు లా పడిపోవడం..దాని రక్తం నా మీదికి సైతం చిమ్మింది.."

" నిజమా..లేదా నేను చెప్తున్నానా"

" లేదు..ప్రతిది నాకు గుర్తె..మనం మొదటిసారి షికారు వెళ్ళినప్పటి నుంచి ప్రతిది.."

ఆ ముసలాయన కళ్ళ లో ఆరాధన ,ప్రేమ నిండి అలాగే ఉండిపోయాడు.సూర్యకాంతి కళ్ళ లో మెరిసి తళుకు మన్నది.

" నువ్వు గనక నా మనవడివే అయితే నిన్ను తీసుకు పోయి ఎక్కడనో ఆడుకునేవాడిని..కాని నువ్వు పరాయిల బిడ్డవి గదా..అదీ వేరే పడవ లో షికారు కి పోతున్నవాడివి.."

" సరే..ఆ Sardines తెచేదా..నాకు తెలుసు అవి ఎలా అమర్చాలో " కుర్రవాడు అన్నాడు.

" నావి నాకు ఉన్నాయిలే..పెట్టె లో ఉంచాను"

" నేను ఫ్రెష్ వి తెస్తాను..అలా ఉండు"

" ఒకటి చాల్లేవయ్యా.." ముసలాయన చెప్పాడు.గాలి హాయి గా వీస్తోంది.సేద తీరుతున్నట్లుగా ఉన్నది.

" లేదు ..రెండు తెస్తాను.. " అరిచాడు కుర్రవాడు.

" సరే..రెండు..మరి ఎక్కడా దొంగిలించినవి అయి ఉండకూడదు.."

" అయ్యో..అవి నేను కొన్నాను..తెలుసా.."

" థాంక్యూ.."  చెప్పాడు ముసలాయాన.ఎక్కువ ప్రేమ ముంచుకొచ్చినా అతను ఎక్కువ మాట్లాడలేడు.

"రేపు మొత్తానికి ఒక గొప్ప సుదినం కాబోతున్నది..సముద్రం మీద.. " అనుకున్నాడు తను లోలోపల.

" రేపు ఏ వైపు కి వెళుతున్నావు వేట కి ..సముద్రం లో.." అడిగాడు కుర్రవాడు.

" చాలా దూరం.. పవనాలు మళ్ళీ వెనక్కి మళ్ళినా ..వెంటనే రాలేనంత దూరం.. ! తెల్లవారకముందే బయలుదేరుతా..సముద్రం లోకి ఈసారి..!
                              2

"అయితే నువ్వు ఓ పెద్ద చేప ని గాని పట్టిన పక్షం లో..నీకు సాయం గా మేము వస్తాము లే" అన్నాడు కుర్రవాడు.

" నువ్వు ఇప్పుడు వెళ్ళే పడవ ఉన్నదే  అతను ..సముద్రం లో ఎక్కువ దూరం వెళ్ళడా.. ఏం..?" ముసలాయన ప్రశ్నించాడు.

" లేదు.అతనికి కంటి చూపు అంతంత మాత్రమే..ఆ డాల్ఫిన్ లు అవీ పైకి లేచినపుడు పక్షులు అవీ వచ్చి చూస్తున్న మందం కూడా చూడలేడు.."

" అతనికి కంటి చూపు అంత తక్కువా..?"

"ఇంచుమించు అంతే"

" వింతగానే ఉన్నదే...అతను తాబేళ్ళ వేట కూడ చేసిన వాడు కాదు.అలాంటివి చేయడం లో కంటి చూపు మందగించే అవకాశం ఉంటుంది.."

" అలా అంటున్నావా..మరి మస్కిటో కోస్ట్ లో ఎన్నో ఏళ్ళు నువు తాబేళ్ళ వేట చేశావు.నీ కంటి చూపు బాగానే ఉందిగా.." ఆశ్చర్యంగా అన్నాడు కుర్రవాడు.

" నేను ఒక వింత ముసలివాణ్ణి లే"

"నిజంగా ఓ పెద్ద బలమైన చేప ఇపుడు నీకు పడిందే అనుకో...దాన్ని నువ్వు సంభాళించగలవా..?"

"దానికి నా మెళుకువలు నాకున్నాయి..ఎలాంటి దానినైనా ఒడ్డుకు తీసుకురాగలను.."

" సరే..పద..ఈ మర బోటు కి సంబందించిన సరంజామానంతా ఇంటికి తీసుకు పోదాం.ఆ తర్వాత నా పని లోకి నే పోతాను" చెప్పాడు కుర్రాడు.బోటు కి పెట్టే గేర్ ని,తెర చాపలు కట్టడానికి గాను ముందు భాగం లో అమర్చే పొడవాటి దుంగని వాటిని  ముసలాయన తన భుజానికి ఎత్తుకున్నాడు.ఎరలు పెట్టే చెక్క పెట్టె,గాలాలు వేసే తాళ్ళు ,హార్పున్ లాంటివి కుర్రవాడు పట్టుకున్నాడు.ఇవన్నీ ఇక్కడ ఉంచినా ఎవరూ తీసుకెళ్ళరు లే గాని ఎందుకు అనవసరం గా ఉంచడం అని..ముఖ్యంగా హార్పున్ లాంటివి..!

అలా ఇద్దరూ నడుచుకుంటూ వచ్చి ముసలాయన ఇంటికి వచ్చారు.ఒక గుడిశె మాదిరి దే అని చెప్పవచ్చు. ముసలాయన ఆ పొడవాటి దుంగని గోడకి ఆనించి నిలబెట్టాడు.తెరచాపల్ని వాటిని ఒక వార గా పెట్టాడు.ఆ కుర్రాడు కూడా మిగతా అన్నిటిని పక్కనే సదిరాడు.ఆ పొడవాటి దుంగని mast అంటారు వారి పరి భాష లో.రాయల్ పాం కలప తో తయారు చేసినట్టిది.

ఆ చిన్ని ఇంటిలో ఉన్నది బహు కొద్ది సామాన్లు..ఒక మంచం,ఒక కుర్చి,ఒక టేబుల్..అంతే.పొయ్యి బొగ్గు తో రాజేస్తారండానికి గుర్తు గా నేమో..నేల మీద మరకలు అవీ ఉన్నాయి..ఈ మధ్య ఊడ్చినట్లు గా లేదు.అక్కడక్కడ గాలికి కొట్టుకు వచ్చి న చెట్ల ఆకులు..పరుచుకుని ఉన్నాయి.ఒక వేపు న క్రీస్తు పరిశుద్ధాత్మ బొమ్మ,మరో వేపు మేరీ మాత బొమ్మ ఉన్నాయి.అవన్నీ ఎప్పుడో భార్య బతికి ఉన్నరోజుల్లో పెట్టినవి..అలానే ఉన్నాయి.ఆ గోడకి ఉండే భార్య ఫోటోని మాత్రం ఒక అరలో మంచి చొక్క మడత లో పెట్టాడు. ఆ గోడ మీద అది కనబడుతున్నప్పుడల్లా తనకి ఏకాంతం లో ఉన్న భావం కలిగి అదోలా అనిపిస్తుంది.

" తినడానికి ఏమి ఉంది" అడిగాడు కుర్రవాడు Manolin .

" ఒక కుండలో కొంత పసుపు అన్నం,చేపల కూర ఉంది..నీకు ఏమన్నా కావాలా " ముసలాయన అడిగాడు.

" నేను ఇంటి వద్ద తింటాలే..వాటిని వేడి చేయనా "

"వద్దు..నేను తర్వాత వేడి చేసుకుంటా..లేదా అలాగే తినేస్తా "

" ఆ వల ఏది..ఓ సారి చూస్తా.."

" అలాగే..కానీ" చెప్పాడు ముసలాయన.

అక్కడ పసుపు అన్నం ఉండదు,కూర ఉండదు..ఆ వల ఉండదు..దాన్ని అమ్మివేసిన సంగతి ఆ కుర్రాడికి తెలుసు.కాని ఒక్కోసారి అలా ఏదో మాటలు సాగిపోతుంటాయి వారి మధ్య.

" అన్నట్లు ఎనభై అయిదు నా లక్కీ నంబర్ గదా..ఒక వెయ్యి పౌండ్ల చేప పడిందనుకో ఈ రోజు..ఎలా ఉంటుంది.."  అడిగాడు ముసలాయన.

" నేను వెళ్ళి వల ని ఇంకా ఆ సార్డైన్ లని తెస్తా గాని..ఈ తలుపు దగ్గర సూర్య కాంతి లో కూర్చుంటావు గా"

" ఓ..అలాగే..నిన్నటి పేపర్ కూడా ఉండాలి.దాంట్లో బేస్ బాల్ ఆట గురుంచి చదవాలి" చెప్పాడు ముసలాయన.

ఆ పేపర్ సంగతి మాత్రం ఆ కుర్రాడికి తెలియదు,ముసలాయన ఉన్నట్లుండి మంచం లోనుంచి ఓ పేపర్ తీసుకొని చదవ సాగాడు." నిన్న Perico ఈ పేపర్ ని ఇచ్చాడు చదువుకోమని"  అన్నాడు దాని వివరం చెపుతూ.

" సరే..మరి నే వెళ్ళోస్తా..ఎర గా వేసే చేపల్ని నీవి,నావి కలిపే పెడదాం..రేపొద్దున్న ఎవరివి వాళ్ళు తీసుకుందాం.వచ్చిన తర్వాత బేస్ బాల్ సంగతులు చెపుదువులే.."

" ఏది ఏమైనా ఈ సారి Yankees ఓడిపోవడం జరగదు" చెప్పాడు ముసలాయన.

" Indians of Cleveland జట్టు తక్కువా..నాకు భయమే .."

" Yankees లో నమ్మకముంచవయ్యా..గొప్ప ఆటగాడు DeMaggio ఆ జట్టు లో ఆడుతున్నాడు ..మరిచిపోయావా  "

" అట్లాని కాదు..Tigers of Detroit ..వాళ్ళు మాత్రం తక్కువా.."

" ప్రతి చిన్నదానికి భయపడితే ఎలా...అలా అయితే అణా కాణీ కాని వాళ్ళ కి భయపడుతూ పోవాలి"

" సరేలే..నువు చదువుతూ ఉండు...మళ్ళీ వస్తా "

" రేపు ఎనభై అయిదవ రోజుగదా..అదిరిపొయే లా ఏదైనా జరగవచ్చునేమో.."

" ఓ సారి 87 రోజులకి ..ఒక్కటీ పడలేదని చెప్పావు గుర్తుందా.."


" లేదు లే ఆ రికార్డు ఎట్టి స్థితి లోను  పునరావృతం కాదు.."  చెప్పాడు ముసలాయన.
                           3

ఆ కుర్రవాడు తిరిగి వచ్చేసరికి ముసలాయన నిద్ర పోతూ కనిపించాడు...ఆ కుర్చీ లో జారగిలబడి..సూర్యుడు కిందికి దిగుతున్నాడు.తల ఒక పక్కకి వొరిగి  ఉంది.భుజాలు శక్తివంతం గానే ఉన్నా వృద్ధాప్యపు చాయలు కనిపిస్తూనే ఉన్నాయి.అతను వేసుకున్న చొక్కా కి అక్కడక్కడ అతుకులు ఉన్నాయి.అవీ మాసి పోయి కనిపిస్తున్నాయి.కళ్ళు మూతలు పడిన ఆ మొహం లో జీవం ఉన్నట్లు గా లేదు.న్యూస్ పేపర్ ఆ మోకాళ్ళ పైనే తారాడుతున్నది.సాయంత్రం..చల్లని గాలి..!

" పెద్దాయన..ఇక లే.." కుర్రవాడు అన్నాడు.

ఆ ముసలాయన కళ్ళు తెరిచి చిన్నగా నవ్వాడు.ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చిన అనుభూతి.

" ఏం తెచ్చావు తినడానికి" అడిగాడు ముసలాయన.

"ముందు లే.."

" పెద్ద గా ఆకలి లేదు...నాకు"

" దా ..కొద్ది గా అయినా తిను...లేకపోతే చేపల వేట ఎలా చేస్తావు..?"

" హ్మ్...నే తిన్నాలే " అలా చెబుతూనే పక్కనున్న న్యూస్ పేపర్ ని మడిచి పక్కనెట్టాడు.తర్వాత దుప్పటిని కూడా చక్క గా సదిరాడు.

"ఆ దుప్పటిని కప్పుకోరాదా...ఇట్లా తినకుండా పోయేట్లయితే నేను బతికుండంగా నువు చేపలు పట్టలేవు.." అన్నాడు కుర్రాడు .

" నువ్వు అలా అనకు..ఎప్పటికీ నువు చిరంజీవి లా ఉండాలి..సరే..మనం ఏమి తినబోతున్నాము..ఇంతకీ.."

" బ్లాక్ బీన్స్,రైస్,ఫ్రైడ్ బనానాస్..ఇంకా అలా.."

 ఆ టెర్రస్ వద్ద నుంచి రెండు పెద్ద గిన్నెల్లో తెచ్చాడు.. కావలసిన స్పూన్ లు,ఫోర్క్ లు..అన్నీ జేబు లోనుంచి తీశాడు.

" ఇవి నీకు ఎవరు ఇచ్చారు.." అడిగాడు ముసలాయన.

" అదే..మార్టిన్..ఆ ఓనర్ ఉన్నాడు గా.."

" నా కృతజ్ఞతలు తెలియ జెయ్యి అతనికి"

" నేను ఇప్పటికే తెలియజేశానులే..నువు అవసరం లేదు.."

" ఏమైనా అతనికి ..కడుపు నిండేంత పెద్ద చేప ని ఇవ్వాలి...మన కోసం ఇలా ఎన్ని సార్లు చేశాడో.."

" నిజమే"

" మన గురుంచి ఇంత ఇది గా ఆలోచించే మనిషి కి ఎంత ఇచ్చినా తప్పు లేదు"

" రెండు బీర్లు కూడా ఇచ్చాడు.."

" ఆ కేన్ లో ఉండే బీర్లు అంటే నాకు బాగా ఇష్టం"

" లేదు..ఇప్పుడు ఇచ్చినవి..బాటిల్స్ లో..మనం మళ్ళీ వెనక్కి ఇచ్చేయ్యాలి.."

" అబ్బా..ఎంత మంచి వాడివో..ఇక తినడం మొదలెడదాము.."

" దాని కోసమే నేనూ ఎదురు చూసేది.."

" సరే..రెడీ..కొంచెం శుభ్రం చేయడానికి కొన్ని నీళ్ళు ఉండే బావుండును" చెప్పాడు ముసలాయన.

ఇప్పుడు నీళ్ళంటే..రెండు వీధులు కిందకి పోవాలి.ఆ సబ్బు,టవల్,ఇంకో చొక్కా,చలి కోటు ..బూట్ల జత తెచ్చి ఉంటే బాగుండును..అనుకున్నాడు ఆ కుర్ర వాడు.

" చాలా బాగుంది.." వంటకాల్ని రుచి చూసి అన్నాడు ముసలాయన.

" ఇప్పుడు బేస్ బాల్ గురుంచి చెప్పు" అడిగాడు కుర్రవాడు.

" Yankees మాత్రమే గెలుస్తారు నేను చెప్పినట్లు"

" ఒకటి తెలుసా..వాళ్ళు ఈ రోజు ఆట లో ఓడిపోయారు.." చెప్పాడు కుర్రవాడు.

" హ్మ్..దానిదేముంది లే..ద గ్రేట్ DeMaggio మళ్ళీ తన తడఖా చూపిస్తాడు.."

" టీం అంటే అతను ఒక్కడేనా...ఇంకా ఇతరులూ ఉంటారు గా.."

" ఉండొచ్చు...కాని అతని ఆట ఎవరకీ రాదు..బ్రూక్లిన్,ఫిలడెల్ఫియా ల్లో చెప్పమంటే నేను మొదటిదానికి ఓటేస్తా...హ్మ్..ఇంకా చెప్పాలంటే..Dick Sisler లాంటి ఆటగాళ్ళు ఉన్నారు అనుకో..."

" అతని లాంటి ఆటగాళ్ళు ఎవరూ లేరు.బాల్ ని ఆ విధంగా ఆడిన వారు ఎవరూ లేరు..నావరకైతే అదీ లెక్క.."

" నీకు గుర్తుందా..అతను ఒకసారి మన ఈ ..ఆవరణం లోకే వచ్చాడు.నాతో పాటు చేపలు పట్టడానికి పిలుద్దామనుకుని అనుకున్నా..కాని అడగడానికి భయమేసింది.నీకు చెప్పాను..నువు కూడా ఎందుకో భయపడ్డావు.."

" ఆ ..తెలుసు..అది పొరబాటే...రమ్మంటే వచ్చేవాడే..అది ఒక చిరకాల జ్ఞాపకం గా మిగిలిపోయేది.."

" నాకు ఇష్టమైనా ఆటగాడు ఆ DeMaggio ని నా పడవ లో షికారు తీసుకు వెళ్ళాలి.ఆ..ఇంకోకటి..వాళ్ళ నాన్న కూడా మన లాగా నే చేపలు పట్టే వృత్తి లోనే ఉండేవాడట..బహుశా అతనూ..మన లాంటి ఒక మనిషే కావచ్చును..కనక మనల్ని బాగా అర్ధం చేసుకొని ఉండేవాడేమో..అది నా మనసు లోని మాట.." చెప్పాడు ముసలాయన.

" Sisler వాళ్ళ నాన్న నా వయసు అప్పటినుంచే పెద్ద జట్ల లో ఆడేవాడట.అంటే అతను ధనవంతుడనేగా అర్ధం.."

" ఆ..నీకు ఒకటి తెలుసా ...ఇప్పటి నీ వయసు లో నేను ఒక నలుచదరపు నౌక మీద కీలకమైన బాధ్యత నిర్వహిస్తూ ఉండేవాడిని. అలా పోతూ పోతూ ఆఫ్రికా వైపూ పయనించేవాళ్ళము..అక్కడి బీచ్ ల లో సిమ్హాలు తిరుగుతూ ఉండటం..నాకు ఇప్పటికీ గుర్తే.."

" అవును..చెప్పావు ఓసారి.."

" సరే..మనం ఇపుడు..ఆఫ్రికా గూర్చి చెప్పుకుందామా..బేస్ బాల్ గురుంచా.."

"హ్మ్..బేస్ బాల్ గురుంచి చెప్పూ..అన్నట్లు John J McGraw  ఆట గురుంచి చెప్పు..


" అతను అప్పుడప్పుడు..మన ఈ ప్రాంతానికి వచ్చేవాడు...చాలా రఫ్ గా ఉండేవాడు..తాగితే అదుపు చేయడం మహా కష్టం..పైగా గుర్రాల పిచ్చి ఒకటి..ఎప్పుడూ ఫోన్ లో వాటి వివరాలనే మాట్లాడుతూ ఉండే వాడు.." 

                              4

" John J.McGraw  ...గొప్ప మేనేజర్ అని మా నాన్న చెప్పేవాడు" కుర్ర వాడు తన అభిప్రాయం చెప్పాడు.

" ఎందుకని...అతను తరచు ఇక్కడకి వస్తుంటాడనా..? Durochar లాంటివాడు ప్రతి ఏటా ఇక్కడకి రావడం మొదలెట్టినా ...అతణ్ణి కూడ మీ నాన్న ఆకాశానికెత్తాస్తాడనుకుంటా.." అన్నాడు ముసలాయన.

" నిజం చెప్పాలంటే ఎవరు ఆ రంగం లో మిన్న..? Luque నా లేక  Mike Gonjalez  నా ..?"

" నా దృష్టి లో వాళ్ళంతా సమానులే.."

" నా దృష్టి లో మటుకు నువ్వే మంచి చేపల వేటగాడివి.."

" లేదు,నా కంటే గొప్ప వాళ్ళున్నారు   "

"Que' va ( No way అని ఈ స్పానిష్ మాట కి అర్ధం)  కాని వారి అందరి లో నువ్వే మేటి"

"థాంక్యూ..నన్ను సంతోష పరిచావు.ఆ మాట వీగిపొయేలా ఏ చేప నా దారికి అడ్డు రాకూడదని ఆశిస్తున్నా.."

"ఇప్పటికీ నువ్వు గట్టి గా నే ఉన్నావు.అలా ఏమి జరగదు లే.."

" నాకు కొన్ని మెళుకువలు తెలుసు.అది మాత్రం నిజం.."

" ఇపుడు నువు తొందర గా పడుకో..అలా అయితేనే పొద్దుటే ఫ్రెష్ గా ఉంటావు.అప్పటికి వచ్చి ఆ పడవ లో ని సరంజామా ని టెర్రస్ దాకా తీసుకొస్తాలే.."

" సరే..అయితే గుడ్ నైట్... పొద్దుటే నేను నిన్ను లేపుతాను లే  "

" నువు నాకు అలారం లాంటి వాడివి"

" నా వయసే నాకు అలారం వంటిది...వయసు బాగా మళ్ళిన వాళ్ళకి చాలా పొద్దు నే తెలివొస్తుంది..రోజు మొత్తం బారెడు ఉండాలనా..ఏమో "

" అదేమో గాని..చిన్న వయసు వాళ్ళు మాత్రం ఆలశ్యం గా నిద్రోయి,లేటు గా లేస్తారు...అది మాత్రం తెలుసా.."

" సరే మరి..నిన్ను పొద్దున్నే లేపుతాలే..."

మా పడవ అతను నన్ను లేపడం నాకు ఇష్టం ఉండదు.అది నన్ను  చిన్న బుచ్చినట్లు అవుతుంది.."

" నాకు తెలుసు"

" సరే..పోయి నిద్ర పో "

ఆ కుర్రవాడు వెళ్ళిపోయాడు.దానికి ముందర ఇద్దరూ లైట్ లేకుండానే భొజనం కానిచ్చారు.ముసలాయన తన ట్రవుజర్స్ విప్పి దిండు లా సర్దుకున్నాడు.ఎత్తు గా ఉండానికి దాని లో కొన్ని న్యూస్ పేపర్లు కుక్కాడు.పడుకుని దుప్పటి కప్పుకున్నాడు.బెడ్ స్ప్రింగ్ లు గుచ్చకుండా కూడా కొన్ని పేపర్లు పరిచాడు వాటి మీద..!

కాసేపట్లో అతనికి నిద్ర పట్టేసింది.ఒక కల కూడా వస్తోంది...తాను మంచి వయసు లో ఉన్నాడు..ఆఫ్రికా ఖండం లోని సముద్ర తీరాల్లో సంచరిస్తున్నాడు..ఎత్తైన పర్వతాలు..సముద్రపు అలల చప్పుడు...స్థానికుల పడవలు...ఆ పడవలకి పూసిన లేపనాలు కూడా ముక్కుపుటాల్ని తగులుతున్నాయి...ఒకానొకప్పుడు తాను సంచరించిన ప్రదేశమే అది.

పోను పోను ఆఫ్రికా వాసన పరుచుకొని మళ్ళీ అదృశ్యమయింది..ఇప్పుడు నేల మీద నుంచి వీచే చల్లని ఉదయపు గాలి...మెలకువ వచ్చి లేచాడు.బట్టలు వేసుకున్నాడు. ఆ కుర్ర వాడిని లేపుదామని బయలు దేరాడు.ఈ రోజు ఎందుకో ఈ నేల మీదినుంచి వీచే చల్ల గాలి తొందర గానే మేల్కొన్నట్లుగా నే ఉంది.అతనికి ఇప్పుడు ఏ కల వచ్చినా ఆఫ్రికా తీరం లో ..ఆ పడవల పై గడిపిన ..ఆ పాత రోజులే తన చిన్న  తనం ని గుర్తు చేసే రోజులవి..ఆఫ్రికా తీరం లో ని ఆ సిమ్హాలు..అవీ కల లోకి వచ్చేవి తప్ప ఇంకా ఏవి రావు..ఆ స్థితిని దాటి పొయినాడతను.  
ఆ కుర్రవాడు ఉన్న చోట కి నడుచుకుంటూ వెళుతున్నాడు.చలి వణికిస్తోంది..కాసేపట్లో పడవ వేసుకొని  సముద్రం లోనికి వెళితే అన్నీ మటుమాయమవుతాయి.ఆ కుర్ర వాడు నిదురిస్తూ ఉన్న చోటికి వెళ్ళి ..ఒకేసారి తట్టి లేపడం ఎందుకని ..అతడి కాలి మీద చిన్న గా తన చేయి తాకించి ఉంచాడు.ఆ కుర్రాడు మెల్లి గా నవ్వుతూ లేచి ,బట్టలు వేసుకున్నాడు.

" నిద్ర లేపినందుకు సారీ" ముసలాయన అన్నాడు.

" హా...హా..వేరే దారి లేదు గా"

ఆ మసక వెలుతురు లోనే కొంత మంది జాలరులు తమ సరంజామా తో నడుచుకుంటూ వారి పడవ ల వైపు కదులుతున్నారు.ముసలాయన ఇంట్లోని తాళ్ళ చుట్టలు,హార్పూన్ ఆయుధం,ఇలాంటివి కుర్రాడు పైకెత్తుకున్నాడు.ముసలాయన తెర చాపలు ఇంకా వాటి అన్నిటిని కట్టే పెద్ద కర్ర చెక్క ని వాటిల్ని ఎత్తుకున్నాడు.

"కొంచెం కాఫీ తాగరాదు" అన్నాడు కుర్రవాడు.

" ఈ గేర్ ని పడవ లో పెట్టి తాగుతా.."

పొద్దునే చేపల వేట కి వెళ్ళే జాలరులు అందరూ అక్కడే ఆ టెర్రస్ దగ్గరే కాఫీ తాగటం పరిపాటి.ఇద్దరూ తాగారు.

" రాత్రి నిద్ర బాగా పట్టిందా " అడిగాడు కుర్రవాడు.అతని లో ఇంకా ఎక్కడో ఒక నిద్ర మత్తు వదల్లా..!

" ఆ బాగా నే పట్టింది Manolin.." చెప్పాడు ముసలాయన.

" నాకు బాగా నే పట్టింది.అవును..నీకు ఎరలు అవీ తెస్తా ఉండు..కావాలంటే ఇంకో కాఫీ తాగు..ఇక్కడ మనకి ఖాతా ఉంది"  అలా చెప్పి ఆ కుర్రాడు పగడపు రాళ్ళ మీది నుంచి చెప్పులు లేకుండానే వెళ్ళిపోయాడు.ఈ రోజు కాఫీ ని ఎంత మెల్లి గా అయినా తాగవచ్చు.తను ఇప్పుడు లంచ్ ఏమీ తీసుకుపోవడం లేదు పడవ మీద..ఒక బాటిల్ నీళ్ళు మాత్రం పెట్టుకున్నాడు.పడవ ఒంపు లో ఉంచాడు దాన్ని.కాసేపటికి ఆ కుర్రాడు ఓ న్యూస్ పేపర్ లో ఎరల్ని,ఇంకా కొన్ని సార్డైన్ చేపల్ని తీసుకొని వచ్చాడు.లోపల పెట్టాడు.ఇద్దరూ కలసి పడవ వెనుక్కి వెళ్ళి దాన్ని మెల్లిగా సముద్రం లోకి దింపారు.వారి కాళ్ళ కింద సన్నని గులకరాళ్ళు కస కస మని అంటున్నాయి.

" సరే..ముసలాయన..గుడ్ లక్ మరి  " అన్నాడు కుర్రవాడు.

" గుడ్ లక్" బదులు గా చెప్పాడు ముసలాయన.అలా చెబుతూనే పడవ లోకి ఎక్కి తెడ్లను రెండు వేపు లా ఉన్న పిన్ ల మధ్య పెట్టి తాళ్ళను బిగించి కట్టుకున్నాడు.పడవ కి కింద ఉన్న  బ్లేడ్ ని పరిశీలించుకున్నాడు. అది  మెల్లిగా శబ్దం చేస్తుండ గా పడవ సముద్రపు నీటి పై ముందుకు వెళుతోంది.

మిగతా కొన్ని పడవ లు దగ్గర ఉన్న రేవు ల్లో బయలుదేరినవి....శబ్దాలు వినిపిస్తున్నాయి.ఇంకా సూర్యుడు పూర్తి గా బయటకి రాలేదు..సముద్రపు జలాల్లో వేసే తెడ్ల  చప్పుళ్ళు చిన్న గా వినబడుతున్నాయి. ఎక్కడో దూరంగా ..మనుషులు మాటాడుతున్న అలికిడి.రాత్రి కాపలా కాసి మిగిలిన చంద్రుడు దూరపు గుట్టల నుంచి కిందికి దిగుతున్నాడు.ఒక్కొక్కళ్ళు ఒక్కో దిక్కు కి పోతున్నారేమో,కాసేపటికి ఆ శబ్దాలన్నీ ఆగిపోయినాయి.

తను సముద్రం లో చాలా దూరం పోవాలిప్పుడు.అది తనకి తెలుసు.అలా సముద్రం లో పోతూనే ఉన్నాడు..క్రమేపి నేల అంతర్ధానమయింది.ఎటు చూసినా ఇప్పుడు సముద్రమే.ఆ నేల వాసన తన ముక్కు పుటాలకి కూడా ఇప్పుడు అందటం లేదు.హాయిగా ఉన్నది.తెలతెలవారుతోంది..సముద్రపు వాసన తో ఉదయిస్తున్నాడు సూర్యుడు.

అక్కడక్కడ ఆ సముద్రపు నీళ్ళ మీద తెమడలు గట్టినట్లు నాచు వంటి పదార్థాలు.వాటిని చూస్తూనే ముందుకు నడుపుతున్నాడు పడవని.కాసేపు ఉన్నాక గుర్తు వచ్చింది..ఇప్పుడు తన పడవ   ఎక్కడ ఉందో గుర్తించాడు...ఈ సముద్రం లో పెద్ద బావి అని  జాలరులు పిలిచే ఒక లోతైన ప్రదేశం మీద తను పడవ లో పోతున్నాడు.దీని లోతు చెప్పాలంటే 4200 అడుగులకి పైబడే ఉంటుంది.ఇక్కడ రకరకాల చేపలు సమాయాత్తమై కింది నుంచి పై దాకా అలా ఈదుతూ విహరిస్తుంటాయి.Squids అనే చేపలు మందలకి  మందలు అలా ఒక్కోసారి పైకి వచ్చిన రాత్రి వేళ లో అక్కడే పొంచి ఉండే పెద్ద చేపలు వీటిని ఆరగిస్తుంటాయి.


ఉన్నట్లుండి హిస్ మని ఒక శబ్దం వచ్చింది.ఎగిరి ఒక చేప దాని మొప్పల తో పడవ ని తాకినట్లయింది. కనీ కనపడని వెలుతురు.ఈ ఎగిరే చేపలు అంటే తనకి చాలా ఇష్టం.మానవునికి మిత్రులు వంటివి అవి.ముఖ్యంగా సముద్రం పై వెళ్ళే వారికి.సముద్రం పక్షుల పట్ల కౄరమైనదే.చేపల్ని పట్టాలని తిప్పలు పడుతుంటాయి గాని అంత ఈజీ కాదు.నీళ్ళ లో మునుగు కుంటూ,వేదన గా అరుచుకుంటూ ఏవో వాటి కష్టం అవి పడుతుంటాయి.
                              5

తన సముద్రాన్ని ఎప్పుడూ స్త్రీ గా నే భావిస్తాడు.అంటే స్పానిష్ భాష లో la mar అన్నట్లుగా ..వాళ్ళకి ప్రేమ కలిగినపుడు ..!అయితే కొన్ని చెడు మాటలు కూడా అంటుంటారు...ఆ ప్రేమించే వాళ్ళు..!ఖరీదైన మోటార్ బోట్ లను కొని సముద్రం పై షికారు చేసే యువ జాలరులు,వాళ్ళకి మంచి షార్క్ లు పడి ,వాటి లివర్ లని మాంచి రేటు కి అమ్మినపుడు ..అపుడు మాత్రం సముద్రాన్ని వాళ్ళు el mar అని పులింగం తో పిలుస్తారు.వారికి సముద్రం ఓ పోటి దారు గానో ,ఒక్కో మారు శత్రువు గానో  కబడుతుంది.

ఆ ముసలాయనకి మాత్రం స్త్రీ వంటిదే..తన కోసం ఎన్నో కడుపు లో న్నదాచుకున్న వనిత. అప్పుడప్పుడు సముద్రం భయాయానకంగా  మారురుంది.ఎక్కడ లేని విధ్వంసం చేస్తుంది.అయితే అదంతా ఆ చంద్రుడు ఈ కడలి పై చూపే ప్రభావమే.

సరే..సముద్రం ఇప్పుడు ప్రశాంతం గా ఉంది. తన పడవ ని  పెద్ద ప్రయాస లేకుండానే అలల పై చిన్న గా పోనిస్తున్నాడు.ఒక రకంగా దానికదే కదులుతున్నట్లే లెక్క.అనుకున్న దానికంటే ముందు గానే,చాలా లోపలకి వచ్చినట్లే చెప్పాలి.

ఆ లోతుగా ఉన్న బావులు అని పిలువబడే ప్రదేశం లో ఓ వారం రోజులు పాటు ప్రయత్నించాను.ఏం దొరికింది...ఏమి లేదు..ఈ రోజు నేను ఇంకా ఇంకా లోపలకి పోతాను.Bonita,Albacore వంటి చేపలు ఉండే చోటకి ..బహుశా..ఒక పెద్ద చేప తనకి దొరకవచ్చు..చూద్దాము ఇలా అనుకుంటూ సాగుతున్నాడు.

ప్రవాహ గతి తో పడవ ముందుకి పోతుండగానే గేలాలకి ఎరలు గా  కట్టే చేపల్ని బయట కి తీశాడు ముసలాయన.ఇంచుమించు 240 అడుగులు లోతుకి ఉండే లా ఒక చేపని,450 అడుగుల లోతు కి ఉండేలా మరో చేపని ఇంకా మూడవ,నాల్గవ చేపల్ని ఇంకా లోతుకి ఉండేలా గేలాలకి కట్టి సముద్రం లోకి దింపాడు.ఆ పడవ కి పక్కన ఉండే హుక్ ల నుండి అవి వేలాడుతున్నాయి.ప్రతి చేప యొక్క తల కిందికి ఉండేలా కట్టాడు.వాటి తో పాటు అదనన్ గా తెచ్చిన ఫ్రెష్ గా ఉన్న సార్డైన్ చేపల్ని గుచ్చాడు..ఒక పూల మాల వలె అమర్చాడు..ఒక వేళ ఏ పెద్ద చేప దగ్గరకి వచ్చినా వీటన్నిటిలో ఏది రుచి లేనిది,ఏది తాజాది అంత తొందర గా పసిగట్టలేదు..ఎందుకంటే అన్నీ కలిసి ఉండటం వల్ల కంఫ్యూజన్ ఏర్పడుతుంది.

ఇంకో వేపుకి ఉన్న గేలాలకి ఆ కుర్ర వాడు ఇచ్చిన టున ఇంకా అల్బకర్ చేపల్ని కట్టాడు.గతం లో బ్లూ రన్నర్,ఎల్లో జాక్ లాంటి వాటిని కట్టే వాడు.మంచి వాసన తో తాజా గా ఉన్నాయి.మొత్తానికి సర్దడం పూర్తి అయింది.ఏ మాత్రం ఈ ఎరల్ని తిండానికి ఏ చేప వచ్చి కొరికినా పైన ఉండే ఒక పుల్ల ఊగూతూ సంకేతం ఇస్తుంది.

ప్రతి గేలం 1440 అడుగుల లోతు దాకా పోతుంది.అవసరమైతే దానికి జోడించడానికి అదనపు తాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి.1800 అడుగుల లోతున పడ్డ చేపనైన తీసుకు రావచ్చు..అంత సరంజామా ఉంది.పడవ మెల్లగా పోతున్నది.పైన తేలుతున్న గేలానికి గల పుల్లలు పైపైనే మునుగుతూ తేలుతూ ఉన్నాయి.గేలాలు సర్దుబాటు అయ్యే లా  పడవ ని కొద్దిగా అటూ ఇటూ పోనిచ్చాడు.

ఇపుడు..వెలుతురు మెరుగ్గా ఉంది.ఏ నిమిషానైనా సూర్యుడు ఉదయించవచ్చును.అదిగో ..కిరణాలు అప్పుడే  విస్తరిస్తున్నాయి.ఇపుడు సముద్రం మీద ముందుకు పోతున్న మిగతా పడవలు దూరంగా కనిపిస్తున్నాయి.అవి అన్నీ తన పడవ కంటే వెనకే ఉన్నాయి.ప్రవాహం పై ఊగుతూ వస్తున్నాయి.కాసేపటకి కిరణాలు తమ తీవ్రతని పెంచాయి.అవి సముద్రపు నీళ్ళ పై బడి రిఫ్లెక్ట్ అయి  ముసలాయన కంటికి ఇబ్బంది కలిగిస్తున్నాయి.కళ్ళని మరో వైపు తిప్పుకున్నాడు.ముఖ్యంగా పొద్దుటి పూటే ఇలా అనిపిస్తుంది..ఆ సమయం దాటితే మళ్ళీ బాగా నే ఉంటుంది.నీళ్ళ లోకి పరిశీలన గా చూశాడు.గేలాలు బాగా నే ఉన్నాయి..మళ్ళీ సదిరాడు వాటిని.ఏదైనా పెద్ద చేప ఈదుతూ ఈ ఎరలకి చిక్కకపోతుందా అనేమో..!


ఒక్కోసారి చేప 360 అడుగుల లోతు లో కొట్టుకుంటుంటే ,అది600 అడుగుల లోతున కొట్టుకున్న విధంగా అనిపిస్తుంది.ప్రతి రోజు ఒక కొత్త రోజే.ఈ రోజు ఒక మంచి రోజు కావచ్చు గదా.అదృష్టం కలసి రావాలి ..అది దగ్గర కి వచ్చినప్పుడు మనిషి కూడా అందుకోడానికి సిద్ధంగా ఉండాలి.సూర్యుడు ఉదయించి రెండు గంటలు అయింది.ఇపుడు కిరణాలు కంటిని బాధించడం లేదు.దూరంగా మూడు పడవలు వస్తోన్న జాడ కనిపిస్తొంది.

అప్పుడే ఒక పక్షి తన తల పైన అంత ఎత్తున చక్కర్లు కొట్టడం గమనించాడు.దాని రెక్కలు నల్ల గా పెద్ద గా ఉన్నాయి.అది ఉన్నట్టుండి తనకి తగలాలని కిందికి చటుక్కున రాగా ముసలాయన ఒడుపు గా వొంగి దాన్ని తప్పించుకున్నాడు.అయినా ఆగడం లేదు.అది అలానే ఒకటే చక్కర్లు కొడుతూనే ఉంది..గాలి లో..!

" వాడు ఉట్టి గానే చూడడం లేదక్కడ..ఏదో విషయం ఉండే ఉంటుంది..ఏమిట్రా అది" ముసలాయన గట్టి గా అరిచాడు

స్థిమితంగా ,చిన్నగా ఆ పక్షి నే అనుసరిస్తూ తన పడవని ముందుకు పోనిస్తున్నాడు.ఉన్నట్లుండి ఆ పక్షి రెక్కల్ని కదపకుండానే ఝామ్మంటూ నీటి వేపు కి వేగంగా దిగింది.ఇంతలోనే ఓ ఎగిరే చేప నీటి లోనుంచి తటాలున పైకి లేచి మళ్ళీ నీళ్ళ లోకి డైవ్ చేసింది.

" ఏయ్ ..డాల్ఫిన్..చాలా పెద్ద డాల్ఫిన్" ముసలాయన గట్టి గా అరిచాడు.

పడవ లో ఉన్న ఇంకో గేలం తీసి దానికి ఎర ని కట్టాడు..దాన్ని పడవ కి ఓ వైపున కిందకంటా పోనిచ్చి పై భాగాన్ని రింగ్ బోల్ట్ కి కట్టాడు.మళ్ళీ ఇంకో ఎరని ఇంకో గేలానికి తగిలించి పడవకి ఆ వంపు లో అలానే పెట్టాడు.యధాప్రకారం తను వెనక్కి వెళ్ళి కూర్చొని పడవని పోనిస్తున్నాడు.ఇంతకీ ఆ పక్షి ఎక్కడబ్బా అని చూస్తే..అదెక్కడకి పోయిందని..ఆకాశం లో కాదు గాని ఈసారి ..సముద్రం నీటి మీదనే ఏ చేపనో పట్టాలని తిప్పలు పడుతోంది.ఆ పక్షి నీటి లో మునుగుతూ తేలుతూ ఎగిరే చేపని అనుసరిస్తున్నది.నీటి లో ఉబ్బినట్లయింది.పైకి లేచింది డాల్ఫిన్.మళ్ళీ మునిగింది.అదీ ఆ చేప నే తరుముతున్నట్లు గా ఉంది.ఆ చేపకి ఇక నూకలు చెల్లినట్లే ..ఈ రెండు జీవాల పుణ్యమా అని.చూడబోతే లోపల డాల్ఫిన్ ల గుంపు ఉన్నట్లు గానే ఉంది.ఇలా యోచిస్తూ ముసలాయన సాగిపోతున్నాడు.

ఆ ఎగిరే చేప చాలా వేగంగా ఈదుతాయి.అది ఒక్కటి దొరికినా పెద్ద విషయమే.ఉన్నట్టుండి చేప మళ్ళీ పైకి వచ్చి కిందికి పోయింది.. అలా చేస్తూనే ఉన్నదది.దీని జతగాళ్ళు ముందు గానే వెళ్ళిపొయి ఉంటాయి.ఆ పక్షికి కూడా అదృష్టం చిక్కడం లేదు.తనకి ఏ ఒక్కటైనా దొరకదా ఇక్కడ..ఎక్కడో ఉండే ఉంటుంది తనకి దొరకబొయేది.

దూరంగా ఎక్కడో ఉన్న తీరం వైపు చూస్తే మబ్బులు దట్టంగా అల్లుకొని పెద్ద పర్వతాల మాదిరి గా అగుపిస్తున్నాయి.సముద్రం నీళ్ళు బాగా నీలం రంగు లో కనిపిస్తున్నాయి.సూర్య కాంతి నీటి మీద పడి వింత శోభ గొలుపుతున్నది.అక్కడక్కడ Plankton తేలియాడుతున్నది.అంటే దరి దాపు లో చేపలు ఉన్నట్లే.ఇపుడు పక్షి ఎక్కడున్నదా అని చూస్తే ఎక్కడా కనిపించలేదు.నీటి పై భాగం ప్రశాంతం గా ఉంది.పసుపు రంగు లో తెట్టెలు తెట్టెలుగా తేలియాడుతున్న పదార్ధం..సర్గోసా మొక్కలు ..పిచ్చి పిచ్చిగా ఉన్నాయి.తన పడవ వాటి పక్కనుంచే పోతున్నది.మధ్య లోకి  వెళ్ళి ఆ తేలియాడే  పదార్థాల్ని చీల్చుకుంటూ పోతున్నది పడవ..బుడగలు కట్టి చికాకు గా ఉంది అక్కడి యవారమంతా...

" Agua mala (You Whore) " అని గట్టిగా తిట్టాడు ముసలాయన.అలా అంటూనే తెడ్ల మీదికి వంగి కిందికి పరిశీలనగా చూశాడు.తన అనుమానం నిజమే.ఇది ఆ విషపు చేప నే.ఈ బుడగల చేస్తూ ఇలాంటి చోట్లనే ఉంటుది ఇది.రంగుని సైతం అనుకూలం గా మార్చుకుంటుంది.భయంకరమైన విషం గల చేప.ఒక్కోసారి వేట లో దొరికినపుడు చేతికి రక్షణ తీసుకొని వీటిని ఏరివేడం చేస్తాడు..ఈ చేప విషం చాలా వేగంగా పనిచేస్తుంది మనిషి మీద.
                                6

సముద్రపు నీళ్ళ లో తేలియాడుతూ ఆ రంగు రంగు ల బుడగలు అందం గా కనిపిస్తున్నాయి.కాని అందం గా కనిపించేవి అన్ని మంచివి అని కాదు గదా..ఇవీ అంతే..!అయితే ఒకటి,సముద్రం లో తిరిగే పెద్ద తాబేళ్ళు వీటి లో గల పదార్థాల్ని తింటూ ఉంటాయి.చక్కగా కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ..ఆనక వాటి కవచాల్లోకి ముడుచుకొని నిద్రోతుంటాయి.ఆ ముసలాయనకి ఆ తాబేళ్ళు తినే తీరు ముచ్చట గొలుపుతుంది.

పెద్ద తుఫాను వచ్చి వెలిసిపోయిన తర్వాత ఇవి సముద్రపు ఒడ్డున నిర్జీవంగా పడి ఉంటాయి ఒక్కోసారి.వాటి పెంకుల మీద నుంచి నడుస్తూంటే పట పట మని విరిగిన శబ్దం వస్తుంది.అది ఒక గమ్మత్తు గా ఉంటుంది.పచ్చ రకం తాబేళ్ళు ఇంకా Hawks-bills రకం తాబేళ్ళు చూడటానికి బాగుంటాయి.మంచి వేగంగా ఈదుతాయి.వాటిని చూస్తే స్నేహపూర్వకమైన శత్రుత్వం...మెదులుతుంది.ఆ పెంకు లోకి తలని ముడుచుకోవడం అనే కాదు వాటి ప్రణయమూ ఒక వింతే.చక్కగా కళ్ళు మూసుకొని Portugese men-of war అని పిలువ బడే నాచు వంటి పదార్ధాన్ని ఆరగిస్తున్నాయి.

చాలానాళ్ళు తాబేళ్ళు వేటాడే పడవల్లో కూడా వెళ్ళి ఉన్నాడు.ఒక్కో తాబేలు టన్ను బరువు అయినా ఉంటుంది.తాబేళ్ళ పట్ల చాలామంది కృరంగా వ్యవహరిస్తుంటారు.దాని గుండెని కోసిన తర్వాత కూడా అది కొట్టుకుంటూనే ఉంటుంది.నా గుండె కూడా అలాంటిదే.అదనే కాదు కాళ్ళు చేతులు కూడా అలాంటివే.అనుకున్నాడు ముసలాయన.మే నెల నుండి తాను తెల్ల గుడ్లు తినడం మొదలెడతాడు.అవి వంటికి బలాన్ని ఇస్తాయి.సెప్టెంబర్,అక్టోబర్ మాసాల్లో చేసే షికారు కి జవాన్ని చేకూర్చుతాయి.
జాలరులు వారి పనిముట్లని పెట్టుకొనే షెడ్డు లో షార్క్ నుంచి తీసిన లివర్ ఆయిల్ ని ఓ డ్రమ్ము లో పోసి పెడతారు.తాను రోజు ఓ కప్పు ఆయిల్ ని తాగుతాడు.కొంతమంది దాని వాసన బాగోదు అంటారు కాని తను అది సరకు చేయడు.ఆ ఆయిల్ జలుబు గిలుబులకి ఇంకా కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని  తన నమ్మకం.

ఉన్నట్టుండి ఓ సారి ఆకాశం వైపు చూశాడు.ఆ పక్షి మళ్ళీ కనిపించింది..చక్కర్లు కొడుతున్నది పైన..!" మొత్తానికి వాడికీ ఓ చేప దొరికింది" గట్టి గా అరిచాడు ముసలాయన.ఇది వరకు కనిపించిన ఎగిరే చేప ఇప్పుడు కనబడలేదు.గేలానికి కట్టబడిన ఎర చేపలు మామూలు గా నే ఉన్నట్లున్నాయి.ఏది ఇంకా పట్టుకున్న జాడ లేదు.కాసేపుండి చూస్తే ఓ చిన్న Tuna రకం చేప నీళ్ళ లోనుంచి పైకి ఎగురుతూ ,మునుగుతూ ముందుకు సాగుతున్నది.ఒక దిశ అని లేదు.దానిష్టం వచ్చినట్లు ఎగురుతున్నది.కిరణాలు తగిలి వెండి మాదిరి గా మెరుస్తోంది.అది బహుశా ఎర గా కట్టిన చేపల వెంట పడాలని ఏమో..!

ఆ చేపలు చాలానే కనిపిస్తున్నాయిప్పుడు..మందలు గా సాగుతున్నాయి.అన్నీ తెల్లగా అనిపిస్తున్నాయి.ఆ పక్షి మళ్ళీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది.నీళ్ళని తాకుతూ, గాలి లో లేస్తూ సాగుతున్నది.ఈ పిట్ట కూడా నాకు సాయం గానే ఉంది.అనుకున్నాడు ముసలాయన.కాలి దగ్గర గా ఉన్న గేలాన్ని ఏదో లాగినట్లు తోచింది.తెడ్లు వేయడం ఆపాడు.తన చేతి తో ఆ గేలాన్ని పట్టుకొని దాని బరువు ని అంచనా వేయడానికి ప్రయత్నించాడు.చిన్న బరువు తోచింది.ఆ Tuna చేప నా ..? గేలపు తాడు ని ఊపినప్పుడు ఒక ప్రకంపనం లాంటిది కింద  జరుగుతున్నది.ఉన్నట్లుండి ఒక చేప భాగం నీళ్ళ పైన ఆడినట్లు అనిపించింది.మళ్ళీ నీటి లో మునిగిపోయి అగుపడటం లేదు.దాని మొప్పలు ..ఇరు వేపు లా బాగున్నాయి.అయితే పూర్తి గా కనబడలేదు.ఆ పడవ దరి నుంచే లోపలికి మునిగిపోయింది.
పడవ వెనక భాగానికి వెళ్ళి వెల్లకిలా పడుకున్నాడు.మళ్ళీ ఒక వేగవంతమైన ప్రకంపన తన పడవ ని తాకింది.ఓ పెద్ద చేప దాని తోక ని వేగంగా కదిపినప్పుడు అయ్యే అలజడి అది.కిందికి ఒంగి దాని తల మీద సరదా గా అన్నట్లు గా ఒక దెబ్బ వేశాడు.అతని వొళ్ళు వణికినట్లు అయింది. ఇది  Albacore రకం చేప అనుకుంటా..దాదాపు పది పౌండ్ల బరువు ఉంటుంది..ఎర గా కట్టడానికి బాగుంటుంది అనుకున్నాడు.

అవును..ఇప్పుడు తన తో తానే  గట్టి గానే మాట్లాడుకుంటున్నాడు.ఈ చర్య ఎప్పుడు మొదలయింది..గుర్తు రావడం లేదు.కొన్ని సార్లు రాత్రుళ్ళు పడవ మీద ఒంటరి గా ఉన్నప్పుడు పాటలు కూడా గట్టి గా పాడుకుంటుంటాడు.కుర్ర వాడి తో కలిసి షికారు చేసేప్పుడు మాత్రం కొద్ది గా మాట్లాడేవాడు..ముఖ్యంగా వాతావరణం బాగో లేనప్పుడు...  సముద్రం మీద ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడడం అంత పద్ధతి గాదు అని ముసలాయన అభిప్రాయం.మరి ఇప్పుడు తాను అన్నీ బయటకే వాగేస్తున్నాడు.అవును లే ఇక్కడ వినే వాళ్ళు ఎవరని..బాధపడే వాళ్ళు ఎవరని ...!

ఈ విధంగా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే తనని పిచ్చి వాడు అనుకోవడం ఖాయం..ఆ ప్రమాదం ఉంది.అయినా నేను పిచ్చి వాణ్ణి కానుగా,అలాంటప్పుడు ఎవరు ఏమని అనుకుంటే నాకేంటి ..అలా సముదాయించుకున్నాడు.కాస్త డబ్బున్న వాళ్ళు రేడియోలు ఉన్న మంచి బోట్లు వేసుకొని వస్తారు కాలక్షేపానికి..అయినా అవన్నీ ఆలోచించడానికి అంత సమయం లేదిప్పుడు.తాను ఎందుకు పుట్టాడో ఆ పని చూసుకోవడమే తన కర్తవ్యం.ఈ చుట్టు పక్క ల ఓ పెద్ద చేప ఉండే ఉండాలి.కొన్ని సంగతులు ఇవేళ వేగంగానే జరుగుతున్నాయి.ఈశాన్య దిక్కు కి వేగంగా వెళుతోంది పడవ..అలానే అనిపిస్తోంది..ఇది వాతావరణ జాలమా..ఇంకొకటా..?

తీరం వైపు చూస్తే ఇదివరకు లా లేదు.పర్వతాల మీద మేఘాలు టోపీలు మాదిరి గా ఉన్నాయి.సూర్యుని కిరణాలు నీటి మీద పడి మిల మిల మెరుస్తున్నాయి.గేలాలు ఉన్న తాళ్ళని చూసుకున్నాడు.కిందికి స్థిరంగా ఉన్నాయి చాలా లోతున.Tuna చేపల్లో చాలా రకాలు ఉన్నాయి..అయితే గుండు గుత్త గా ఆ ఒక్క పేరు తోనే పిలుస్తుంటారు.వేడి బాగా నే ఉంది.ముసలాయన మెడ వెనుక నుంచి చెమట చుక్కలు దారలు గా కారుతున్నాయి.కాసేపు నిద్ర పోతే బాగుండు అనిపించింది.గేలం తాడు ఒకదాన్ని కాలి కి కట్టుకొనికొద్ది గా ఒరుగుదాం అనుకున్నాడు.ఈ రోజు కి 85 రోజులు.ఏమైనా ఓ మంచి షికారు చేయాల్సిందే అనుకున్నాడు.


అలా అనుకుంటూ ఉండగా కర్ర పుల్ల ఉన్నట్లుండి వేగంగా మునిగి లేచింది. " ఔనోను..ఇది..అదే..! " అంటూ ఆ గేలపు తాటి ని బొటన వేలు,చూపుడు వేలు మధ్య లోనుంచి లాగుతూ మళ్ళీ చూశాడు.బరువు లా తోచ లేదు.తాడు ని అలాగే పట్టుకున్నాడు.మళ్ళీ ఏదో వచ్చి లాగిన అనుభూతి...మళ్ళీ ఉన్నట్టుండి గట్టి ఊపు లా ఊపింది కిందన.ఆహా..ఇది ఖచ్చితంగా...అదే..దాని పనే..ఇంచు మించు ఆరు వందల అడుగుల లోతున Marlin అనబడే ఆ చేపయే.. అది ఎరలు గా కట్టిన Sardines చేపల్ని తింటూనదన్నమాట అనుకున్నాడు ముసలాయన.
                              7

గేలం తాడు ని అలాగే ఎడం చేతి తో పట్టుకొని నీటి లోకి చూస్తుండగా మళ్ళీ లోపల కదిలినట్టు గా తోచింది.ఇంకా అదనంగా ఉన్న తాడు ని నీటి లోపలకి స్థిరంగా పంపుతున్నాడు.ఆ చేప కూడా కంగారు పడకూడదు గా ...అందుకనే అతని చేతి వేళ్ళ సాయం తో తాటి ని వదులుతున్నాడు.

" తిను చేప..బాగా తిను..ఆ ఎరలు గా కట్టిన బుల్లి చేపాల్ని బాగా తిను..ఆ సముద్రం నీటి లో..ఆ చీకటి లో..ఆరువందల అడుగుల లోతున ఉన్నట్లున్నావు.. తాజా గా ఉన్నాయి అవి..మళ్ళీ అటు తిరుగు ఓసారి..అలాగే లాగిస్తుండు.." ముసలాయన అలా బిగ్గరగా  నే మాట్లాడుతున్నాడు.

లోపల నుంచి ఈ సారి ఒక గట్టి ఊపు తగిలింది.బహుశా ఎరల్ని పీక్కొని తిండం లో కష్టం గా ఫీలవుతుందేమో..ఆ గేలపు హుక్ లో ఉండే వాటిని పీక్కొని తినడం అంత ఈజీ కాదు..బాగానే లాగాలి..కాసేపు ఆగినాక చలనం ఆగిపోయింది.

" ఏయ్ చేపా..రా..రా..కాస్త తిరుగు ఇటు..అటేపు టున రకం చేపలు కూడా ఉన్నాయి.వాటిని కూడా వాసన చూడు మరి.సిగ్గుపడకుండా తిను." చేపని ఉద్దేశించి తను అలా మాటాడుతూనేఉన్నాడు.అదే సమయం లో బొటన వేలు,చూపుడు వేలు మధ్య నుంచి గేలపు తాడు ని పట్టుకొని వేచి చూస్తున్నాడు అలానే.మళ్ళీ ఒక చిన్న ఊపు లోపలనుంచి.

" ఆ చేప కి హుక్ బాగా నే తగులుకొని ఉండవచ్చు.దేవుడా..దాన్ని ఆ దిశ గా పోనీ....అది ఎటూ పోకుండా ..ఓ తిరుగులు తిరుగు తోంది.బహుశా అది గతం లో ఏదో గేలానికి చిక్కి బయటపడిన రకం అనుకుంటా.పాత అనుభవాలు గుర్తుకి వస్తున్నాయ్ అనుకుంటా.."
" అంతలోనే తాడు కదిలినట్లు అయింది.కాసేపు బాగా బరువు  ఉన్నట్లు గాను,కాసేపు తక్కువ బరువు ఉన్నట్లు గాను అనిపిస్తోంది.చేతి వేళ్ళ మధ్య నుంచి తాడు ని వదులుతున్నాడు.బాగా ప్రెషర్  పడుతోంది." ఏమి చేపరా  బాబు ఇది , గేలపు హుక్కులు బాగానే గుచ్చుకొని ఉన్నాయేమో. మళ్ళీ ఓసారి రౌండ్ వెయ్యి .  తిరుగులు తిరుగుతున్నావు  లోపట..బరువు బాగా నే ఉన్నట్లుంది."

ఇంకా కొంచెం తాడు వదిలాడు.మంచి గా తిననివ్వాలి.దానికి సౌకర్యం గా ఉండాలి.ఇంకా తాడు ఉంది..భయం లేదు." నువ్వు బాగా తింటేనే ఆ  హుక్ లు బాగా నీ నోటి లోకి పోతాయి.  తిను ఇంకా తిను.. బాగా తిను,అప్పుడు ఈజీ గా పైకి లాగవచ్చు..బయటకి వచ్చినాక నా హార్పున్ తో నీ పని బడతా ..సరేనా ...తయారా..  " ముసలాయన గొణుగుతూ అన్నాడు తాడు ని చేతి నుంచి చేతి కి మార్చుకుంటూ.. !

చేప బరువు అంచనా వేసుకుంటూ ..తనలో తాను మాట్లాడుకుంటూనే ఉన్నాడు.చేప మళ్ళీ కదిలినట్లయింది. వెంటనే తాడు ని లేపలేదు. ఆ తాడు బలం గా నే ఉంది. ఎంత చేపనైన లాగేస్తుంది.  హిస్ స్స్స్ ...అనే శబ్దం రాసాగింది.బలం కొద్దీ తాడుని పట్టుకొని ఉన్నాడు ముసలాయన.పడవ కాసేపటి తర్వత వాయవ్యం వేపు తిరుగసాగింది. కాసేపటికి నీళ్ళ లో కి ఒక శక్తి ప్రవహించింది.ఆ చేప స్థిరం గా లోపలే ప్రయాణం చేస్తోంది.

" ఇప్పుడు కనక ఆ కుర్రవాడు ఉంటే బాగుండును" ముసలాయన అనుకున్నాడు. ఈ చేప ఏదో గాని గట్టి రకం లానే ఉంది.నన్నే తోసినంత పని చేస్తోంది.అయినా నేను వదులుతానా..చేతనైతే దాన్నే ముక్కలు చేయనీ ఈ తాడుని... చిత్రం ఏమిటంటే మరీ లోపలకి పోవడం లేదు.అంత వరకు సంతోషం దేవుడా..!

అదే గనక ఇంకా సమ్ముద్రం లోపలకి పోవాలనుకుంటే తాను చేయగలిగేది ఏమి లేదు.ఆ విధంగా శబ్దాలు చేస్తూ,చస్తే నేను ఏం చేయగలను..కొన్ని పనులు చేయాలిప్పుడు...తాడు ని లోపలకి వదిలాడా దాన్ని గట్టిగా పట్టుకోడానికి తంటాలు పడాల్సి వస్తోంది.పడవ కింద నుంచి ఆ చేప చేసే చికాకు కి ..పడవ కూడా వొంపు తిరిగిపోతోంది.ఆగడం లేదు." ఏమిటి ..ఇది గాని నన్ను చంపుతుందా..?లేదు ..అది జరగని పని" మళ్ళీ తనే సముదాయించుకున్నాడు.

నాలుగు గంటలు గడిచాయి.నీటికి పై భాగం లోనే ఈదుతున్నది..అయితే చేప దాని పూర్తి స్వరూపాన్ని చూపించడం లేదు.పడవ ని వొంపడానికి తెగ ప్రత్నిస్తున్నది..తాడు ని గట్టి గా   తన వీపు కి కట్టుకున్నాడు.

" దాదాపు మధ్యానం అనుకుంటా..ఈ చేప గేలానికి గల హుక్ కి చిక్కుకున్నది గాని  మొహం మాత్రం కనబడనీయట్లేదు.గట్టిదే. ఈ చేప చిక్కడానికి ముందర మాట ..టోపీని నుదురు మీదికి లాక్కొని పెట్టుకున్నాడు.బాగా చెమట పట్టి అది నుదురు మీదికి జారి చిట పట లాడుతోంది.


దాహం గా అనిపించింది.తాడు మీద మోకాలు ఆనించకుండా జాగ్రత్త గా పాకి..పడవ ముందు భాగం లో ఉన్న బాటిల్ ని తీసుకొని కొన్ని నీళ్ళు తాగాడు.అలసట గా అనిపించి అలానే కొద్ది గా ఒరిగాడు..కొద్దిగా రెస్ట్ తీసుకుందామని...పడుకుని అలాగే తల వైపు వెనుక భాగం లో చూశాడు.నేల భాగం అసలు కనబడటం లేదు.ఇంకా రెండు గంటలు గడిస్తే సూర్యుడు కూడా అస్తమిస్తాడు.ఈ లోపులోనే తాను వెళ్ళిపోవాలి.వీలవుతుందో లేదో.పోనీ చంద్రుడు వచ్చే వేళ కైనా బటపడాలి.అదీ వీలు కాకపోతే రేపు పొద్దుట కి కూడా అవుతుందేమో..ఎంతైనా గానీ..నాకైతే బాధ లేదు.ఆ చేప  నోట్లో హుక్ చిక్కుకొని ఉందిగా..అదే నిర్ణయించాలి..నేను వెళ్ళే వేళని..! ఆ వైరు కూడా దాని నోరు ని కట్టేసినట్లు చేసి ఉండవచ్చును..అందుకే గింజుకుంటున్నది...అసలు ఇంతకీ నాకు చిక్కిన ఈ చేప ఎలాంటిదో..అసలు ఓసారి అది నాకు కనిపిస్తే బాగుండును " అనుకున్నాడు ముసలాయన.
                               8

ముసలాయన పైన ఆకాశం లో చుక్కల్ని చూస్తూనే కింద నీళ్ళ లో ఆ చేప తిరుగుడి ని అంచనా వేస్తూనే ఉన్నాడు.అది దూరంగా వేరే దిక్కు కి వెళ్ళి పోవాలని కూడా ప్రయత్నించడం లేదు.అక్కడక్కడనే తనలాడుతున్నది.చీకటి పడింది,చల్లదనం ఆవరిస్తున్నది..వొంటికి పట్టిన చెమట ఆరిపోతున్నది.పడవ లో ఉన్న ఓ  బాక్స్ లో ఎర చేపల్ని దాస్తుంటాడు..దాని మీద ఉన్న వస్త్రం తో పగటి పూట ఒంటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ ఉంటాడు.ఇపుడు దాన్ని తన మెడ చుట్టూ కట్టుకొని ఇంకో కొసని పడవ కి ఒక మూలన కట్టాడు.కాబట్టి ఇపుడు కిందికి వంగి చూస్తున్నా ..కిందికి వెళ్ళే గేలపు తాడుకి కుషన్ లా ఉపయోగపడుతున్నది.పడవ కి ఓ చివరకి వెళ్ళి కిందికి నీళ్ళలోకి చూస్తున్నాడు.హాయిగా నే ఉన్నా..మరో వేపున ఓర్పు కూడా నశిస్తోంది.

లోన ఉన్న చేపని తాను చేయగలిగేది ఏమీ లేదు,అలానే అదీ తనని చేయ గలిగేదీ ఏమీ లేదు.అలాగని ఎంతసేపు ఈ ఎదురు చూపు..!పడవ లోనే నిలబడి లఘు శంక తీర్చుకున్నాడు.పైన ఉన్న చుక్కల్ని చూశాడు.గేలపు తాడు సముద్రపు నీళ్ళ లోకి నిటారు గా ఉంది.ఆ నక్షత్ర కాంతి లో..! కాసేపాగి పడవ కొద్ది గా అటు ఇటు ఊగినట్లుగా కదిలింది.దూరంగా ఎక్కడో హవానా నగరపు విద్యుత్ వెలుగులు మిణుకు మిణుకు మంటు..!ఆ కాంతి కనక కనుమరుగు అయితే పడవ తూర్పు వేపు సాగుతున్నట్లు లెక్క.

ఈ చేప ని చూస్తుంటే కొన్ని గంటలు పాటు ఇలానే ఉండేలా ఉంది.రేడియో గాని ఉంటే ..బేస్ బాల్ ఆట గురుంచి విని వివరాలు తెలుసుకునేవాడు.కాని లేదాయే.అయినా పిచ్చి గాని..నువు నీ పని గురుంచి ఆలోచించు...అవన్నీ ఇపుడు అవసరమా..తనని తాను తిట్టుకున్నాడు ముసలాయన.అంతలో గట్టి గా అరిచాడు" ఈ సమయం లో సాయం చేయడానికి ఆ కుర్రవాడు ఉంటే ఎంత బావుండేది" అని..!

అయినా ముసలితనం లో ఏ మనిషి ఒంటరి గా ఉండకూడదు.కాని తప్పదు మరి.
ఆ..ఇంకొకటి గుర్తుంచుకోవాలి.పొద్దున్నే కాసిన్ని టున రకం చేపల్ని తాను తినాలి.లేకపోతే ఒంట్లో శక్తి ఉండదు.గుర్తుంచుకో..తనకి తనే చెప్పుకున్నాడు.రాత్రి పూట గదా.దేని గొడవ దానిదే..ఈ నీళ్ళ లో కూడా...!రెండు Porpoise చేపలు తన పడవ సమీపం లో సరసాలాడుకుంటున్నాయి.ఆ చప్పుడు..ఆ మగ చేప ,ఆడ చేప చేసే సమాగమ సందడులు తాను గుర్తుపట్టగలడు.హ్మ్..అవీ మనుషులకి తోబుట్టువులు  వంటివే..ఆ ఎగిరే చేపలు మాదిరిగా...!

ఒక్క సారిగా నీటి లోపల ఉన్న ఆ పెను చేప గుర్తుకు వచ్చి విచారమనిపించింది. దాని వైఖరి వింత గానే ఉంది.దాని వయసు ఎంతో ఏమో..ఇలాంటి మొండి చేపని ఇంతవరకు చూడలేదు.పైకి ఎగిరి దూకడానికి కూడా ఆలోచిస్తున్నది.తెలివైనదే.. అలా బలంగా ఎగిరి తనని దెబ్బ తీయవచ్చును...అయితే అది అనేక మార్లు గాలాల్లో చిక్కుకొని తప్పించుకున్న రకం కాబోలును..!

ఇక్కడ పడవ మీద ఉన్నది ఒకే ఒక్క మనిషి అని దానికి ఏం తెలుసు...అంతే కాదు ఆ మనిషి ఒక ముసలి వాడు అని కూడా దానికి తెలియదనుకుంటా.తప్పకుండా అది ఒక పెద్ద చేప యే అయి ఉండాలి.మార్కెట్ లోకి పోతే దాని మాంసానికి ఎంత ధర వస్తుందో.. మంచి ధైర్యస్తుని లానే గేలానికి వచ్చి తగులుకుంది.. ఏ మాత్రం తొట్రిల్లకుండా తన పోరాటం కొనసాగిస్తున్నది.దానికి ఇంకా ఏమైనా ఇతర ఆలోచన ఉందా..లేదా నా లాగానే నిరాశ తో అలసిపోయిందా..!
                                   9
" ఆ కుర్రవాడు ఉన్నట్లయితే బాగుండు" గట్టిగానే అన్నాడు ముసలాయన.ఆ తర్వాత మెల్లగా వెళ్ళి పడవ ఒంపు భాగం లో కూర్చున్నాడు.అతని భుజం మీద నుంచి ఆ గేలపు తాడు సముద్రం లోకి వేలాడుతున్నది.లోపల ఆ చేప చేసే అలజడి అర్ధమవుతూనే ఉంది.ఏదైనా కానిమ్మని స్థిరంగా అలాగే భుజం మీద ఉంచుకున్నాడు దాన్ని.

ఆ చేపని ఎలగైనా బయటకి వచ్చేలా ఏదో ఒకటి చేయాలి.అన్ని మోసాలకి,బంధనాలకి దూరంగా ఎక్కడో ఆ సముద్రపు నీళ్ళ లోతు లో ఉండాలని అనుకుంటున్నదది.ఇప్పుడు ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది.ఇద్దరకీ తోడు వచ్చే వా ళ్ళు ఎవరూ లేరు.బహుశా ఈ వృత్తికి నేను పనికి రానా..లేదు..లేదు...ఈ జన్మకి నేను చేయగలిగే  పని ఇదే.కాసేపు ఆగు ఆ టున రకం చేప మాంసం తినాలి.అది గుర్తు పెట్టుకోవాలి.

కత్తి తీసుకొని మిగతా గేలపు తాళ్ళ ని కోయడం మొదలుపెట్టాడు.ఈ మిగులు అంతా కలిపి పెద్దవి గా చేసి పెట్టుకోవాలి.అవసరం పడితే పడవచ్చు.మొత్తానికి ఒక ఆరు తాళ్ళ ని రిజర్వ్ లో పెట్టుకున్నాడు.వీటన్నిటినీ ఉపయోగించి ఇంకో చేపని పట్టానే అనుకో...చ..ఇప్పుడు పడిన చేప తోనే సతమతం అవుతుంటే మళ్ళీ అదొకటా...అసలు ఇది మార్లిన్ రకమో,బ్రాడ్ బిల్ల్ రకమో,షార్క్ నో ..ఎవరకి తెలుసు..ముదు దీని పని కానివ్వాలి..! అలా అనుకుంటున్నాడు ముసలాయన.

"ఆ కుర్రవాడు ఉన్నట్లయితే బాగుండు" మళ్ళీ గట్టిగా అరిచాడు అతను.పిచ్చిగాని ఆ కుర్రాడు ఇప్పుడెలా వస్తాడు.ఏదైనా తాను ఒక్కడినే చేసుకోవాలి.రిజర్వ్ లో ఉన్న రెండు తాళ్ళని హుక్ కి తగిలించాడు.ఒక్కసారిగా చేప గట్టిగా విదిలించింది.దాని ప్రభావం గేలపు తాడు మీద పడి...సర్ మని బలం గా రాసుకొని మొకానికి కింద బలం గా తగిలి కంటి కింద కోసుకున్నట్లయి రక్తం కారింది..గాయం..కాసేపటికి గాయం ఎండినట్లయింది.

పడవ వొంపు లోనే ..అక్కడున్న చెక్క మీద విశ్రాంతి తీసుకుంటున్నట్లు గా ఒరిగాడు.అతని భుజం మీద గేలపు తాడు ని భద్రం గా పట్టుకున్నాడు.ఈ సారి మళ్ళీ కింది నుంచి బలమైన కుదుపు వచ్చింది.పడవ కదిలినట్లయింది.ఇలా ఎందుకు జరుగుతోంది..బహుశా ఆ గేలపు తాడు కి ఉన్న వైరు దాని వంటిని బలం గా చుట్టుకొని ఉంటుంది.దాని పరిస్థితి నా పరిస్థితి కన్నా  మెరుగు లా ఉన్నదా ...ఏమో..!అయితే పడవ ని ఎత్తేయడం దాని వల్ల కాదులే..!అది ఎంత పెద్దదైనా గాని ,నా దగ్గరున్న మిగులు తాడు తో దాన్ని అదుపు చేయగలను.

" ఏయ్ ..చేపా..గుర్తుపెట్టుకో...నేను చచ్చేంతవరకు నిన్ను వదలను" గట్టిగా అరిచి చెప్పాడు ముసలాయన.

ఎక్కడికి పోతుంది..అదీ నాతోనే ఉంటుంది...వాతావరణం చల్లగా ఉంది.సూర్యుడు ఇంకా పైకి రాలేదు.ఎంతసేపు అయితే అంత సేపు ఉంటా.అతని కుడి భుజం మీద ఉన్న గేలపు తాడు సముద్రం లోకి ఉన్నది..ఆ చేపని పట్టుకొని.ఉత్తరం వేపు కదులుతున్నట్లు ఉన్నదే అనుకున్నాడు.ఆ చేప ప్రవాహం తో పాటే కదులుతున్నది.అలసి ఉన్నదేమో.కాసేపు ఆగి చూస్తే తాడు కొద్ది గా ఒంగినట్లు కనిపించింది నీటి మీద.అంటే పైపైనే ఈదుతునట్లు ఉన్నది.అయితే దూకడం గాని చేస్తుందా...చేయక పోవచ్చు. సరే ..కానీ..దేవుడా ..దూకితే దూకనీ ...నా దగ్గర కావలసినంత తాడు ఉంది..అదుపు చేయగలను ...అనుకున్నాడు.

చేప మీద ఒత్తిడి పెంచితే ఎలా ఉంటుందో...అయితే మరీ పెద్ద గా ఊపితే ..దాని గాయం ఎక్కువై బయటకి  దూకి నన్ను తోసివేయవచ్చు... సరే పొద్దు గడుస్తున్నకొద్దీనాకు అనుకూలం గానే ఉంటుంది లే...నీళ్ళ మీద తెట్టు లా ఉంది పసుపు పచ్చని పదార్థం..ఆ Gulf weed రాత్రి పూట మెరిసినట్లు కాపడుతుంది.

" ఏయ్..చేప ..నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమ ఇంకా గౌరవమూనూ..అయితే ఈ రోజు ముగిసేలో గా నిన్ను వేటాడి తీరుతాను.."

ఇంతలోనే ఓ పక్షి ఎగురుకుంటూ  ...బహుశా ఉత్తర దిక్కు నుంచి ..వచ్చింది.చాలా కొద్ది ఎత్తు లోనే ఎగురుతున్నది.అదీ అలిసినట్టే ఉంది. పడవ కి ఓ చివరన కాసేపు కూర్చున్నది అది..మళ్ళీ ఏమి అనుకుందో...ముసలాయన తల దగ్గరకంటా ఎగురుతూ వచ్చి..పోయి..పొయి..ఆ గేలపు తాటి మీద వాలింది.అక్కడ హాయిగా ఉందేమో.

" ఏయ్..పిట్టా..నీ వయసు ఎంత..ఇదే నీ మొదట ప్రయాణమా ఏమిటి.." అడిగాడు ముసలాయన.ఏదో అర్ధమైనట్లు గా ఆ ముసలాయనకేసి చూసింది ఆ పిట్ట.ఆ తాడు ని అలాగే ఒడిసి పట్టుకుని కూర్చున్నాడా..ఇంకా దేన్ని పరీక్షించే ఓపిక లేదతనికి. ..అసలు ఈ పిట్టలన్నీ ఇలా ఎందుకు వస్తుంటాయో ...ఏ గద్దలు వంటివో వస్తే నీ పని హుళక్కే లే..నీకు చెప్పినా అర్ధం కాదు..కాలం గడుస్తుంటే నీకు తెలుస్తుందిలే.కాసేపు విశ్రాంతి తీసుకో ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికిపో...లేకపోతే ఓ పని చెయ్..నా ఇంటికి వచ్చి అక్కడే ఉండిపో...నీ ఇష్టమైతేనే లే....అయితే ఒకటి ఈ పడవ మీద నేను నిన్ను తీసుకు పోలేను..ఇక్కడ మరో మిత్రుడి తో పని లో ఉన్నాను " అలా ఆ పిట్ట తో పిచ్చాపాటి మాట్లాడ్తున్నాడు ముసలాయన.

ఉన్నట్లుండి ఆ చేప మళ్ళీ ఓ కుదుపు ఇచ్చింది..గట్టి గా పట్టుకోకపోయినట్లయితే ముందుకి పడేవాడే.కుడి చేత్ తో ఆ తాడు ని పట్టుకొని ఉన్నాడా..దాని ఊపు కి చేయికి గాయమై రక్తం కారింది.మొత్తానికి దానికీ లోపల ఏదో అయి ఉంటుంది.తాడు ని బాగా చూసి చేప కదలిక కోసం కిందికి చూడడానికి ప్రయత్నించాడు.ఆ తర్వాత...ఆ తాడు నే పట్టుకొని వెనక్కి విశ్రాంతి కోసమా అన్నట్లు ఒరిగాడు.చూడబోతే నా స్థితి నీది ఒకేలా ఉందే అనుకున్నాడు.


పక్షి ఉందా అని పైకి చూశాడు.తనకి తోడు అదేగా..ఇప్పుడు.అది కనిపించలా..!ఎగిరిపోయింది..ఏదైనా ఆ తీరం చేరేదాకా నీ ప్రయాణమూ కష్టమైనదేలే.. చ..ఈ పిట్ట ధ్యాస లో పడి చేప విషయం లో ఏమారుపాటు గా ఉన్నానేమిటి..ఈ చేప కుదుపుడు కి ఎలా గాయం అయిందో చూడు...లేదు ఇక మీదట నా పని  మీద నే దృష్టి పెట్టాలి.ఇంకొకటి ఆ టున రకం చేప మాంసం కొద్ది గా తినాలి..లేకుంటే సత్తువ ఉండదు..ఇలా సాగుతున్నాయి ఆలోచనలు అతనిలో..!  
                                  10

ఆ గేలపు తాడు ఉంది కదా..కింద నీళ్ళ లో చేప ని పట్టుకుని ఉన్నది..దాన్ని తన ఎడమ భుజం మీదికి మార్చుకున్నాడు ముసలాయన.సముద్రపు నీళ్ళ లోకి వొంగి చేతిని కడుక్కున్నాడు.చేతిని అలాగే నీటి లో ఉంచాడు.ఆ చేతికి అయిన గాయం..దాని వల్ల అయిన రక్తపు చారికలు ..వాటినే చూస్తున్నాడు.పడవ ఇంకా నీళ్ళు మెల్లగా కదులుతున్నాయి.

ఇపుడు ఆ చేప కాస్త శాంతం గా ఉంది 'అనుకున్నాడు.చేతిని అలాగే నీళ్ళ లో ఉంచాలనిపించింది.అయితే ఆ మాయదారి చేపని నమ్మడానికి లేదు.ఉన్నట్లుండి మళ్ళీ ఓ పెద్ద కుదుపు ఇస్తే...! చేతిని సూర్యుని కాంతికి అడ్డంగా పెట్టాడు..ఆకాశం  వేపు కి  చూస్తూ..! కాసేపటి క్రితమే గదా..లోపలనుంచి ఆ చేప ఇచ్చిన కుదుపు కి ఎడమ చేతికి గాయం అయింది.దీన్ని జాగ్రత్త గా చూసుకోవాలి.దీని తోనే గా తాను పనిచేయవలసింది.

ఇప్పుడు ..చేతి గాయం కొంత ఆరింది.తాను తీసుకొచ్చిన ఆ చేపల్ని తీసి కొసుకుని తినాలనిపించింది.మోకాళ్ళ మీద వంగి తాళ్ళ చుట్టల కింద ఉన్న చేపల్లోనుంచి ఒకటి లాగాడు.దాన్ని ఆరు ముక్కలుగా కోశాడు కత్తి తో.ఆ తర్వాత కత్తి ని తన పంట్లాము కేసి తుడుసుకున్నాడు.మాంసాన్ని చక్కగా తీసి వాటి అస్థికల్ని సముద్రం లో పారేశాడు.మొత్తం అంతా తినగలనా లేదా అనుకుంటూనే ఓ ముక్కని కత్తి తో గుచ్చి తీసుకున్నాడు.భుజం మీద ఉన్న తాడు ..మరో వేపు చికాకుగా అనిపించింది.

తన గాయపడ్డ చేతి కేసి చూస్తూ అన్నాడు...ఇలా చికాకు చేస్తే ఒరిగేది ఏమీ ఉండదు.ఆ..ఏమి చెయ్యి రా బాబు..అని..!నీళ్ళ లోకి చూశాడు..తాడు ఒంపు గా కదిలింది..సరే...కోసిన ఈ చేప ముక్క ని తిను..బలం వస్తుంది..ముఖ్యంగా చేతికి.నీ తప్పు ఏం లేదు..చాలాసేపు ఉండాలిగా ఈ పని మీద .. అలా తనలో మాట్లాడుకుంటూనే ఉన్నాడు.ఒక ముక్క ని నోట్లో వేసుకున్నాడు..చిన్నగా నమిలాడు.ఫర్వాలేదు అనిపించింది.ఇంకా బాగా తినాలి.లోపలికి అంటా ఇంకాలి.ఉప్పు గాని,నిమ్మ తొన గాని ఉంటే మరీ బాగుండేది.

" ఏయ్ ఓ నా చెయ్యి...ఇదంతా నీకోసమే..నీకు శక్తి చేకూర్చడానికే.." అన్నాడు.చెయ్యి కొద్దిగా బిగుసుకున్నట్లు అయింది.మిగతా చేప ముక్కల్ని కూడా తినేశాడు.దాని చర్మాన్ని,పనికి రాని వాటిని నీళ్ళ లోకి ఊసేశాడు.ఇది బాగా రక్తం పట్టిన చేప.డాల్ఫిన్ బదులు ఇది దొరికింది.అదే మంచిదయింది.బలానికి చాలా మంచిది.కాస్తా ఉప్పూ అదీ ఉంటే భలే ఉండేది. మిగతా వి అలా ఉండనీ..ఎణ్దిపోతాయో,కుళ్ళిపోతాయో వాటి ఇష్టం.నాకయితే ఆకలి తీరింది.సముద్రం లోపలి చేప అది శబ్దం చేయడం లేదు.ఇంకొంచెం తింటే..!

" ఏయ్..నా చెయ్యి...మంచి గా ఉండు,నీ కోసమే ఇదంతా తినేది.."తన గాయపడ్డ చేతికి మళ్ళీ చెప్పాడు.ఎలాగో మొత్తానికి అన్ని ముక్కలు లాగించాడు.మంచి గా సదురుకుని చెయ్యిని పట్లాం కి తుడుచుకున్నాడు.ఆ..సరేలే..కాసేపు కుడి చేతి తో తాడుని పట్టుకొని సంభాళించుతాను.గాయపడ్డ ఎడమ చెయ్యి..కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో అనునయించుకున్నాడు.

ఎడమ కాలిని బలమైఅన గేలపు తాటి మీద ఆంచి పెట్టాడు.వెనక్కి ఒరిగాడు..! " దేవుడే సాయం చేయాలి.ఇలాంటి సమయంలో..!ఈ సముద్రం లోని ఆ చేప తనని ఏమి చేయబోతున్నదో.."

ఇప్పటికైతే శబ్దం లేదు.దాని ప్రణాళిక ఏమిటో...దానిది సరే అసలు తన ప్రణాళిక ఏమిటి..అదా దాని సైజు ని బట్టి ఉంటుంది.ఈసారి గాని అది గాలి లో ఎగిరిందా..దానిని చంపుతా.. లోపలే ఉండి పితలాటకం చేస్తొంది.సరే దానితో పాటు నేనూ వేచి ఉంటా. అలా యోచిస్తున్నాడు ముసలాయన.గాయం అయిన చేతిని పంట్లాం కేసి రుద్దుకున్నాడు.ముడుచుకుని వేళ్ళు పెగలను అంటున్నట్లు గట్టి గా అయిపోయాయి.తెరవాలని ప్రయత్నించి..సరే ఇప్పుడు కాదు ఇంకా సూర్యుడు పైకి రానీ అప్పుడు చూద్దాము అనుకున్నాడు.తిన్నది కూడా లోపల అరగాలిగదా ...అప్పుడు ఆ వేళ్ళని నేనే విడదీస్తా..ఎందుకు ..బలవంతంగా ఇప్పుడు..కాసేపు గానీ..దాని అంతట అదే జరగనీ..!

ఒక్కసారి సముద్రం మీదు గా చూశాడు.ఎంత ఒంటరి గా ఉన్నాను అనిపించింది.నీళ్ళు మిల మిల లాడుతూ ఉన్నాయి.వింత నిశ్శబ్దం అంతటా..!పైకి చూస్తే ఆకాశం లో తెల్లని మేఘాలు..ఉన్నట్లుండి..ఒక అడవి బాతుల గుంపు ఎగురుకుంటూ వచ్చింది.అంతలోనే కనపడలేదు.మళ్ళీ కాసేపు ఆగి కనబడ్డాయి.సముద్రం మీద ఎప్పుడూ ఒంటరిగా ఉండము..ఏదో ఒక జీవ రాశి ఏ వైపు నుంచో కనబడుతూనే ఉంటుంది.ఇది అంతా హారికేన్లు వచ్చే కాలం.సముద్రం వాటి జాడని ముందు గానే తెలియజేస్తుంది.అయితే నేల మీద వేరు.ఆకాశం లో ఇప్పుడు తెల్లని మేఘాలు..ఐస్ క్రీం ల్లాగా!సెప్టెంబర్ ఆకాశం..చాలా బాగుంది.

నాకైతే వాతావరణం అనుకూలం గానే ఉంది.ఆ చేపకి మాత్రం కష్టమే 'అనుకున్నాడు.బిగుసుకుపొయిన వేళ్ళని వదులు చేయడానికి ప్రయత్నించాడు.శరీరం లోని ఓ భాగం మొరాయిస్తే మహా హింస గా ఉంటుంది.అదీ ఓ మోసమే..మనిషి ఒక్కడే ఉన్నప్పుడు మరీ బాధ గా ఉంటుంది.ఆ కుర్రాడు ఉంటే ఈ చెయ్యిని రుద్ది మంచిగా చేసేవాడు.ఉన్నట్లుండి..ఓ కుదుపు ..లా తోచింది.లోపలి చేప పైకి వస్తున్న భావం కలిగింది.


..ఆ..అదిగో...బయటకి వచ్చేసింది అది..ఏయ్ నా చెయ్యి.. సర్దుకో..ఇక ..సిద్దం గా ఉండు!" అరిచాడు ముసలాయన.సముద్రపు నీళ్ళని చీల్చుకుంటూ ఆ చేప పైకి లేస్తూ ఉంటే నీళ్ళు దానికి ఇరువేపులా జాలువారుతున్నాయి.మామూలుది కాదు.చాలా పెద్ద చేప ఇది.తన పడవ కంటే ఇంకా రెండు అడుగులు పొడవుగానే ఉంది.దాని ఒంటి మీద చారలు..ఓహో దాని అందం...సూర్య కాంతి తగిలి మరింత భాసించింది.నీటిలోనుంచి బయటకి వచ్చి తన విశ్వరూపం చూపించింది.దాని తోక చూస్తే కొడవలి కి ఉన్న చురుకుదనం ఉంది.మొప్పలు కూడా కత్తులకి ఏ మాత్రం తీసిపోవు.మళ్ళీ లోపలకి వెళ్ళిపోంది ఆ చేప.
                                         11
గేలపు తాడు స్థిరంగా,మెల్లగా ఇంకా నీళ్ళ లోకి దిగుతున్నది.చేప లోపల బెదురుతున్నట్లు తోచడం లేదు.ముసలాయన తన రెండు చేతుల తో చేతనైనంత మేరకు తాడు ని సంభాళించుతున్నాడు.చాతుర్యం తో దాని పై వత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నాడు.మరీ ఒకేసారి తీవ్రంగా వెళ్ళినా దాని తాకిడిని తట్టుకోవడం కష్టం.తాడు తెగే అవకాశమూ ఉంది.

అది చాలా పెద్ద చేప.దాన్ని అనునయిస్తూ పట్టాలి.దాని బలం ఏమిటో దానికి తెలియకుండా చేసి బందించాలి అంతే..!అది గాని తాడో పేడో అని పైకి లెగిస్తే తట్టుకోవడం ఎవరి తరం..?నేనే గనక ఆ చేప స్థానం లో ఉంటే నాశక్తిని అంతటిని ఇప్పుడే ఉపయోగించేవాడిని.దేవుడా..కృతజ్ఞతలు.మా మనుషులకి ఇచ్చినన్ని తెలివితేటలు వాటికి ఇవ్వనందుకు..!

ముసలాయన ఇలాంటి పెద్ద చేపల్ని చూడని వాడేమీ కాదు.ఇంతకన్నా బరువు ఉన్న చేపల్ని సైతం పట్టిన రోజులు ఉన్నాయి.అయితే కూడా ఎవరో ఒకరు ఉండేవారు.ఇప్పుడేమో ఒంటరి గా ఉన్నాడు.కనుచూపు మేర లో భూమి కూడా కానరావడం లేదు.తన ఎడం చేతి వేళ్ళు ఇంకా మొరాయిస్తూనే ఉన్నాయి.ఇది గనక సర్దుకుంటే ,కుడి చేతికి ఆసరా గా ఉంటుంది.ఆ చేప,ఈ రెండు చేతులు తోబుట్టువులు వంటివి.ఏదీ మొరాయించడానికి లేదు.అంతే.

చేప కదలిక తగ్గింది.అయితే ఎందుకని ఇందాక అంత ఎత్తు ఎగిరింది..దాని రూపం చూపెట్టడానికా..?అయితే నా సంగతి ఏమిటో నేనూ చూపించాలి.గాయపడ్డ నా ఎడం చేతిని అది చూసి ఉంటుందా..? నేనే ఆ చేపని అయితే తీరు వేరు గా ఉండేది.ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏమిటి...నా ఆత్మశక్తి ఇంకా నా తెలివితేటలు..!

అలా యోచిస్తూ పడమ మీద ఉన్న చెక్కబల్ల మీద స్థిమితం గా కూర్చున్నాడు.ఓ వేపు శరీరం పెట్టే బాధని సహించుకుంటూనే..!...కింద చేప మళ్ళీ కదులుతున్న అనుభూతి కలుగుతున్నది.మెల్లగా ..పడవ కూడా కదులుతున్నది. తూర్పు నుంచి వీస్తున్న పవనాలు సముద్రం యొక్క అలల్ని కొద్దిగా పైకి లేపుతున్నాయి.

సరే..మధ్యానం కల్లా..ఎడమ చేతి వేళ్ళు కరుణించాయి.తెరుచుకున్నాయి ఎట్టకేలకు.హాయిగా తోచింది.ఓ చేప ..ఇహ నీకు ఇది దుర్వార్త యే సుమా అంటూ అరిచాడు.అలా అంటూనే తడుని భుజాల మీదినుంచి అనువు గా  జరుపుకున్నాడు.ఆ..ఇప్పుడు..బాగుంది.అయితే ఎడమ చెయ్యి నొప్పి అలానే ఉంది.దాని పట్టించుకోదలుచుకోలేదు.

నాకు మామూలు గా అయితే పెద్ద గా భక్తి అది లేదులే గాని..ఇపుడు చిన్న ప్రార్ధన చేసుకోవడం మేలు అనుకున్నాడు.రెండు రకాల ప్రార్ధనలు వచ్చు.అయితే అవి గుర్తుకు రాలేదు.ఒక వేగం తో ఉచ్చరించడం మొదలెట్టగానే అప్రయత్నంగా మిగతా ప్రార్ధన అంతా నోటికి రావడం ఆరంభమయింది." ఓ మేరీమాత ..ప్రభువు ని మా అందరి నిమిత్తము నీ గర్భములో   మోసిన తల్లీ ..నీవు స్త్రీలందరిలో అతి శ్రేష్టురాలవు.ఈ మృత్యు ఘడియల లో నిన్ను ప్రార్దించుచున్నాను. నన్ను సమ్రక్షించు..ఆ చేప ని మర్దించు.."
చివరి లో ఆ చేప విషయం చేర్చడం మంచిదని అలా చెప్పాడు.ఆ ప్రార్ధన చేసుకున్నాక మనసు కి హాయిగా తోచింది.అయితే శరీరం యొక్క బాధ అలానే ఉంది.కొద్దిగా పెరిగినట్లుగా కూడా అనిపించింది.పడవ చివరకి వెళ్ళి ఆ వొంపు మీద ఒరిగాడు.చక్కగా వచ్చేశాయి గదా ఎడమ చేతి వేళ్ళు..పనిచేస్తాయా లేదా అని చూసుకున్నాడు.గాలి ఓ వేపు వీస్తూనే ఉన్నా మరో వేపు ఎండ కూడా బాగానే ఉంది.

ఈ చేప ..రాత్రికి కూడా ఇలానే ఉంటే ..తానూ జాగారం చేయాలిసిందే.బాటిల్ లో నీళ్ళు దగ్గర పడుతున్నాయి.ఇంకో చిన్న చేపని అయినా తినాలిసిందే..లేకపోతే బలం ఉండదు.ఇప్పుడు చేప ఏమోగాని డాల్ఫిన్ మాత్రం దొరకవచ్చు.ఓ భాగాన్ని నరికి కొంత తింటాను.ఆ ఎగిరే చేపలు కనిపిస్తే బాగుండు..వాటిని కట్ చేయకుండానే తినేయవచ్చు.వాటిని పచ్చిగా తిన్నా బాగానే ఉంటాయి.సరే..ముందు శక్తిని కాపాడుకోవాలి.ప్రభువా...ఆ చేప అంత పెద్దదని తెలియలేదే ముందు..!

అది ఎంత గొప్పదైనా గానీ...నేను దాన్ని అంతమొందించుతాను.అది అన్యాయం కాదూ ..అనిపించింది.మనిషి ఏదైనా ఓర్చుకొని ఏదైనా చేయగలడు ..అది నిరూపించే తరుణం వచ్చింది.ఆ కుర్రాడికి చెప్పాను గదా..నేను ఒక వింత ముసలాణ్ణి అని. దాన్ని నిరూపించుకునే తరుణం ఇదే అనిపించింది.

కొన్ని వేల సార్లు శక్తిసామర్ధ్యాలు చాటుకున్నాడు.కాని దేనికి అదే వేరు వేరు గదా.అక్కడ ..ఆ చేప..ఇక్కడ..నేను..నిద్రపోతుంటాము..అప్పుడు కల లో సిమ్హాలు వస్తుంటాయి.అనట్లు ఆ సిమ్హాలే ఎందుకు రావాలి కలలో..ఏయ్ ముసలి వాడా..నీ ఆలోచనలు కట్టిపెట్టు.తనకి తనే సర్ది చెప్పుకున్నాడు.ముందు విశ్రాంతి తీసుకో కొద్దిగా.దాని పని లో అది ఉంది.నెమ్మది గా ఉండనీ.

మధ్యానం..పడవ మెల్లగా కదులుతున్నది.భుజం మీద ఉన్న తాడు ని సర్దుకున్నాడు.చేప పైననే ఈదుతోంది.దాని ఘనమైన మొప్పలు..తోక..అదీ బాగున్నది.అంత లోతు లో చేప ఎలా చూస్తుందో....దాని కళ్ళు కూడా పెద్ద గానే ఉన్నాయి..ఇంచుమించు గుర్రం కి ఉన్న కళ్ళు లా ఉన్నాయి.రాత్రిళ్ళు తనకి కూడా ఒక్కోసారి బాగా కనబడతాయి కళ్ళు.ఒక పిల్లి మాదిరిగా.

ఎడమ చేతి వేళ్ళు చలనం ఇపుడు బాగానే ఉంది.వాటికి కొద్దిగా బరువుని అలవాటు చేయాలనిపించి ..తాడు ని అటు ఇటు మార్చుకోవడం చేస్తున్నాడు.ఇంకా నువు అలసిపోకపోతే ఓ చేపా...నువు వింత ప్రాణివే.గట్టి గానే అరిచాడు ముసలాయన.అతను ఇంకొద్ది గా అలిసిపోయాడు.ఇతర విషయాలు ఆలోచించాలి అనిపించింది.ఇపుడు Yankees of Newyork జట్టు వాళ్ళు Tigers of Detroit వాళ్ళతో తలపడుతూ ఉండవచ్చు.


ఇది రెండవ రోజు.ఈ చేప ఎటూ తేల్చడం లేదు.అయితే తాను ఆత్మ విశ్వాసం కోల్పోకూడదు.నేను ఎవరి అభిమానిని..ఘనత వహించిన DiMaggio యొక్క అభిమానిని.ఎటువంటి ఆటగాడు అతను..ఒకసారి కాలికి ఎంతో పెద్ద గాయం అయినప్పటికీ ..ఆటని ముందుకు తీసుకుపోయాడు.అలాంటిది తనకి జరగకపోవచ్చును.కాని కోడిపందేలు జరుగుతున్నప్పుడు చూడు..ఒక పుంజు కి కన్ను పోవచ్చును..ఒక దానికి కాలు పోవచ్చును..ఎలా ఉంటుంది అది.ఏది అయినా బాధ బాధ యే గదా.పక్షులు గాని,మృగాలు గాని ..అవి జీవిస్తున్నంత ప్రమాదభరిత జీవితాన్ని మనిషి జీవిస్తున్నాడా..నిజం చెప్పాలంటే లేదనే చెప్పాలి..అయితే ఈ రాత్రి ...సముద్రం లో ఆ చేప తో..తను ఓ మృగం వలెనే పోరాడవలసిందే.. అనుకున్నాడు.
                                12

ఈ చేప తో నేను ఎంతసేపటి నుంచి వేగుతున్నాను.నా ఈ స్థానం లో ఆ గొప్ప ఆటగాడు DiMaggio గనక ఉంటే ఎలా ఉంటుంది...అయితే ఒకటి..తను నాకంటే వయసు లో చిన్న ఇంకా బలశాలి.అది ఒప్పుకోవలసిందే.అతని తండ్రి కూడా ఒక జాలరి యే.బేస్ బాల్ ఆట లో అతనికి ఓ సారి ఎముక జాలు సంభవించింది గదా...ఆ నొప్పి ..నా చెయ్యి కి కలిగినంత నొప్పి అంత ఉంటుందా...?దాని సంగతి అయితే నాకు తెలియదు.నాకు ఎప్పుడూ అలా జరగలేదు గనక.

సూర్యుడు అస్తమించడానికి తయారు గా ఉన్నాడు.ఏమైనా తాను గుండె నిబ్బరం కోల్పోరాదు.అన్నట్లు ఓసారి కాసాబ్లాంకా అనే ఊరి లో ఓ మద్య శాల లో ఒక నీగ్రో తో తాను బలపరీక్ష కి నిలువ వలసి వచ్చింది.తను సియొన్ ఫ్యుగోస్ నుంచి వచ్చిన వాడు.మంచి బలశాలి.టేబుల్ మీద ఇద్దరూ చేతులు ఆంచి  ఒక రి చెయ్యి ని ఇంకొకరు కిందకి వంచే పోటీ అది.అది అంత తొందరగా పూర్తవ్వలేదు.రమారమి ఒకటిన్నర రోజు పట్టింది.తుది ఫలితం తేలడానికి.కిరోసిన్ దీప కాంతి లో కూడా అది సాగింది.ప్రతి నాలుగు గంటలకి రెఫెరి మారడం ఒకటి.ఆ నీగ్రో వ్యక్తి కి తనకి గోళ్ళ దగ్గర రక్తం వచ్చినా ఎవరూ తగ్గలా.జనాలు బెట్లు కట్టడం ఒకటి.ఇది ఎంతకి తెగేలా లేదు.మేము పనికి పోవలా లేదా అని చూసే కార్మికులు అనుకోవడం..మొత్తానికి ఆ పోటి లో విజేత గా తనే నిలిచాడు.

తను అప్పుడు ఇప్పటి ముసలి వ్యక్తి కాదుగా...శాంటియాగో ద చాంపియన్..!ఆ దగ్గరనించి అందరూ తనని చాంపియన్ అని పిలిచేవారు.మళ్ళీ వసంత కాలం లో జరిగిన పోటీ లో సైతం తనే గెలిచాడు.ఆ తర్వాత మరి కొన్నిట్లో గెలిచిన పిమ్మట వాటిని మానేశాడు.తాను నిజంగా తల్చుకుంటే ఎవరినైనా ఓడించగలననే నమ్మకం అతనికి అలా ఏర్పడింది.అయితే ఒకటి..ఎడమ చెయ్యి ఉందే..అది అప్పుడు కూడా తనకి చేయిచ్చేది.నమ్మడానికి లేదు.

సరే..మొత్తానికి ఈ రాత్రి ఏమి వింత జరగనున్నదో...చేతి వేళ్ళు  బిగుసుకు పోవడం అనేది మాత్రం జరగకూడదు.అంతలోనే మియామి వేపు వెళ్ళేదనుకుంటా...విమానం కొద్దిగా కిందనుంచే శబ్దం చేస్కుంటూ వెళ్ళింది..తన తల మీద నుంచి.దాని నీడ ఆ ఎగిరే చేపల మీద సైతం పడింది.వీపు కి ఉన్న ఆ గేలపు తాడు ని అలాగే వెనక్కి పెట్టుకొని అల్లంత దూరం చూడాలని ప్రయత్నించాడు.పడవ కింద ఆ పెద్ద చేప కదిలిన చప్పుడు అయింది.పడవ కూడా మెల్లిగా ముందుకు కదులుతున్నది.

మళ్ళీ చూడటం కుదరదేమో అన్నంత ఇదిగా ..ఆ విమానాన్ని అలాగే కనుమరుగయ్యేదాకా చూస్తూన్నాడు ముసలాయన.నిజంగా విమానం కూడా వింత అయినదే.దానిలోనుంచి చూస్తే సముద్రం ఎలా అగుపిస్తుందో..ఇంకా కొద్దిగా కింది నుంచి వెళితే ..ఆ ఎగిరే చేపలు ఇంకా మిగతావి కూడా నీళ్ళలో కనబడతాయి.ఓసారి తను ఎత్తైన బోటు లో వచ్చినపుడు..డాల్ఫిన్ ..దాని వొంటి మీద చారలు మచ్చలు తో పచ్చగా కనిపించింది.అవి గుంపులు గా ఈదుతూ ఉంటాయి.
ఇక చీకటి పడింది అనగా ,అప్పటికే తాను వేసిన మరో గేలానికి డాల్ఫిన్ వచ్చి చిక్కింది.ఆ సర్గూసా చెత్త సముద్రం మీద తేలుతూ ఒక ద్వీపం మాదిరి గా ఉంది.సరిగ్గా పడవ దాని దగ్గరకి రాగానే ఈ డాల్ఫిన్ చిక్కింది.ముందు అది గాలి లో ఎగరడం చూశాడు.మిణుకుమనే కాంతి లో తళుక్కుమని తోచింది.కాసేపు తీవ్రంగా పెనుగులాడింది.మళ్ళీ మళ్ళీ కొట్టుకోసాగింది.ముసలాయన దానికి దగ్గరకి వంగి గేలపు తాడుకి మరింత చిక్కేలా డాల్ఫిన్  వొంటి మీద కొట్టాడు.కింద ఉన్నదే ఆ పెద్ద చేప గేలపు తాడు ..దాన్ని జాగ్రత్తగా అటు ఇటూ మార్చుకున్నాడు.. ఉన్నట్లుండి..ఓ పక్కగా ఒరిగినట్లు అయింది తాడు..! " దీనికి ఎంతకీ బుద్ది రాదు...సరే..ఈ రాత్రికి చికాకు చెయ్యకుండా మంచి గా ఉండు..నేను కూడా మంచి గా ఉంటా..." అన్నాడు గట్టిగా.

డాల్ఫిన్ ని ఇపుడు కాదు గాని రేపు పొద్దుట పూట చీల్చి తింటా.సత్తువ వస్తుంది కాబట్టి ఇంకా ముందుకైనా సాగిపోవచ్చు.ఇక ఈ చేప ఉందే..దాన్ని ఇపుడేం అనకూడదు..అదలాగే లోపల ఉండనీ.సూర్యాస్తమయ సమయం లో చేపలు చికాకు గా ఉంటాయి. మనకీ మంచిది కాదు.అప్పుడు బోనిటో చేప ముక్కల్ని తిన్నాడు గదా..అయితే ఈ డాల్ఫిన్ మాంసాన్ని తినడం అంత ఈజీ కాదు.ఇది కొంత గట్టి గా ఉంటుంది.సరే..ఏది మాత్రం ఈజీలే..!

" చేపా..ఇపుడు..నీకు ఎలా ఉంది..?నాకయితే పొద్దుటికి తిండి దొరికింది.నా ఎడమ చెయ్యి సైతం బాగయింది.నీకు అనిపిస్తే ..పడవని తోసేయ్.." ముసలాయాన బిగ్గరగా నే అడిగాడు.

వీపు మీద అటూ ఇటూ మార్చుకుంటున్న ఆ గేలపు తాడు తన బలాన్ని పరీక్ష చేస్తున్నట్లు ఉంది.నమ్మేదానికి లేదు.నొప్పి కూడా అనిపిస్తోంది.దీనికంటే చికాకు యవ్వారాలే చూశాను..ఇప్పుడు నా కాళ్ళు బాగానే ఉన్నాయి..ఎడమ చెయ్యి కూడా ఫరవాలేదు.చేపది అయితే పై చెయ్యి కాదు.అలా సర్ది చెప్పుకున్నాడు.


సెప్టెంబర్ నెల ..తొందరగా చీకటి పడింది.పడవ మీదే ఆనుకొని ఆకాశం వైపు చూడసాగాడు.నక్షత్రాలు కొన్ని బయటకి వచ్చాయి.కాసేపటిలో మిగతావి అన్నీ వచ్చేస్తాయి.అవి తనకి దూరపు మిత్రులు వంటివి.ఆ చేప కూడా అంతే.ఆ..ఇలాంటి చేప గురుంచి విన్నదీ కన్నదీ లేదు.దీని ని సమ్హరించవలసిందే.సంతోషం..ఏ ఆకాశం లోని చుక్కలనో తెంపుకు వచ్చే పనిని భగవంతుడు మనిషికి పెట్టలేదు.ఒకసారి ఊహించు..ప్రతి రోజూ మనిషి ఓ చంద్రుడినో...సూర్యుడి నో వేటాడాలి అని విధి నిర్ణయించినట్లయితే ..ఆ పని ఎంత నరక యాతన గా ఉంటుంది.అదృష్టం..అలాంటి కష్టం మనిషికి ఇవ్వబడలేదు.అలా పరి పరి విధాలా అనుకొంటూన్నాడు ముసలాయన..! 
                                   13
ఆ చేప పరిస్థితి తలుచుకుంటేనే జాలి గా అనిపించింది.గేలానికి చిక్కిన దానికి తిండి తిప్పలు లేవు.అయినప్పటికి దాన్ని చంపే విషయం లో తనకి వేరే యోచన ఏమీ లేదు.అవును..దాన్ని కోస్తే ఎంతమందికి సరిపోతుంది..అసలు దాని మాంసం తినే అర్హత ఈ జనాలకి ఉందా..?లేనే లేదు.దాని ఔన్నత్యమే వేరు.ఏమోలే..అవన్నీ అర్ధం కాని విషయాలు.ఏదైమైనా ఏ చుక్కల్నో,చంద్రుడినో వేటాడే పని మాత్రం మనిషికి ఇవ్వబడలేదు.అంత దాకా సంతోషం.సముద్రం మీద ఇలా పయనిస్తూ..తోబుట్టువుల్లాంటి ఈ చేపల్ని వేటాడుతూ జీవిస్తే చాలు.

నీళ్ళ లోపల గట్టిగానే తన్లాడుతున్న ఈ చేప గూర్చి ఆలోచించాలి.సరే..దీనివల్ల ఓ నష్టం ఉంది.ఓ లాభం ఉంది.అది ఎంత గింజుకుంటే అంత సరిపోను తాడు తనవద్ద ఉంది.తెడ్ల ని బలంగా లాగడం వంటిది  చేస్తే మాత్రం ప్రమాదమే.అయితే ఉపయోగించవలసింత బలాన్ని ఇంకా అది ఉపయోగించడం లేదు.అంతదాక పర్లేదు.బలం కావాలంటే తాను డాల్ఫిన్ మాంసాన్ని  కొంత తినవలసిందే.

సరే..కొద్దిగా అలా ఒరుగుతా..పడవ చివరన..అనుకున్నాడు.ఈ లోపులో అదేం చేస్తుందో కూడా తెలుస్తుంది.ఏమైనా క్షేమంగా ఉండానికి తాను కొద్దిగా జాగ్రత్త గా ఉండవలసిందే.చేప మూతికి పక్క గా గేలం గట్టిగా పట్టేయడం తో అది నోరు తెరవలేకపోతోంది.ఆ గేలం విధించే శిక్ష పెద్దదేం కాదు.దానికి వేసే ఆకలి ఉందే...దాన్ని బాధ పెట్టే మనిషి ఉన్నాడే ..ఇవన్నీ దానికి అర్ధం కాకపోవచ్చును.కాని అవే ఇక్కడ అసలు విషయాలు.

హ్మ్మ్..ముసలి వాడా..కాస్త విశ్రాంతి తీసుకో...దాని పనిని అది చేసుకోనీ మళ్ళీ నీకు పనిబడేదాకా..అనుకున్నాడు తనలో..!అలాగే కాసేపు కునుకు తీశాడు.బహుశా రెండు గంటలు నిద్ర పోయాడేమో..చంద్రుడు ఆకాశం లో కనబడ్డం లేదు.టైం ఎంత అయిందో ..అంతా అయోమయంగా ఉంది.ఆ చేప లోపల తన్లాడుతూనే ఉంది.తన భుజం మీది గేలపు తాడు ని సర్దుకున్నాడు..దాని ఇంకో కొసన ఉన్న ఆ చేప భారం అనుభవం అవుతూనే ఉంది. ఆ ఎడం చేతిని ఓ వేపుకి ఆంచి సదురుకున్నాడు.

ఆ తాడుని ఇంకొద్ది వేగంగా కదిపితే బాగుండునేమో ..అయితే ఒకటి..బలం బాగా ఉపయోగిస్తే ఒక్క తోపు లో దాన్ని తెంపేయగలదు ఈ చేప.తాడు ని అనువు గా నా చేతులతో సంభాళించుతూ ఉండాలి. ఈ శరీరాన్నే ఓ మెత్త లా గా చేసుకొని..! " ఓయ్..ముసలాయన..నువ్వు సరిగా నిద్ర పోలేదు..అది తెలుసా .." గట్టిగా అరిచాడు అతను.ఒకరోజు గడిచింది.ఇంకోరోజు రాత్రి లోకి వచ్చావు.నీకు నిద్ర లేదు.అది తెలుసా..?ఓ కునుకు తీసుకో..లేకపోతే నీ తల కాయ లో అంతా చికాకై పయి ఏం జరుగుతుందో తెలియకుండా పోతుంది.

లేదు...నా తలకాయ బాగానే ఉంది.తోబుట్టువుల్లాంటి ఆ నక్షత్రాలు ఉన్నాయే అవి కనిపిస్తున్నంత సత్యం. అవున్లే..ఎవరైనా నిద్రపోవలసిందే..సూర్యుడు గాని చంద్రుడు గాని ..కొన్నిమార్లు ఈ సముద్రం కూడా నిద్రపోతుంది.ఎలాంటి అలలు..అలజడి లేకుండా..!
కాసేపు  గేలం పని ఏదో తెలివి గా సర్ది..ఆ డాల్ఫిన్ నుంచి మాంసం ని తెంపాలి.మళ్ళా పడుకున్నప్పుడు గాని ..ఆ చేప తెడ్లని గాని బలం గా లాగిందా..పెద్ద ప్రమాదమే ఏర్పడుతుంది.నిద్రపోకుండా కాచుకోవడం మంచిది.మరో రకంగా చూస్తే నిద్ర లేకపోవడమూ ఇబ్బంది కరమే.ఆ చేప చేసే గట్టి తాకిళ్ళని కాచుకోవడానికి అనుకూలంగా సర్దుకు కూర్చున్నాడు.ఆ చేప కూడ సగం నిద్ర లో ఉన్నట్లుంది.అయినా అది బాగా విశ్రాంతి తీసుకున్నా ప్రమాదమే.చచ్చేదాకా అలా తన్నుకు చావడమే..!

కుడి చేతి తో ఆ వెనుక గా ఒరలో ఉన్న బాకు ని తీశాడు.నక్షత్రాలు కాంతివంతంగా ఉన్నాయి.డాల్ఫిన్ చక్కగా కనబడింది.దాని తల లో ఓ పోటు పొడిచి అక్కడి ముక్కని లాగాడు.గేలపు తాడు ని కాచుకుంటూనే ..డాల్ఫిన్ దవడ కింద భాగాన్ని చీరాడు.పని అయిన తర్వాత కత్తిని శుభ్రం చేసి దాచాడు.జారుడు గా ఉంది డాల్ఫిన్ మాంసం...నోటి భాగం లో రెండు చిన్న చేపలు ఇరుక్కుపోయి కనిపించగా వాటిని జాగ్రత్త గా తీసి అవతల పెట్టాడు.తినే భాగాల్ని శుభ్రం చేసుకుని,అస్థికల్ని విసిరి వేశాడు.అవి నీళ్ళలోకి మెల్లిగా మునిగిపోయాయి.

ప్రవహిస్తున్న నీటికి అడ్డంగా మాంసపు ముక్కల్ని పట్టుకున్నాడు.కడిగినట్లుగా అయినాయి.నీటి ఉరవడి అంతగా లేదు.అక్కడక్కడ తేలుతున్న తేట వంటి పదార్థం ..దాన్ని కొద్దిగా ముందుకి తోశాడు."లోపల ఆ చేప అలసిపోవడమో...విశ్రాంతి పొందడమో ..ఏదో అలాంటి స్థితి లో ఉన్నట్లుంది..".


సరే..ఈ మాంసపు ముక్కల్ని తిని నేను సేదతీరుతా..అనుకున్నాడు.మొత్తానికి ..ఆ డాల్ఫిన్ ముక్కలు గాని..చిన్న చేపల ముక్కలు గాని ..సగానికి సగం తిన్నాడు.వండుకుని తింటే ఆ డాల్ఫిన్ మాంసం ఇంకా బాగుంటుంది.ఏమైనా..ఉప్పు..నిమ్మ ..ఇవి లేకుండా పడవ లో బయలుదేరకూడదు అనుకున్నాడు ముసలాయన..! 
                                  14
" నాకు నిజంగా మతే ఉన్నట్లయితే...ఈ పడవ లోనే అనువైన చోట సముద్రపు నీళ్ళు పొద్దున్న పోసి ఎండబెడితే సాయంత్రం కల్లా ఉప్పు కాదూ..అయితే ఒకటిలే ...సాయత్రం కి కూడా డాల్ఫిన్ దొరికి ఉండేదా...సరే..ఏదో ఒకటి...నమిలి తిన్నాను..దాని మాంసాన్ని...మరీ వాంతి వచ్చేంత ఇది గా ఏమి లేదు."

తూర్పు వైపు ఆకాశం లో మబ్బులు ముదురుకుంటున్నాయి.ఒక్కొక్క నక్షత్రమూ కనుమరుగు అవుతోంది.ఏదో ఒక పేద్ద మబ్బుల సొరంగం లోకి పోతున్నట్లుగా ఉంది.గాలి నెమ్మదించింది.మూడు,నాలుగు రోజుల్లో వాతావరణం చికాకు చేసేలానే ఉంది.అయితే ఇపుడు కాదుగా..కొంచెం నిద్రపో ముసలివాడా...ఆ నీళ్ళ లోపల చేప ఏం అలజడి చేయడం లేదుగా..!"

గేలపు తాడుని చక్క గా సర్దుకున్నాడు.వెనక ఉన్న చెక్కని ఆనుకొని అలా ఒరిగాడు.కొద్దిగా తాడు ని లోనికి వదిలి,ఎడమ చేయి ని దాని మీద పెట్టుకున్నాడు.ఒక చెయ్యి కాకపోయినా ఇంకో చెయ్యి అయినా అప్రమత్తం గా ఉండాలి.ఆ తర్వాత ఇరవై నిమిషాలో,అరగంటో నిద్ర పోయినా ఫర్వాలేదు.కుడి చేతి మీద తన ఒంటి భారం మోపి నిద్రలోకి జారుకున్నాడు.

ఇపుడు కలలో సిమ్హాలు రావట్లేదు.ఒక రకం చేపలు కనబడుతున్నాయి..అవి సముద్రం లో కొన్ని మైళ్ళ పొడుగూతా ఈదుకుంటూ పోతున్నాయి.అవి ఎద కొచ్చి ఉన్నాయి.ఆ నీళ్ళలోనే పైకి ఎగురుతూ ..మునుగుతూ సాగుతున్నాయి.మళ్ళా ఇంకో కల.. తాను ఓ ఊళ్ళో..మంచం మీద పడుకొని ఉన్నాడు.ఉత్తర దిక్కునుంచి వీస్తున్న చల్లని మంచు గాలి.అతని తల కింద దిండు కి బదులు గా కుడి చెయ్యి ఉంది.అదీ నిద్ర పోతూ ఉంది.

మళ్ళీ ఇంకో కల...ఒక సిమ్హాల కల...పొద్దుటి పూట మసక వెలుతురు అది...ఒక సిమ్హం ముందు అగపడింది.ఆ తర్వాత ఇంకొన్ని అగపడ్డాయి.తాను పడవకి ఓ వేపున చుబుకం ఆనించి చూస్తున్నాడు.ఇంకా ఏమైనా జీవాలు ఉన్నాయా అని..ఏమీ కనబళ్ళేదు.
చంద్రుడు ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాడు.ముసలాయన నిద్రలోనే ఉన్నాడు.నీళ్ళలో ఆ  చేప చేసే అలికిడికి పడవ మెల్లగా కదులుతోంది.అది మబ్బుల సొరంగం లోకి పోతున్నట్లుగా ఉంది.ఉనట్టుండి కుడి చెయ్యి పిడికిలి ...తన మొహం మీదికి వచ్చింది.మంటగా అనిపించింది ఆ భాగం లో..ఎడమ చెయ్యి కూడా కాసేపు ఆగి మండినట్లుగా అనిపించింది..ఆ చేప విసురు కి తాడు ఒరుసుకుపోతున్నదన్న మాట..ఆ గేలపు తాడు కి అనుసంధానం గా  ఉన్న అదనపు చుట్టల్ని కొద్ది గా నీళ్ళ లోకి వదిలాడు.ఉన్నట్లుండి నీళ్ళలోనుంచి ఆ చేప అంతెత్తున లేచి దభెల్లున మళ్ళీ సముద్రం లో పడింది.అలా ఒకసారి కాదు...మళ్ళీ మళ్ళీ ..దూకసాగింది.ఆ ఉదుటికి ముసలాయన వెళ్ళి డాల్ఫిన్ మాంసం ముక్క ఉన్న చోటులో పడ్డాడు..ఎలా..మొఖం సరిగ్గా ఆ మాంసం లో కూరుకు పోయింది.ఓ వైపున తాడుని సంభాళించుకుంటూనే ఉన్నాడు..అయితే వెంటనే వెనక్కి తిరగడానికి పడలేదు..అలా ఉంది స్థితి.

" ఈ సమయం కోసమే నేనూ,నువ్వూ  చూస్తున్నది...కానివ్వు...ఇపుడు చూసుకుందాము...ఆ తాడుని చికాకు చేసి నన్ను గాయపరిచినందుకు నువు మూల్యం చెల్లించవలసిందే.." అనుకున్నాడు.

ఆ చేప ఎగురుళ్ళు కంటికి సరిగా ఆనడం లేదు గాని...అది సముద్రపు నీటి పై దూకుతూ ,మునుగుతూ చేసే చప్పుళ్ళు ఆ గేలపు తాడు ద్వారా అనుభం అవుతూనే ఉంది.దాని వేగానికి తాడు తన చేతుల్ని గాయపరుస్తున్నది..ఇది ఇలా జరిగేదేనని తనకి తెలుసు..గాయపడని వేపుకు తాడుని తిప్పుకుంటున్నాడు ఒడుపుగా...మొత్తానికైతే వదిలిపెట్టలేదు...అలానే ప్రయత్నిస్తున్నాడు.ముఖ్యంగా వేళ్ళు,అరిచేతులు తెగకుండా ప్రయత్నిస్తున్నాడు.ఇప్పుడే గనక ఆ కుర్రవాడు ఉన్నట్లయితే ఈ తాడు కి తడి పెడుతూ ఉండేవాడు..దానివల్ల ఒరుసుకుపోకుండా మంచిగా ఉండేది.అతను ఉన్న పక్షం లో బాగుండేది..కాని లేడుగా..!
గేలపు తాడు చివరకి ఏం రాలేదు..ఇంకా అదనం గా చుట్టలు చుట్టి ఉంది. ఇంకొద్ది తాడు ని వదిలాడు.అపుడు చేప కి కూడా తిరగడానికి కొద్ది స్వేచ్చ లభిస్తుంది.మాంసం లో పడ్డ తన మొఖాన్ని మెల్లగా పైకిలేపాడు.మోకాళ్ళ మీద వొంగి ..ఆ పిమ్మట లేచి నిలబడ్డాడు. అదనంగా ఉన్న తాడు తన కాళ్ళకి తగిలింది.ఎంత తాడు కిందికి వదిలితే అంత మంచిది..చేపకి కూడా ఒరిపిడి తగ్గుతుంది.

కనీసం ఓ డజన్ సార్లయినా ....సముద్రం లోనుంచి జంప్ చేయడం ...మునగడం చేసిందది.చప్పుడు కూడా బాగానే వస్తోంది.అలాగని అది మరీ లోపలకి వెళ్ళి మరణించే పరిస్థితీ లేదు.కాసేపట్లో అది నీళ్ళ లో చుట్టూరా తిరగడం చేస్తుంది గా...అప్పుడు నేను నా పని చేస్తాను అనుకున్నాడు ముసలాయన..!


ఆశ్చర్యం...ఉన్నట్లుండి అది అంత అలజడిగా పైకి లేస్తూ ,నీళ్ళ లో పడటం ఎందుకు ...అలా ప్రవర్తిస్తోంది.కారణం ఏమై ఉండవచ్చు...ఆకలా...డస్సిపోవడమా...లేక పోతే నీళ్ళ లో ఏదైనా చూసి భీతి చెందినదా...?బలంగా ..నిదానం గా ఉండే చేప ఇది..!చూడటానికి భయరహితంగా,ఆత్మ విశ్వాసం తోనూ ఉన్నట్లుగా ఉన్నది.విచిత్రమే..! 
                             15


"ఇపుడు నువు ధైర్యంగా ...ఆత్మవిశ్వాసం తో ఉండటం మంచిది..ముసలివాడా" అనుకున్నాడు తనలో తను." దాన్ని నువు వేటాడుతున్నావు..తాడుని కూడా అనుకున్నంత పొందలేవు...కొద్దిసేపటి లో ఆ చేప గుండ్రంగా తిరగడం మొదలెడూంది..చూసుకో.."

ఎడమ చేతి తో అలానే పట్టుకొని ..వెనక్కి తిరిగి కుడి చేతి తో నీళ్ళు తీసుకున్నాడు సముద్రం లోనుంచి...ముఖం మీద ఇందాక అంటిన డాల్ఫిన్ మాంసాన్ని కడుక్కోవడానికి.లేకపోతే దేవినట్లయి వాంతి అయినా కావచ్చు...దానివల్ల ఇంకా శక్తి కోల్పోయే అవకాశం ఉన్నది.ముఖం కడుక్కొని..ఆపైన కుడి చేతిని కూడా కడుక్కున్నాడు.సముద్రం నీళ్ళ లో కాసేపు అలాగే చేతిని ఉంచాడు.

సూర్యుడు అయితే కనపడటం లేదు గాని ...వెలుతురు పొడసూపింది ఆకాశం లో.తాను తూర్పు గా సాగుతున్నట్లు అనిపిస్తోంది.సముద్రపు అలలు తీసుకువెళుతున్నవేపే వెళుతున్నాడు.తాను అలసినట్లే ఉన్నాడు.ఆ చేప  గుండ్రంగా తిరగడం ప్రారంభించినపుడు...తన అసలు పని మొదలవుతుంది.కుడి చేతిని నీళ్ళ లోనుంచి తీసేసుకున్నాడు." కొద్దిగా నొప్పి ఉన్నది లే గాని..ఇపుడు ఫరవాలేదులే" అనుకున్నాడు.మళ్ళీ గేలపు తాడు ని జాగ్రత్త గా సంభాళించడం మొదలెట్టాడు.తన శరీరానికి అనువు గా.

" నువు కష్టపడినా ...దానికీ ఓ పరమార్ధం ఉందిలే.." ఎడమచేతికి సర్దిచెప్పాడు.

రెండు చేతులకి ఒకే రకపు సామర్ధ్యం ఉండి ఉంటే బాగుండేది.అలా పుట్టి ఉంటే బాగుండేది.మరో చెయ్యికి సరైన తర్ఫీదు ఇవ్వలేదని దాని అర్ధం.అవకాశాలు ఎన్నో వచ్చినాయి.ఆ దేవుడికే తెలుసది.ఈ చేయి మొరాయించినపుడు కూడా ...ఆ రాత్రి బాగానే పని చేయగలిగాను.ఒకసారి ఇది తెగింది..మళ్ళా అలా జరగడం కంటే ..అసలిది పోవడమే మంచిది.

" ఇంకొద్దిగా డాల్ఫిన్ మాంసం తింటేనో...బుర్రలో కూడా చికాకుగా ఉంది...లేదు..ఇపుడది కష్టం." అనుకున్నాడు మళ్ళీ.వాంతి వచ్చి చికాకు అయి..శక్తి కోల్పోయే కంటే ఇలా ఉంటమే హాయి...అందులోను ఇందాక ముఖం మాంసం లో కూరుకుపొయి ..చాలా ఇదిగా అనిపించింది.అత్యవసరం అయితే తర్వాత చూసుకోవచ్చులే..ఆ ఎగిరే చేప మాంసం తింటే పోలా..శక్తి కి"
ఇంకో చేప..అదే ఎగిరే చేప మాంసం తయారు గానే ఉంది.శుభ్రంగానూ ఉంది.దాని లోని ముల్లుల్ని తీసి పారేసి దాని తోక దాక ఉన్న మాంసాన్ని తిన్నాడు.అన్నిటికంటే ఇది బలవర్ధకం.సరే..కావలసింది చేశా.ఇక ఆ నీళ్ళ లోని చేప దే ఆలశ్యం.తిరుగులు తిరగడానికి.

ఇది మూడవ రోజు సూర్యుడు ఉదయించి..తాను ఈ సముద్రం మీదకి వచ్చిన తర్వాత. నీళ్ళ లో చేప కదలిక ప్రారంభం చేసింది.గేలపు తాడు కూడా కొద్దిగా వొంగినట్లు అయింది గాని ముందు అది గమనించలేదు.తాడు మీద వత్తిడి బాగానే ఉంది.మెల్లిగా కుడి చేతి తో కదిలించడం చేస్తున్నాడు.భుజాలు,తల కిందు గా వంచి నీళ్ళ లోకి చూశాడు.రెండు చేతులతో గేలపు తాటిని ఊపి చూశాడు.

" గుండ్రంగా తిరుగుతోంది...పైగా దూరంగా జరుగుతోంది...ఎంత వీలైతే అంత గట్టిగా పట్టుకోవాలి దాన్ని...అది తిరిగిన ప్రతిసారి అలుపు తగ్గినట్లు అవుతోంది.కాసేపట్లో ..అంటే ఓ గంట లో బయటకి రావచ్చును అది.ఏదోలా అలాగే రప్పించి ..ఆ తర్వాత మట్టుబెట్టాలి.అయితే నెప్పది గా తిరుగుతోంది.చెమట తో ముసలాయన తడిసిపోయాడు.ఆ చేప నీళ్ళలో గుండ్రంగా తిరుగుతూనే పైకి వస్తున్నట్లుగా అనిపించింది.గేలపు తాడు వంగే విధానాన్నిబట్టి చేప కదలికని అంచనా వేయవచ్చు.

గంట అయినతర్వాత..ఆ సముద్రపు నీళ్ళ లో నల్లని మచ్చలు..ఆ చేపవేనేమో కనిపించసాగాయి.కంటి కింద అయిన గాయం మీదకి చెమట ధార గా కారుతోంది ముసలాయనకి.నొసల మీద కూడా.నీరసం గా తోచింది. " నేనెప్పుడు విఫలం కాలేదు..ఇలాంటి చేప చేతి లోనా నేను చచ్చేది..లేదు.చక్కగా వస్తోది అది..దేవుడా నాకు సాయం చెయ్యి..ఇపుడయితే చేయలేను గాని తర్వాత నీకు వందల కొద్దీ ప్రార్ధనలు చేస్తాను. "

ఉన్నట్లుండి మళ్ళీ గట్టి ఊపు ..ఊపినట్లయింది.గేలపు తాటిని రెండు చేతులతో పట్టుకున్నాడు.ఇది బరువు గా ..వేగంగా ఉంది.దీని ఈ సారి ఊపు..
చేపని బందించి ఉన్న ఆ హుక్ లు వైర్ లీడర్ కి అనుసందింపబడి ఉంటాయి గదా..దాని సమీపం లో బల్లెం తో పొడవాలని అనుకున్నాడు.అదెలగూ చేయవలసిందే.ఇపుడు గుండ్రంగా తిరుగుతోంది..కానీ..ఒక్కోసారి గాలి లో ఎగిరితే కూడా మంచిదే..దానికి తగులుకున్న హుక్ చేప గాయం ని పెద్దది చేస్తుంది..మరీ మితి మీరినా కష్టమే..హుక్ కూడా పడిపోవచ్చు.


"ఎగరకు చేప ఎగరకు.." ముసలాయన కొద్ది గా తాడు వదులుతున్న కొద్దీ అది వచ్చి వైర్ లీడర్ కేసి కొట్టుకొంటోంది.దాని బాధ అది పడనీ..పడాలి..నాకేమిటి..నన్నూ నేను కంట్రోల్ చేసుకోగలను..దాని బాధ దానికి పిచ్చెత్తించినట్లు చేస్తుంది.కాసేపు ఉన్నాక ఆగి..మళ్ళీ గుండ్రంగా తిరగడం షురూ చేసింది.తాడుని లోపలకి తీసుకొంటున్నాడు మెల్లిగా...లోపల నీరసం గా ఉన్నది.సముద్రం నీటిని ఎడమ చేతి తో తీసుకొని తల మీద,మెడ వెనుక భాగం వద్ద పోసుకొని రుద్దుకున్నాడు. 
                                      16
ఇపుడు చెయ్యి బిగుసుకుపోవడాలు అలాంటివి ఏమీ లేవు...కాసేపట్లో గేలానికి  తగిలిన ఆ చేప  పైకి వస్తుంది.అపుడు చూపించాలి నా తడాఖా....మాటలెందుకులే.. !" మోకళ్ళమీద అలగే కాసేపు ఉండి ...సాలోచనగా ఇంకొంచం తాడు ని వదిలాడు. కొద్దిగా విశ్రాంతి పొందుతా...గుండ్రంగా తిరుగుతూ వస్తుందిగా...అప్పుడు నా పని మొదలెడతా...అని అనుకున్నడు ముసలాయన.

విశ్రాంతి తీసుకుంటున్నా ఒకలాంటి ఆతురతే... ఆ చేప  పడవ కి చేరువగా రావడం తో తాడు ని లాఘవంగా కదపడం మొదలెటాడు. ఎప్ప్పటికంటె కూడా ఈసారి బాగా అలిసిపోయాను.వ్యాపార పవనాలు  వీయడం మొదలైంది.ఇవి ఇపుడు తనకి బాగ అవసరం.నెత్తిమీద   ఉన్న టోపి  ఓ వేపుకి పడి ఉంది.వాతావ్రణం సైతం బాగుంది.మళ్ళీ  ఇంటిముఖం పట్టడానికి ఇవి అవసరం.
నైరుతి దిక్కు వేపు వెళ్ళాలి నేను....సముద్రం లొ దారితప్పడం ఏమీ ఉండదు...  ఇదొక పెద్ద ద్వీపం  లాంటిది.మూడోసారికి,ఆ చేప ఎగిరినపుడు ...అగుపించింది.ముందు ఓ పెద్ద నీడలా తోచింది.పడవ కింద భాగంలో...ఆ చేప పొడవు నమ్మలేనంత గా ఉంది. లెదు పెద్ద ఆ ఉండదు అనుకున్నాడు తనలో.నిజానికి అది పెద్ద చేప నే..!సముద్రం పైన ఈదుతూ 30 యార్డుల దూరం లో ఉందది..!

పెద్ద కొడవలి కంటే కూడా  పెద్ద గా ఉంది దాని తోక.ఆ నీలపు నీళ్ళ లో వెలిసిపొయిన లావెండర్ రంగు లొ ఉంది.దాని మీద ఉన్న గీతలు కూడా కనిపిస్తున్నాయి. అన్నివిధాలా అసామాన్యంగా నే ఉన్నది.  ఒక రెండు చిన్న చేపలు ..ఈ పెద్ద చేప కి చేరువ లో నే ఈదుతున్నాయి.కొన్నిసార్లు ఆగుతూ...చక్కగా ఈదుతూ పోతున్నాయి.ముసలాయన చెమటలు  కక్కుతున్నాడు...సూర్యుడొకడే  కాదు దానికి కారణం.ఇక తన ఆయుధం హార్పూన్ ని ఉపయోగించి ...దాన్ని పరి మార్చే  సమయం చేరువ అవుతోంది.అయితే ఇంకా కొద్దిగా ..ఇంకొద్ది  గా దగ్గరకి రావాలి...ఆ చేప. దాన్ని తల మీద కాదు  ..గుండే భాగం లో హార్పూన్ తొ దెబ్బ తీయాలి.  తల భాగంలో కాదు...గండె భాగం లో ..దాన్ని హార్పూన్ తో దెబ్బతీయాలి.నిశ్శబంగా... బలం కొద్దీ దెబ్బ తీయాలి. చేప కూడ  తిరుగుడు ఆపడం లేదు. దాని వెనుక తోక ఊపుతూ పోతుంది.  
మొత్తనికి దాన్ని నేను కదల్చగలిగాను.సరే..ఈసారి ఇంకా దాన్ని బలహీనపర్చగలగాలి..అన్ని భాగాలను..!ఇదే చివరి అవకాశం..ఇంకా దాన్ని  లాగిపారేయాలి.మళ్ళీ గట్టిగా లాగాడు గేలపుతాడుని..పడవకి చేరువ గానే ఉన్నది అది..!మళ్ళీ ఆ చేప సర్దుకుని ఈదసాగింది.

ఓ చేపా...నువు ఎలాగు మృత్యువు ని  వరించబోతున్నావు... నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా...ఏమిటి..?అలగయితే ఎలా..? ముసలాయన నోరు పిడచగట్టుకుపోయింది..నీళ్ళు నోటిలో కొన్నైనా  పడాలి...మాట గట్టిగా రావాలంటే..!చేప సంభాళించుకుంటూనే ఈదసాగింది.

నన్ను  చంపుతున్నావు గదే .నీకు ఆ హక్కు ఉందిలే.. నీలాంటి అందమైన ...గొప్పదైన తోబుట్టువు ని నేనింతదాకా చూడలేదు.పోని నన్ను చంపు... ఎవరు ఎవర్ని  చంపినా నాకు ఫరవలేదు...! నీ తల ఏమైనా పాడయిందా ...సరి చేసుకో..  మనిషి లాగనో,చేప లాగనో బాధపడటం నేర్చుకో...!

చేప తిరగలబడినపుడు  ...గాయపరచాలని అనుకున్నాడు.కాని ఉన్నట్లుండి అది సర్దుకొని ముందుకే పోతోంది.ముసలాయన ఈ సారి శరీరం లో   మిగిలిపోయిన బలాన్ని అంతా ఉపయోగించి తాడుని లాగాడు.ఇపుడు చేప బాగా దగ్గరయింది.
మరింత తాడుని లోపలికి లాక్కున్నాడు.ఆ తాడు ని కాళ్ళ తో తొక్కి పట్టి హార్పూన్ ఆయుధాన్ని తీశాడు.బలం కొద్దీ చేప కి ఓ పక్క గా పొడిచాడు.సరిగ్గా దాని గుండె ఉండే చోట.బాధ తో అది అంతెత్తున ఎగిరింది.. హార్పూన్ కి అమర్చిన ఆ బల్లెం  దాని లోపలకి దిగడం తో ఇక ఆలశ్యం  చేయకుండా  పోటు మీద పోటు మళ్ళీ మళ్ళీ పొడిచి వదిలాడు.తన బలం అంతా హార్పూన్ లో నిక్షిప్తం చేశాడు.

చివరిసారిగా దాని గొప్ప రూపాన్ని  చూపెట్టాడానికా అన్నట్లు  ఆ చేప మళ్ళీ ఒక్కసారిగా  గాలిలోకి ఎగిసింది.దభెల్లున సముద్రం లో పడింది.దాని నుంచి వచ్చిన వాసన ముసలాయన్ని,పడవని వేగంగా  తాకింది.

వెంటనే అతడిని నీరసం ఆవహించింది.  హార్పూన్ కి ఉన్న తాడు ని సర్దుకుని చూస్తే వెండి రంగు లో మెరిసే ఆ చేప పొట్ట సముద్రపు నీటి మీద తేలుతున్నట్లుగా అగుపించిది. తన చూపు మందగించినట్లుగానూ  అనిపించింది.అ దృశ్యాన్ని కాసేపు అలాగే చూశాడు..  రెండు చేతుల్ని తల వెనక్కి పెట్టి అదుముకున్నాడు.నీ ఈ తల మంచిగా పనిచెయనీ...నేను అలసిన ముదుసలినే అయినా నా తోబుట్టువు  వంటి ఈ చేపని చంపాను.పోరాటం ముగిసింది. ఇపుడు ఇక బానిస చాకిరి  మిగిలింది.  దీన్ని తాళ్ళ తో  గట్టి గా కట్టుకొని ఒడ్డుకి తీసుకుపోయే పని ఉన్నదిక..!
                                     17
ఇపుడు ఈ  చనిపొయిన పెద్ద చేపని  ఒడ్డుకి తీసుకుపొయే పని మిగిలిఉంది.దాన్ని పడవలో పెట్టడానికి కుదరదు.అంత పెద్దది అది.పడవ కి ఒక వార గా కట్టి తీసుకుపోవాలి.చేపని దగ్గర గా  లాగి .దాని మూతికి,మొప్పలకి గట్టిగా తాళ్ళతో కట్టాలి.ఈ చేప ఇపుడు నా సొంతం.  దాని పోరాట శైలి కి మెచ్చుకోవలసిందే.ఆ ..అన్నట్లు చేప కి  చివరి మధ్య భాగాల్లో కూడా తాళ్ళ తో కట్టాలి.మళ్ళి అవన్నీ పడవకి అనుసందానం చేసి కట్టాలి.


అలా ఆలోచిస్తూ కొద్ది గ నీళ్ళు తాగాడు. ఒక్కమాటు ఆకాశం కేసి చూసి ఆ తర్వాత  చేప వేపు దృష్టి సారించాడు.  మధ్యానం కూడా ఐ ఉండదు.వ్యాపార పవనాలు బాగానె  వీస్తున్నయి. పడవనీ చేపనీ అవే లాక్కెళ్ళి పోతాయి.గట్టిగ మాటాడితే తాళ్ళు కూడా  అవసరం లేదు.ఇంటికి పోగానే నేను ఆ కుర్రాడు కలిసి  దీన్ని కోసి పోగులు వేస్తాము. ఈ చేప తల  చాలా పెద్దగా ఉంది.హార్పూన్ కి ఉన్న తాడు ని...మిగతా తాళ్ళని  తీసి చేప మొప్పలు   దవడలు అన్నిటిని చక్కగా గట్టిగ కట్టాడు. బందోబస్తు గా  రెండు వరసలు వేశాడు. చేప వంటి మీద గీతలు అర చేతి మందాన ఉన్నాయి. చేప రంగు సైతం మారింది. దాని కన్ను ఒకటి బయటకి   వచ్చి ఉంది.

తప్పదు. దాన్ని చంపడానికి ఇదే మార్గం మరి. ఈ చేప బరువు పదిహేను వందల పౌండ్లకి ఉండొచ్చు.. లేదా కొద్ది గా ఎక్కువ నే ఉండొచ్చు. తరుగు పోగా...ఒక్కో పౌండ్ మాంసం ని ముప్ఫై సెంట్ల చొప్పున అమ్మవచ్చు.ఆ లెక్కన మొత్తం ఎంత వస్తుంది...ఎమోలే..ఆ లెక్కలన్నీ వెయ్యాలంటే ఇపుడు పెన్సిల్ కావల్సిందే.తలంతా చికాకు గా ఉంది..! ఆ నా అభిమాన  బేస్ బాల్ ఆటగాడు DeMaggio నన్ను  ఇపుడు గాని చూస్తే మెచ్చుకోకుండా ఉంటాడా..!  ఎముక దెబ్బ తినడం లాంటిది అయితే నాకు జరగలేదు.అసలు అలా జరిగితే ఎలా ఉంటుందో....అలాంటివి అన్నీ మనకి తెలియకుండానే  జరిగిపోతాయి.అయితే ఒకటి .. చేతులు,వీపు భాగాలు సలుపులు గా ఉన్నాయి.

ఎందుకైనా మంచిదని మిగిలిన తాళ్ళు ఇంకొన్ని తీసి చేపకి అన్ని భాగాలకి కట్టుదిట్టం గా కట్టి...పడవ  తో పాటు  దాని కళేబరం  కూడా నీళ్ళ లో కదిలేలా చేశాడు.  ఇప్పుడు పడవ,చేప చేదోడు వాదోడు గా వస్తున్నాయి.ఒడ్డు వేపు.నైరుతి దిక్కు ఎటువైపు అని చెప్పాలంటే తనకి కంపాస్  లాంటిది ఏమీ అవసరం లేదు. గాలి వీచే విధానాన్ని బట్టి  అది పడవని తీసుకెళ్ళే తీరుని బట్టి దిక్కుల్ని తాను గుర్తించగలడు.
ఆ చిన్న చేపలు Sardines రకం ఉండలి గదా..వాటి మాంసం తిని కాసిన్ని నీళ్ళు తాగుదామా  అనుకున్నాడు ముసలాయన...సమయానికి చెంచా కనబళ్ళేదు..మాంసం కూడా అంత బాగున్నట్లు లేదు.  సముద్రం మీద తేలియాడుతున్న తెట్టు మీదుగా పడవ సాగిపోతోంది.బుల్లి చేపలు shrimps రకం వి నీళ్ళ పైన టింగు టింగుమని ఎగురుతూన్నాయి. ఓ డజన్ బుల్లి చేపల్ని చేతి తో పట్టాడు ముసలాయన. వాటి తలలు తుంచి మిగతా భాగాల్ని నోటిలో  వేసుకుని నమలడం ప్రారంభించాడు. బాగున్నాయి..ఇవి వంటికి కూడా మంచివి అనుకున్నాడు.

ఆ తర్వాత  బాటిల్ లో  మిగిలిన నీళ్ళు కొన్ని తాగాడు.  పడవ దానితో పాటు కట్టిన చేప ముందుకు సాగిపోతున్నాయి. అది చక్కగా ఆనేట్లు కట్టుకున్నాడు పడవకి.ఇంకా ఇదంత కల గానే ఉంది.నిర్జీవమై తనతో బాటు వస్తోన్న ఈ చేప ..వింత గానే ఉంది.అక్కడ ఆ చేప..ఇక్కడ గాయాలతో  నా చేతులు. ఇది కల కాదు..నిజమే. గాయాలదేమి ఉందిలే..కొన్ని రోజులు సముద్రపు  ఉప్పు నీళ్ళు  తగిలితే అవే మానిపోతాయి.ఆ చేప..నేను  ..ఇంటికి వెళ్ళిపోతున్నాం మొత్తానికి. ఆది నా పడవని  లాగుతోందా ..లేదా నా పడవే  దాన్ని లాగుతోందా.. సరే..ఏదైతే ఏమిటిలే...ఇరువురం పక్క పక్క నే పోతున్నాం..అనుకుంటే పోలా...! ఏమైన తెలివి అనేది మాత్రం   మనిషికే ఎక్కువ.ఏ జీవి తో పోల్చినా.

ముసలాయన చేతుల్ని కాసేపు అలాగే సముద్రపు నీళ్ళ లో ఉంచి..తీసిన తర్వాత తలకేసి రుద్దుకున్నాడు.ఆకాశం లో మేఘాలు  తెల్లగా గుతులుగుత్తులు గా  ఉన్నాయి..ఇంకా పైన చారల మాదిరి గాను ఉన్నయి.  ఈ రాత్రికి చక్కటి గాలి  వీస్తుంది ..పర్లేదులే అనుకున్నాడు.అప్పుడప్పుడు తను  వేటాడి తెస్తున్న ఆ చేప వేపు ఓ కన్ను వేస్తున్నాడు.


ఎలా పసిగట్టిందో  మొత్తానికి గాని ..ఒక షార్క్....ఈ చేప కళేబరం వెంట పడటం కంటబడింది.బహుశా సముద్రపు నీటి లో ఏ మైలు   దూరం కిందనో ఈదుతుండగా చేప రక్తపు వాసన దీనికి తగిలిఉంటుంది.ఇక ఊరుకుంటుందా ..నీలిసంద్రపు పై భాగాన్ని  బద్దలు చేసున్నట్లు గా పైకి వచ్చింది.ఇక ఈ చేప, పడవ   వెళుతున్న దారిని వెంబడిస్తూ వస్తున్నది.
                                         18
చూడటానికి చాలా పెద్ద గా ఉంది ఈ షార్క్.అయితేనేమి వేగంగా ఈదే చేప తో సమానంగా ఈదుతోంది.అది నోరు తెరిచినప్పుడల్లా దాని రంపపు పళ్ళు భీకరంగా అగుపిస్తున్నాయి.. అయితే మిగతా భాగాలన్నీ మాత్రం అందంగా ఉన్నాయి.పై భాగం అంతా స్వార్డ్ ఫిష్ కి మల్లే నల్లగా ఉంది.. పొట్ట మాత్రం వెండి రంగు లో ఉంది.చూపులు కి మహా నాజుకు గా ఉంది.దాని పళ్ళు రంపాల మాదిరి గా ఎనిమిది వరసల్లో ఉన్నాయి.మహా పదును గా ఉంటాయి.దానిలో సందేహం లేదు.సముద్రం లోని  చేపల్ని తిండానికి పుట్టిన పుటకాయే అది.వేగం లోను,శక్తి లోను దానికి ఎదురే లేదు.

తాను వేటాడి తీసుకొస్తున్న ఈ చేప యొక్క రక్తం ని పసిగట్టింది గదా ...అందుకే  ఈ షార్క్  వెంటబడి వస్తోంది.ముసలాయనకి బాగా తెలుసు..ఈ  జీవం అనుకున్నది చేసేదాకా  వదలని రకం. ఒకసారి చేప కేసి ,షార్క్ కేసి నిశితం గా చూశాడు.అంతా కలలా  అనిపించింది.నన్ను చికాకు చేసే అవకాశం దానికి ఇస్తానా..నీకు మూడింది లే పో అనుకున్నాడు.

షార్క్ పడవ కి చేరువ గా వచ్చింది.ఆ చేపని కొరకడానికి తన రంపపు పళ్ళ తో ప్రయత్నం చేస్తోంది.ఎట్టకేలకు అది విజయం సాధించింది.  మొత్తానికి కొంత భాగం ని కొరికి తిన్నది.ఆ షార్క్  తల భాగం    నీళ్ళ మీద ఉంది... మిగతా భాగం నీటిలో  ఉంది.ఇక జాగు చేయ దల్చుకోలేదు ముసలాయన.  హార్పూన్ కి  ఉన్న బల్లేన్ని సరిగ్గ షార్క్ కంటి మీద దిగేలా పొడిచాడు.దాని  కళ్ళు పెద్దగా ఉన్నాయి.దాని మెదడు లోకి దిగేల కొన్ని  పోట్లు వేశాడు. ఒక కసి తో ఉన్న శక్తిని అంతటిని ఉపయోగించి కీలకమైన దాని భాగాల్ని  పొడిచి పారేశాడు.

ఉన్నట్లుండి షార్క్ ఒక్కసారి గా పైకి ఎగిరింది. దానిలో ప్రాణం లేదు.  అయినా మళ్ళీ ఎగిరింది. హార్పూన్ కి ఉన్న తాడు ని లాగిపారేసింది.కాసేపు కొట్టుకున్న తర్వాత ఆ చలనమూ ఆగిపోయింది.దాని కళేబరాన్ని అలా చూడసాగాడు ముసలాయన... అంత తొందరగా చావు ని అంగీకరించే రకం కాదది.. అందుకే దాన్ని  అలాగే చూస్తున్నాడు. చివరకి  అది చనిపొయిందని నిర్ధారించుకున్నాడు.
రమారమి నలభై పౌండ్ల దాక చేప మాంసాన్ని గుంజేసింది  ఈ షార్క్.అంతే కాదు తన హార్పూన్  కి ఉపయోగించే తాడు ని సైతం లాగి  పారేసింది. మళ్ళీ  నా ఈ చేప  కి రక్తం కారడం షురూ అయింది...దీన్ని  పసిగట్టి వెంటబడే జీవాలు ఎన్నో ఈ సముద్రంలో.ఎందుకనో చేప వేపు చూడాలనిపించలేదు.  అదీ, నేను ఇద్దరమూ దెబ్బతిన్నవాళ్ళమేగా ఇపుడు అనిపించింది ముసలాయనకి.

"మొత్తానికి ఆ షార్క్ ని మట్టుబెట్టాను.అది మామూలుది కాదు.ఇది కల అయితే బాగుండు.నేను ఏ చేపనీ పట్టలేదు. ఏం లేదు.న్యూస్ పేపర్లు పరిచిన ఆ నా మంచం లో పడుకొని కంటున్న కల అయితే  బాగుండు ..ఇదంతా.."

మనిషి పుట్టింది ఓడిపోవడానికి కాదు.తన ప్రయత్నం లో భాగంగా నాశనమై పోవచ్చునేమో గాని మనిషి ఎప్పుడూ ఓడిపోడు.క్షమించు చేపా నిన్ను చంపినందుకు...ఇపుడు నాకు చెడు కాలం దాపురించింది.. హార్పూన్ ఆయుధం కి ఉన్న తాడూ పోయింది.ఆ షార్క్ మహా కౄరమైనది, తెలివైనది..అయితే అంతకి మించిన వాడిని నేను.కాకపోవచ్చునేమో..!ఇంకొన్ని ఆయుధాలు పట్టుకొస్తే బావుండేది.

" ఏ ముసలివాడా ...మరీ ఎక్కువ ఆలోచించకు..పడవ మీద అలా సాగిపోతూనే ఉండు.ఏదైనా వస్తే అప్పుడు చూసుకోవచ్చులే.."

" నేను ఆలోచించకపోతే ఎలా...నాకు మిగిలింది అదే గా.అన్నట్లు ఆ ఆటగాడు De Maggio నేను షార్క్ ని చంపిన విధానాన్ని చూస్తే ఏమంటాడో...మెచ్చుకుంటాడా..?నీకు ఒకప్పుడు కాలికి దెబ్బ తగిలి ఎముక ఎలా చికాకు చేసిందో...ప్రస్తుతం నా  చేతులు గాయాలతో అలానే అయ్యాయి..అయితే అప్పుడెప్పుడో ...ఒకసారి తేలు నో దేన్నో తొక్కితే అది కుట్టింది చూడు..భరించరాని నొప్పి...అప్పుడు కలిగింది.


అవన్నీ ఎందుకు...కాస్తా సంతోషం కలిగించే విషయం ఆలోచించరాదు..ప్రతి నిమిషం ఇప్పుడు ఇంటికి దగ్గర గా వచ్చేస్తున్నావు గదా ..పోయిన చేప మాంసం గురుంచి ఎందుకు రంధి ..?ఓ నలభై పౌండ్ల మాంసం బరువు తగ్గింది కదా.. అలా అనుకోరాదూ..! ఈ విధంగా తనలో తాను మాటాడుకుంటూ సాగుతున్నాడు. 
                                  19
"నేను  ఒక ముదుసలిని... అయితే ఆయుధం లేని వాడిని కాను..."

గాలి చల్లగా వీస్తోంది.హాయిగా సాగిపోతున్నాడు.తనతో పాటు తీసుకు రాబడుతున్న చేపని  చూశాడు.ఆశ మళ్ళీ చిగురించింది.అదీ గాక ఇలా ఓ ప్రాణి ని చంపేది కూడా పాపమే గా అనిపించింది.అయినా ఇప్పుడు దాని గురుంచి ఎందుకు..చాలా ఉన్నాయి ఆలోచించడానికి...అసలు వాటి గురుంచి కూడా తనకి తెలీదు.నా ఒక్కడి కోసమేనా నేను దీన్ని చంపింది.. ఎంతోమంది తినడానికేగా..తినే జనాలు వాళ్ళే ఆలోచించనీ ఈ పాప పుణ్యాల గూర్చి..!నువ్వు ఓ జాలరి గా పుట్టాలని,అది చేప గా పుట్టాలని రాసి ఉంది.దానికి చేసేముంది.ఇలా ఆలోచిస్తూఉన్నాడు ముసలాయన.

రేడియొ ఉన్నా లేదా పేపర్ ఉన్నా బాగుండు ఊసు పోవడానికి..లేకపోతే ఇగో ఇదే ఆలోచనలు. దీన్ని అమ్మడానికో...దీని వల్ల జీవించడానికో ..దాని కోసమే ఈ పెను చేపను చంపలేదు.ఒక జాలరిగా ఇది నాకు గర్వకారణ మైన విషయం.చేప బతికి ఉన్నప్పుడైనా ,చచ్చిన తర్వాతనైన ఒక లాగే దాన్ని నేను ప్రేమిస్తాను. అలాంటపుడ్ చంపె ఇది నాకు లేదా..అది  పాపమా?

"ఏయ్ ముసలివాడా నువు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్ సుమా "  తనలోనే అనుకున్నాడు.
మరి ఆ పెద్ద పళ్ళ జీవం అదే ఆ షార్క్ ని చంపే పనిలో నువ్వు బాగానే ఆనందించావు గదూ..నువ్వు ఎట్లా చేపల మీద బతుకుతావో..అదీ అంతేగా.. అది నానా చెత్త ని తినేది గాదు.అందంగానూ,భయ రహితం గానూ ఉండే జీవం అది.

అవును నన్ను  నేను కాపాడుకుండానికే దాన్ని చంపింది.గట్టి గానే అన్నాడు.ప్రతి జీవి ఇంకో జీవి ని ఏదో రకంగ చంపుతూనే ఉంది.ఈ చేపలు పట్టే పని నన్ను ఎలా బతికిస్తున్నదో ,అదే రకంగా నా ప్రాణాలు కూడా తీస్తుంది.నన్ను నేను మోసం చేసుకోరాదు.అది నిజం.

కొద్దిగా కిందికి ఒంగి ఆ షార్క్ చేపని ఎక్కడైతే కొరికిందో అక్కడ కొద్దిగ మాంసం తుంపి తీసుకుని నోట్లో వేసుకుని నమిలాడు.  బాగానే ఉంది.ఫర్లేదు.మార్కెట్ లో రేటు బాగానే వస్తుంది.అయితే ఒకటి..ఇక్కడ ఈ సముద్రపు నీళ్ళ లో ..దీని వాసన ..మిగతా జీవాలకి కొట్టకుండా తీసుకురావడం కుదరని పని..మళ్ళీ ఏ షార్క్ లాటి దో వెంటబడితే..అదీ తన భయం.

చల్ల గాలి అలాగే వీస్తోంది. ఈశాన్యం వేపు కి తిరిగింది..ఇదిలానే ఉంటుంది ..ఆగదు ఇప్పట్లో.ముసలాయన ముందుకి చూశాడు ..దరిదాపుల్లో  ..ఏ నౌక యొక్క పొగ గాని... ఇంకా పడవలు గాని కనబడటం లేదు.ఒక్క పిట్ట కూడా లేదు.ఏదో చిన్న చేపలు అక్కడక్కడ.. నీళ్ళ మీద తేలుతున్న గడ్డి గాదం లాటిది..!రెండు గంటలు గా తిరుగు ప్రయాణం సాగుతూనే ఉంది.పడవ మీదనే కాస్త అలా ఒరిగి చేప మాంసాన్ని నములుతున్నాడు.

అంతలోనే ...రెండు షార్క్ లు ..ఒకటి ముందు కనిపించింది..తగులుకుంటూ వస్తూనే ఉన్నాయి..తన చేప వైపు..!ఏయ్ ..అంటూ గట్టిగా అరిచాడు.గోధుమ రంగు లో ఉన్నయవి...చేప వాసనని పసిగట్టి వెంటబడ్డయి.తెడ్డు కి ఓ వేపు పదునైన కత్తి ఉన్నది..వీటి దుంప తెగ.. ఇవి వాసన కొట్టి చస్తున్నాయి..వీటికి ఉచ్చం నీచం లేదు..ఏది దొరికితే  అది తినిపారెసే ఒక రకమైన షార్క్ జాతి ఇది. ఆకలైతే తెడ్డు ని కూడా కొరుకుతాయి.తాబేలు అనీ కాదు మనిషి అని కాదు..ఏది దొరికితే దాన్ని తినేసే రకం ఇవి.

" ఆ..ద ..ద.." అన్నాడు ముసలాయన.అవి పడవ కిందికి చేరి ఊపడం చేస్తున్నాయి. ఒకటి మాత్రం కొద్దిగ ఇవతలికి వచ్చి ముసలాయన్ని చూడసాగింది. ఇదే సమయం అని ముసలాయన తెడ్డు కి ఉన్న కత్తి తో సరిగ్గా దాని మెదడు ప్రాంతం లో ఒక వేటు వేశాడు.ఏ మాత్రం తెములుకోడానికి అవకాశం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ అలా వేస్తూనే ఉన్నాడు.కాసేపటికి అ షార్క్ జీవ  రహితం గా నీళ్ళ మీద తేలడం ని నిర్ధారణ చేసుకున్నాడు.


ఇంకో షార్క్ ఉంది గా...అది  పడవ పక్కగా వచ్చి  దబ్బున బాదింది తన శరీరం తో. బలం కొద్దీ తెడ్డు తో గట్టిగా మోదాడు.  అది తప్పించుకొంది.ముసలాయన భుజం లో నొప్పి గా అనిపించింది.అది మళ్ళీ తల బయట పెట్టింది..ఈసారి మళ్ళీ తెడ్డు కి గల కత్తి  దాని తలకి తగిలేలా మోదాడు.దాని కంట్లోనూ,వెన్ను దగ్గర,మెదడు దగ్గర బాదాడు.ఆ షార్క్ పండ్ల లో తెడ్డు కి ఉన్న కత్తి ని పెట్టి గుండ్రంగా తిప్పాడు. పో..సముద్రం లో మైలు కిందికి  దిగి పో... అక్కడ నా చేత చంపబడిన నీ మిత్రుడు ఒకడుంటాడు..వాడిని కలుసుకో పో...అంటూ అరిచాడు ముసలాయన.  
                                     21
వాటిని చంపాలని తను అనుకోలేదు.అయితే ఆ షార్క్ ల్ని బాగానే గాయపరిచిన  ఆమాట మాత్రం నిజం.నేనే గనక రెండు చేతులతో ఆ గద ని పట్టుకుని కొట్టి ఉంటే ఆ మొదటిది చచ్చి ఊరుకునేది.తాను తీసుకొస్తున్న చేప వేపు చూడాలనిపించలేదు.సగాని కి పైగా దాని మాంసం నాశనమయింది.సూర్యుడు అస్తమించాడు..ఆ రెండు చేపలతో పోరాటం లో ఉండగానే.

కాసేపటి లో చీకటి అలుముకుంటుంది. ఇంకొద్ది సమయం లో హవానా నగరపు వెలుగులు దూరం నుంచి కనబడాలి.అలా కాకపోయినా ఏదో ఒక బీచ్ లో ఉండే లైట్లన్నా కనబడాలి.నేను ఇప్పుడు ఎంతో దూరం లో లేను.అయినా నా గురుంచి వ్యాకులపడేది ఎవరని...ఆ కుర్రవాడు నా గురుంచి బాధపడచ్చు..ఇంకా పాతకాలపు జాలరులు కొందరు ..అలా ఉండొచ్చునేమో.ఏమైనా ఒక మంచి ఊరు లోనే నేను జీవిస్తున్నాను.

ఇప్పుడు చేప తో కబుర్లు చెప్పాలని అనిపించడం లేదు.ఏముందని అక్కడ.ఉన్నట్లుండి తోచింది.అక్కడుంది సగం చేప నే గా.చేపా..నేను సముద్రం లో చాలా దూరం పోయాను.ఇద్దరమూ దెబ్బ తిన్నాము.అయితే ఒకటి ..మధ్య లో చాలా షార్క్ లిని చంపాము గదా.నువ్వు ఇప్పడి దాకా ఎన్నిటిని చంపి ఉంటావు..నీ తల మీద బల్లెం లాటి మొప్ప ఉంటుంది గాని ఎందుకు..అది పనికిరానిది.
ఆ చేప యే గనక మామూలు గా ఈదుతున్నప్పుడు షార్క్ లాటిది వస్తే ఏం చేస్తుందో.ఈ రాత్రి లో గాని అది వస్తే ఏమి చేస్తుందో..! సరే నువ్వు ఏమి చేస్తావు...నేనా ..చివరి దాకా పోరాడుతా..!ఇలా తనలో తను అనుకుంటూన్నాడు.ఇప్పుడు వెలుతురు లేదు సముద్రం మీద.గాలికి అలా ముందుకు సాగుతోంది పడవ.రెండు అర చేతుల్ని రుద్దుకుని గుప్పిళ్ళు మూసి తెరిచి ..నేను ఇంకా బతికే ఉన్నాను..అనుమానం లేదు అనుకున్నాడు.

కాసేపు వెనక్కి జారగిలబడి నాకేం కాలేదు..నా భుజాలే నాకు చెబుతున్నాయి అని సర్దుకున్నాడు.నాకు చేప చిక్కితే చాలు..ఎన్నో ప్రార్ధనలు చేస్తానని అప్పుడు అనుకున్నా గాని..ఇప్పుడు బాగా అలిసిపోయాను.ఆకాశం నుంచి కొంతైనా వెలుతురు వస్తుందా అన్నట్లు పైకి ఓమారు చూశాడు. ఇటు చూస్తే ఈ చేప మాంసం సగమే మిగిలింది.అదృష్టం...ఈ మాత్రమైనా దక్కింది.అసలు అంత లోపలికి పోవడమే నువ్వు చేసిన పొరపాటు.

" చక్కగా పడవ నడుపుకుంటూ పో..ఇంకా నీకు అదృష్టం ఉందిలే"

" దీన్ని అమ్మి ఏమి కొనేదని"

" పోయిన ఆ హార్పూన్ నా..విరిగి పొయిన కత్తి నా..పాడయిన ఈ చేతుల్నా "

" సరే..ఏదో ఒకటిలే..కాని ఎనభై నాలుగు రోజులకి గదా ఇది దొరుకుతుంటా ..అది మామూలా"

చ..అర్ధం లేని విషయాలు అవన్నీ ఆలోచించకూడదు ఇంకేమీ అనుకున్నాడు తనలో..!అదృష్టం అనేక రూపాల్లో వస్తుంది.ఎవరు గుర్తించగలరు దాన్ని..?దానిలో కొద్దిగా నాకు దక్కాలి..దానికి ప్రతి గా ఎంతో కొంత ఇస్తా.నాకు ఇప్పుడు కావలసింది ఒకటే..తీరం నుంచి కనబడే లైట్ల యొక్క కాంతి.చక్కగా సర్దుకు కూచున్నాడు.

అప్పుడు రాత్రి లో పది కావచ్చునేమో.ఎట్టకేలకు దూరం నుంచి లైట్లు ఇచ్చే కాంతి లీల గా కనిపిస్తోంది.గాలి పెరిగింది.సముద్రం చికాకు గా ఉంది.కాసేపటి లో తీరం కి చేరుకుంటాను.అయిపోయింది అనుకోడానికి లేదు..మళ్ళీ ఏవో దాడి చేయవచ్చు.రాత్రి పైగా ఆయుధం లేదు.చేసేదేముంది.

వళ్ళంతా నొప్పులు గా ఉంది.దెబ్బతిన్న భాగాలు ..వీటికి తోడు చలి రాత్రి.ఇంకా ఏమి ఉండదులే అనుకున్నాడు.అర్ధరాత్రి సమయానికి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.కాని ఫలితం లేనిదే అది.ఈ సారి దాడి చేసిన షార్క్ లు అన్నీ గుంపులు గా వచ్చాయి.వాటి మొప్పలు అవీ రాత్రి లో మెరుస్తున్నాయి.కొన్ని పడవ కింద చేరి కదుపుతున్నాయి.ఉన్న గద లాటి దాని తో అందిన కాడల్లా కొట్టసాగాడు.కాసేపటికి అది కాస్తా నీళ్ళ లో జారిపొయింది..మొత్తానికి అవే లాగిపారేశాయి.

పడవ వెనక అమర్చే పొడవైన కర్రలాటి దాన్ని తీసి అందిన వాటినల్లా బాదటం చేస్తున్నాడు.అవి ముందుకు వచ్చాయి.ఒకదానికొకటి మంచి అనుసంధానం గా కదులుతున్నాయి.మిగిలి ఉన్న ఆ కొద్ది చేప మాంసాన్ని ముక్కలు గా కొరికి వేస్తున్నాయి.అటూ ఇటూ తిరుగుతున్నపుడు అగుపిస్తున్నాయి.


మొత్తానికి ..తన మానాన  తాను బాదుతూనే ఉన్నాడు.ఎన్ని తిప్పలు పడినా ...అవి చేపని తినడం విజయవంతం గా ముగించాయి.ఇక ఏమీ లేదనుకొని ..అవి నిష్క్రమించాయి.ముసలాయనకి శ్వాస తీసుకోవడం భారం గా తోచింది.నోరంతా అదోలా అయింది.కాసేపటికి సర్దుకున్నాడు.సముద్రం లోకి ఊసి " తినండి..మొత్తం తినండి...ఒక మనిషిని చంపినట్లు గా ఆనందించండి" అన్నాడు ఆ షార్క్ ల్ని ఉద్దేశించి..! 
                                       22
పడవ అలాగే ముందుకు పోతున్నది.మనసు లో ఎలాటి భావాలు లేవు...దేని గురించి కూడా.జరిగినదంతా గతం లోకి జారుకున్నది.సాధ్యమైనంత చక్కగా తెలివి గా ఒడ్డుకి చేరుకోవడమే ఇప్పుడు తన ముందు ఉన్నది.బల్ల మీద ఉన్న పదార్ధాన్ని తన్నుకుపోయినట్లు ఇక మిగిలిన ఆ చేప అస్థి పంజరాన్ని కూడా ఏదో షార్క్ తన్నుకు పోతుందా ..పోనీ.దాని గురించి లక్ష్యపెట్టదలచలేదు.పడవ ని చక్కగా నడపడమే ఇప్పుడు తన ముందున్నది.ఎలాంటి బరువు లేకుండా తేలిగ్గా పోతున్నది పడవ.

పడవ కి వెనుక ఉన్న టిల్లర్ అనబడే బలమైన కర్ర ని కొద్దిగా కొరకడం తప్ప పెద్ద గా ఏం చేయలేదు ఆ షార్క్...మొత్తానికి దాన్ని అది ఉండే స్లాట్ లో పెట్టేశాడు.ఆ బీచ్ లో వెలుగుతున్న లైట్లు మిణుకు మిణుకు మంటూ అగుపిస్తున్నాయి.ఇంచు మించు ఇక ఇంటి కి చేరుకున్నట్లే లెక్క.ఈ పవనాలు ఎంత మంచివో...అలా తీసుకుపోతుంటాయి...అయితే సముద్రం మటుకు శత్రువులు,మిత్రులు ఇద్దర్నీ కలిగి ఉన్నట్టిది.మంచం మరి...అదీ మంచిదే...దెబ్బతిన్నప్పుడు శరీరానికి హాయిని  ఇస్తుంది. నువ్వు ఇప్పుడు ఆ స్థితి లోనే ఉన్నావు.నీకిప్పుడు మంచం అవసరం.

" అదేం లేదు..నేను చాలా లోపలకి వెళ్ళాను.." గట్టిగా నే పైకి అరిచాడు.
మొత్తానికి హార్బర్ లోకి వచ్చేశాడు.టెర్రస్ అంతా లైట్లు వెలుగుతున్నాయి.అంతా మంచాలు ఎక్కి గాఢ నిద్ర లో ఉన్నారు.గాలి మంద్రంగా వీస్తూ ..వేగాన్ని అందుకున్నది క్రమంగా..!తాను దిగేప్పుడు సాయం రావడానికి ఎవరూ లేరు.దిగి..ఆ పడవ ని మెల్లగా తోసి అక్కడ ఉన్న రాయికి కట్టేశాడు.పడవకి ఉన్న తెర చాపలు అవీ విప్పుకున్నాడు.ఒడ్డు కి పై భాగం లోకి వెళ్ళడానికి తయారయ్యాడు.అప్పుడు గాని అర్ధం కాలేదు తాను ఎంత అలిసిపోయింది..!ఒక్క క్షణం ఆగి ఆ చేప ..తాను వేటాడిన చేపని చూశాడు.ఏముందని అక్కడ..అస్థిపంజరం..కాకపోతే తల భాగం లో కొద్దిగా నల్లటి కండ...ఆ మొప్పలు..!

భుజం మీద సరంజామా ఉంచుకొని ముందుకి కదిలాడు.పడిపోయి తమాయించుకున్నాడు. లెగబోయాడు...ఎందుకైనా మంచిదని అలాగే కాసేపు కూర్చొని ..రోడ్డు వేపు చూశాడు.ఒక పిల్లి కనబడింది..దాని పనిలో అది తిరుగుతున్నది.సరంజామా ని కింద బెట్టి తను లేచి నిలబడ్డాడు.ఇంటికి వెళ్ళే లోపు లో కనీసం అయిదు సార్లు అలా కూర్చుంటూ వెళ్ళాడు.

మొత్తానికి లోపలకి వెళ్ళి ఆ తెరచాపల్ని వాటిని గోడ కి ఆనించాడు.నీళ్ళ సీసా లో ఉన్న కొన్ని నీళ్ళ ని నోట్లో పోసుకున్నాడు.వెంటనే మంచం మీద కి ఒరిగాడు.దుప్పటి కప్పుకున్నాడు.అర చేతుల్ని అలాగే తెరుచుకొని వాటి మీద భారం పడకుండా పడుకున్నాడు.పొద్దున్నే ఆ కుర్రవాడు వచ్చాడు..అలా ప్రతి రోజు వచ్చి చూసిపోతున్నాడు..ఈ రోజు ముసలాయన తిరిగి వచ్చాడు.అతని చేతులకి అయిన గాయాల్ని చూసి కుర్రవాడు రోదించసాగాడు.కాఫీ తీసుకు వద్దామని బయటకి వచ్చాడు..దారి పొడుగూతా ఏడుస్తూనే ఉన్నాడు.

అప్పటికే కొంతమంది జాలరులు ముసలాయన పడవ దగ్గరకి వచ్చి ఆ చేప స్వరూపాన్ని చూస్తున్నారు.కొంత మంది అడిగారు." ఎక్కడ అతను" అని." నిద్రపోతున్నాడు..ఇప్పుడే ఎందుకు లేపడం " అన్నాడు కుర్రాడు.

" ఈ చేప పెద్దదే..పద్దెనిమిది అడుగులు ఉంది.." అన్నాడు ఒకతను.

కుర్రవాడు టెర్రస్ వద్ద ఉన్న హోటల్ లో కాఫీ ఇమ్మని అడిగాడు." కొద్దిగా పాలు,పంచదార ఎక్కువ వేసి.. స్ట్రాంగ్ గా ఇవ్వండి" అన్నాడు.

" ఇంకా ఏమన్నా కావాలా " హోటల్ అతను అడిగాడు.

" ఇప్పుడు అయితే ఇంతే..ఏమి తింటాడు అనేది తర్వాత చూస్తాను"

" నిన్న నీకు రెండు చేపలు ..భలే మంచివి పడ్డాయి"

" నా వాటికేం వచ్చింది లే"  అంటూ కుర్రవాడు ఏడవసాగాడు.

" చెప్పు ఇంకా ఏమన్నా కావాలా "

" వద్దు.నేను మళ్ళీ వస్తా.శాంటియాగో (ముసలాయన) ని ఇబ్బంది పెట్టవద్దని వారికి చెప్పండి.."

" ఓహ్..అతనితో చెప్పు.. నాకూ బాధ గా ఉందని"

" థాంక్స్ "  అన్నాడు కుర్రవాడు.
ముసలాయన లేచేవరకు ఓపిగ్గా ఆ గది లోనే కూర్చున్నాడు కుర్రాడు.కాసేపు లేచినట్లు లేచి నిద్ర లోకి జారుకున్నాడు.చల్లారిన కాఫీ ని వేడి చేయడానికి పుల్లలు ఏరుదామని బయటకి వచ్చాడు కుర్రాడు.ముసలాయన లేచాడు.

" ఇందా..ఈ కాఫీ తాగు" అంటూ ముసలాయనకి ఓ గ్లాస్ లో పోసి ఇచ్చాడు.

ముసలాయన తీసుకొని తాగాడు. " అవి బాగా దెబ్బ తీశాయి నన్ను..అదే మనోలిన్ చేప...నిజంగా ఏమి దెబ్బ తీశాయి.."

" ఆ చేప కాదేమో దెబ్బ తీసింది..నేను అనుకోవడం.."

" లేదు..ఆ చేప ని పట్టిన తర్వాత నే అయిన చికాకంతా.."

" అక్కడ నీ పడవ ని...దాని లోని గేర్ ని ..పెడ్రికొ ..ఆ హోటల్ ఆయన చూస్తుంటాడులే..దాని గురుంచి చింతించకు..ఆ చేప తల ఒక్కటే ఇక మిగిలింది కదా ..ఏమి చేద్దామని దాన్ని.."

" దాన్ని పెడ్రికో  ని తీసుకోమని చెప్పు..ఎరలు గా దాని ముక్కల్ని ఉపయోగించుకుంటాడు."
చెప్పాడు ముసలాయన.

" మరి ఆ బల్లెం"

" నీకు కావలసి వస్తె తీసుకో.."

" తీసుకుంటాలే..ఇంకా మిగతా వాటి గురుంచి మనం ఆలోచన చేద్దాం"

" నాకోసం వెతికారా"

"అవును. తీరం లోని దళాలు..ఇంకా విమానాల ద్వారా.."

" సముద్రం చాలా పెద్దది.దాంట్లో నా పడవ ఎంతని. " ఫర్లేదు నా గురుంచి కూడా శ్రద్ధ తీసుకునేవారు ఉన్నారు అని పించి ఆనందం గా తోచింది." నిన్ను చూడలేకపొయా ఇంత కాలం..ఇంతకీ నీ ప్రగతి ఎలా ఉంది.." అడిగాడు ముసలాయన.
" మొదటి రోజున ఒకటి పడింది.రెండో రోజున ఒకటి..మూడో రోజున రెండు చేపలు పడ్డాయి..."

"బాగుంది"

" ఇక మనం ఇద్దరం వేట కి పోదాం"

" లేదు ..లేదు..నాతో ఉంటే అదృష్టం రాదు"

" దాన్నటు పోనీ.. ఆ అదృష్టం ని నేనే లాక్కొస్తా"

"మీ వాళ్ళు వద్దంటారేమో"

" నాకదేం లెక్క లేదు.నిన్న నాకు రెండు చేపలు పడ్డాయి.ఇకనుంచి మనం కలిసే పడదాం.నీ నుంచి నేర్చుకునేది ఎంతో ఉంది.."

" సరే..మంచి పదునైన బ్లేడ్ చేయించు పడవ లో ఉపయోగపడానికి..నాదగ్గరున్నది పొయింది గదా..చాలా పదును గా ఉండాలి."

" సరే..కావలసినవి అన్నీ చేయిస్తా.."


" ఎన్ని  రోజుల్లొ అయితే బావుంటుంది.."

" మూడు రోజుల్లో లేదా ఆ పైన అనుకో"

" సరే..సిద్ధం గా ఉంచుతాలే గాని ...  నీ చేతుల గాయాలు తగ్గనీ ముందు"

" దాన్ని ఎలా తగ్గించుకోవాలో నాకు ఎరుకే గాని...చాతి లో కొద్ది గా కలుక్కుమన్నట్టన్నది రాత్రి.."

"అది కూడా తగ్గనీ.. నువ్వు పడుకో ముందు ...తినెందుకు ఏమైనా తెస్తా ఉండు.."

" అలాగే పేపర్లు ఉంటే తీసుకు రా...అదే నేను మిస్ అయిన రోజులవి.."
" అన్నీ తెస్తాలే..నీకు అయిన గాయాలకి మందులు కూడా తెస్తా"

" మర్చిపోకుండా చెప్పు..ఆ చేప తలని పెడ్రికో ని తీసుకోమని చెప్పు.."

" నాకు జ్ఞాపకం ఉందిలే"

అలా ఆ కుర్రవాడు ఇంట్లోనుంచి బయటకి వచ్చి రోడ్డు వేపు కి తిరిగాడు.మళ్ళీ అతను ఏడుస్తూనే ఉన్నాడు.

ఆ మధ్యానం తీరం వద్దన ఉన్న టెర్రస్ దగ్గరకి టూరిస్ట్ లు ఎక్కడినుంచో వచ్చారు.సందడి గా ఉంది ..!పార్టీలు జరిగిన దానికి గుర్తు గా ఆ పక్కనే కొద్ది దూరం లో బీర్ డబ్బాలు అవీ ఉంటాయి.అక్కడ నే ఉన్న పెను చేప యొక్క అస్థి పంజరం ..దానికి తగులుతున్న సముద్రపు అలలు.ఇది చూసి అడిగింది ఓ టూరిస్ట్ " ఏమిటది.. " అని.

" అది టిబురోన్ రకం ..ది ..షార్క్ కావచ్చును" వెయిటర్ జరిగినది అంతా చెప్పాలని ప్రయత్నించాడు.

" షార్క్ లు ఇంత చక్కని తోకలు కలిగి ఉంటాయా...నాకు తెలియదు నిజంగా .." అందామె.

" నాకూ తెలియదు" ఆమె తో పాటూ ఉన్న ఇంకోతను చెప్పాడు.

ఆ రోడ్డు కి అవతల ఏమి జరుతోందంటే ...అక్కడున్న తన నివాసం లో ముసలాయన ..మళ్ళీ నిద్ర లోకి జారుకున్నాడు.ఆ కుర్రవాడు అలాగే చూస్తూ కూర్చున్నాడు ..మొహం మంచం లోకి  పెట్టి నిద్రపోతున్న ఆ ముసలాయన్ని చూస్తూ.ఇప్పుడు ముసలాయన కలలో కి సిమ్హాలు  వస్తున్నాయి. (సమాప్తం)    

No comments:

Post a Comment