30-4-2023 నాటి ఈనాడు దినపత్రిక (ఆదివారం అనుబంధం) లో నా అనువాద పుస్తకం పై రివ్యూ (గౌరహరి దాస్ కథలు)
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Sunday, May 14, 2023
Tuesday, January 3, 2023
గౌరహరి దాస్ కథలు పుస్తకం పై నిన్నటి రోజున వచ్చిన రివ్యూ
Saturday, December 31, 2022
బరంపురం లో ఒక రోజు
2022 వ సంవత్సరానికి ఇది చివరి రోజు. ఇంకా కొన్ని గంటల్లో 2023 వ లోకి ప్రవేశిస్తాము. ఈ సమయాన, ఈ నెలలో బరంపురం లో జరిగిన వికాసం వారి స్వర్ణోత్సవ సంబరాల గూర్చి కొన్ని మాటలు రాయాలని ఈ ప్రయత్నం. 24 వ తేదీన హాజరు కాలేకపోయాను కొన్ని అవరోధాల వల్ల. అయితే 25 వ తేదీన వెళ్ళగలిగాను. మిత్రులు విజయచంద్ర గారు అర్ధరాత్రి అనుకోకుండా నా ఫోన్ కి సమాధానమిచ్చి బస ఏర్పాటు చేసిన గ్రీన్ హౌస్ డార్మిటరి కి దారి చూపారు. అందుకు వారికి కృతజ్ఞతలు. ఆ 24 అర్ధరాత్రి నాడు,చన్నీళ్ళు స్నానం చేసి చక్కగా పడుకున్నాను.తెల్లారి లేస్తే ఆ రూం లోనే సూర్యరావు గారు (శ్రీశ్రీ మహాప్రస్థానానికి బొమ్మలు వేసిన వారు) ఇంకా రామినాయుడు గారు (కన్యాశుల్కం నాటకం ఫేం) కనిపించినారు.వారితో అనుకోని పరిచయం చాలా ఆనందం కలిగించింది.అదేవిధంగా విజయచంద్ర గారి సోదరులు రొక్కం కామేశ్వర రావు గారు కూడా అక్కడనే ఉన్నారు.
With Sri Gourahari Dasఅంతా కలిసి బరంపురం వీథుల్లో తిరుగుతూ టీ టిఫిన్లు లాగిస్తూ కాలక్షేపం చేశాము.ప్రోగ్రాం సమయానికల్లా ప్రొద్దుటే పదింటికి ఆంధ్రా హాల్ కి వచ్చాము.అక్కడ ప్రసిద్ధ సాహితీవేత్తలు కె శివారెడ్డి గారు,అప్పల్నాయుడు గారు,వాసిరెడ్డి నవీన్ గారు ఇంకా తదితరులు కనిపించారు.పలకరించి మళ్ళీ అక్కడ కొద్దిగా అల్పాహారం కానిచ్చాము.ఎంతో మంది సాహితీ అభిమానులు ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు.అంతా కళకళ లాడుతూ ఉంది. ఆ తర్వాత సభాప్రాంగణం లోకి వచ్చాము.ప్రముఖ ఒరియా రచయిత ,సంపాదకులు గౌరహరి దాస్ గారు కనిపించారు.వారు ఎంతో అభిమానం తో ఆలింగనం చేసుకున్నారు.ఆయన రాసిన కథలే నేను తెలుగు లోకి "గౌరహరి దాస్ కథలు" అనే పేరు తో అనువదించాను.అది మీకు తెలుసును.ఆ సభలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.నిజానికి ఇది పూర్తిగా దాస్ గారి ఆలోచనయే అని చెప్పాలి.అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలి.
News coverage in Sambad Oriya daily
సభకి శివారెడ్డి గారు అధ్యక్షత వహించారు.నేను గౌరహరి దాస్ గారి కథలు అనువదించి ఆ విషయం వారికి తెలుపగానే చాలా మంచి పనిచేశావు అని అభినందించారు.గౌరహరి దాస్ గారి ఒరియా కథల్ని అనువదించడానికి ప్రధాన కారణం ఆయన ఆ సమాజం లోని ఎన్నో మానవీయ,సాంస్కృతిక కోణాల్ని గొప్ప ఆసక్తికరం గా మలచడమే,ఆ వైదుష్యాన్ని తెలుగు వారికి పరిచయం చేయడానికే అనువాదం చేశాను.భూసురపల్లి వారి ప్రసంగం వినడం ఇదే మొదటిసారి.ఇప్పటి సాహితీతీరుతెన్నుల్ని వారి తో పాటు వాసిరెడ్డి నవీన్ ,అప్పల్నాయుడు గార్లు చక్కగా వివరించారు. కొంతమంది ఒరియా సాహితీవేత్తలు పరిచయం అయినారు.ఏది ఏమైనా బరంపురం అనేది తెలుగువారి సాహిత్యప్రపంచం లో గొప్ప వెలుగులీనే రమ్యసీమ అని చెప్పాలి. ఈ కార్యక్రమానికి వెళ్ళడం లో ప్రధానపాత్ర విజయచంద్ర గారు అని చెప్పాలి. చంద్రునికో నూలు పోగులా ఆయనకి దోస్తోవిస్కీ తెలుగు అనువాదం "కరమజోవ్ సోదరులు" ని మాత్రం ఇవ్వగలిగాను.
ఎందరో మహానుభావులు,అందరికీ వందనములు..!!!
--- మూర్తి కెవివిఎస్
Monday, December 19, 2022
గుర్తుండే అనువాద సంకలనం
Please click the link to see it clearly https://epaper.visalaandhra.com/Home/FullPage?eid=19&edate=18/12/2022&pgid=36783
![]() |
| A Review placed in Visaalaandhra Daily, dt. 18.12.2022 |
Tuesday, November 29, 2022
ఆంధ్రప్రభ దినపత్రిక లో వచ్చిన రివ్యూ
గౌరహరి దాస్ కథలు - సమకాలీన ఒరియా సమాజానికి ప్రతిబింబం (Review)
మనకి పొరుగునే ఉన్న ఒరిస్సా రాష్ట్రం లో ఎలాంటి అద్భుతమైన కథలు వెలువడుతున్నాయో ఈ మధ్యనే తెలిసింది. అదీ ఇటీవల వెలువడిన "గౌరహరి దాస్ కథలు" అనే అనువాద కథా సంపుటి చదివిన తర్వాత తప్పకుండా ఆ అనిర్వచనీయ అనుభూతిని కొంతైనా పంచుకోవాలని అనిపించింది. వస్తువు ని ఎన్నుకోవడం లోనే గాక,దాన్ని పాఠకుని హృదయానికి చేరువ అయ్యేలా తీర్చిదిద్దటం లోనూ మూలరచయిత గౌరహరి దాస్ తనదైన ప్రత్యేకతని ప్రదర్శించారు. దాన్ని అంత సొగసుగానూ తెలుగు భాష లోకి అనువదించారు మూర్తి కెవివిఎస్. మొత్తం ఈ కథా సంపుటి లో పన్నెండు కథలు ఉన్నాయి.ప్రతి కథ లోనూ ఏదో ఒక విన్నూత్న అంశం ఉంది.
భువనేశ్వర్,కటక్ ల వంటి నగరాల నుంచి, దాని మీదుగా తాళబంధ ,పతాపూర్ వంటి ఒరియా గ్రామీణ సీమల్లో కి మనల్ని తీసుకుని వెళతారు రచయిత.అచటి సంస్కృతి,పండుగలు,రాగద్వేషాలు ఒకటేమిటి ఎన్నో మానవ ఉద్వేగాలని ఎంతో గొప్పగా మనముందు ఉంచుతారు.ఈ అనువాద కథల్ని చదివిన తర్వాత ఒరియా రాష్ట్రం గురించి మనకి ఎంతో సదాభిప్రాయం కలుగుతుంది. ఆ రాష్ట్రం పేరెత్తగానే మనకి గుర్తు వచ్చేది తెలుగు రాష్ట్రాల్లో ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు మాత్రమే. కాని అది అత్యంత దురదృష్టకరమైన విషయం. దాన్ని కూడా రచయిత వివిధ కథల్లో ప్రస్తావిస్తారు.
గాజుబొమ్మ అనే కథ లో గ్రామ సీమ నుంచి కలకత్తా నగరానికి ఇటుకబట్టీ లో పనిచేయడానికి వెళ్ళిన ఓ మామయ్య ,తన చిన్నారి మేనల్లుడికి ఇంకా ఇతర కుటుంబ సభ్యులకి బహుమతులు తేవడానికి ఎలా కష్టపడి చెమట కార్చుతుంటాడో చదివితే కళ్ళ వెంబడి నీరు వస్తుంది. మహానగరం లో ఎన్ని వెతలు ఉన్నాయో ఎంతో హృద్యం గా చెప్పారు రచయిత. తండ్రి అనే కథ లో నిజాయితీ గా పనిచేసి చివరి దశ లో జబ్బు పడినపుడు అతని కొడుకు ఎందుకు ఆయన చావుని కోరుకున్నాడో చెప్పిన వైనం జీవితం ని కొత్తగా మరో కోణం లో చూపిస్తుంది.
పాపం అనే కథ ఒరియా రాష్ట్రం లో ఉన్న వైష్ణవ సంప్రదాయ కుటుంబ జీవనాన్ని వివరిస్తూనే ఇప్పటి యువతరం లో వచ్చే మార్పుల్ని వినోదాత్మకంగా చెప్పారు.మన తెలుగు వారికి ఏడుకొండల వాడు ఎలాగో వాళ్ళకి జగన్నాధ స్వామి అలా అన్న మాట. నటదాది అనబడే బ్రహ్మచారి వైఖరి నవ్విస్తూనే మనలో విషాదం నింపుతుంది. కసింద చెట్టు అనే కథ లో పూరి కి వెళ్ళి జగన్నాధుని రథ యాత్ర వీక్షించడానికి ఒక స్త్రీ పడిన కష్టాన్ని వివరిస్తూనే ,సాటి స్త్రీ పట్ల ఆమె మానవత్వం తో వ్యవహరించకపోవడాన్ని గర్హిస్తాడు రచయిత.ఈ కథ చదువుతుంటే మనం పూరీ క్షేత్రం లో తిరుగాడుతున్న అనుభూతి కలుగుతుంది.
ఇల్లు అనే కథ లో ఓ నిర్భాగ్యుడైన తండ్రి వేదన ని వర్ణిస్తూ తరతరానికి వచ్చే మార్పుల్ని చెప్పారు.మధ్య తరగతి జీవితం లో ఉండే ఒరిపిడిని ఈ కథ లో చూడవచ్చు.ఏకుమేకు కథ లో నకుల నాయక్ వంటి వారు మనకి కోర్ట్ ప్రాంగణం లో కనిపిస్తూనే ఉంటారు.రచయిత న్యాయ శాఖ వ్యవహారాల్ని ఎంతో పరిశోధించి ఈ కథ రాశారు అని చెప్పాలి.అహల్య పెళ్ళి కథ లో కనిపించే కథానాయిక ఒక పట్టాన మన మనసుల్లో నుంచి తొలిగిపోదు.బంగారపు ముక్క,సరిపోయింది,నేరము శిక్ష,మాయవృక్షం ఇలాంటి కథలు పాఠకుడిని చాలాకాలం పాటు వెంటాడుతాయి.
మూలరచయిత గౌరహరి దాస్ సమకాలీన ఒరియా సాహిత్య రంగం లో ఎంతో పేరెన్నికగన్న వ్యక్తి. సంబంధ్ అనే దిన పత్రిక కి సంపాదకులు గా పని చేశారు.యాభై కి పైగా పుస్తకాల్ని ప్రచురించారు.కేంద్ర,రాష్ట్ర సాహిత్య అకాడెమీ పురస్కారాల్ని పొందారు.ఆయన కథల్ని ఇప్పటికైన తెలుగు లోకి తెచ్చి తెలుగు పాఠకులకి అందించిన అనువాదకులు మూర్తి గారు ఎంతైన అభినందనీయులు.అనువదించిన విధానం కూడా చదువరి కి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఎంతో ఆసక్తికరమైన శైలి లో ఉన్నది. ఈ పుస్తకం నవోదయా బుక్ హౌస్,హైద్రాబాద్ వారి వద్ద లభ్యమౌతుంది. పేజీలు 144 , వెల రూ.150.
--- కంభంపాటి పవన్ కుమార్
( Printed in Prajakaanksha weekly 27.11.2022)








