రేపటి కోసం (కధ)----మూర్తి కె.వి.వి.ఎస్.
నిన్నటి పేపర్ లో ఆ వార్త చూసిన దగ్గర నుంచి మనసు వికలమై,దేని మీదా లగ్నం చేయలేకపోతున్నాను.కేవలం నా ఒక్కడికి మాత్రమే అలా అనిపిస్తున్నదా లేదా అందరకీ అలా నే అనిపిస్తున్నదా..ఒక వేళ అనేకమంది ని ఆ వార్త అంత లా కదిలిస్తే మరి జనాల్లో కదలిక ఏదీ..?సమాజం లో రావలసినంత అలజడి రావడం లేదేం..?చదివిన రోజున కాస్త బాధ పడటం ...మళ్ళీ యధా విధి గా ఎవరి దైనందిన కార్యకలాపాల్లో వారు మునిగిపోవడం..!అదేనా జరుగుతున్నది..?
" హలో శ్రీనివాస్ గారూ..! ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు" పలకరించాడు మా కొలీగ్ సాంబశివరావు.వెంటనే ఈ లోకం లోకి వచ్చి పడ్డాను.
"ఏం లేదు సార్ ...నిన్నటి వార్త ..ఒకటుంది లెండి..దాని గురించే ఆలోచిస్తున్నాను" అన్యాపదేశం గా జవాబిచ్చాను.
"ఏమిటీ ..మిమ్మల్ని అంతగా కదిలించిన వార్త"
" అదే...మన ఊరి లో నే జరిగిన సంఘటన.తనని ప్రేమించలేదని ఒకమ్మాయిని కొబ్బరి బొండాలు నరికే కత్తి తో నరికి చంపాడే ఒక అబ్బాయి.దాని గురించే ఆలోచిస్తున్నా.."
" ఇలాంటివి ఇంచుమించు ఇప్పుడు ప్రతి ఊళ్ళో నూ జరుగుతున్నాయి..మనం అప్పుడప్పుడూ చదువుతూనే ఉన్నాం గదా"
"అదేమిటండి...నరికి చంపడం ఏమిటి..?అసలు అంతంత కోపాలు ఏమిటి ఈ వయసుల్లో.ప్రేమలు గీమలూ ఈ రోజునే కొత్తగా వచ్చాయా..!ఇష్టం లేకపోతే అంతటి తో వదిలెయ్యాలి లేదా ఏదైనా నోటి తో మాట్లాడుకోవాలి గాని నరికి చంపితే ప్రాణం మళ్ళీ వస్తుందా,అయినా ఒక ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు ,వీళ్ళకి చెప్పే నాధుడే లేడా "కాస్త కోపం గా నే అన్నాను.
"ఎవరు చెపితే ఎవరు వింటారు.ఈ నాటి యువత కి చెప్పేలానే ఉందా ..మాకు అంతా తెలుసు అనే దారి లో ఉన్నారు " వేదాంత ధోరణి లో చెప్పాడు సాంబశివరావు.
కాలేజీ అయిపోయింది.ఇల్లు దగ్గరలోనే గనక నడుచుకుంటూ వెళుతున్నాను.రోడ్డు మీద వెళుతున్న కాలేజీ పిల్లల్ని చూస్తున్నాను.ఇంత సౌమ్యంగా కనిపించే ఈ పిల్లలు ఏ కొద్ది ప్రేమ విఫలమైతే నో ఎందుకని సైకో ల్లా మారిపోతున్నారు,ఏమిటి కారణం..?ఆలోచిస్తున్నాను.వీళ్ళని ఇంతలా ప్రభావితం చేస్తున్నవి ఏమిటి..? సినిమాలు ఇంకా టి.వి.సీరియల్స్ ....కక్ష తీర్చుకో....వెంటాడు..వేటాడు...రక్తాన్ని చిందించు ..ఇవేగదా నేటి యువతరానికి ఇచ్చే సందేశాలు..!ముఖ్యంగా అమ్మాయి ప్రేమ నిరాకరిస్తే ఘోరంగా కక్ష తీర్చుకునే పైశాచికత్వం అదో ఫేషన్ లా ,ట్రెండ్ లా తీర్చిదిద్దుతున్నారు కొన్ని సినిమాల్లో..! అవతల జీవితం నాశనం,ఇవతల జైల్ లో పడి వీడి జీవితం నాశనం..దీనివల్ల ఎవరు ఏం బావుకున్నట్లు...!
నా ముందు ఒక అమ్మాయి,అబ్బాయి ..మా కాలేజీ వాళ్ళే కబుర్లాడుకుంటూ నడుస్తున్నారు.ఇప్పుడు హాయి గా నవ్వుకుంటూ బాగానే కనిపిస్తున్నారు.మళ్ళీ రేపు ఏ లవ్ ఫెయిల్ అవుతేనో ...పేపర్ లో మరో వార్త చూడవలసి వస్తుందా తనకి....నాలో నేనే ఆలోచించుకుంటూ నడుస్తున్నాను.నీ పిచ్చి గాని మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు ..అంతరాత్మ మూలిగింది.లేదు లేదు తనకి తోచింది తను చెప్పాలి.తను ప్రపంచం లో తిరిగి చూసింది,చదివింది,అర్ధం చేసుకున్నది ఈ యువతరం తో పంచుకోవాలి.వారి లో తలెత్తుతున్న పెడ ధోరణి ని ఏ కొద్ది గా మార్చగలిగినా తన జీవితం ధన్యమే అనుకున్నాను.
అవును...రేపు ఫేర్ వెల్ ఫంక్షన్ ఉన్నది కాలేజ్ లో..!ఆ వేదిక ని తను ఉపయోగించుకోవాలి..!వాళ్ళ మెదడు లో ఒక కొత్త విత్తనాన్ని నాటాలి.ఏమో అది పెరిగి పెరిగి వృక్షమై మరెన్నో విత్తనాల్ని అనేక మెదళ్ళ లో పాదుకొల్పుతుందేమో..!ఒక ప్రయత్నం చేద్దాం నష్టం ఏముంది.ఆ రోజు ..ఆ క్షణం రానే వచ్చింది.మా ప్రిన్స్ పాల్ గారు సభకి అధ్యక్షత వహించారు.నా వంతు వచ్చింది మాట్లాడటానికి.
"మై డియర్ యంగ్ ఫ్రెండ్స్...ప్రస్తుతం మిమ్మల్ని మిత్రులు గా భావించే నేను ఒక ప్రత్యేక విషయం చెప్పాలని అనుకుంటున్నా.ఈ రోజున ఫేర్ వెల్ జరుగుతున్నది.మళ్ళీ మీరు మాకు కనబడరు.ఒక వేళ కనబడినా అది వేరు గా ఉంటుంది.ఈ సమయం లో ఉండే అనుబంధం వేరు.ప్రతి ఒక్కరికి యవ్వనం లో కలిగే అనుభూతులు కొన్ని ఉంటాయి.అమ్మాయిలైనా ,అబ్బాయిలైనా ..ఒకటి గుర్తు ఉంచుకొండి ప్రేమ అనేది జీవితం లో ఒక భాగం మాత్రమే తప్పా అదే జీవితం మొత్తం కాదు.కొన్ని ఏళ్ళు పోయిన తర్వాత మీకు అది అర్ధం అవుతుంది.ముఖ్యంగా అబ్బాయిలకి చెప్పేది ఏమంటే ...అమ్మాయిలు కొద్దిగా నవ్వుతూ మాటాడితే ..దాన్ని మీరు మరీ ఎక్కువగా ఊహించుకోకూడదు.ఈ అమ్మాయి నాకే సొంతం ,నా తోనే మాటాడాలి,నన్నే ప్రేమించాలి అలా ఊహించుకోవద్దు.మీరు సరదాగా ఇంకో మనిషి తో ఎలా మాటాడాలి అని అనుకుంటారో వాళ్ళూ అదే భావం తో మాటాడాలి అని అనుకోవచ్చు.అంత మాత్రం చేత ఎక్కువ గా మీకు మీరే ఊహించుకొని వారి జీవితాల్లోకి ప్రవేశించి ఇబ్బంది పెట్టాలని అనుకోవద్దు.మీరు కెరీర్ మీద దృష్టి పెట్టి చక్కగా ఎదిగితే జీవితం లో అన్నీ అవే వెంటనట్టి వస్తాయి.సినిమాల్లోనూ ,టివి ల్లోనూ చూపించే సన్నివేశాలు అవి అర్ధ సత్యాలు.వాటినే అనుకరించాలని అనుకోవద్దు.పేపర్ల లో చూడండి..ఇవేళా రేపు...అన్నీ రక్తసిక్త ప్రేమ వార్తలే..!ప్రేమ లో తేడాలొచ్చాయని నరకడాలు,ప్రాణాలు తీసుకోడాలు ..ఏమిటివి..? పాశ్చత్యుల పేపర్లు చూస్తే ఎక్కువ గా చంపేది చంపబడేది ధన సంపాదన కోసం,అదే మన దేశం లో చూస్తే ..ఇలాంటి అటూ ఇటూ గాని ప్రేమల కోసం..!ఒకటే గుర్తు పెట్టుకొండి ఎవరకీ ఎవరి ప్రాణాన్నీ హరించే హక్కు లేదు.జీవితం చాలా విశాలమైనది.ఒక ద్వారం మూసుకుంటే మరొకటి తెరుచుకుంటుంది.ఇదంతా ఎందుకు చెప్పానో కొన్నాళ్ళ తర్వాత మీకే తెలుస్తుంది,మరి శెలవు" అంటూ నా ప్రసంగాన్ని ముగించాను.ఎలా ఫీలయ్యారు వీళ్ళు అని వాళ్ళ ముఖాల్లోకి చూశాను.అందరూ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు గా అనిపించారు.అంటే లోపల పడిన ఆలోచనలు వాటి పని అవి చేస్తున్నాయన్నమాట.
అదే నాకూ కావలసింది. స్టాఫ్ అంతా నావేపు మెచ్చుకోలు గా చూశారు.మీ అందరి తరపునా నేను వీళ్ళకి చెప్పాను,అంతే..నాలో నేనే అనుకున్నాను. (సమాప్తం)

No comments:
Post a Comment