ఈ మధ్య కాలం లో మొక్కలు బాగా నాటుతున్నారు.రోడ్లకి ఇరుప్రక్కలా..ఇంకా ఖాళీ ప్రదేశాలలోను...ఇళ్ళలోనూ..ఆఫీసుల లోనూ...!మంచిది,ఈ మాత్రం చైతన్యం రావడం బాగుంది.మానవాళి శ్రేయస్సు కోసం,భూమి శ్రేయస్సు కోసం ఇలా చేయడం మంచిదనే అవగాహన చిన్నారులనుంచి పెద్దవారి వరకు పెరిగింది.అయితే ఒకటి ఏమిటంటే రోడ్ల ప్రక్కన పెరిగిన మొక్కలు ఒక ఏడాదికో రెండేళ్ళకో కరంట్ వైర్లకి అడ్డు వస్తున్నాయనో ,బోర్డ్ లకి అడ్డు వస్తున్నాయనో నిష్కారణం గా నరికిపారేస్తున్నారు.మళ్ళీ మామూలే...ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ మొక్కలు వేయడం,మళ్ళీ పెరగ్గానే అడ్డుగా ఉన్నాయనే నెపం తో నరికివేయడం.ఈ ప్రక్రియ ఇలా నిరంతరాయం గా కొనసాగుతూనే ఉన్నది.దీనివల్ల ఎవరకి ప్రయోజనం..?
ఇంకో విషయం ఏమిటంటే వేసే మొక్కలు కూడా తురాయి లాంటి వాటిని వేస్తున్నారు.అవి త్వరగా పెరిగే మాట వాస్తవమే కాని వేసవి రాగానే అసలు ఆకులు ఉండవు.అన్నీ రాలిపోతాయి.ఏ మాత్రం గాలి దుమ్ము వచ్చినా విరిగి పోతాయి.ఏమిటికి ఇవి..చూసి ఆనదించేందుకు తప్పా..! నేను పూనా లోనూ,మళ్ళీ మైసూరు లోనూ చూశాను.చెట్లని కాపాడుకునే విధానాన్ని.ప్రజల్లో కూడా మంచి అవగాహన ఉండి సహకరిస్తారు.కానుగ,వేప,నేరేడు,చింత ఇలాటి పెద్ద వృక్షాలు పెంచడం ఎంతో అవసరం.వ్యపారస్తుల బోర్డ్లకి అడ్డు వచ్చినా ,వైర్లకి అడ్డు వచ్చినా,ఇళ్ళకి అడ్డువచ్చినా ఆ చెట్లని నష్టపరచకుండా విన్నూత్న ఐడియాల తో వాటిని ఉపయోగించుకోవడం అనేదాన్ని మనం ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నాం.అవి తెలియక కాదు గాని..అంత దాకా ఎందుకు కొట్టేస్తే పోలా భావం మన జనాల్లో పెరిగిపోయింది.
ప్రపంచం అంతా తిరుగుతున్నాం ఈ రోజున.ఒక కుగ్రామమై పోయింది ప్రపంచం.మన ఇంటిలో ఉన్నదాన్ని పదిలం గా చూసుకుంటాం.అదే సమాజానికి పనికి వచ్చే పనిని చేయాలంటే మాత్రం నిర్లక్ష్యం.అనేక దేశాల్లో కమ్మ్యునిటి సర్విస్ అనే భావన ఎంత ప్రబలంగా ఉందో దానిని ప్రజలు ఎంత చక్కగా అమలుపరుస్తారో అంతా తెలిసిందే.ఒక మంచి పని చేయడానికి కూడా తలమాసిన యవ్వారాలే మనదగ్గర, అదే ఈ దేశపు ఖర్మ ..!

No comments:
Post a Comment