"కరోనా", ప్రస్తుతం ఈ పదం మన జీవనం లో ఓ భాగమైపోయింది. కొంతమంది ఈ వైరస్ వూహాన్ లేబరేటరీ నుంచి బయలు దేరింది అన్నారు.మరి కొందరు అమెరికా కుట్ర లో ఓ భాగమని అన్నారు.ప్రస్తుతం ఇంకో వార్త బయటకి వచ్చింది. అదేమిటంటే అమెరికా,రష్యా,చైనా మూడు దేశాలు కలిసికట్టు గా చేసిన ప్రయోగ ఫలితమే ఇదని,ఒక పద్ధతి ప్రకారం గా ప్రపంచం లోకి వదిలారని తాజా వార్త.
నాకు మటుకు ఈ వార్త పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఏది ఏ విధం గా అయినా జరగడానికి అవకాశం ఉన్న రోజుల్లో మనం నివసిస్తున్నాం.ప్రస్తుతం సంపద,అధికారం ఇవే చోదక శక్తులు. బయటకి కనిపించే,వినిపించే వ్యవహారాలు వేరు లోపల ఒప్పందాలతో జరిగే వ్యవహారాలు వేరు.గమనిస్తూ పోతుంటే అలా అనిపిస్తోంది.తెల్లారి లేస్తే మనం చదివే వార్తలు అన్నీ నిజాలే కావాలని ఏమీ లేదు.అక్కడకి వెళ్ళి దగ్గరుండి పరిశోధించే వారు ఎవరు..?
ఫలానా చైనా లోనో,అమెరికా లోనో ఇలా ఘోరం గా ఆసుపత్రుల లో చనిపోయారు చూడండి అంటూ కొన్ని దృశ్యాలు మీడియా లో చూస్తాము.అవే రిపీట్ అవుతుంటాయి వివిధ మాధ్యమాల్లో.వాటినే మనం చర్చించు కుంటూ ఉంటాము. అవి ఎంత మేరకు నిజాలో ఆ దేవుడికే తెలియాలి. అక్కడి పోయి ప్రతి ఒక్క కేసు ని పట్టి చూస్తున్నామా..? అంతర్జాతీయ వార్తా సంస్థల ద్వారా ఏది ఏ మేరకు ఏ ప్రయోజనాల కోసం ఏ వార్తల్ని ప్రపంచం మీద కి విడిచిపెట్టాలో వారికి బాగా తెలుసును. దేశ రక్షణ కి సంబందించిన విషయాల్లో మన దేశం లో లా వేలు పెట్టాలని చూస్తే ఆయా దేశాలు వారి చిరునామాల్ని కూడా మిగల్చవు.
మా దేశాలు మీ వంటి వే అనుకోవడానికి కొన్ని సంఘటనలు జరగనిస్తుంటారు.దాని వెనుకా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.ఉదాహరణకి స్విస్ ఖాతాల్లో ఉన్న భారతీయ ఇంకా ఇతర దేశాల బిలియనీర్ల పేర్లు లీక్ చేయడం ,ఆ లీక్ చేసిన అసాంజే కి ఏవో ఇతర దేశాలు నీడనివ్వడం...ఇలాంటి వాటి వెనుక చెప్పినా నమ్మలేనంత రహస్య ఎజెండాలు ఉంటాయి.బయటకి శత్రు దేశాల్లా కనిపించే కొన్ని దేశాలు చాలా అంశాల్లో పరస్పర ప్రయోజనం ఉన్నది అనుకున్నప్పుడు కలిసే పని చేస్తుంటాయి.
ఒక రోమన్ ఉక్తి ఉన్నది,ఏమిటంటే "నువ్వు నాతో ఎంత తీయ గా వాగ్ధాటి తో మాట్లాడుతున్నావు అన్న దానితో కాకుండా నా పట్ల నువ్వు క్రియాత్మకంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అన్నదాని మీద ఆధారపడే నేను నిన్ను నమ్ముతాను" అని. ఈ ఉక్తి పాశ్చాత్య విలువల్లో ఒకటి గా రూపొందింది.ఉదాహరణకి అమెరికా ఒక దేశం మీద ... అనుకుందాం దండెత్తినప్పుడు దాని మిత్ర దేశాలు అయిన ఫ్రాన్స్,బ్రిటన్ వంటి దేశాలు దాన్ని తీవ్రంగా ఖండిస్తుంటాయి. శత్రు దేశం కి సంబందించిన సరఫరాలు సహజం గా ఆగిపోతాయి గదా,అలాంటప్పుడు తమ మిత్ర దేశాల ద్వారా వేరే మార్గం లో వాటిని అంటే మరో మార్గం లో పొందుతుంది.ఉదాహరణకి ఆయిల్ వంటివి. అంటే మన మిత్రులే బయటకి శతృవుల్లా కనిపిస్తూ ఎదుటి పక్షాన్ని బురుడి కొట్టిస్తుంటారు.
కొన్ని వందల ఏళ్ళు గా ఇలాంటి ఆటల్లో వాళ్ళు ముదిరిపొయే ప్రపంచం మీద కి వచ్చి మన స్థానిక పాలకుల్ని లొంగదీసి పాలించినది. ఫ్రెంచ్,బ్రిటిష్ వాళ్ళు మన దేశం లో ఆధిపత్యం కోసం ఎంత కుమ్ములాడుకున్నా మన స్థానిక రాజుల కి ప్రయోజనం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. టిప్పు సుల్తాన్ తో స్నేహం చేస్తూ ఆయుధాల్ని,గుర్రాల్ని ఫ్రెంచ్ వాళ్ళు ఆయన కి అమ్మినా ప్రత్యక్ష్య యుద్ధం లో గాని రహస్యాల్ని చెప్పడం లో గాని ఎప్పుడూ సహకరించలేదు.దానికి బదులు గా వలస ప్రాంతం ల్ని పంచుకోవడం లో బ్రిటిష్ వారు ఏ ఆఫ్రికా లోనో సహకరించి ఉంటారు, అక్కడ కూడా కొన్ని ఇలాటి లావాదేవీలే ఉన్నాయి వారికి.
కొన్ని చరిత్రలో రాయరు.విడి విడి గా చదివిన విషయాల్ని బేరీజు వేసుకుని ఆలోచిస్తేనే అర్ధమవుతాయి. ఇంకో విచిత్రం ...అంత ప్రచ్చన్న యుద్ధ సమయం లోనూ ఒక్క రష్య సైనికుడు అమెరికా చేతి లో గాని,అలాగే ఒక్క అమెరికా సైనికుడు రష్యా చేతి లోనూ చావలేదనే విషయం ఎంతమందికి తెలుసు..? మూడవ ప్రపంచ దేశాల వాళ్ళే బలిపశువులంతా..!వాళ్ళ ఆట లో ఆడబడింది.
90 వ దశకం అనంతరం ప్రపంచీకరణ అనే భావాన్ని చాలా లోతు గా అగ్ర రాజ్యాలు అధ్యయనం చేసి ప్రణాళికల్ని రూపొందించి ఉండవచ్చును.అందుకనే రష్యా లో కూడా ఒక్క చుక్క నెత్తురు చిందకుండా ఆ స్వరూపాన్ని మార్చివేశారు.ఒక్క నిర్ణయం తీసుకుని ఎన్ని అంచెల్లో దాన్ని అతి సహజం గా అమలు చేయాలి అన్నదాని లో వారి అనుభవాలే వేరు.ప్రస్తుతం సాగుతున్నది మన పరి భాష లో చెప్పాలంటే వసుధైక కుటుంభం ,దాని తాలూకూ పాలన.యు.ఎన్.ఓ. దాని అనుబంధ శాఖలన్నీ బయటకి కనబడే అంగాలే,ఆత్మ మారింది.
ప్రపంచీకరణ వల్ల నష్టాలు లేవా,జరగలేదా..? అంటే ఉన్నయి,జరిగినవి.అయితే పూర్తి గా నష్టాలే అన్నా నా మటికి నేను అంగీకరించలేను. ప్రపంచీకరణ వల్ల సమస్త మానవళి కి ఒనగూరిన ప్రయోజనాలూ సౌకర్యాలు ఉన్నాయి.నన్ను తిట్టుకున్నా ఇది నిజమనే నా భావన.దీని గురుంచి ఎప్పుడైనా ఓ పోస్ట్ రాస్తాను. ------Murthy Kvvs

No comments:
Post a Comment