Monday, August 17, 2026

ఎందుకని అలా విభజించారు అంటే ...

 మనం ఇంగ్లీష్ సాహిత్యం గురించి చదివేటప్పుడు ఎలిజబెథన్ ఏజ్, విక్టోరియన్ ఏజ్ అని చదువుతుంటాము. ఎందుకని అలా విభజించారు అంటే మొదటి ఎలిజబెత్ రాణి ఇంగ్లండ్ ని పాలించిన కాలం లో వర్ధిల్లిన ఇంగ్లీష్ సాహిత్యం అని చెప్పాలి.1558 నుంచి 1603 వరకు ఎలిజబెథన్ శకం గా పరిగణిస్తారు. ఈ కాలం ఇంగ్లీష్ సాహిత్యానికి స్వర్ణ యుగం గా భావిస్తారు.పద్యం,కళలు,డ్రామాలు ఇలా ఎన్నో రూపాలు కొత్త పుంతలు తొక్కాయి.ప్రాచీన రోమన్,గ్రీక్ కావ్యాలు చదవడం దాంట్లోచి సొహూర్తి పొందటం జరిగింది. అంతకుముందు లా కాకుండా రైమింగ్ లేకుండా కవిత్వం రాయడం ప్రారంభించారు. షేక్స్పియర్,మార్లో,స్పెన్సర్ లాంటి వారు ఈ కాలానికి చెందిన వారే.

ఇక విక్టోరియన్ ఏజ్ అనేది 1837 నుంచి 1901 వరకు ఉన్నట్లు భావిస్తారు. ఈ కాలం లో ఇంగ్లీష్ నవలా సాహిత్యం అగ్రస్థానం లో నిలిచింది. పారిశ్రామికీకరణ జరిగి దాంట్లో ఉన్న సమస్యల్ని వెలికి తీయడం లో చార్లెస్ డికెన్స్ లాంటివాళ్ళు ముందుకి వచ్చారు.బాల కార్మికుల సమస్యలు,పేదరికం, లాంటివి బాగా హైలేఇట్ చేయబడ్డాయి. 1945 నుంచి ఇపుడు గడుస్తున్న కాలాన్ని ఇంగ్లీష్ సాహిత్యం లో పోస్ట్ మోడర్న్ యుగం గా పిలుస్తున్నారు. నిజానికి ఇంగ్లీష్ సాహిత్యాన్ని ఓల్డ్ ఇంగ్లిష్,మిడిల్ ఇంగ్లిష్,రినైజాన్స్,నియో క్లాసికల్,రొమాంటిక్ ఇలా అనేక పీరియడ్ లుగా విభంజించారు.

No comments:

Post a Comment