Monday, July 23, 2012

డబ్బులు సంపాదించడానికి కూడా బద్దకమే...!!!


యెప్పుడైనా బుద్దిపుట్టి యేదో టిఫినో,కాఫియొ లాగిద్దామని యేదో హోటల్ కి వెళతాం.వెళ్లి అలా చాలా సేపు wait చేస్తూనే ఉంటాం.యేఒక్కడూ వచ్చి యేమి తింటారు అని అడగరు.మనల్ని చూడక కాదు సుమా ...ఆ...customer అడిగినప్పుడే చూద్దాం..వాళ్లే పిలుస్తారు యెవరికోసం...? అని లోపల అనుకొంటూ counter దగ్గర్నుంచి hotel owner యెక్కడో ఓ మూలనుంచి server చిద్విలాసంగా దర్జాగా చూస్తుంటారు తప్ప యెమి కావాలి సార్ అని దగ్గరికి వచ్చి మాత్రం అడగరు.


అక్కడ server యెవరో  తెలియకా యెవర్ని పిలిస్తే యెమి ఉపద్రవం వస్తుందో అని మనం తటపటాయిస్తుంటాం.యెవరయ్యా ఇక్కడ ...అంటూ 5 లేక 6 సార్లు పిలిస్తే అప్పుడు హుందాగా వచ్చి యేం కావాలి అంటారు.మంచి నీళ్లు కావాలన్నా,చట్ని కావాలన్న మళ్లి మనం అరవనిదే రారు.customer కోసమే మన business, వాళ్లే మనకు ఆధారం ...డబ్బులు తీసుకుని service చేయడం మన కర్తవ్యం అనే స్ప్రుహ వీళ్లకి యెందుకు ఉండదు...?వాళ్ల false ego లు చూపించడానికా business చేసేది.


అసలు వివిధ వ్యాపార రంగాల్ని యెందుకు services క్రింద యెందుకు పిలుస్తారో దాని అంతరార్ధం యేమిటో వీళ్లకి తెలుసా...? నా ద్రుష్టిలో ప్రతి వ్యాపారికి,దాంట్లో పనిచేసే server లకీ ప్రభుత్వం hosting విషయాల్లో శిక్శణ ఇవ్వాలి.        

2 comments:

  1. Uneducated people run most of the business and even they don't maintain hygiene.

    ReplyDelete