అసలు ఎప్పుడో చదవ వలసింది.లేటయింది.ఆల్కెమిస్ట్ చదివావా..?చాలా బాగుంది అంటూ ..ఈ మధ్య అడిగిన మిత్రులు ఎందరో..!నేను ఏదో మిస్ అయినట్లుగా నే ఫీలయ్యాను.ఎట్టకేలకు రెండు రోజుల క్రితం ముగించాను.ఏమి చెప్పాలో అర్ధం కాక కొంతసేపు అలా ఉండిపోయాను.మనం మనసు లో ధృఢంగా విశ్వసించినది సాకారం దాల్చడానికి ప్రకృతి శక్తులు సైతం సాయం చేస్తాయి అనే దీనిలోని డైలాగు బాగా ప్రాచుర్యం పొందినది.నిజానికి ఈ మాట చాలా పాతదే కాని దీని ద్వారా చాలా మందికి చేరింది.
ఈ పాటికే ఈ నవల లోని ఇతివృత్తం చాలా మందికి తెలుసు గనక మరీ లోనకి వెళ్ళను.సాంటియాగో అనే కుర్రాడు ..అతనికి దేశాటనం అంటే ఇష్టం.పెద్దగా ధనవంతుడు కాదు కాబట్టి గొర్రెల కాపరి గా మారి అటు జీవితాన్ని ఇటు ప్రవృత్తిని సంతృప్తిపరుచుకుంటూ ఉంటాడు.ఒక రోజు ఓ పల్లె లో పాడు బడిన చర్చ్ లో గొర్రెల్ని ఆపుకొని నిద్రకి ఉపక్రమించినపుడు ఈజిప్ట్ లోని పిరమిడ్ ల వద్ద గొప్ప సంపద ఉన్నట్లు కల వస్తుంది.ఒక్కసారి కాదు చాలాసార్లు.ఇతను ఒక జిప్సీ మాంత్రికురాల్ని,ఒక ఇంగ్లీష్ అతన్ని, ఒక స్థానిక రాజు ని,ఓ ఆల్కెమిస్ట్ ని అలా కలుసుకుంటూ మొత్తానికి చివరకి ఆ గమ్యానికి చేరడం జరుగుతుంది.అక్కడ దీన్ని కాజేయడానికి వచ్చిన ముగ్గురు కలుస్తారు.ఎంత తవ్వుతున్నప్పటికీ ఈ కుర్రాడి కి ఆ నిధి దొరకదు.వాళ్ళు ఈ కుర్రాడిని ఎగతాళి చేస్తారు...అక్కడ ఎక్కడో ఓ పాడుబడిన చర్చ్ లో ఓ నిధి ఉన్నట్లు మాకు కల వచ్చింది.అంతమాత్రాన మేం అక్కడి వెళ్ళామా..అని ఎగతాళి చేస్తారు.అప్పుడు ఈ కుర్రాడికి వెలిగి అసలు అక్కడే తను పడుకున్న చోటనే నిధి ఉందా అని అనుమానం వచ్చి ఇక్కడకి వచ్చి తవ్వుతాడు.కధ సుఖాంతం ..అవుతుంది.
సరే..బాగుంది.కాని దీనిలో ఏమి కొత్త ఎలిమెంట్ ఉందో నాకు అర్ధం కాలా..!పోనీ పాతదయినా కొత్త రకంగా చెప్పినట్లు అనిపించలేదు.అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా అన్నట్లు సన్నివేశాలు ఉంటాయి.బలవంతంగా ఒక దానికి ఇంకో దానికి కుట్లు వేసినట్లు ఉన్నాయి.నామటికి నాకైతే ఓ చందమామ కధ లా అనిపించింది.ఓ పాలు ఫిలాసఫీ,ఓ పాలు చరిత్ర,ఓ పాలు ఉత్తేజపరిచే సెల్ఫ్ డెవెలప్మెంట్ పాఠాలు,ఓ పాలు ఇలా ఎందుకు జరిగింది అని అడగకూడని మేజికల్ రియాలిటి ఇవన్నీ చేర్చి వండిన వంటకం ఇది అనిపించింది.
పావ్లో కోయిలో పనితనం ఎక్కడ ఉంటుంది అంటే జీవితం లోని abstract aspects ని చాలా చిన్న పదాలలో ఒద్దికగా కన్విన్సింగ్ గా చెపుతాడు.అది తన అనుభవం లోనుంచి వచ్చి చెపుతున్నాడా అనిపిస్తుంది.బ్రెజిల్ కి చెందిన ఈయన పోర్చ్ గీస్ భాష లోనే రాస్తాడు.ఆ పిమ్మట ఇంగ్లీష్ లోకి అనువాదం అవుతుంది.అతని భూమిక కేథలిక్ విశ్వాసాల మీదనే ఉన్నప్పటికీ ఇతర మతాల లోని సారాన్ని బాగా అర్ధం చేసుకున్న ధోరణి కనబడుతుంది.మార్గరెట్ జల్ కోస్టా అనే ఆవిడ ఎక్కువ గా ఇంగ్లీష్ అనువాదం చేస్తూ ఉంటుంది.జటిలత లేకుండా పాఠకుని అలరించే రీతి లో చేసే ఇలాంటి అనువాదాలు అందరి ఆమోదం పొందుతాయి.ఏ మాత్రం కొత్తదనం ఉన్నా అది ఒక అదనపు ఆకర్షణే.
No comments:
Post a Comment