Don Brown అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. డావిన్సీ కోడ్ నవలా రచయిత గా ప్రసిద్దుడు.ఆయన రాసిందే ఈ Digital Fortress అనే ఈ ఫిక్షన్.దీన్ని టెక్నో థ్రిల్లర్ అనవచ్చును స్వభావ రీత్యా..! NSA అనగా నేషనల్ సెక్యూరిటి ఏజెన్సీ అనేది అమెరికా యొక్క శక్తివంతమైన గూఢచార సంస్థ.ప్రపంచం లోని ఏ సమాచార వ్యవస్థ నైనా అవలీల గా టాప్ చేసి అమెరికా ప్రయోజనాల కి భంగం వాటిల్లకుండా దేశ రక్షణ కి పాటుపడటమే దీని కర్తవ్యం.CIA,FBI వంటి శాఖలు కూడా సాంకేతికం గా దీని మీద ఆధారపడుతుంటాయి.అనుమానస్పదుల పై నిఘా పెట్టడానికి,ఇతరుల మెయిల్స్ చదవడానికి NSA కి చాలా విస్తృతమైన వ్యవస్థ ఉంటుంది.ఎలాంటి కోడ్ భాష లో రాసినా సరే దాన్ని డీకోడ్ చేయగలిగే మెరికల వంటి క్రిప్టో గ్రాఫర్స్ అనేక మంది ఇక్కడ పనిచేస్తూంటారు.
అలాంటి దానికి సంబందించిన నేపధ్యం లో ఈ నవల సాగుతుంది.వీరివద్ద ఒక సూపర్ కంప్యూటర్ ఉంటుంది.దానిపేరు TRANSLTAR ,అసలు ఇలాంటిది ఒకటి ఉన్నట్లు చాలా కొద్దిమంది కి మాత్రమే తెలుసు.ప్రపంచం లోని సకల కంప్యూటర్ల లోని సమాచారాన్ని వడపోసి జరిగే వ్యవహారాల్ని గమనిస్తూంటుంది. సివిల్ లిబర్టీ గ్రూప్ లు కొన్ని వాదిస్తుంటాయి,ఇలాంటి వాటివల్ల పౌరుల వ్యక్తిగత హక్కులు కోల్పోతున్నారని.అయితే అధికారులు మాత్రం అసలు అలాంటి సూపర్ కంప్యూటర్ ఏమీ లేదని ప్రకటిస్తారు,అయితే అది కంటి తుడుపు కి మాత్రమే..!
ఆ సంస్థ కి డిప్యూటీ కమాండర్ Trevar Strathmore అనే ఆయన.అమెరికా ప్రయోజనాల కోసం దేనికైన వెనుకాడని వ్యక్తి.దేశ అధ్యక్షుని తో ఏ సమయం లో నైనా మాట్లాడగలిగే అవకాశం అతనికి ఉంటుంది.యాభై ఏళ్ళ పై చిలుకు వయసు లో ఉంటాడు.తనకు ఒక సవాలు ఎదురు అవుతుంది.ఒకప్పుడు తమ సంస్థ లోనే పని చేసి బయటకి వెళ్ళిన ఓ జపనీయుడు Digital Fortress అనే ఓ కోడ్ ని తయారు చేస్తాడు.అది ఈ సూపర్ కంప్యూటర్ కి ముప్పు లా తయారు అవుతుంది.దాని సీక్రెట్ పాస్ వర్డ్ ని ఆక్షన్ కి పెట్టడానికి అతను ప్రయత్నిస్తాడు.తనకి ఏమైన జరగరానిది జరిగితే ఆ పాస్ వర్డ్ ని ఉచితం గా వెల్లడి చేయమని నార్త్ డకోటా అనే అతడికి పురమాయిస్తాడు ఈ జపనీయుడు.
దీన్ని డీకోడ్ చేయడానికి సుసాన్ అనే NSA క్రిప్టో గ్రాఫర్ చాలా ప్రయత్నిస్తుంది.ఆమె ఫియాన్సీ డేవిడ్ బెకర్ ఓ ప్రొఫెసర్,తను కూడా పాటుపడుతుండగా ,ఉన్నట్లుండి Strathmore ఒక పని చేస్తాడు.డేవిడ్ ని స్పెయిన్ కి వెళ్ళి సీక్రెట్ కోడ్ ఉన్న ఉంగరాన్ని కనిపెట్టి తీసుకురమ్మని పురమాయిస్తాడు.Seville అనే స్పానిష్ పట్టణం లో డేవిడ్ కి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి.ఈ లోపులో సంస్థ లోనే గ్రెగ్ హేల్ అనే అతని నార్త్ డకోటా నా అనే అనుమానం రేగుతుంది.మరి చివరకి ఏమయింది అని తెలుసుకోవడానికి పుస్తకం చదివితేనే తెలుస్తుంది.
చివర దాకా సస్పెన్స్ తో నడుస్తుంది కధ.ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి.డేవిడ్ స్పెయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ నడిచే కధ వల్ల మనకి ఆ దేశం లో విషయాలు చాలా తెలుస్తాయి.స్పానిష్ భాషని ధారళం గా ఉపయోగించాడు.రచయిత డాన్ బ్రౌన్ కూడా పద ప్రయోగాలు కొన్ని కొత్త గా చేసినట్లు అనిపిస్తుంది.
No comments:
Post a Comment