Saturday, May 16, 2026

వాళ్ళకి నాలుగు, మనకి మూడు...ఏమిటి ఈ తేడా?

 మనదేశం లో మూడు కాలాలు గురించి చెప్పుకుంటాము. ఎండా కాలం,వర్షా కాలం,చలి కాలం.ఇవి ప్రధానమైన కాలాలు,ఇక్కడి శీతోష్ణస్థితి ని అనుసరించి అలా విభజించుకున్నాం.అయితే యూరోపియన్ దేశాల గురించి,అమెరికా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ నాలుగు కాలాలు ఉన్నట్లు వింటూంటాము.

వాటి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. స్ప్రింగ్ అనే మాట వింటూంటాం. ఈ వాతావరణం మార్చ్ నుంచి ఏప్రిల్ నెల దాకా ఉంటుంది.మంచు కరిగే కాలం ఇది.అలాగే పూలు పూస్తుంటాయి.నులి వెచ్చని ఎండ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోయే కాలం అది.

ఇహ వాళ్ళకి సమ్మర్, జూన్ నుంచి ఆగస్ట్ నెలల మధ్య ఉంటుంది. వాతావరణం మనంత వేడిగా మాత్రం ఉండదు.జనాలు వెకేషన్ లకి వెళ్ళే కాలం. ఆ తర్వాత ఫాల్ లేదా ఆటం. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య ఉండే కాలం ఇది. ఆకులు రాలుతుంటాయి. 

చల్లగా ఉంటుంది వాతావరణం.పగలు తక్కువ గా ఉంటుంది. ఇక వింటర్ . ఇది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెల దాకా ఉంటుంది.గడ్డకట్టేంత చలి.ఒక్కో ప్రాంతం లో కొంత తేడా గా ఉండవచ్చు.

 యు.ఎస్. లో వింటర్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది.చల్లగా ఉంటుంది. మన దగ్గర సమశీతోష్ణ వాతావరణం వల్ల,ఎక్కువ కాలం పొడిగా ,వేడిగా ఉంటుంది. వింటర్ అనేది షార్ట్ గా ఉంటుంది. 


No comments:

Post a Comment