Saturday, May 2, 2026

చైనా లో జనాభా ఎందుకు తగ్గిపోతున్నది?

 చైనా అనగానే మనకి చప్పున గుర్తుకు వచ్చేది ప్రపంచం లో ఎక్కువగాజనాభా ఉన్న దేశమని. ఆ తరువాత అక్కడ నుంచి వెల్లువెత్తే ఎగుమతులు. గత నాలుగు ఏళ్ళ నుంచి వరుసగా ఆ దేశం లో జనాభా గణనీయంగా తగ్గుతూ వస్తోంది.ముఖ్యంగా 2025 లో ని గణనాంకాల ప్రకారం చూస్తే ఆ దేశం లో జననాల రేటు ఎన్నడూ లేనంత తగ్గిపోయింది.1949 లో ప్రతి వెయ్యిమంది కి 8.04 జననాల రేటు ఉండేది. కాని గత ఏడాది ఇది 5.63 కి పడిపోయింది.అలాగే 60 ఏళ్ళు దాటిన వృద్దుల జనాభా 23శాతం కి పెరిగింది.ఈ మధ్య కాలం లో మనం కొన్ని యూట్యూబ్ ల లో కూడా చూస్తున్నాం.బీజింగ్,షాంఘై,షాంఝి లాంటి నగరాల్లో చాలా అపార్ట్ మెంట్లలో ఎవరూ లేక ఖాళీగా ఉంటున్నాయని ,రెస్టారెంట్లు,వీధులు కూడా ఎన్నడూ లేనివిధంగా జనరహితంగా దర్శనమిస్తున్నాయని తెలిసి ఇది నిజమా అనుకున్నవారూ ఉన్నారు.

కాగా ఇటీవల బి.బి.సి. ఇంకా ది హిందూ లాంటి మీడియాల్లో కూడా ఈ వార్త నిజమేనని ధృవీకరించారు.పిల్లల్ని చదివించడం,పెంచడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా పరిగణించడం జరుగుతోంది.అలాగే యువతరం లో పెళ్ళి పట్ల విముఖత కలగడం మరో కారణం. పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఉద్యోగాల్లో ఉన్న యువత పిల్లల్ని పెంచడం అనే ప్రక్రియ తమ పని వేళలకి ఆటంకంగా ఉంటుందని భావిస్తున్నారు.ఒకానొక సమయం లో చైనా లో ఒక కుటుంబానికి ఒక బిడ్డ చాలు అనే నినాదం ఉండేది.అయితే దాన్ని 2016 లో మార్చేశారు. ఇద్దరిని కంటే చాలు అనే పాలసీ తీసుకు వచ్చారు. 2021 వచ్చేసరికి మరేం ఫర్వాలేదు ముగ్గురు బిడ్డల్ని కనండి అనే పాలసీ తీసుకొచ్చారు. జననాల రేటు పెంచడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది.

బిడ్డని కన్నవారికి 3 ఏళ్ళు వచ్చేదాకా 3,600 యువాన్లు ఇస్తామని దంపతులకి తాయిలాలు ప్రకటించారు. కొన్ని ప్రావిన్స్ లలో అయితే మెటర్నిటీ లీవ్ ని మరింత పొడిగించుకోవచ్చునని, బోనస్ లు అదనం గా ఇస్తామని ప్రకటించాయి.అంతే గాక కండోం ల మీద ,కాంట్రసెప్టివ్ ల మీద 13 శాతం అదనం గా పన్ను విధించడం జరిగింది. ఇలాంటి అతి తక్కువ ఫర్టిలిటి రేటు సింగ పూర్,దక్సిణ కొరియా ,తైవాన్ లాంటి దేశాల్లో కూడా పెరుగుతోంది. ఇదే ట్రెండ్ గాని మున్ముందు కొనసాగితే చైనా జనాభా మరో ఎనభై ఏళ్ళలో సగానికి పడిపోతుందని కొన్ని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి.   

No comments:

Post a Comment