Mriya : A Lost Soul in Ghats
ఇది 160 పేజీలు గల ఒక ఇంగ్లీష్ నవల. రచయిత్రి పేరు అమృతా దాష్. భువనేశ్వర్ కి చెందిన అధ్యాపకురాలు.ఇంతకు ముందు ఈమె రాసిన కవిత్వం గాని,మిగతా రచనలు గాని చదవలేదు.భాస్కర్ పరీచ అనే ఒరియా పత్రకారుని సమీక్ష చదివి పుస్తకాన్ని తెప్పించాను.ఒక్కోసారి కొత్త వాళ్ళ పుస్తకాలు అనూహ్యంగా చాలా బాగుంటాయి. ఈ పుస్తకం కూడా నన్ను నిరాశ పరచలేదు. ఒరియా వారిలో వారి మాతృభాషతో బాటు ఆంగ్లం లో అలవోకగా రాయగలిగే ఓ సంస్కృతి ఎప్పటి నుంచో ఉన్నది. బెంగాలీ,మళయాళీ వాళ్ళ మాదిరి గా!
ఈ నవల మ్రియా అనే ఓ స్త్రీ యొక్క గాథ. చిన్నతనం లో పెళ్ళయి ,అత్తవారింటి ఆరళ్ళు తట్టుకుని పై చదువులు చదివి తన కాళ్ళ పై నిలబడిన నవతరం యువతి కథ. ఉద్యోగం చేయడానికి భువనేశ్వర్ వస్తుంది,తన కొడుకు తో!ఆ తర్వాత అక్కడ అమన్ అనే యువకుని తో పరిచయం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది.మ్రియా స్వయంగా కవయిత్రి.ఆలోచనాశీలి. అలాంటి వ్యక్తి వారణాసి వెళ్ళి చివరి రోజులు ఎందుకు గడపాలనుకుంది? అమన్ కి ఇష్టం లేని పెళ్ళి అయిన తరువాత అతని జీవితం తిరిగిన మలుపులు ఏమిటి? ఇవన్ని తెలుసుకోవాలంటే ఈ నవల చదవాలి.
ఇతివృత్తం పరంగా సాధారణమైనదే అయినప్పటికీ చెప్పిన విధానం విసుగు లేకుండా సాఫీగా సాగిపోయింది. వారణాసి వెళ్ళిన తరువాత కథాగమనం లో అనేక మలుపులు ఉంటాయి. ఒక సినిమా ని తలపిస్తాయి. మనం ఎంతో మందిమి తెలుగు లో రాస్తుంటాము.కాని ఎవరి శైలి వారిదే.దేని అందం దానిదే.అలాగే ఇంగ్లీష్ వచనం లో కూడా ఒరియా వారి లో ఎవరి శైలి వారిదే.అలనాటి మనోజ్ దాస్ నుంచి ఈనాటి అంతగా పేరు వినబడని వారి రచనలు నేను చదువుతున్నప్పుడు నాకు కలిగిన అనుభూతి అది.
The survival tale of a working woman told in a simple yet gripping style.
అమెజాన్ లో లభ్యమవుతుంది. వెల: రూ.199/-

No comments:
Post a Comment