ఆంగ్లమూలం: డి.హెచ్.లారెన్స్
తెలుగుసేత: మూర్తి కెవివిఎస్
ఆ యూదు చిన్నారి ఈస్ట్ వుడ్ కేసి నిర్ఘాంతపోయినట్లు చూసింది.
"కాని...ప్రతి అడ్డమైనవాడు అలా చూడడమేనా.." గట్టిగా అన్నది.
అతను మళ్ళీ పైప్ తీసి నోట్లో పెట్టుకున్నాడు.
"ఏదో కుతి కొద్దీ చూసి ఉండొచ్చును" అన్నాడతను.
"జిప్సీ వ్యక్తి ఎలాంటి వాడని మీ ఉద్దేశ్యం ...మంచోడనేనా.." Yvette ప్రశించింది. దానికి ఈస్ట్ వుడ్ ఏమో అన్నట్లు భుజాలెగరేశాడు.
"నేనే గనక నీ స్థానం లో ఉంటే ఇలాంటివి ఇతరుల్ని అడగను" అన్నాడు ఈస్ట్ వుడ్.
"కావచ్చు..కానీ" అంటూ ఆగిపోయింది Yvette.
"నువు చెప్పేది బాగ లేదు.అతనెలా సరిపోతాడు.ఈ అమ్మాయి అతడిని పెళ్ళాడి ఆ సంచార బండి లో ఊరూరూ తిరుగుతుందా..?" తన ప్రియుడిని అడిగింది యూదు చిన్నారి.
"నా ఉద్దేశ్యం పెళ్ళి అని కాదు" అన్నాడు ఈస్ట్ వుడ్.
"అంటే ప్రేమ వ్యవహారమా...మరీ దారుణం...ఆమెని గూర్చి ఆమె ఏమనుకోవాలి...అది ప్రేమ కాదు.వ్యబిచారం వంటిది అది" అంది యూదు చిన్నారి.
ఆమె ప్రియుడు ఈస్ట్ వుడ్ అలాగే పొగ పీలుస్తూ ఉండిపోయాడు.
"ఆ జిప్సీ వ్యక్తి ఆ రోజుల్లో మా రెజిమెంట్ లో గుర్రాల్ని చూసేవాడు.మంచి మనిషి.ఓ సారి న్యూమోనియా వచ్చి పోయాడని అనుకున్నాము. అయితే ఆరోగ్యవంతుడయ్యాడు మళ్ళీ.మరోసారి నేను ఓ ఆపద లో చిక్కుకున్నాను.అంటే మంచు లో కూరుకుపోయాను.దాదాపు ఇరవై గంటలు.ఆ సమయం లో తను నన్ను కాపాడాడు.." చెప్పాడు మేజర్ ఈస్ట్ వుడ్.
ఒక్కసారిగా అందరూ మాటల్లేని వాళ్ళలా అయిపోయారు.
"జీవితం ఎంత అద్భుతం" అంది Yvette.
"అనుకోకుండా ఆ గోతి లోనుంచి తవ్వి తీశారు నన్ను" అన్నాడు ఈస్ట్ వుడ్.
" నిజంగా తలరాత అంటే అదే.." నెమ్మెది గా ఏదో యోచిస్తున్నట్లు గా అంది Yvette.
అతను ఏమీ మాటాడకుండా ఉండిపోయాడు.
(సశేషం)
No comments:
Post a Comment