ఇటీవల ఒరియా భాష నుంచి 12 కథల్ని తెలుగు లోకి అనువదించాను. పుస్తకం గా కూడా బయటకి వచ్చింది. దాని పేరు గౌరహరి దాస్ కథలు. ఈ కథల్ని మొదట చదివినపుడు తప్పకుండా ఇవి మన భాష లోకి రావలసిన కథలు అనిపించాయి. గౌరహరి దాస్ గారు కథా రచయితగా,పాత్రికేయునిగా లబ్ధప్రతిష్టులు. ఒరియా ఈటీవి కి సారధి గా,సంబంధ్ అనే ఒరియా డైలి కి సంపాదకుని గా పనిచేశారు.ఇంకా ఎన్నో కాలంస్ ద్వారా ఆ రాష్ట్ర ప్రజ కి సుపరిచితులు.ఇంకా నాటక రచయిత గా, వ్యాస కర్త గా ప్రత్యేక స్థానం ఉంది.
రాష్ట్ర,కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ ల్ని ఇంకా ఎన్నో పురస్కారాల్ని పొందారు.ఆయన్ని సంప్రదించి విషయం వివరించగానే అనువాద హక్కుల్ని రాతపూర్వకం గా ఇచ్చారు.వారికి ఇందుకుగాను కృతజ్ఞతలు.ఈ అనువాద కథల్ని చదివి తొట్టతొలిగా చక్కని కాంప్లిమెంట్ ని యండమూరి వీరేంద్రనాథ్ గారు మెసెజ్ రూపం లో నిన్న పెట్టారు.ఇది ఈ పుస్తకానికి దక్కిన అపురూప గౌరవం గా భావిస్తూ,ఇక్కడ దాన్ని పంచుకోవాలని అనిపించింది.
ఈ పుస్తకం నవోదయ బుక్ హౌస్,కాచి గూడా,హైద్రాబాద్ (Ph. 90004 13413) వారి వద్ద లభ్యమౌతుంది.పేజీలు 144. వెల రూ.150/-
No comments:
Post a Comment